’కనకం ‘’చేసే  హస్తాలే ‘’కవిత్వంరాసే చేతులు ‘’అయితే –

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Feb 19, 2026, 10:28:38 PM (13 days ago) Feb 19
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, D. G. V. Purnachand, Subbarao Guttikonda, chalapaka prakash Channel

కనకం ‘’చేసే  హస్తాలే ‘’కవిత్వం రాసే చేతులు ‘’అయితే

--ఆకవిత్వం కమ్మచ్చు తీరినట్లు  మహా నాజూకుగా ,జిగి బిగి కలిగి తళుకులీనుతూ ,సుగంధం కూడా అబ్బి పరిమళ భరితంగా శాశ్వత విలువలు కలిగి ఉంటుందని రుజువు చేశాడు శ్రీ చలపాక ప్రకాష్  ఏడేళ్ళ తర్వాత వెలువరించిన  కవితా సంపుటిలో .ఈ కవితలన్నీ వివిధ పత్రికలలో, వేదికలమీద పరిచయమైనవే .దాదాపు మనం చదివినవే .ఇప్పుడు 2026 లో పుస్తక రూపం దాల్చాయి .కనుక నిగ్గు తేరిన ,కాలపరీక్షలో నిలిచిన గెలిచిన’’హాల్ మార్క్ ‘’కవితలు అనవచ్చు .

 కవిత్వం చలపాకకు అలవోక .ప్రవాహం .పదాలను వెతుక్కోనక్కరలేదు .వచ్చి కూర్చుంటాయి .అందగిస్తాయి .మందగించవు .భావానికి మెరుగులు దిద్దుతాయి .తమ సత్తా ఏమిటో చూపిస్తాయి .ఈ సంపుటిలో మెరిసిన కవితా రేణువుల అందచందాలను  మీకు పరిచయం చేస్తాను .జీవితం లో విశ్రాంతి లేకపోవటం ‘’రెస్ట్ వరెస్ట్ గా -ఆస్పత్రి బెడ్ మీద సరికొత్త రోగమై కూర్చుంది .’’అందుకేకాలం ‘’కొత్తదనాల్లో వేగం తగ్గించి దారితప్పే అడుగు జాడల్ని సరిచూసుకొని సరి చేసుకోవాలి ‘’అనే హితవు .కంప్యూటర్ ఫేస్ బుక్ అయి చాటింగ్ మోసం మొహాన్నే మాడ్చేసి,రూపాన్ని మార్చేసింది ‘’తస్మాత్ జాగ్రత .అన్నీ ఫ్రీలే కనుక వాటర్ బాటిల్ స్టోర్ లో ఇచ్చె సమాజం కోసం ఎదురు చూపు .దీనికి తోడూ జి.స్. టి. రోకటిపోటు సలుపు .కనిపించే ప్రతి  దాన్ని కబళించే ప్రపంచీకరణ సూత్రం ‘’వగలాడి తనం ‘’అ౦టాడుకవి . కవి ‘’తల్లోపేలు చంద్రుడిలో మచ్చ లా తలగోక్కో పెడుతోందని చమత్కారం .’’నావ-కాలం, –నది- జీవితం, సముద్రం- మరణం’’జీవితానికి మూడేముక్కల్లో గొప్ప నిర్వచనం .అపరాధాలు చేస్తూపోతే ‘’నువ్వు కాచిన ‘’టీ’’ లో గమ్మత్తైన ఏదో ఒక’’ టి’’పడిచస్తావ్ .పారాహుషార్ .అపార్ట్ మెంట్ పై నుంచి లేపుతున్న ఆచెయ్యి ఆహారపొట్లానికో ,టాటా చెప్పటానికో తెలుసుకోలేక పోతున్నాడు .ప్రతి అపార్ట్ మెంటు జీవనది అందులో మనుషులు నీటిచుక్కలు తెలిసింది ఎంతైనా తెలియంది కొండైనా-కరిగిపోవాల్సిందే నేలతల్లిలో ‘’కల ‘’గలిసి పోవాల్సిందే ‘’.చలపాక వేమన ‘’సూక్తి .గుండెకే కాదు ఒంటి నిండా పడ్డ బొక్కలను చూసి నిట్టూర్పు .’’కాకి వదిలిన రాయికి కుండ గుండె లో తడి ఒణుకు ‘’వినూత్న పదబంధం .నిజమైన నేస్తం ‘’వెలుగునిచ్చే స్నేహమనే ఒత్తికి గుండె గా నిలుస్తాడు ‘’హైబ్రిడ్ వేషమేసుకొచ్చిన-రంగులు మార్చే ప్రేమ పూలు ‘’ఏమారుస్తాయి భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ’’ . యువకవుల గుండె చప్పుడు ,ఆదర్శం మార్గదర్శి అద్దేపల్లి రామమోహన రావు –‘’పల్లె పల్లె మర్రి చెట్టు రూపం లో కలగలిసిన సాహిత్య రూపం ‘’’’ప్రకాశ’’వంతమైన చలపాక నిర్వచనం.’’అక్షర కంకణం తో’’ స్టెంట్ ‘’పడితే కాని  ‘’అక్షరం బతికి బట్టకట్ట లేదేమో నని నిర్వేదం .’’కన్నీరు, ఉన్నవాడి దరి చేరదు పేదోడి కంటి రెప్పల్లో నేస్తంగా ఒదిగి ఉంటుందట.’’.తన్ను ఏకాకిని చేసి తుర్రుమన్నది జోరీగ –‘’కపిత్వం కాకిగోల భరించలేక ‘’ 

-       ఆలోచన తళుక్కున మెరిసినప్పుడు ,కాగితాన్నే మనసుగా చేసుకొని ,ఆలోచనే కలం గా పూసుకొని కవిత్వమై కలసిపోవాలని’’,సూర్యోదయ’’(యు మీన్ జపాన్ ?) దేశంగా అవతరించాలని  ఉంటుంది చలపాక చేతులకు.’’ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లుక్ ‘’  అని తెలిసింది మొదట లైట్ తీసుకున్నా , ఆతర్వాత .’’నా రూప భావం నీలో పరకాయ ప్రవేశం ‘’అని ఊహాత్మక౦  గా ,వ్యూహాత్మకంగా అంటాడుకవి .కులానికి రిజర్వేషన్ ఉన్నా –సుఖ నిద్రకు జనరల్’’ కూపే’’ లో రిజర్వేషన్ ఉండదట .ఇదో అనుభవం .రెండు సిమ్ లున్నా ,ప్రతివాడి సెల్ –రెండు జీవిత కాలాల విముక్తి దొరకని  ఖైదీయే ‘’.అని’’ సెల్ హల్ చల్’’ గురించి నిజం చెప్పాడు .’’మరక కూడా మంచిదే’’ అన్నట్లు -మైమరపూ ఒక వరమే .ఎన్నో సంఘటనల్ని సమాధి చేసి గుండె గాయం కాకుండా మందుపూస్తుంది . .’ప్రాణం లేకుండా తానుండి –ఆమె లేకపోవటమే విడిపోవటం ‘’.గతకాలం లో తచ్చాడిన పాదముద్రలన్నా జ్ఞాపకంగా బంధించి ఉంచాలని ‘’చిన్నిచిన్ని  ఆశ ‘’ఈ ఆవేశపరుడికి .ప్రేమమైన మనిషి హృదయం బతికి ఉన్నప్పుడు గాయాలమయం –పోయాక గేయాల ,మయం ‘’ఫ్లెక్సీలమయం కూడా బాబూ .’’తోటి వారిని ప్రేమించే ముందు –మన గుండెల్ని తడుముకొంటు –మనసారా ప్రేమగా హత్తుకో ‘’అని ఈ ‘’హార్ట్ ఆర్ట్ ‘’స్పెషలిస్ట్ చిట్కా .’’కాలంతెలీకుండా నిద్రకాస్తూ –కళ్ళు వాస్తూ ‘’సెల్ బందీలపై జాలి ఎగతాళి .

-        విజయ౦ హర్షమై కురిసిన వేళ-వోటమి శోకిస్తూ పోవటమే తన విజయానికి కూటమి ‘’సభ్య సమాజం లో మౌనం మరగరాదు,అక్షరాభిమానం కరగక పోవటమే నవ్యత్వం ‘’కవిగారికో చిన్న డౌటు –‘’అన్నిటికి వచ్చే ముసలితనం –కాలానికి రాదెందు చేత ?’’ ,తానుకన్న కల మన’’వడి’’ లో ప్రత్యక్షమైనందుకు ‘’ఈ ముసలికవికి దక్కిన అదృష్టం .ఉగాది అంటే ‘’ఏడాది మొత్తం గుర్తు చేసే రోజు ‘’అనే భావన రావాలని కవి ఆశ .అదే అందరి శ్వాస కావాలి కదా .’’తాను ఎక్కడికీ పోలేదని –తనను తననుగా ప్రేమించే హృదయజ్ఞాపకాలలో ‘’శాశ్వతంగా ఉన్నానని చిరునామా చెప్పాడు కవి .’’కవిత్వం –‘’కవి’’ తత్వాన్నిబోధించే –విశాలభావజాల గాలం ‘’ ఇది మంచి కోటబుల్ కోట్ ,.మట్టిని పూజించటమేకాదు –మట్టి పరిమళాన్ని ఆఘ్రాణించ టమే  ప్రకృతి వైద్యం .మన ఉనికిని  గుర్తు పట్టే సమాధికీ మూలం మట్టి మాత్రమె ‘’అని’’ మిట్టీ మె సోనా’’ ఉందన్నారు.మట్టి మనిషిలాగా .మానవతా వాది అయిన ఈ కవికి  -‘’యుద్ధం కోరని దేశం ,ప్రపంచ మానవ శ్రేయస్సే’’మరీ మరీ ఇష్టం .కొత్త చిగుళ్ళు తొడుగుతున్నప్పుడు-భూమి పగలబడి నవ్వుతూ ,పగుళ్ళు బారుతుందట ‘’గొప్ప ఇమేజరీ .పెద్ద చిన్నా బుల్లి తెరలతో పోటీ పడి చిట్టి తెర’’ విజేతయై విజయదరహాసం ఒలకబోసింది .కడవంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ అన్నట్లు – మీసాలు మెలేసే పెద్ద పెద్ద  స్పెషలిస్ట్  డాక్టర్లు అయినా –మృత్యువు అక్కున చేరి సేద తీరాల్సిందే ‘’ఇది జీవిత నగ్న సత్యం .’’మూడు తలల పాము లాటలు ‘’ఆడే మూఢుల వికృత వింత ఆటలలో ఎందరు బలైపోతున్నారోనని కవి హృదయం ద్రవించి –కాలమే తేలుస్తుందని ‘’నిట్టూర్చాడు .’’నిజం నిప్పు –ఇజం పైకప్పు ,మేకప్పు ‘’స్వేచ్చ బలైపోతుంటే –బందీ కబంధహస్తాలనుంచి విముక్తికోసం –కొత్తకోరికల పరకాయ ప్రవేశం చేయాల్సిందే ‘’తప్పదుఅన్నారు కవి .’’అక్షరం ‘’అక్షరాభ్యాసం చేస్తోందట –మరింత మెరుగులు దిద్దుకోవటానికి ‘’ .  ‘’ఆకలిది దేహానిదా?-ఉచితాలు ‘’ఉచితానుచితాలు’’  చూడకుండా ఇచ్చి పారెస్తు౦టే  సోమరమ్మ ,బద్ధకిష్టయ్యలు తామర తంపరగా తయారౌతున్నారు .’’బాల్యానికి ఎదగాలనే తొందరే,జీవితపుఆటల్లో  గెలవాలని ఆరాటమే ‘’దీని తస్సాదియ్యా..

-       ఒంట్లో షుగర్ బలీయమైతే –‘’చప్పదనమే ‘’బహుమతి  .వాడి వోడిపోతున్న దేహానికి ‘’నేలతల్లి ఆసరా ‘’గొప్పకానుక .గుర్తుపట్టే ఒక్క దేహమైనా ప్లాట్ ఫాం పై కనిపించక’’ చెల్లని నోట్ల కట్టలా శిలా విగ్రహం’’గా కనిపించింది కవికి.’’సాయంత్రం వాన సేద దీర్చే స్నేహితుడయ్యాడు ‘ప్రేమించి లేచిపోయినోళ్ళకు  అమ్మా నాన్న ల ప్రేమ కనిపించలేదా ?వెయ్యి డాలర్ల ప్రశ్న .’’చెట్లు నరికిన పాపానికి ముక్కుకు ‘’ప్రాణవాయువు ‘’సిలిండర్ కట్టుకోవటమే గొప్ప శిక్ష అయింది .

-         తర్వాత కవితలన్నీ ‘’కరోనా ‘’కవితలే .మనం  దాదాపు చదివినవే .బాధపడి కన్నీరు కార్చినవే .కొన్ని హైలైట్స్ –కరోనా కాటుకు పిట్టల్లా రాలిపోతున్న వారి యోగ క్షేమాలు కూడా తెలుసుకోలేని నరకం .ఇప్పుడు ఐశ్వర్యం కంటే ఆరోగ్యం ముఖ్యం .ప్రపంచం అంతా ఆకీలుబొమ్మ చేతిలో బందీ .అది’’ ధ్రుత రాష్ట్ర కౌగిలి ‘’చిక్కుకోటం తప్ప విడిపించుకోలేనిది .ఒకరకం గా మానవత్వపు కళ్ళు తెరిపించిన కాలమది .మనిషి మనిషిని ముట్టుకొంటే కరోనా షాక్ ‘’.అంటరాని తనం వెలివాడ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కాపురం పెట్టింది .ఇలాగైనా మనుషులకు ఇంట్లో ఉంటూ కాస్త విశ్రాంతి శారీరకం గా మానసికంగా .అందుకే ఇది ‘’పోయేకాలం.అంటే ప్రాణం పోయేకాలం అన్నమాట . ‘’ప్రాణం ఖరీదు కోట్ల’’ లో .ప్రకృతి కాలుష్యంతో పాటు భాషామతల్లినీ కాలుష్యపరుస్తున్న తీరు భయానకం బాధాకరం .ప్రపంచ మానవుల్ని ఏకం చేసిన మహా మాయరోగం  -‘’తడిసిన మానవ మేధస్సును కడిగి –తుడిచే కొత్తచేతి రుమాలు ‘’జాతస్య మరణం ధృవం ‘’అనే పాతసామెతకు కొత్త నిర్వచనం కరోనా . సూర్యుడు క్వారంటైన్ నుంచి బయటపడ్డ రోగిలా కనిపించాడు .దీనిపై యుద్ధం ‘’కోల్పోయిన ఒక జీవిత కాలానిది. ‘గడ్డాలూ మీసాలు పెంచే వినూత్నఫాషన్ ఉరికొయ్యకు ఋషుల పరువు ను ఉరితీసి చంపాలి ‘’అక్కర్లేదేమో వాళ్ళే శపిస్తారు భయ్యా .

-        ప్రతి నమస్కారం చేయని వాడు బతికున్నాచచ్చినట్లే –‘’ప్రాణం మనం చాచిన చేతుల్లో ,బదులిచ్చే సంస్కారం లోనే ఉంది’’సువర్ణాక్షర లిఖిత మైన మాటలివి .అసత్యం పువ్వు ఎప్పటికైనా నేలరాలి –మట్టి లో సత్యంగా కలవాల్సిందే ‘’.’’బాధ పడ్డ నీ కన్నీరు –నా కంటి వెలుగులోకి –చేరడం నేనేకాదు నువ్వూ చూడకపోవచ్చు .ఇది సత్యం నిరంతర సత్యం .

-         ఇంటికి తాళం మాత్రమె కాదు ,అమూల్యాలన్నీ కాపాడే తాళం భార్య .దాంతో పెట్టుకొంటే నీ పరువు బస్టాండ్ .కాలమెప్పుడూ మొఖం వాచినట్లు ‘’పాతముఖాలను తీసి కొత్తముఖాలను తగిలిస్తూ’’ ఉంటాది .ట్రంపు కంపు లోంచి బయట పడి సత్తా చూపని ఎన్ .ఆర్ .ఐ . లకు సవాల్ విసిరిన అసలైన  ‘’భారతీయుడు’’ మనకవి .’’అసంపూర్ణ వల లాంటి జీవితాన్ని కంటూ ఉండటమే భయంకర కల ‘’

-       చివరగా ‘’ఆలి మెడలో బంగారపు  తాళికూడా లేని –స్వర్ణకారుల బతుకు లలో కాంతులే లేవు ‘’.స్వర్ణం’’ లేని ‘’కారు’’లయ్యారు ‘’కారు చౌక’’ జీవులయ్యారు. అయినా ,ఎవరూ గుర్తించకున్నా –‘’ప్రతి ఒంటిపై అందగించే  నగలో  సుత్తి దెబ్బలకు తట్టుకొని, మెరిసిన,  తళుకులో, మెరుపులో మనం ఉన్నా౦ భయ్యా ‘’అని ఓదారుస్తాడు’’ ఈ సు’’వర్ణ’’ కవీ, స్వర్ణకారుడు,అయిన చలపాక ప్రకాష్ .ఆయన మేధోజనిత మైన ఈ సంపుటి నిజంగా స్వచ్చమైన  కాంతులీనుతోంది ఆయన మనస్సులా ,వ్యక్తిత్వంలా ,ప్రవర్తనలా .

-       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-20-2-26-ఉయ్యూరు .  


--
1.jpg
2.jpg
Reply all
Reply to author
Forward
0 new messages