స్వాతంత్ర్య పోరాటోద్యమ నాయకుడు ,‘’విశ్వనాధ అంతేవాసి’’ అచ్చ౦గాఆయనలా పద్యాలు పాడేవారు ,ఆయన్ను  కరీం నగర్ప్రిన్సిపాల్ గా తీసుకు వెళ్ళినవారు,జయంతి పత్రిక సంపాదకులు -శ్రీ  జువ్వాడి గౌతమరావు 

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Aug 28, 2025, 10:34:15 PM (11 days ago) Aug 28
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

స్వాతంత్ర్య పోరాటోద్యమ నాయకుడు ,‘’విశ్వనాధ అంతేవాసి’’ అచ్చ౦గా ఆయనలా పద్యాలు పాడేవారు ,ఆయన్ను  కరీం నగర్ ప్రిన్సిపాల్ గా తీసుకు వెళ్ళినవారు,జయంతి పత్రిక సంపాదకులు -శ్రీ  జువ్వాడి గౌతమరావు 

జువ్వాడి గౌతమరావు (ఫిబ్రవరి 11929 - 2012) భాషాభిమాని, సాహితీకారుడు.

జననం

కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ గ్రామంలో 1929ఫిబ్రవరి 1  జువ్వాడి గౌతమరావు జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. అతనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీవీ నరసింహారావుకోవెల సుప్రసన్నాచార్యకోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో అతనుకు చాలా సాన్నిహిత్యం ఉంది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. వరంగల్‌లో కాళోజీఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటుపడ్డాడు.[1]

స్వాతంత్ర్య పోరాటంలో యోధుడిగా పనిచేసిన అతను సోషలిస్టుగా పరిణతి చెందాడు. ప్రగతిగామిగా ఉంటూనే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకొని ఆ స్కూల్ ఆఫ్ థాట్‌కు తనను తాను పరిమితం చేసుకున్నాడు. రాజకీయాలంటే ఇష్టం లేకుండానే ఎన్నికల్లో జనతా పార్టీ పక్షాన 1977లో పోటీ చేశాడు.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జువ్వాడి అత్యంత ఆత్మీయుడు. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షాన్ని శ్రావ్యమైన కంఠంతో తమదైన శైలిలో అంతరార్థాలను విశదీకరిస్తూ రసికులకు వినిపించగలిగి, వారి మూర్తితత్వాన్ని ఆవిష్కరించాడు. తానే రచించాడా అన్నంతగా ప్రజల్లోకి రామాయణ కల్పవృక్షాన్ని తీసుకెళ్లాడు. జువ్వాడి ప్రోద్బలంతోనే విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విశ్వనాథ భక్తియోగఅనే పద్యకావ్య సంపుటిని జువ్వాడి కోసం రాసి అంకితం ఇచ్చారు. కల్పవృక్షంలో కైకేయి’, ‘వేయిపడగలలో విశ్వనాథ జీవితంవంటి జువ్వాడి సాహిత్య వ్యాసాలు సాహిత్యలోకంలో సంచలనాలు సృష్టించాయి.

నవ్య సాహిత్యోద్యమ కాలంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కొంతకాలం పాటు జయంతి అనే సాహిత్య పత్రిక నడిపాడు. తర్వాత దానికి జువ్వాడి సారథ్యం వహించారు. వివిధ పత్రికల్లో జువ్వాడి రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి వెలిచాల కొండలరావు సాహిత్యధారపేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించాడు. జువ్వాడి సాహిత్య కృషికిగాని, సంపాదకత్వం వహించినప్పటి జయంతి పత్రికకు గాని రావాల్సిన కీర్తి ప్రతిష్ఠలు రాలేదు. అయినా జయంతి సంపాదకుడిగా అతను సంపాదకత్వం పత్రికా రంగానికే వన్నె తెచ్చింది. నాడు ఇంటర్ ఫైనలియర్ చదువుతున్న సీ నారాయణడ్డి తొలి కవిత అచ్చయింది ఆ పత్రికలోనే.జీవితమంతా సాహితీ అధ్యయనంతోను, విశ్వనాథ కల్పవృక్ష గానంతోను గడిపారు. ఇటీవలే విశ్వనాథ ప్రత్యేక సంచికను సాహిత్యపీఠం అతనుకు అంకితం చేసింది.

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో  

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-8-25-ఉయ్యూరు

 

image.pngan

--

SriRangaSwamy Thirukovaluru

unread,
Aug 29, 2025, 2:51:55 AM (11 days ago) Aug 29
to sahiti...@googlegroups.com
భక్తియోగ కాదు భ్రష్టయోగ. జువ్వాడి గారికి రామాయణ కల్పవృక్షం కంఠతః ఉండేది. అంతేకాదు ఆయన కల్పవృక్షం మొత్తం గానం చేసి 70క్యాసెట్లలో పెట్టారు. శ్రీకృష్ణ సంగీతం, శృంగార వీధి, గోపికాగీతలు వాటిని క్యాసెట్లుగా చేసారు. విశ్వనాథ చెపుతుంటే 12 నవలలు రాసారు. వాటిని ఆ కాలంలో చింతల సత్యనారాయణ బుక్ షాపు వారు అచ్చువేసారు. అందులో ఒకటి మ్రోయుతుమ్మెద. విశ్వనాథ వారు స్వయంగా జువ్వాడి గౌతమరావు, మల్లంపల్లి శరభయ్య మరొకరు వున్నంతవరకు నా రామాయణం పొల్లుపోకుండా అప్పచెప్పగలరని అనేవారట. కోవెల సంపత్కుమార, సుప్రసన్న, ధూళిపాళ, కేతవరపు రామకోటి శాస్త్రి, మాదిరాజు రంగారావు, బులుసు వెంకటేశ్వర్లు వీరందరూ కల్పవృక్షం అప్పచెప్పగలిగేవారు. ఇందులో తుమ్మపూడి వారు కూడా వస్తారు. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం గాన సభకు జువ్వాడి గారు రామ్ మనోహర్ లోహియాను తీసుకువెళ్లారు, ఆ గానం విని ఇతను కవి మాత్రమే కాదు పరమభక్తుడని అన్నారట. జువ్వాడి గారు ప్రతి సంవత్సరం వారింట్లో విశ్వనాథ సాహిత్య సదస్సు నిర్వహించేవారు, ఆ సదస్సుకు మా గురువుగారు కోవెల సంపత్కుమార గారితో వెళ్ళాను. నేను విశ్వనాథ సత్యనారాయణ గారి కృష్ణ కావ్యాల పై పరిశోధన చేయడం వలన విశ్వనాథ సాహిత్య కుటుంబం లో సభ్యుడిని అయ్యాను. కేవలం సభ్యుడిని మాత్రమే ఎందుకంటే నాకు ఏవీ కంఠతః ఉండవు. నా పరిశోధన గ్రంథం విశ్వనాథ శతజయంతికి ముద్రించినాను. విశ్వనాథ పరిమళం ఒక పరమాణువు అంటుకుంది. 

--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-i3zfOux5AZLs4hvcFmKfCnyHLCdH5rVqL7NqducZMKQ%40mail.gmail.com.

SriRangaSwamy Thirukovaluru

unread,
Aug 29, 2025, 2:53:02 AM (11 days ago) Aug 29
to sahiti...@googlegroups.com
భ్రష్టయోగి

gabbita prasad

unread,
Aug 29, 2025, 6:50:38 AM (11 days ago) Aug 29
to sahiti...@googlegroups.com
నేనుకూడా బెజవాడ రామ్మోహన్ లైబ్రరీలో సుమారు ముప్ఫై ఏళ్ళక్రితం గౌతమరావు గారి  రెండు గంటల  కల్ప వ్రుక్ష గానంవిన్నఅదృష్టవంతుడిని .నాతోపాటు విశాలాంధ్ర ఎడిటర్ రాఘవా చారి గారు మొదలైన వారున్నారు .వారింట్లో జరిగే కల్ప వ్రుక్షగానాన్ని నాకు ఉత్తరం రాస్తే వస్తానన్నాను వారు రమ్మని కార్డ్ రాశారు వెళ్ళలేక పోయిన దురదృష్ట వంతుడిని 
 గౌతమరావు గారు గానం చేసిన సిడి లు ఉన్నాయా ?

SriRangaSwamy Thirukovaluru

unread,
Aug 29, 2025, 7:23:57 AM (11 days ago) Aug 29
to sahiti...@googlegroups.com
నా దగ్గర లేవు. ఒక క్యాసెట్ ఉండాలి. వెతకాలి. 70క్యాసెట్లను కోవెల వారు సి.డి గా మార్చాలని అన్నారు. కాని చేసింది లేనిది తెలియదు. ఈసారి కరీంనగర్ వెళ్ళినపుడు గౌతమరావు గారి అబ్బాయిని అడగాలి. ప్రస్తుతం నేను యు.కెలో ఉన్నాను. 

gabbita prasad

unread,
Aug 29, 2025, 8:44:43 AM (11 days ago) Aug 29
to sahiti...@googlegroups.com
Reply all
Reply to author
Forward
0 new messages