’సాహితీ పూర్ణ చంద్రుని’’ ‘నవీన ఆంద్ర సాహితీ వేదం –ఆంధ్రగీతి  

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Mar 3, 2026, 9:31:05 AM (2 days ago) Mar 3
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, D. G. V. Purnachand, Subbarao Guttikonda

‘’సాహితీ పూర్ణ చంద్రుని’’ ‘నవీన ఆంద్ర సాహితీ వేదం –ఆంధ్రగీతి  

కొన్నిరోజుఅలక్రితమే కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సాహితే భిషగ్వరుడు డా.జి.వి .పూర్ణ చంద్ వెలువరించిన ‘’ఆంధ్రగీతి ‘’ ని సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ఆరు ఎపిసోడ్ లుగా ప్రత్యక్షప్రసారం ఇవాళతో పూర్తీ చేశా. ఇది యుట్యూబ్ లో కూడా దర్శనమిస్తుంది . నవీన ఆంద్ర సాహితీ వేదం అనిపించిందియిది. .ప్రతి తెలుగింటా తప్పక ఉండాల్సిన పుస్తకం .ఏడు అధ్యాయాలుగా ఆయనకిష్టమైన  ‘’సప్త సింధు ‘’గా  ఈ బృహత్ గీతం హొయలు చిందింది .రసహృదయుల, సహృదయుల మనసులకు’’ మాదీఫల రసాయనం’’ అయింది .పాత పైత్యాలు విరగగొట్టిన ‘’పైత్యా౦తకం’’  అయింది .తెలుగు జాతి ఉద్దీపనకు, బలానికి, శక్తి సంపూర్ణతకు ‘’పూర్ణ చంద్రోదయం’’ ‘’అయింది .తెలుగింట పవిత్ర   గీతి అయింది .అందులో ముఖ్యంగా రెండవ అధ్యాయం ఆంధ్రులందరూ నిత్య పారాయణ చేసి తరించ వలసిందిగా రూపు దాల్చింది .పాఠ్య భాగాలలో తప్పక చేర్చాల్సిన భాగం అనిపించింది .ఎదలోపలి నుంచి తనకుతానై పైకి పొంగిన పవిత్ర గంగా జలమైంది .పూర్ణకు శుభాభినందనలు .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-3-26-ఉయ్యూరు  


--
Reply all
Reply to author
Forward
0 new messages