స్వాతంత్ర్యోద్యమం లో అమలాపురం రారాజులు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 22, 2024, 7:26:47 AM (8 days ago) Jun 22
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Vuppaladhadiyam Venkateswara, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, గోదావరి రచయితల సంఘం రాజమహేంద్రవరం, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

స్వాతంత్ర్యోద్యమం లో అమలాపురం రారాజులు

 

అమలాపురం రూరల్‌, ఆగస్టు 14: స్వాతంత్రోద్యమ పురిటిగడ్డలు ఆ గ్రామాలు. అయితే.. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారందరూ రారాజులే. స్వాతంత్ర్యోద్యమం పేరు చెప్పగానే మండల పరిధిలోని వన్నెచింతలపూడి, సమనస-రంగాపురం గుర్తుకొ స్తాయి. ఈ రెండు గ్రామాల నుంచి 17 మంది స్వాతంత్ర్యోద్యమకారులు ఉండగా వారికి అండగా ఎప్పుడూ వందమంది వరకు ఉద్యమకారులు ఉండేవారు. వన్నెచింతలపూడి గ్రామం నుంచి నడింపల్లి బంగార్రాజు ఆఽధ్వర్యంలో నడింపల్లి సీతారామరాజు, నడింపల్లి భీమరాజు, నడింపల్లి జగ్గరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, నడింపల్లి విశ్వనాథరాజు, నడింపల్లి సుబ్బరాజు (సాధురాజు), నడింపల్లి రామమూర్తిరాజు, నడింపల్లి సత్యనారాయణరాజుల, భూపతిరాజు సుబ్బరాజు స్వాతంత్ర్యోద్యమంలో జైలు జీవితం గడిపినవారే. రంగాపురం గ్రామానికి చెందిన భూపతిరాజు జగ్గరాజు ఆధ్వర్యంలో భూపతిరాజు సూర్యనారాయణరాజు, భూపతిరాజు రామరాజు, భూపతిరాజు రామచంద్రరాజు, భూపతిరాజు వెంకటపతిరాజు, నడింపల్లి సత్యనారాయణ, నడింపల్లి సుబ్బరాజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జైలు జీవితం గడిపినవారే. అంతేకాదు తమ యావదాస్తులనూ ఉద్యమానికి అర్పించారు.

నడింపల్లి బంగార్రాజు 1930వ దశకంలో మద్రాసు, రాజమహేంద్రవరం, బళ్లారి సెంట్రల్‌ జైళ్లలో శిక్ష అనుభవించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత బంగార్రాజుకు పెన్షన్‌తో పాటు భూమిని అప్పగించింది. భూమిని భూదాన ఉద్యమంలో వినోభాబావేకు అప్పగించారు.

1932లో భూపతిరాజు జగ్గరాజు ఉద్యమానికి సంబంధించిన ఉత్తరాన్ని రహస్యంగా తుని చేరవేస్తుండగా పిఠాపురంలో పోలీసులు అడ్డగించారు. ఆయన్ను తీవ్రంగా కొట్టి పంట పొలాల్లో పడేశారు. కొన ఊపిరితో ఉన్న జగ్గరాజును స్థానికులు గుర్తించి రక్షించడంతో పాటు స్వగ్రామానికి చేర్చారు.

స్వాతంత్రోద్యమ కాలంలో దేశం కోసం పడ్డ కష్టాలను గుర్తించి 1973లో నాటి జిల్లా కలెక్టర్‌ సీఎస్‌ రంగాచారి భూపతిరాజు జగ్గరాజు, నడింపల్లి జగ్గరాజులకు తామ్ర పత్రాలను ప్రదానం చేశారు.

సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి రామన్న, సత్తి వెంకన్న స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాల్గొని ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపారు.

బండారులంకకు చెందిన కాశిన వెంకటరత్నం 14వ ఏటనే స్వాతంత్రోద్యమ బాట పట్టారు. మహాత్మాగాంధీతో కలిసి జైలు జీవితం గడిపారు. 1929 మే 5న కోనసీమ పర్యటనకు వచ్చిన మహాత్మునితో కలిసి వెంకటరత్నం పర్యటించారు. ఉద్యమం కోసం ఆస్తులు తరిగిపోతున్నా పట్టించుకోలేదు. టంగుటూరి ప్రకాశంపంతులు ప్రధాన అనుచరునిగా గుర్తింపు పొందారు.

వాడపల్లిలో స్వరాజ్య స్ఫూర్తి

ఆత్రేయపురం, ఆగస్టు 14: వాడపల్లి గ్రామంలో 1931 మార్చి 30న శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించారు. రథంపై బాపూజీ చిత్రపటాన్ని, స్వరాజ్య జెండాను దేశ భక్తులు ఎగురవేశారు. రథోత్సవం జరుగుతుండగా వాటిని తొలగించాలని బ్రిటీష్‌ పోలీస్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ముస్తఫా ఆలీఖాన్‌ హెచ్చరించారు. దేశ భక్తులు ససేమిరా అనడంతో లాఠీచార్జి చేసి తుపాకీ కాల్పులు జరిపి ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించారు. నలుగురు పోరాటయోధులు వీర మరణం పొందారు. వందలాది మంది గాయపడ్డారు. మరికొంత మందిని జైళ్లలో బంధించారు. ప్రజల పోరాట పటిమతో బ్రిటీష్‌ పాలకులు పలాయనం చిత్తగించారు. ఈ పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలనే సదుద్దేశ్యంతో రాజకీయ దురంధురుడు, గాంధేయవాది మంతెన వెంకట సూర్యసుబ్బరాజు వాడపల్లి క్షేత్రం ఎదురుగా స్మారక స్థూపాన్ని నిర్మించారు. చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కల్యాణం, రథోత్సవాలను తిలకించడానికి వచ్చే వేలాది మంది భక్తులు అమరులకు నివాళులర్పిస్తున్నారు.

బాపూజీ ర్యాలి వచ్చిన వేళ..

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం ప్రత్యేకత సంతరించుకుంది. 1929లో విదేశీ వస్తు బహిష్కరణపై పోరాటం సాగిస్తున్న సమయంలో గాంధీజీ ఈ గ్రామాన్ని సందర్శించారు. వేల సంఖ్యలో దేశ భక్తులు ఆయన వెంట నడిచారు. గాంధీ వచ్చిన వేళను పురస్కరించుకుని 1953లో కేశవస్వామిగుడి వీధిలో దివంగత పి.సూరపరాజు గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు.

స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తికి ఊతమిచ్చిన దేవులపల్లి గేయం

సామర్లకోట, ఆగస్టు 14: స్వాతంత్రోద్యమ స్ఫూర్తికినాడు దేశవ్యాప్తంగా ఎంతో ఊతమిచ్చిన గేయం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం కావడం విశేషం. ఈ గేయ రచయిత దేవులప ల్లిది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం రావువారి చంద్రంపాలెం కావడంతో ఈ ప్రాంతా నికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మస్థలం రావువారి చంద్రంపాలెం కాగా, కాకినాడ పీఆర్‌ కళాశా లలో ఉన్నత విద్యాభ్యాసం చేసి తొలిసారిగా పెద్దాపురం లూధరన్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా 1919లోచేరారు. 1945లో సినీరంగంలో ప్రవేశించిన దేవులపల్లి స్వాతంత్య్ర పోరాటయోధులను మరింత ఉత్తేజితులను చేసేందు కుగానూ జయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి అనే గేయం రచించగా అప్పట్లోనే ఈ గేయం ఎంతో పాపులారిటీ సాధించింది. 1986లో చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాలో ఇదే గేయాన్ని తిరిగి తెరకెక్కించడం ద్వారా దేవులపల్లి గేయం మరోసారి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది.

పెద్దాపురంలో మహాత్ముడి తీపి గుర్తులు

పెద్దాపురం, ఆగస్టు 14: కాకినాడ జిల్లా పెద్దాపురంలో జాతిపిత మహాత్మాగాంధీ తీపిగుర్తులు ఉన్నాయి. మహాత్ముడు పట్టణంలో రెండు ప్రాంతాలను సందర్శించినట్లు పలువురు చెబుతున్నారు. దీంట్లో పట్టణంలో ఉన్న మెయిన్‌రోడ్డు కాగా, రెండవది ముప్పనవారి బంగ్లాను చెప్పవచ్చు. 1942లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలకు ఆయన వచ్చినప్పుడు పెద్దాపురం పట్ణణాన్ని సందర్శించారు. డైలీమార్కెట్‌, మెయిన్‌రోడ్డ్డు మధ్యలో ఉన్న సెంటర్‌లో ఆయన కాంగ్రెస్‌ నాయకులనుద్దేశించి ప్రసంగం చేశారు. అప్పటి నుంచి ఆ సెంటర్‌ను గాంధీ బొమ్మసెంటర్‌ అని పిలుస్తారు. మహాసభ ముగిసిన అనంతరం ఆయన ముప్పన వారి బంగ్లాలో ఆరోజు రాత్రి బసచేశారని పెద్దలు చెబుతున్నారు.

పొట్ట కండరాలపై ఎగిరిన జాతీయ పతాకం

పోర్టుసిటీ(కాకినాడ), ఆగస్టు 14: స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని యోగపీఠ గురువు సద్గురు సచ్చిదానంద యోగి పొత్తి కడుపుపై జాతీయ త్రివర్ణ పతాకంతో దేశభక్తిని చాటు కున్నారు. భారతదేశ సంస్కృతిని ప్రతిభింబిస్తూ దేశభక్తిని చాటాలనే ఉద్దేశంతో యోగ సా ధనలో ని నౌలిచాలన క్రియద్వారా పొట్ట కండరాలపై జాతీయ జెండాను ఎగరవేశాడు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మన సనాతన సంస్కృ తిలో భాగమైన యోగాతో స్వాతంత్య్ర దినోత్సవ వేళ జాతీయ జెండాను వినూత్నంగా ఎగరవేయాలనే ఆలోచనతో యోగా శాస్త్రంలో చెప్పిన నౌలిచాలన క్రియ అనే పద్ధతితో పొట్ట కండరాలపై జాతీ య జెండాను ఎగురవేయాలనే ఆలోచన వచ్చిందన్నారు.

రావి ఆకుపై మహాత్మాగాంధీ

సబ్బు బిళ్లలపై మహానీయుల చిత్రాలు

గొల్లప్రోలు రూరల్‌, ఆగస్టు 14: రావి ఆకుపై చెక్కిన మహాత్మాగాంధీ, సబ్బుబిళ్లలపై మహానీయుల చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాకినాడజిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉ పాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులు లీఫ్‌ కార్వింగ్‌ కళలో తనకు ఉన్న ప్రావీణ్యంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలుచిత్రాల చిత్రించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని రావి ఆకుపై చెక్కారు. సబ్బు బిళ్లలపై మహానీయులు సుభాష్‌ చంద్రబోస్‌, బాలగంగాధర్‌ తిలక్‌, ఇందిరాగాంధీ, డాక్టర్‌ ఏపీజే అబ్ధుల్‌కలామ్‌, వివేకానందుడు, చత్రపతి శివాజీ, రవీంద్రనాధ్‌ఠాగూర్‌, లాల్‌బహదూర్‌ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రాలను, జాతీయ చిహాన్ని చెక్కారు. విద్యార్థులకు ఈ చెక్కిన చిత్రాలతో పలు అంశాలను వివరించారు. గోవిందరాజులను ఎంఈవోలు ఎన్‌.వెంకటేశ్వరరావు, ప్రసాద్‌, పాఠశాల హెచ్‌ఎం సురేష్‌కుమార్‌ల అభినందించారు.

సెల్యూట్‌ పోస్టల్‌

గుడిసెఅవతలకు నడిచివెళ్లి జాతీయ పతాకాల అందజేత

డివిజన్‌లో 20 వేల జెండాల పంపిణీ

రాజమహేంద్రవరం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాజ మహేంద్రవరం పోస్టల్‌ డివిజన్‌కి సెల్యూట్‌ కొట్టాల్సిందే. హమ్‌ ఘర్‌ తిరంగాని చివరి ఇంటివరకూ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దట్టమైన అటవీప్రాంతంలో గుడిసెఅనే చిన్న గ్రామం ఉంటుంది. ఇది పర్యాటకంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఊరు వెళ్లిన పోస్టల్‌ సిబ్బంది గ్రామస్థులకు జాతీయ పతాకాలను అందజేశారు. అక్కడికి మరో ఆరు కిలోమీటర్ల అవతల 5ఇళ్లు ఉన్న ఊరికీ నడిచి వెళ్లి జాతీయ పతాకాలను ఇంటిపై ఎగురవేసేలా చైతన్యంతీసుకువచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ గ్రామాల్లో జాతీయ పతాకం రెపరెపలాడడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కాగా..స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు రూ.25 నామమాత్రపు రుసుముకు మొత్తం 17వేల జాతీయ జెండాలను పంపిణీ చేశామని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌ పి.కోమల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం సెలవు తీసుకోకుండా అన్ని పోస్టాఫీసుల్లో పంపిణీ చేశామన్నారు. ఆనాటి స్వాతం త్య్ర పోరాట యోధుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాజ మహేంద్రవరం పోస్టల్‌ డివిజన్‌కి సెల్యూట్‌ కొట్టాల్సిందే. హమ్‌ ఘర్‌ తిరంగాని చివరి ఇంటివరకూ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దట్టమైన అటవీప్రాంతంలో గుడిసెఅనే చిన్న గ్రామం ఉంటుంది. ఇది పర్యాటకంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఊరు వెళ్లిన పోస్టల్‌ సిబ్బంది గ్రామస్థులకు జాతీయ పతాకాలను అందజేశారు. అక్కడికి మరో ఆరు కిలోమీటర్ల అవతల 5ఇళ్లు ఉన్న ఊరికీ నడిచి వెళ్లి జాతీయ పతాకాలను ఇంటిపై ఎగురవేసేలా చైతన్యంతీసుకువచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ గ్రామాల్లో జాతీయ పతాకం రెపరెపలాడడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కాగా..స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారం రోజులపాటు రూ.25 నామమాత్రపు రుసుముకు మొత్తం 17వేల జాతీయ జెండాలను పంపిణీ చేశామని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌ పి.కోమల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం సెలవు తీసుకోకుండా అన్ని పోస్టాఫీసుల్లో పంపిణీ చేశామన్నారు. ఆనాటి స్వాతం త్య్ర పోరాట యోధుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొన్నారు.

  మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-24-ఉయ్యూరు

 

 

image.png

గాంధీజీ ఒక రోజు బస చేసిన ముప్పన వారి బంగళ

Reply all
Reply to author
Forward
0 new messages