ఉయ్యూరు శ్రీసువర్చలా౦జనేయ స్వామి వార్ల దేవాలయం లో శ్రీ పరాభవ నామసంవత్సర  శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం .

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Apr 23, 2026, 8:00:44 AM (7 days ago) Apr 23
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీసువర్చలా౦జనేయ స్వామి వార్ల దేవాలయం లో శ్రీ పరాభవ నామసంవత్సర  శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం .

శ్లోం -‘’సువర్చలాధిష్టిత వామభాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం

భానుప్రభం రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం శ్రీ హానూమంత మీడే’’.

స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర వైశాఖ మాస బహుళ దశమి 12-5-26 మంగళవారం  శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లొ 10-5-26ఆదివారం  వారం నుంచి 12-5-26  మంగళ వారం  వరకు త్రయహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం జరురుతుంది  ప్రతిరోజూ సాయంత్రం సరసభారతి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ..భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వార్లను సేవించి తరించ ప్రార్ధన .

  కార్యక్రమమ వివరం

10-5-26 –ఆదివారం  -వైశాఖ బహుళ అష్టమి -ఉదయం6గం .లకు

 అష్టకలశ స్నపన ,మన్యుసూక్తంతో శ్రీ సువర్చలా౦జనేయస్వామికి అభిషేకం ,నూతన వస్త్ర ధారణ,అనంతరం గ౦ధ సిందూరం ,మల్లె పూలతో అష్టోత్తర సహస్ర నామార్చన  ,నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం 6-30 గం నుంచి 8గం వరకు  –సరసభారతి 198వ కార్యక్రమంగా సంగీత ,భజన విభావరి

6-30నుంచి 7గం ల వరకు –సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి(ఉయ్యూరు ) బృదం చే- గానలహరి

సా-7గం –నుంచి 7-30 వరకు –శ్రీమతికామరాజు సరస్వతీ దీప్తి (విజయవాడ ) చే భక్తి సంగీత విభావరి .

సా.7-30నుంచి 8గం వరకు –శ్రీమతి రమాదేవి, శ్రీపెద్ద అప్పలనాయుడు బృందం (ఉయ్యూరు )  చే భజన కార్యక్రమం .

అనంతరం -1958-60లో విజయవాడ S.R .R.కాలేజిలో మాకు ఫిజిక్స్ బోధించిన గురు వరేణ్యులు ,శాతవాహన కాలేజి విశ్రాంత ప్రిన్సిపాల్ ,నిర్వాహకులు ,జ్ఞాన వయో వృద్ధులు  శ్ర్రే జి.ప్రజాపతిరావు , శ్రీమతి హైమవతి దంపతులకు స్వామి  వార్ల సమక్షం లో -గురు సత్కారం

 11-5-26-సోమవారం  - వైశాఖ బహుళ నవమి--ఉదయం 9గం.లకు –తమలపాకు లతో (నాగవల్లి పూజ ) విశేష పూజ , నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం6-30నుంచి -7-30  సరసభారతి 199వ కార్యక్రమంగా-

 శ్రీ కె.సుబ్రహ్మణ్య రాజు –వయోలిన్ ,శ్రీ అమ్ముల ఎస్.ప్రసాద్ ,మృదంగం  ,శ్రీ గోనుగుంట్ల యలమందరావు –డోలు(విజయవాడ ) బృందం చే సంగీత కచేరి .

 

         

12-5-26-మంగళ వారం  -వైశాఖ బహుళ దశమి -శ్రీ హనుమజ్జయంతి

                     ఉదయం 6గం .నుంచి 9-30గం .’’రసం మామిడి పండ్ల’’తో  స్వామి వారలకు విశేష అర్చన.

ఉదయం -9-30గంలకు -శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు -శాంతి కళ్యాణ మహోత్సవం

                           అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

 సాయంత్రం 6గ౦లకు-సరసభారతి 200 వ కార్యక్రమంగా -

కాలని మహిళా మండలి వారిచే -శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ 

శ్రీ స్వామివార్లకు ప్రత్యేక వడమాల .

అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -23-4--26-ఉయ్యూరు.

 

  


--
2.jpg
1.jpg
Reply all
Reply to author
Forward
0 new messages