ఆగ్నేయ ఆసియా అందాలకు ఆదర్శం అలనాటి ఆంధ్ర రాజధాని అమరావతి-5(చివరి భాగం )
జావా లో మన హవా
రామాయణం జావాను యవ ద్వీపం అన్నది .ఇండో నేశియలో ఇదే పెద్ద ద్వీపం .5వ శతాబ్ది దాకా ఇక్కడ బౌద్ధం లేదుఒకటవ శతాబ్దానికే జావాలో వైదికమత వలసలు ఏర్పడ్డాయి .అందుకే పాహియాన్ జావాలో బ్రాహ్మణులున్నారు ఆని రాశాడు .వారిమతం బ్రాహ్మణ మతం అన్నాడు .పాహియాన్ క్రీ శ 413లో ఒక వైదిక మతస్తుని ఓడలో కాంటన్ నగరంవెళ్ళాడు .ఇక్కడ గుణవర్మ కాశ్మీర రాకుమారుడు మొదట బౌద్ధం ప్రచారం చేశాడు .రాజ్యాన్ని త్యజించి బౌద్ధ భిక్షువై ప్రచారం చేశాడు .మొదట లంక కు వెళ్లి అక్కడి నుంచి జావా వచ్చి రాజమాత కు బౌద్ధ దీక్ష నిచ్చి ,తర్వాత రాజుకు బౌద్ధ దీక్ష ఇచ్చాడు .కాంటన్ వెళ్లి చనిపోయాడు . 8వ శతాబ్దిలో జావా శైలేంద్ర వంశ చక్రవర్తుల శ్రీ విజయ రాజ్యం లో భాగంయ్యాక ,మహాయాన బౌద్ధానికి కేంద్రమయింది .మధ్యజావాలో దేవేంద్రుడు అనే రాజు ‘’తారా మందిరం ‘’కట్టించాడు .10వశతాబ్ది వరకు శైలే౦ద్రుల పాలన ఉంది.జావా వాస్తు శిల్పానికి స్వర్ణయుగం .బోరోబదూర్ స్తూపం శిలామయ ఇతిహాసం వంటిది అన్నారు తిరుమల .చండీ మండుట్ వాస్తుశిల్ప నైపుణ్యానికి మచ్చు తునక .బోరోబదూర్ మందిరం మనపూర్వ ఆంధ్ర రాజధాని అమరావతి ఛాయలను పోలి ఉంటుంది .రెండు మూడు శతాబ్దాలనుంచి మన అమరావతి బౌద్ధ వ్యాప్తికి ,కళావ్యాప్తికి కేంద్రం.
బోరో బదూర్ సుందర మందిర సముదాయం రామాయణ భారత కధలకు శిల్పానువాదం.20 దేవాలయాల సముదాయం .ఒకప్పుడు అగ్నిపర్వతం బ్రద్దలై ఈ దేవాలయ సముదాయం ఉన్న పీఠభూమి లావాతో మునిగిపోయింది .12దేవాలయాలు శిధిలమై ఎనిమిది మాత్రమె మిగిలాయి .వీటిలో అయిదు అర్జున దేవాలయాలసముదాయం ఉత్తర పీఠభూమి లో ఉన్నది .అత్యంత సుందరమైన భీమ మందిరం దక్షిణాగ్రం పై ఉంది.డచ్చి వారు దీనిపై చాలా అశ్రద్ధ చూపారు .ఇవాళ స్వతంత్ర ప్రభుత్వం చాలా శ్రద్ధ చూపిస్తోంది .
మధ్యజావాలో శైవ మహాయానాలు వర్ధిల్లాయి .కనుకనే బోరో బదూర్ స్తూపం కళాఖండంగా రూపు దాల్చింది .’’జీవకళా పరిపాక పరాంశం ‘’అన్నారు రామ చంద్ర . ఇది చతురస్రాకార స్తూపం..అంచెలంచెలుగా ఆరు వేదికలపి నిర్మించారు అట్టడుగు వేదిక వెడల్పు 479చదరపు గజాలు .వేదికకు నాలుగు వైపులా మెట్లున్నాయి .ఆరవ వేదిక మధ్య గుండ్రని చిన్న చిన్న స్తూపాల మూడు వరుసలున్నాయి .ఇవి 12.మూడవ స్తూప వలయం మధ్య పెద్ద స్తూపముంది .చిన్న స్తూపాలు బోలుగా ఉంటాయి .మధ్యస్తూపం వ్యాసం 52అడుగులు .ఐహిక ఆముష్మిక ఈస్తూపం సంకేతం అన్నారు తిరుమలవారు .
బోర్నియా, ఫైలిప్పీన్లపై వైదిక, బౌద్ధ ప్రభావం పడింది .
ఆధారం - సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్ర గారి వ్యాసం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -2-9-25.ఉయ్యూరు .