ప్రకాశం పంతుల గారి ‘’దార్శనిక ప్రకాశం ‘’-1
గా౦ధీయుగం లో ఆంధ్రనాయక త్రయం దేశ భక్త కొండా వెంకటప్పయ్య పంతులు ,దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ,ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గార్లు .మొదటి ఇద్దరు సత్వ గుణ సంపన్నులు .ప్రకాశం గారు మహా రాజసమూర్తి .ఆయన వేషం నడక ,భాష ,ఠీవీ,దర్పం దీన్ని స్పురింప జేస్తాయి .ఆయనను ‘’సోల్జర్- స్టేట్స్ మన్ ‘’అంటారు .పట్టుదలకు,సాహసానికి ,యాగానికి ,ఆత్మ గౌరవానికి ఆయన తర్వాతనే ఎవరైనా .విద్యార్ధి దశనుంచి ఆయనలో ఈ గుణాలు ప్రస్ఫుటంగా వెల్లడవుతూనే ఉన్నాయి .ఆయన అబాల్య నాయకుడు .అర్ధ శతాబ్ద౦ ఆంధ్ర రాజకీయ రంగం లో అరివీర భయంకరుడై అలరారిన మహాపురుషుడు ‘’ఆంధ్రకేసరి ‘’ఆంధ్రకే సరి కడు యాబద్భారతాని’’కే’’సరి’’.
దక్షిణ భారత రాజకీయ క్షేత్రం లో ,చారిత్రిక ఘట్టాలలో వీర విహారం చేసి ప్రజాహృదయాన్ని చూరగొన్న ప్రజానాయకుడు .ప్రజానాయకుడు అన్న పేరు ఒక్క ప్రకాశం గారికి మాత్రమె చెల్లు బాటయింది . స్వాతంత్ర్య సమరం లో బ్రిటీష వారికి సింహ స్వప్నమై ఉండటమే కాక ,ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో రెవెన్యు మంత్రిగా ,ముఖ్య మంత్రిగా పట్టుదల ,ఆయన చూపిన అపార ప్రతిభ ,ప్రజానురక్తి ప్రశంసా పాత్రం .
గాంధీ మహాత్ముడు ‘’జాతిపిత’’ అయితే, ఆంధ్రకేసరి’’ ఆంధ్రపిత’’ .ఆంధ్రత్వం మూర్తీభవించిన ఆంధ్రుల ప్రేమైక మూర్తి ప్రకాశం .ఆయన ఒక వ్యక్తికాడు.ఆంధ్రుల ఏకతా మూర్తి.ఆయన గొప్ప యోదుడే కాదు మేధా సంపన్నుడు కూడా .మద్రాస్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తూ ,ప్రకాశం గారు న్యాయ శాస్త్ర పాండిత్యానికీ ,ధర్మ సూక్ష్మ పరిశీలనకు ,వాదనా కౌశల్యానికి పేరు పొందారు .న్యాయం కోసం జడ్జీలనే ఎదుర్కొన్న ఘట్టాలు ఎన్నో ఉన్నాయి .ఒక కేసులో ఈయన వాదిస్తుంటే జడ్జి నిద్రపోతున్నాడు .ఈయన వాదన ఆపేశారు .జడ్జి కునుకు నుంచి లేచి ‘’ప్రకాశం గారూ మనం ఎక్కడ ఉన్నాం ?’’ఆని అడిగితె ‘’I don’t know where we are my loord ‘’అన్న ధీశాలి అప్పటి నుంచి పంతులు గారు వాదిస్తుంటే ఆ జడ్జి మళ్లీ నిద్ర ఎప్పుడూ పోలేదట .ఆ నాడు మద్రాస్ లో అయ్యర్లు, అయ్య౦గార్లు మేధావులైన న్యాయవాదులుగా ప్రసిద్ధికెక్కారు .కానీవారేవారికి దక్కని ‘’బార్ అసోసియేషన్ అధ్యక్షా పదవి ప్రకాశం గారికే దక్కింది .అంతేకాదు ‘’లా జర్నల్’కు ’సంపాదకుడు . జడ్జీల తీర్పులను నిర్భయంగా విమర్శించిన ఘటికుడు .రెండు చేతులా డబ్బు సంపాదించి మద్రాస్ నగరం లో అనేక చోట్ల భవనాలను కొన్న సంపన్నుడు ప్రకాశం .
రాజకీయాలలో ప్రకాశం గారు మొదటినుంచి జాతీయవాది .అతివాదనాయకుడైన లోకమాన్య బాల గంగాధర తిలక్ కు అనుయాయి .1919మార్చి 10ణ గాంధీ మద్రాస్ వచ్చినప్పుడు సత్యాగ్రహ స్వీకారం చేసిన ముగ్గురు ప్రముఖులు కస్తూరి రంగయ్య౦గార్ ,ప్రకాశం, రాజగోపాలాచారి గార్లు .ప్రకాశంగారు 1921లో న్యాయవాద వృత్తీ విసర్జించారు .మలబారు మోప్లా తిరుగుబాటులో పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా విమర్శించి ,ఆప్రాంతానికి స్వయంగా వెళ్లి వారికి అండగా నిలచిన ధీరుడు ఆంధ్రకేసరి .అందుకే అక్కడ ఆయనంటే నేటికీ నమస్కరించే వారున్నారని బ్రహ్మయ్య ఉవాచ .అదే సంవత్సరం అహ్మదాబాద్ కాంగ్రెస్ లో ఆయన అఖిలభారత కాంగ్రెస్ సంఘ కార్యదర్శిగా ఎన్నుకొ బడ్డారు .న్యాయ పతి సుబ్బారావు గారి అనంతరం ఆంధ్రులలో ప్రకాశం గారు రెండవ కార్యదర్శి ఆంధ్రరత్న ,కళా, అల్లూరి,పెండేకంటి తర్వాత కార్యదర్శి అయ్యారు .అందరు సుబ్బారావు గారి ఇంటిపేరు న్యాపతి ఆని రాస్తున్నారు న్యాయపతి కరెక్ట్ .న్యాపతి రాఘవరావు రేడియో అన్నయ్య .బిఎన్ రెడ్డిగారి మల్లీ శ్వరి సినిమాలో అల్లసాని పెద్దనఆఎదాది ఫిబ్రవరిలో గాంధీగారి కేసు బొంబాయి కోర్టులో విచారిస్తుంటే ప్రకాశం గారు అక్కడికి వెళ్లారు .దేశ ప్రజలకు గాంధే ఇవ్వాలనుకొన్న సందేశాన్ని ప్రకాశంగారికిచ్చారు .ఆయన భారత దేశమంతా తిరిగి ప్రచారం చేసి మహాత్ముని మన్నన పొందారు .
ఆధారం -రైతుపెద్ద శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి ''నా జీవన నౌక ''
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-25-ఉయ్యూరు ..
ప్రకాశం పంతుల గారి ‘’దార్శనిక ప్రకాశం ‘’-2