రావణుడితో జరిగిన మొదటిరోజు యుద్ధం లో రాముడు కొట్టిన దెబ్బకు రావణుడి ‘’దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బొమ్మ ‘’కనిపించిందా ?
అవును .వాల్మీకం అదే చెప్పింది .యుద్ధకాండ 60వ సర్గలో రాముడు కొట్టిన దెబ్బకు నిలవలేక లంకకు వెళ్ళాడు రావణుడు .బ్రహ్మ దండం వంటి మెరుపులున్న చలించేకా౦తిగల రాముడి బాణాలకు స్మరిస్తూ వ్యధ చెందాడు . .మైండ్ బ్లాక్ అయింది ఒకరకంగా బ్లాంక్ అయింది .దిమ్మతిరిగింది .అప్పుడు బొమ్మ కనిపింది.అంటే తాను పూర్వం చేసిన పాపాలు,దేవతలిచ్చిన శాపాలు గుర్తుకువచ్చాయి .
‘’ఉమా నందీశ్వర శ్చాపి రంభా వరుణకన్యకా –యధోక్తా స్తన్మయా ప్రాప్తం న మిధ్యా ఋషి భాషితం ‘’-పార్వతీదేవి,నందీశ్వరుడు, రంభ ,వరుణపుత్రిక ఎలాశపించారో అలానే జరుగుతోంది .ఋషులమాటలు ఎన్నడూ అసత్యాలుకావు అనే ఎరుక కలిగింది పదితలలవాడికి .కనుక రాముడిని ‘’లైట్ ‘’తీసుకో కూడదు.అశాపాలను దృష్టిలో పెట్టుకొని ఎదిరించే ప్రయత్నాలు చేయండి అని అందరి కీ ఆజ్ఞలు జారే చేశాడు నిండు సభలో .
ఇంతటి విపత్కర పరిస్థితిలో తనకు సాయం చేయగలవాడు తన తమ్ముడు కుంభ కర్ణుడు ఒక్కడు మాత్రమె అని అర్ధమైంది .వాడు మంచి నిద్రలో ఉంటాడు .ఒకరోజుమాత్రమె లేస్తాడు .మళ్ళీ పడక .గత్యంతరం లేదు వాడిని లేపి తన దగ్గరకు తీసుకురమ్మన్నాడు .అన్నిద్వారాలవద్దా కాపలా పెంచమని హుకుం జరీ చేశాడు .ఇదీ దెబ్బతిన్న రావణ అంతరంగం .భయం ఆవహించిన పరిస్థితి.-
ఆధారం –వాల్మీకిరామాయణం –ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారీ .బాలానందిని వ్యాఖ్య
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-6-26-ఉయ్యూరు .
--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z8CHferz3oT9dU1NzD-YUjzyhHuvU5mYzcnCq4Jar4P8A%40mail.gmail.com.