ఆగ్నేయ ఆసియా అందాలకు ఆదర్శం అలనాటి ఆంధ్ర రాజధాని అమరావతి-4
కాంభోజ భోగం
కామ్భోజం అంటే కంబోడియా మొదట చంపారాజ్యంతో పాటు ప్యూనాన్ రాష్ట్రం లో భాగం .క్రీస్తుశకం మొదటి శతాబ్దం లో భారతేయులు ఇక్కడికి వలస వచ్చారు .5 వ శతాబ్దం వరకు ప్యూగాన్ లో భాగంగా ఉండేది .6వశతాబ్దిలో భారతీయులు ఇక్కడ రాజ్యం ఏర్పరచారు .మొదటి భారతీయా రాజు కౌండిన్యుడు .అంతర్వాణి ప్రేరణతో రాజ్యం స్థాపించి అతామార్చేశాడు .ఇక్కడి ఖ్మేర్ జాతి మూలపురుషుడు ‘’కంబు స్వయం భువ ‘’ఆని నమ్ముతారు .అతడు ఆర్యదేశం రాజని ,,ఇక్కడికి వచ్చి నాగరాజు కుమార్తెను పెళ్ళాడి ,తమ వంశం కంబు గామారిందని దేశం పేరు కంబూజం ఆని వాళ్ళ నమ్మకం .ఈరాజుకాలం లో దేశమంతా దేవాలయాల ,విహార ,స్తూపాలతో దేదీప్యమానంగా ఉండేది .రామాయణం భారతాలు వారి ఆస్తి .
9వ శతాబ్దిలో యశోవర్మ కాలం లో విశ్వ విఖ్యాత ‘’అ౦గర్ కర్ ధో౦ ‘’దేవాలయ నిర్మాణం జరిగింది .ఇదీ ఒక మహా నగరం లా భాసిస్తుంది ..శిల్పాలు ,గోపురాలు బహు రమణీయం .10వ శతాబ్ది రాజవర్మకాలం లో మహాయానం ఇక్కడ వ్యాపించింది .బుద్ధుడు జనలోకేశ్వర ,ప్రజ్ఞాపారమిత ,వజ్రపాణి పేర్లతో ఆరాధి౦పబడే వాడు .ఆతర్వాత వైదిక మతం ప్రబలి సూర్యవర్మ రాజు నగరం లో గొప్ప విష్ణు మందిరం నిర్మించాడు .కాంభోజ కళాకారులకు ,వైదిక మాట ప్రచారానికి ఇదీ గొప్ప కేంద్రం .అ౦గకోర్ స్తూపానికి దక్షిణంగా ఉంది.ఇక్కడి అయిదు ఉన్నత శిఖరాల కైవారం అరమైలు .గోడలపై రామాయణ భారత కధలు చెక్కబడ్డాయి .ఈ జిప్టు పిరమిడ్లు గోదిక్ వస్తు శిల్పాలు బోరోబదూర్ స్తూపం దీని నైపుణ్యానికి సాటి రావు ఆని అభిజ్నుల అంచనా .అ౦గకోర్ ధో౦ ను ‘’కంబుపురి ‘’ఆని కూడా అంటారు .9వ శతాబ్ది వరకు ఇదీ రాజధాని .తర్వాత సయాం వారు ధ్వంసం చేశారు .నగరద్వారాలపై అయిదు బుద్ధ శిరస్సులున్నాయి నగర మధ్యలోస్వర్ణ శిఖరం గల మందిరం .ప్రధాన శిఖరం చుట్టూ 20 శిలా శిఖరాలు .ఇదీ శివాలయం .పిరమిడ్ ఆకారం లో ఉంటుంది .కాంభోజ వాస్తుకళ శిఖరాయమానం .అంగ కోర్ నట్మందిరం లో కళ పరాకాష్టకు చెందింది .దీనికి సాటి ప్రపంచం లో లేనే లేదు.మనసు పరవశం చెందుతుంది .
మలయాలో మన పధ్ధతి
మలయాకు రెండు వేల సంవత్సరాల క్రితమే భారతీయులు వలస వచ్చారు.బంగారం సుగంధ ద్రవ్యాలు చందనం కర్పూరం సాంబ్రాణి ఇక్కడి అమూల్య పదార్ధాలు .వీటి ఆకర్షణకు మనవారు ఇక్కడికి వచ్చి స్థిరపడి పోయారు .దీన్ని మనవాళ్ళు సువర్ణ ద్వీపం అన్నారు .తుమసిక్ అనే పేరును సింగపూర్ గా మార్చారు .లిపిసంఖ్యలు ఇచ్చి వీరిని నాగరికులను చేశారు వ్యాపారంతో పాటు మన శైవ౦ వైదికం బౌద్ధం ఇక్కడ చేరాయి .4వ శతాబ్ది లోనే ‘’కేడా’’పట్టణం లో దేవాలయాలు నిర్మించారు .సంస్కృతం లో శాసనాలు వేయించారు .మధ్య ఆసియాలో శకులు ,హూణులు సైబీరియా బంగారం మనకు రాకుండా అడ్డగించటం వలన మనవారు బంగారం కోసం మలయా వైపు మొగ్గారు .వెయ్యేళ్ళు వైదిక సంస్కృతీ మలయాలో వర్ధిల్లింది .వైదిక మతానుయాయులకాలం లో వహాంగ్ రాజధాని ‘’ఇంద్ర పూర్ ‘’గా పిలువబడింది .హీన ,మహాయానాలు నాలుగవ శతాబ్దిలో ఇక్కడికి చేరాయి .’’పెరక్ ‘’నగరం లో గుప్త సంప్రదాయం ఉన్న హీనయాన బౌద్ధ కాంశ్య విగ్రహాలు లభించాయి .ప్యూనన్ రాజ్య పతనం తర్వాత శ్రీ విజయ సామ్రాజ్యం వచ్చింది .వీరిలో శైలేంద్ర వంశ రాజులు సముద్రాదిపత్యం వహించి గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్చారు .15వ శతాబ్దం నుంచి ముస్లిం పాలన వచ్చింది .
సుమత్రా ‘’స్వర్ణద్వీపం ‘’లో మన హల్ చల్
సుమత్రాను రామాయణం ‘’స్వర్ణద్వీపం’’ ఆని వర్ణించింది .ఇక్కడి వలెం బాగ్ లోయలో క్రీస్తుశకం మొదటి శతాబ్ది లోనే భారతీయులు వలసవచ్చారు -5-7శాతాబ్డులమధ్య బౌద్ధం చేరింది .ఇక్కడ రెండు రాజ్యాలున్నాయి .ఉత్తరాన ఇప్పటి జంబీ నగరం రాజధానిగా మలయా ,దక్షిణాన వలెంబాగు రాజధానిగా శ్రీ విజయ రాజ్యం ఉండేవి .విజయరాజ్యం 10వ శతాబ్ది వరకు ఉన్నది .తర్వాత జాజా వారు ,దక్షిణాన చోళులు ,జయించినా ,మళ్లీ స్వతంత్ర౦ అయింది .శైలేంద్ర వంశపాలనలో గొప్ప బౌద్ధ కేంద్రమయింది .వీరు మహాయాన అవలంబులు వీరే బోరోబదూర్ (జావా )లో గొప్ప విహారం కట్టారు ..భారత తో నౌకాయానం జరిపారు .చైనా బౌద్ధ పండితుడు’’ఇత్సింగ్’’ 7వ శతాబ్దిలో ఇక్కడికి వచ్చి అనేక భారతీయ గ్రంధాలు చదివి ,చైనాభాషలోకి అనువదించాడు .1000మండి భిక్షువులు విద్యార్ధులు శ్రీవిజయ రాజధానిలో వివిధ శాస్త్రాలు అధ్యయనం చేసేవారు ..8వ శాతాబ్ది ‘’అవలోకితేశ్వర ‘’రాజు ఆర్య ,తారాశక్తి మందిరాలు,విగ్రహాలు నిర్మించాడు .చైనా బౌద్ధ సన్యాసులు ఇండియా వచ్చే ముందు శ్రీ విజయకు వచ్చి కొంతకాలం సంస్కృత శిక్షణ పొంది వెళ్ళేవారు .ఇక్కడి మహాయాన్మపై తంత్ర ప్రభావం ఎక్కువ .నలందా విశ్వ విద్యాలయ ఆచార్యుడు ‘’ధర్మ పాలుడు ‘’ముసలి తనం లో శ్రీ విజయకు వచ్చి విశ్రాంతి తీసుకొన్నాడు .14శతాబ్ది వరకు బౌద్ద్ధం ఇక్కడ హల్ చల్ చేసింది .అప్పటిరాజు ఆదిత్యవర్మ అవలోకితెశ్వరుని అవతారమైన ‘’జిన అమోఘపాల ‘’విగ్రహాన్ని ప్రతిష్టించాడు .అప్పుడే నెమ్మదిగా ఇస్లాం ఉత్తర సుమత్రాలో ప్రవేశించి కొద్దికాలానికే ద్వీపాన్ని అంతా ముంచెత్తేసింది .
ఆధారం - సాహిత్య శిరోమణి శ్రీ తిరుమల రామ చంద్ర గారి వ్యాసం
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-25-ఉయ్యూరు .