గాంధేయ వాదిపాత్రికేయ సామాజిక కార్యకర్త స్వాతంత్ర్యసమరయోధుడు,సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత ,రాజ్య సభ సభ్యుడు ,గుజరాత్ విద్యాపీఠ్ స్థాపక వైస్ –చాన్సలర్ –పద్మ విభూషణ్కాకా సాహెబ్ కాలేల్క

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 16, 2024, 12:15:35 AMJun 16
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Vuppaladhadiyam Venkateswara, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, గోదావరి రచయితల సంఘం రాజమహేంద్రవరం, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

గాంధేయ వాది పాత్రికేయ సామాజిక కార్యకర్త  స్వాతంత్ర్య సమరయోధుడు,సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత ,రాజ్య సభ సభ్యుడు ,గుజరాత్ విద్యా పీఠ్ స్థాపక వైస్ –చాన్సలర్  –పద్మ విభూషణ్ కాకా సాహెబ్ కాలేల్కర్

1-12-1885 న జన్మించి ,21-8-1981న 96ఏళ్ళ వయసులో మరణించిన కాకా సాహెబ్ కాలేల్కర్ స్వాతంత్ర్య సమర యోధుడు ,సామాజిక కార్యకర్త ,పాత్రియుడు గాంధేయవాది అయిన మహారాష్ట్ర నాయకుడు .

1885 డిసెంబర్ 1 న మహారాష్ట్రలోని సతారా అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన 1903 లో మెట్రిక్యులేషన్ పూర్తిచేసాడు. ఈయన 1907 లో పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుండి తన బి.ఎను తత్వశాస్త్రంలో పూర్తిచేసాడు. ఈయన రాష్ట్రామత్ అనే జాతీయ మరాఠీ దినపత్రికలో కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత 1910 లో బరోడాలోని గంగానాథ్ విద్యాలయ అనే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈయన 1915 లో మహాత్మా గాంధీని మొదటిసారి కలిశాడు. ఆ తరువాత గాంధీ ప్రభావంతో సబర్మతి ఆశ్రమంలో సభ్యుడయ్యాడు. ఈయన సబర్మతి ఆశ్రమంలోని రాష్ట్ర షాలాలో బోధించాడు. ఈయన కొంతకాలం ఆశ్రమంలో నడిచే సర్వోదయ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం వల్ల చాలాసార్లు జైలు పాలయ్యాడు. ఈయన గాంధీ ప్రోత్సాహంతో అహ్మదాబాద్‌లో గుజరాత్ విద్యాపీట్ స్థాపించడంలో చురుకైన పాత్ర పోషించి 1928 నుండి 1935 వరకు వైస్-ఛాన్సలర్‌గా కూడా పనిచేసి, 1939 లో గుజరాత్ విద్యాపిట్ కు పదవీ విరమణ చేశాడు. ఈయనను మహాత్మా గాంధీ సవాయి గుజరాతీ అని పిలిచేవాడు. ఈయన 1952 నుండి 1964 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. 1953 లో వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఈయన 1959 లో గుజరాతీ సాహిత్య పరిషత్కు అధ్యక్షత వహించాడు.[1]

పురస్కారాలు, గుర్తింపులు

గుజరాతీ భాషలో హిమలాయో నొ ప్రవాస్ ,రాఖద్వానో ఆనంద్ ,యాత్రాకా ఆనంద్ ,సత్యమయ జీవన్ పరం శాఖా మృత్యు , ,బపూనీ చాబి ,జీవన నొ ఆనంద్  మొదలైన ప్రేరణాత్మక రచనలు చేశాడు .ఈయన 1965 లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈయనకు 1971 లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌తో సత్కరించింది. భారత ప్రభుత్వం 1964 లో పద్మ విభూషణ్ ను పురస్కారంతో సత్కరించింది. ఈయన స్మారకార్థం 1985 లో స్మారక ముద్రను కూడా విడుదల చేసింది.[2][3]

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-24-ఉయ్యూరు .

 

image.png

 


--
Reply all
Reply to author
Forward
0 new messages