సేవా దీక్షితురాలుకీ.శే .శ్రీమతి గుత్తికొండ  రామ రత్నం గారి జ్ఞాపకాలు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Nov 28, 2025, 8:08:58 AMNov 28
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Subbarao Guttikonda, D. G. V. Purnachand

సేవా దీక్షితురాలు కీ.శే .శ్రీమతి గుత్తికొండ  రామ రత్నం గారి  జ్ఞాపకాలు

పన్నెండేళ్ళ క్రితం పరమపదించిన కీ.శే .శ్రీమతి గుత్తికొండ రామ రత్నం  గారిని 2006లో మాత్రమె నాకు పరిచయమైన కృష్ణా జిల్లార్రచయితల సంఘం కార్యక్రమాలలో ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదనిపిస్తోంది .కదాచిత్ గా చూశానేమో గుర్తులేదు .విపుల చతుర సంపాదకురాలు ,నా ఫాన్ శ్రీమతి కె.బి లక్ష్మి గారితో పరిచయమయ్యాక ,ఆమె గుత్తి కొండ సుబ్బారావు గారి కుటుంబంతో బాగా పరిచయమున్న వారని ,బందరు వెళ్ళినప్పుడల్లా వారింట్లో నే ఉండేదాన్నని ఆమె చెప్పేవారు .కాని ఎప్పుడూ రామరత్నం గారి ఆరోగ్యం గురించి చెప్పిన జ్ఞాపకం లేదు .ఆమె మంచి తనం అతిధి అభ్యాగతులకు పేదలకు ఆమె అందిస్తున్న సేవలు మాత్రం చాలా ఆసక్తిగా చెప్పేవారు .నాకు మాత్రం అనిపించేది ఇంతగా తోడూ నీడగా ఉన్న ఆమె సభలకు ఎందుకు రావట్లేదుఅని .అయితే నేను ఎవర్నీ అడిగినట్లు లేదు.

 ఒక సారెప్పుడో సుబ్బారావు గారికి ఫోన్ చేస్తే ,తాను జగ్గయ్య పేట దగ్గర ముక్త్యా లలో ఉన్నానని ,తన భార్య గారి కోరికపై అక్కడ ఒక శివలింగం ప్రతిష్టించి చిన్న గుడి కట్టిస్తున్నాననీ ,దంపతులం ఇద్దరం అక్కడేఉన్నామని చెప్పారు .తనకు ఇలాంటి కార్యక్రమాలపై అంతగా ఆసక్తి లేకపోయినా ఆమె కోరినందువల్ల ఈ ప్రతిష్ట, గుడి నిర్మాణం చేస్తున్నానీ ,ఆమె కోరిక తీర్చటమే తన ముఖ్య కర్తవ్యమ్ ఆని చెప్పారు. ఆ ఫోటోలు కూడానాకు  పంపినట్లు గుర్తు .ఈ సందర్భాల డేట్లు సంవత్సరాలు జ్ఞాపకం లేవు .

  ఆ తర్వాత రామరత్నం గారు ఇంకో వారానికి చనిపోతారనగా బెజవాడ మ్యూజియం దగ్గర హాస్పిటల్ లో చేర్చినట్లు నాకు పూర్ణచంద్ గారు ఫోన్ చేసి చెప్పిన జ్ఞాపకం .ఆ రోజే ఉదయం కాఫీ టిఫిన్లయ్యాక బస్ లో బయల్దేరి వెళ్లి హాస్పిటల్ కు వెళ్లాను. అక్కడ అప్పటికే సుబ్బారావు గారు ,పూర్ణచంద్ గారు పువ్వాడ తిక్కన సోమయాజులు గార్లు ,కెవి శర్మ గారు  గుమ్మా సాంబశివ రావు గారు వగైరాలున్నారు .అందరి ముఖాలో ఆందోళన కనిపించింది .సుబ్బారావు గారు బాధ ను మనసులో భరిస్తూ కంఠంలో గరళం  దిగమింగుకొంటున్న నీల క౦ఠుని లాకనిపించారు .ఐ.సి .యు .లో ఉన్న రామరత్నం గారిని ఒక సారి అందరం వెళ్లి చూసిన గుర్తు . తర్వాత అక్కడే బయట వరండాలో మాట్లాడుకొంటూ ,కుర్చీలు లేకపోవటంతో ,ఆరగారగా కాఫీ లు తాగుతూ అందరం గడిపేవాళ్ళం .అప్పుడే నాకు తెలిసింది వాళ్ళ మాటల్లో ఆమె సుదీర్ఘ కాలం గా ఏదో జబ్బుతో తీవ్ర బాధ అనుభవిస్తున్నారానీ ,జీవించే చాన్స్ చాలా తక్కువని .అమెరికాలో ఉన్నముగ్గురు  కుమార్తెలలో,ఇద్దరు ఇక్కడికి వచ్చారని ,ఇంకొక ఆమె కోసం ఎదురు చూస్తున్నారనీ తెలిసింది .ఇలా నాలుగురోజులు రోజూ నేను ఉయ్యూరునుంచి వెళ్లి చూసిన గుర్తు .ఉదయం కుదరకపోతే సాయంత్రం వెళ్లి రాత్రి ఏడు గంటలదాకా ఉండి వచ్చేవాడిని  .చివరి రోజు వెళ్లాను .అక్కడ పైన చెప్పిన మిత్రబృందం అంతా ఉంది.ఆమె ఆరోగ్యవార్తలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు బయటికి వచ్చి చెప్పేవారు .చివరి సారిగా విన్న వార్త.ఆమె చక్కగా అందరితో బాగానే మాట్లాడుతున్నారనీ ,తనకు హాస్పిటల్ లో సేవ లందించిన నర్సులకు, మిగిలినవారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇవ్వమని భర్త సుబ్బారావు గారికి చెప్పి ఇప్పించారనీ,ఆమె గారి ముఖం లో సంతోషం సంతృప్తి బాగా కనిపించాయని తనకేమీ కాదని అందర్నీ ధైర్యంగా ఉండమని కర్తవ్య బోధ చేశారనీ ,ఇవన్నీ చూస్తున్న డాక్టర్లు ఆశ్చర్య పోతున్నారని  ఆమె గుండె నిబ్బరానికి కుటుంబసభ్యులు డాక్టర్లు, ఆశ్చర్యపోయారని తెలిసింది .

  అదే హాస్పిటల్ లో పెనమకూరు హైస్కూల్ తెలుగు పండితులు చింతలపాటి కామేశ్వరశర్మ గారి భార్యగారు కూడా చేరి చికిత్స పొందుతున్నట్లు శర్మగారు కనిపించి చెప్పారు .ఆయన తమ్ముడు ఉయ్యూరులో మాఇంట్లో అద్దెకు ఉన్నాడు పెనమకూరులో నాశిష్యుడుకూడా .భార్య ఉయ్యూరు పబ్లిక్ స్కూల్ లో ఆఫీస్ లో ఉద్యోగం .శర్మగారు ఎందుకో ఈ ఆస్పత్రి చికిత్సపై సంతృప్తి వ్యక్తం చేయలేదు మాటలలో .

  ఆ మర్నాడు ఉదయం అనుకొంటా పూర్ణచంద్ ఫోన్ చేసి రామ రత్నం గారు చనిపోయారనీ ,పార్ధివ దేహాన్ని బందరు తీసుకు వెళ్లారనిసుబ్బారావు గారి  మూడవ అమ్మాయి కూడా అంతకు ము౦దే హాస్పిటల్ కు వచ్చి చివరి చూపు చూశారని చెప్పారు .నేను ఏదో పనిలో ఉండటం వలన బందరు రామరత్నంగారి  .అంత్యక్రియలకు వెళ్ళలేక పోయాను .ఆతర్వాత ఆమె  సంతాపసభకు వెళ్ళిన జ్ఞాపకం .ఆతర్వాత  రెండు మూడు సార్లు ఆమె బందరు బస్స్టాండ్ దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్ లోఉదయం  జరిగిన ఆమె స్మారక కార్యక్రమాలకు వెళ్ళిన జ్ఞాపకం. అప్పుడే సుబ్బారావు గారి కుమార్తెలను వారి కుటుంబాలను  చూశాను .ఆమె పై తెచ్చిన స్మృతి సంచిక నాకు సుబ్బారావు గారు పంపారు .చదివి  సరసభారతి బ్లాగ్  లో రాశానో లేదో గుర్తులేదు . కానీ సుమారు రెబ్దేళ్ళ  క్రిందట పూర్ణ చంద్ రాసిన జ్ఞాపకాలు ,సుబ్బారావుగారితోఅనుబంధం భార్య రామరత్నం గారి వివిధ సేవాకార్యక్రమాలపై ,అతి దీర్ఘ వ్యాధిలో ఉన్న చిక్కి శల్యమైనా ,సుబ్బారావు  గారికి ఆమె సహకరించిన విధానంపై కూడా రాశాను .స్వగృహఫుడ్స్ స్థాపన ,స్పందన సాహితీ సమాఖ్య సేవాకార్యక్రమాలు ,ఆమె పొందిన సేవా కార్యక్రమ౦  , పురస్కారం వగైరాలన్నీ తెలిపాను .

  బందరులో కూడా కృష్ణా జిల్లా రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమాలలోనూ నేను పాల్గొనే వాడిని .కానీ ఎప్పుడూ సుబ్బారావు గారింటికి వెళ్ళిన గుర్తులేదు .బాపు రమణ లు మరణించాక వారి పేరిట ఒక స్మారక పురస్కారం సరసభారతి తరఫున ఇస్తే బాగుంటుంది అనిపించింది .మా మైనేని గోపాల కృష్ణ గారికి వారిద్దరూ బాగా పరిచయం .ఆయనకు తెలియజేస్తే వెంటనే స్పందించారు .రాష్ట్రం మొత్తం మీద ఇలా ఆలోచించి చేసింది మాసరసభారతి ఒక్కటే .అప్పుడే సరసభారతి ,శ్రీ చలపాక ప్రకాష్ గారి రమ్య భారతి కలిసి బెజవాడ లో పాలగుమ్మి పద్మరాజు గారి శత  జయంతి నిర్వహించాం టాగూరు లైబ్రరీలో అనుకొంటా .దానికి పద్మ రాజుగారి అమ్మాయిలూ కూడా వచ్చారు .తెలుగు కథకు ఎత్తైన గిరి లాంటి శ్రీ వేదగిరి రాం బాబుదంపతులకు   బాపు రమణ స్మారక సాహితీ పురస్కారం అందించాం .అయిదు వేలరూపాయలు నూతన వస్త్రాలు వగైరాలతో .సభ నిర్వహణ అంతా ప్రకాష్ గారే చూశారు .అప్పటినుంచి వేదగిరి తో టచ్ లో ఉన్నాను .

 బాపు రమణ చిత్రలేఖన పురస్కారం ఎవరికిస్తే బాగుంటుంది ఆని సుబ్బారావు గారిని అడిగితె శ్రీ శీలా వీర్రాజు గారి కివ్వటం సముచితం అన్నారు .ఆపేరు వినటమేకాని రాజుగారి గురించి పెద్దగా తెలియదు .సుబ్బారావు గారు కొంత వివరం ఇవ్వగా  రాజుగారు తమ పుస్తకాలు పంపారు .ఈ కార్యక్రమం బందర్లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తో కలిపి నిర్వహించాం .అప్పుడు ఉయ్యూరునుంచి నేనూ మా శ్రీమతి ,కార్యదర్శి శివలక్ష్మి కారులో వెళ్ళాం .సుబ్బారావు గారు తమ ఇంట్లోనే వీర్రాజు దంపతులు ఉన్నారని చెప్పి అక్కడికే వస్తే అందరంకలిసి హిందూ హైస్కూల్ ఎదురుగా ఉన్న మహతీ సభావేదిక వద్దకు వెళ్ళచ్చు అన్నారు .అప్పటికి రామ రత్నం గారు గతి౦చారని  అనుకొంటున్నాను .మాకు టిఫిన్ కాఫీలు ఏర్పాటు చేశారు .సుబ్బారావు గారి ఇల్లు చూడలేడనే దుగ్ధ ఇలా ఈరింది .ఆతర్వాత అ౦దరం సభా స్థలికి చేరాం .సుబ్బారావుగారు అన్నీ తానె అయి కార్యక్రమం నిర్వహించారు .జిల్లాజడ్జి గారి చేత వీర్రాజు, సుభద్రా దేవి దంపతులకు  మైనేని వారు ఏర్పాటు చేసిన బాపురమణ లస్మారక పురస్కారం 10 వేలరూపాయలు ,నూతన వస్త్రాలు జ్ఞాపిక లతో అందించాము.పూర్ణచంద్ గారు ,సిలార్ మహమ్మద్ గారు ,ధన్వంతరి ఆచార్యులుగారు వంటి పెద్దలెందరో హాజరయ్యారు .వీర్రాజు దంపతులు ‘’ఇంతటి గొప్ప సన్మానం మా జన్మలో చూడలేదు .ఇలాంటి ఆత్మీయత ఎక్కడా మాకు దక్కలేదు .లక్ష రూపాయలు ఇచ్చి మాకు హైదరాబాద్ లో సన్మానాలు జరిగినా ,ఈప్రేమ ఆత్మీయత గౌరవం మర్యాద మాకు ఎక్కడా లభించలేదు ‘’ఆని సంబర పడ్డారు .మా జన్మ ధన్యమనిపించింది .రాష్ట్రంలో బాపురమణ లస్మారక మొదటి పురస్కారం అందజేసిన అదృష్టం మాకు మా మైనేని వారి వలన దక్కింది అప్పటినుంచి వీర్రాజు గారు దంపతులతో తరచూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాం ఆయనా రెండుమూడేళ్ళక్రితం కాలం చేశారు . సుభద్రా దెవి గారితో మాట్లాడుతూనే ఉన్నాను .వారిద్దరి పుస్తకాలపై సరసభారతి బ్లాగ్ లో సమీక్షలు చేశాను కూడా.రామరత్నం గారు లేని లోపం సుబ్బారావు గారింట్లో కనిపించినా, ఆలోటు మాకు కనపడకుండా చేశారు గుత్తికొండ సుబ్బారావు గారు .

 మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-25-ఉయ్యూరు .


--
Reply all
Reply to author
Forward
0 new messages