తెలంగాణా చారిత్రకపరీశొధకుదు ,బాషాశాస్త్రవేత్త,చెన్నారెడ్డి గారి గురువు ఆంధ్ర పరిశోధక మండలికార్యదర్శి ,, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ తొలిలైబ్రేరియన్,దక్కన్ రేడియో లో మొదటి తెలుగు ప్రసంగం చేసిన ఘనుడు -శ్రీ ఆదిరాజు వీరభద్రరావు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Aug 28, 2025, 7:46:45 AM (12 days ago) Aug 28
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

తెలంగాణా చారిత్రకపరీశొధకుదు ,బాషాశాస్త్రవేత్త,చెన్నారెడ్డి గారి గురువు ఆంధ్ర పరిశోధక మండలికార్యదర్శి ,, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం తొలిలైబ్రేరియన్,దక్కన్ రేడియో లో మొదటి తెలుగు ప్రసంగం చేసిన ఘనుడు   -శ్రీ ఆదిరాజు వీరభద్రరావు 

ఆదిరాజు వీరభద్రరావు (నవంబరు 161890 - సెప్టెంబరు 281973తెలంగాణ ప్రాంతపు చరిత్రసంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.

జననం - విద్యాభ్యాసం

ఇతను 1890 నవంబరు 16 ఖమ్మం జిల్లామధిర మండలందెందుకూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన రావిచెట్టు రంగారావు ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, రావిచెట్టు రంగారావు ఇంట్లో నెలకొల్పిన శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరావు నియమితులైనారు.[1]

రచనా ప్రస్థానం

1908లో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాదు నుండి మద్రాసుకు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళారు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు, పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత రచయితగాను శిక్షణ పొందారు. 1914లో హైదరాబాదుకు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితుడయ్యారు . ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూనారాయణగూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశాడు. మర్రి చెన్నారెడ్డి ఇతని శిష్యులలో ప్రముఖులు .[2]

1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశారు . ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించారు . తెలంగాణ 9 జిల్లాల చరిత్రనుభాగ్యనగరం గ్రంథాలను కూడా రచించారు .

సారస్వత, గ్రంథాలయ సేవ

ఇతడు శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో లైబ్రేరియన్‌గా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు . విజ్ఞానచంద్రిగా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగాలక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగాఆంధ్ర సారస్వతపరిషత్తు స్థాపక సభ్యుడిగాఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగావిజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యుడిగాసంగ్రహాంధ్ర విజ్ఞానకోశ యాబై వ్యాసాలు రాశారు .ప్రధాన సంగ్రాహకుడిగాఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యునిగా ఇతడు తన సేవలను అందించారు.

అలనాటి దక్కన్ రేడియోలో తెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత వీరికే  దక్కింది.

మరణం

1973సెప్టెంబరు 28 83 వ ఏట  మరణించారు.


మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-25-ఉయ్యూరు 

image.png
--
Reply all
Reply to author
Forward
0 new messages