Fwd: ​31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ - రచనలకు ఆహ్వానం

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Feb 7, 2026, 9:14:11 PMFeb 7
to sahiti...@googlegroups.com


---------- Forwarded message ---------
From: Raju Vanguri <vangurif...@gmail.com>
Date: Sat, Feb 7, 2026 at 10:13 PM
Subject: 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ - రచనలకు ఆహ్వానం
To: vangurif...@googlegroups.com <vangurif...@googlegroups.com>
Cc: houstonsahitilokam <houstonsa...@googlegroups.com>, తెలుగు మాట <telug...@googlegroups.com>, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక <sahity...@tantex.org>, ప్రపంచ తెలుగు రచయితల సంఘం <prapanc...@gmail.com>


                                                                                      
0139767f-5a78-40fd-a7b5-bdc6f22e2f88.jpg
                                                                               వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)

3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498

Phone: 1 832 594 9054; E-mail: vangurif...@gmail.com

_______________________________________________________‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: ఫిబ్రవరి 19, 2026)

గత మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూరాబోయే "శ్రీ పరాభవ” నామ సంవత్సర ఉగాది

(మార్చ్ 19, 2026) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న

31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ  కి అముద్రిత నూతన రచనలు ఆహ్వానిస్తున్నారు. భారత దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల రచయితలూ ఈ పొటీలో పాల్గ్గొనవచ్చును. నూతన సాహిత్య సృష్టి కోసం నిర్వహించబడుతున్న  స్నేహపూర్వకమైన ఈ “పోటీ” లో మూడు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం-ప్రపంచ రచనల పోటీ

(రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయిస్వంత బ్లాగులుస్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి.)

ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు)  ఒక్కొక్కటీ $200 US డాలర్లు

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు)  ఒక్కొక్కటీ $200 US డాలర్లు

 మొట్టమొదటి రచనా విభాగం 19వ సారి నిర్వహణ

కథలూకవితలూ వ్రాద్దామని కుతూహలంతో చిన్నా, పెద్దా ప్రయత్నాలు చేసినాఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండాప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం. పోటీకి పంపిన రచన తమ మొట్టమొదటి అముద్రిత స్వీయ రచన అని హామీ పత్రం విధిగా జత పరచాలి.

“నా మొట్టమొదటి కథ”: (ఉత్తమ కథ): $116 US డాలర్లు

“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కథ): $116 US డాలర్లు

యువతరం విభాగం- 5వ సారి నిర్వహణ

ప్రపంచవ్యాప్తంగా ఈ నాటి తెలుగు యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సు లో ఉన్న యువతీ యువకులని తమదే అయిన ఈ ప్రత్యేక విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రంకళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) విధిగా జతపరచాలి.

ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు)  ఒక్కొక్కటీ $116 US డాలర్లు

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు)  ఒక్కొక్కటీ $116 US డాలర్లు

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

·              ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించ వచ్చును. ఒక రచయిత అర్హత ఉన్న అన్ని విభాగాలలోనూ పాల్గొనవచ్చును.

·              రచనలు యూనికోడ్ (ఉదా. గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. కథల నిడివి 2500 పదాలకు మించకూడదు. (సుమారు 15 పేజీల లోపు). కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదయోగ్యమే. చేతి వ్రాతతో పంపిన రచనలు పరిగణింపబడవు.

·              తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు.

·              రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయిస్వంత బ్లాగులుస్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణించబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.

·              బహుమతి పొందిన రచనలూప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూతదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టికేవలం వారి నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

·              విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు అనగా... మార్చ్ 19, 2026 నాడు కానీ అంతకు ముందు కానీ   ప్రకటించబడతాయి. కాపీ రైట్స్  ఆయా రచయితలవే అయినాఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను  రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.

·              విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries: February 19, 2026

పోటీ రచనలు, హామీ పత్రం, తదితర వివరాలు ఈ క్రింది Google Form లో మాత్రమే పంపించాలి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfnPKgC8XWztFYLLQhi-CnZO7cHa3DNWElUhNgOPeE-Zd1fXA/viewform

 

వివరాలకి ఈ క్రింది నిర్వాహకులను సంప్రదించగలరు.  

శాయి రాచకొండ (1 281 235 6641): దీప్తి పెండ్యాల (1 513 827 7790) వంగూరి చిట్టెన్ రాజు (1 832 594 9054

Email: vangurio...@gmail.com

--
To unsubscribe, please contact vangurif...@gmail.com
---
You received this message because you are subscribed to the Google Groups "vangurifoundation" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to vangurifoundat...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/vangurifoundation/CAJ5VeEONBcy15irL5fL6%2BoLg057qTMg9QGDL-BBn6QyPvM0-QQ%40mail.gmail.com.


--
31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ఆహ్వానం Final.pdf
Reply all
Reply to author
Forward
0 new messages