వాడపల్లిగా మారిన ఓడపల్లి
వాడపల్లి ఒకప్పుడు "ఓడపల్లి" అనే పేరుండేది. సంస్కృతంలో దాన్నే "నౌకాపురి" అన్నారని స్థానికుల కథనం. వాడపల్లి, వెంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మింపజేసింది. గొప్ప భగవద్ భక్తుడని కీర్తివహించిన పుణ్యమూర్తి పినపోతు గజేంద్రుడు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లి గ్రామంలో జన్మించాడు. అగ్నికులక్షత్రియ సామాజికవర్గానికి చెందినవాడు, [మూలం అవసరం] రఘుకుల గోత్రిజ్ఞులు.
పినపోతు గజేంద్రుడు నౌకావ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సభవించగా అతని ఓడలన్నీ సముద్రగర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి, గట్టున ప్రతిష్ఠించి, గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక, ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం అ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. పురాణ కథ ప్రకారం వాడపల్లిగా మారింది.
1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు.
1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు.
క్షేత్ర చరిత్ర, ప్రత్యేకతలు
· తిరుపతి, ద్వారకా తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున, లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలుస్తారు.
· ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడకల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విదంగా ఉంది. వైకుంటంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకొన వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నది. అధర్మం, అన్యాయం పెరుతున్నవి. వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అపుడు విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.
· కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ద బ్రాహమణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ సుచిగా గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీగర్భంలోకి వెళితే కృష్ణగరుడపక్షి వాలి ఉన్నచోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేసానుసారం వెళ్లగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ,చక్ర, గదాయుదుడైన నారాయుణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విసేషాలతో ఆ అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి పూజించుట ప్రారంభిస్తారు.
· పూర్వపు ఆలయం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని [[పల్లవరాజు
పినపోతు గజేంద్రుడు అనే అగ్నికులక్షత్రియ వంశానికి చెందినవారు నిర్మించారు. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు
ఇతర విశేషాలు
గోదావరి వడ్డున ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చినెలలో సర్వ ఏకాదశి రోజునుండి ఐదు రోజులపాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్ళకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఊరిలోగల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ ఐదురోజులు అన్నసంతర్పణ కార్యక్రమములు ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మావద్దకు రండిఅంటే మావద్దకురండి అని పిలుస్తూంటారు.
ఆశ్రమాలు
· ఇక్కడ కొన్ని ఆశ్రమములు కలవు వీటితో పాటు ఆశ్రమ పాఠశాలలు కూడా నడుపబడుచున్నవి.
· ఈ గ్రామం.[3] సినిమా షూటింగులకు ప్రసిద్దం. ఆత్రేయపురం మాదిరిగానే వాడపల్లి పూతరేకులుకు ప్రసిద్ధి.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి లొల్లలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆత్రేయపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమండ్రిలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఉన్నది .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -7-9-25-ఉయ్యూరు .