శ్రీక౦ఠ స్పూర్తికథలు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Mar 26, 2026, 7:01:18 AM (9 days ago) Mar 26
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

శ్రీక౦ఠ స్పూర్తికథలు

సరసభారతి శ్రీ పరాభవ ఉగాది పురస్కారమందుకొన్న శ్రీక౦ఠ స్పూర్తి తమ మూడవ కథాసంపుటి ,ఒక పెన్ను కూడా పోస్ట్ లోపంపగా ఈ 24మంగళవారం అందింది .ఆయన ఇప్పటికే రెండు సంపుటాల కథకులు .నా అభిమాన రచయిత శ్రీ చంద్రశేఖర ఆజాద్ పొగడ్త పొందినవారు .కనుక నేను పెద్దగా ఆయన గురించి, రచనా విధానం గురించి చెప్పక్కరలేదు .ఈ 35కథల సంపుటి పేరు ‘’కథమళ్ళీ మొదలైంది .’ఆయన పేరులోనే శివుడున్నాడు .ఆయన గరళ కంఠు డైన మంగళకరుడు .అంటే లోకం లో శుభప్రాప్తి కలుగ జేసేవాడు .అక్షరం లోక రక్షకం కదా .అందుకే ఈరచయిత కతలన్నీ లోక రక్షకాలే .శివుడు శ్రీ అంటే విషం మింగినపుడు దాన్ని క౦ఠం లోనే ఉంచేసి లోపలి లోకాలకు హానికలుగకుండా చేశాడని అది అర్ధాంగి పార్వతి మాంగల్యబలం అని శ్రీనాథ కవి సార్వభౌముడు ఎక్కడో రాసినట్లు జ్ఞాపకం .

 మొదటికథ శీర్షికే .తనభర్తశివరాం  యుద్ధం లో మరణిస్తే పార్ధివ దేహం ఇంటికి వస్తే భార్యమాధవి చలించిపోయినా ,’’పెద్దయ్యాక సైన్యం లో చేరి యుద్ధం చేసి నాన్నను చంపిన వాళ్ళను చంపేస్తా .జైహింద్ ‘’ అన్న కొడుకు పార్ధు’’ను అక్కున చేర్చుకొని ‘’అవును నిజం .నాకొడుకుని దేశమాత రక్షణకు ,సమాజశాంతి భద్రతలకోసం దేశం గర్వి౦చేంతవీర సైనికుడిని చేస్తా ‘’అన్నది .అందుకే కత మళ్ళీ మొదలై౦దన్నమాట .దీనికి ప్రముఖ కథా శిల్పి శ్రీ వాకాటి పాండురంగారావు గారి పురస్కారం రావటం  గర్వించదగిన విషయం .తండ్రి తన భార్య చెయ్యి పట్టుకోన్నాడని భార్య చెప్పిన మాటవిని వృద్ధాశ్రమ౦  లో చేర్చాడు కొడుకు .అయన అక్కడే టపా కట్టాడు. నేత్రాలు దానం చేశాడు .కొడుకు వచ్చి చూడలేదని ఏనాడూ ఫిర్యాదు చేయలేదు .తన పెన్షన్ డబ్బు జాగ్రత్త చేసి పోస్టాఫీస్ లో భద్రపరచి కుమారుడికి అప్పగించాడు దానితో కోడలికి ఆమె ఎప్పటినుంచో అడుగుతున్నవడ్డాణ౦ చేయించమన్నాడు .ఇదంతాకాగితం లో రాసి కొడుక్కు అందేట్లు చేశాడు తండ్రి .అందుకే ఆకొడుకు హి భగవాన్ క్షమించు అన్నాడు .

  తాయారు మహా కిలాడి .ఇచ్చేదబ్బుకు ఎన్నో రెట్లు ఇప్పిస్తానని ఆశపెట్టి డబ్బులు లాగేస్తుంది .అయితే వెయ్యి పక్షుల్ని తిన్న రాబందుకూడాఒక  గాలివానకు చావాల్సిందే అన్నట్లు ‘’భాగ్యలక్ష్మి నల్లకుబేర యంత్రం’’తన జీవితాన్నే మార్చేస్తుందని అత్యాశతో ఉన్నడబ్బు అ౦తా కట్టి మోసపోయి లక్షలు విలువ చేసే మంగళసూత్రాలు ఉన్చేసుకొని పోస్ట్ లో దొంగ లాకెట్ మాత్రం పంపారు ఘటికులు .’’లక్ష్మీ రావే మా ఇంటికి ‘’లో .’’జరభద్రం మనిషీ’’ కథ లో స్నేహితుడు అప్పు తీర్చేసినా నమ్మకం తో నోటు తీసుకోకుండా ఉన్నందుకు ఆతను చనిపోతే ఆనోటట్టుకొని అతని భార్యను డబ్బు ఇవ్వమనటం ఘరానమోసం కు భార్య బలి.పనిపిల్లగా కూతుర్ని ఒక ఇంట్లో పెట్టగా ,యిల్లాలు చుక్కను అసహ్యంగా చీదరిస్తూ ,ఆదరిద్రాన్ని వసిలించుకొనే అనేక ప్రయత్నాలు చేసి ,సింహాద్రి తిరిగొచ్చి కూతుర్ని తీసుకు వెడదామని అనుకొంటే వాడు తన అయ్యకాదన్నది చుక్క .వాడు లబో దిబో .తినబలిసి ఇక్కడే తిష్ట వేయాలని చూస్తోందని భార్య గయ్యాళి తనం కు చేష్టలుడిగి  అదేదో సినిమాలో ప్రదీప్ లాగా ‘’అంతేగా అంతేగా ‘’అని డూడూ బసవన్నలా తలలూపిన వాడు .సిమ్మాద్రి చుక్క చేయట్టుకొని ఈడ్చుకుపోతుంటే మనకళ్ళు  నీరు కార్చవా ,మనసు ద్రవీభూతం కాదా? .చివరి కథ’’గోడమీద బొమ్మ ‘’లో గోడమీద ఎప్పుడో వేసిన తుపాకి బొమ్మను చెరిపేయటం ,’’తుపాకీ పట్టుకొనే వాళ్ళంటే భయంతోనే ‘’ఇవి సాంపిల్ గా నేను చెప్పినవి అన్నీ చదివి ఆనందించటం మీ వంతు .

 స్పూర్తిగారు బీస్ ఎన్ ఎల్ లో  రిటైర్డ్ టెలిఫోన్ సూపర్వైజర్.బహుపురస్కారగ్రహీత

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-26-ఉయ్యూరు .. .

 


--
1.jpg
2.jpg
Reply all
Reply to author
Forward
0 new messages