ప్రముఖ దక్షిణ దేశ చారిత్రిక పరిశోధకుడు – పద్మభూషణ్ శ్రీ .కె.ఎ. నీలకంఠ శాస్త్రి
కల్లిడైకురిచ్చి అయ్య నీలకంఠ శాస్త్రి ( 1892 ఆగష్టు 12 – 1975 జూన్ 15) దక్షిణ భారతదేశపు చరిత్రను వ్రాసిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు. ఇతని అనేక గ్రంథాలు చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన ఆధార గ్రంథాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇతని పాండిత్యానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత మూడవ అత్యున్నత పురస్కారం, పద్మభూషణ్ ప్రదానం చేసింది.[1]
జీవిత విశేషాలు
ఇతడు తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి సమీపంలోని కల్లిడైకురిచ్చి అనే గ్రామంలో 1892, ఆగష్టు 12న ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[2] ఇతడు తిరునల్వేలిలోని ఎం.డి.టి. హిందూ కాలేజీలో ఎఫ్.ఎ. చదివాడు. కళాశాల విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజిలో పూర్తి చేశాడు.[3][4] ఇతడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఎం.ఎ. ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు. మద్రాసులోని హిందూ కాలేజీలో 1913 నుండి 1918 వరకు ఉపన్యాసకుడిగా పనిచేశాడు.[5][6] ఇతడు చరిత్ర ఆచార్యుడిగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 1918-1920ల మధ్య పనిచేశాడు.[5] అటుపిమ్మట అన్నామలై విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పాటయిన ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమితుడైనాడు.[7]
1929లో ఇతడు తిరుచ్చి హిందూ కళాశాలలో చరిత్ర ఆచార్యుడిగా చేరాడు. అదే సంవత్సరం మద్రాసు విశ్వవిద్యాలయంలో చరిత్ర, పురావస్తు శాఖలో ఆచార్యునిగా ఎస్.కృష్ణస్వామి అయ్యంగార్.[8] స్థానంలో నియమించబడి[9] 1946 వరకు కొనసాగాడు.[3] 1952-1966 మధ్యలో ఇతడు మైసూర్ విశ్వవిద్యాలయలో ఇండాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.[3][5][9] 1954లో మైసూర్ రాజ్యంలోని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంటుకు డైరెక్టర్‌గా ఉన్నాడు. 1950లలో ఇతడు అఖిల భారత ప్రాచ్య సమ్మేళనానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.[10] ఇతడు 1957-1972ల మధ్య "యునెస్కో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ కల్చర్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా"కు డైరెక్టర్‌గా సేవలందించాడు".[3][9] 1957లో ఇతని సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. 1959లో ఇతడు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా దక్షిణ భారత చరిత్ర బోధించాడు.[5] ఇతడు 1975 జూన్ 15న మరణించాడు.[9]
పరిశోధకునిగా
శాస్త్రి ప్రముఖ భారతీయ చారిత్రిక, ప్రాచ్య, సాంస్కృతిక సంస్థలైన ఇండియన్ హిష్టరీ కాంగ్రెస్, ఇండియన్ హిష్టారికల్ రికార్డ్స్ కమిషన్, ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్సులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవాడు. ఆయన అందులో ప్రచురించిన పరిశోధకా వ్యాసాలు గణనీయమైనవి. 1946లో పాట్నాలో జరిగిన హిష్టరీ కాంగ్రెస్ కు ఆయన అధ్యక్షత వహించాడు. శాస్త్రి భారతాన్ని పాలించిన రాజవంశాలపైన, ఆగ్నేసియాదేశాల మత సంస్కృతులపై దక్షిణభారతదేశ ప్రభావము అను విషయంపై చాలా పరిశోధన చేసాడు.
ది చోళాస్అను శీర్షికతో రెండు సంపుటాలు, స్టడీస్ ఇన్ ద చోళా హిస్టరీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది శాస్త్రిగారి తొలి చారిత్రిక పరిశోధనా ఫలాలు. అటుపై ది పాండ్యన్ కింగ్డమ్ అను పరిశోధనా గ్రంథం చారిత్రికుడిగా ఆయన కీర్తిని ఇనుమడింపజేసింది. ఆయన గ్రంథాలలో ఇది ప్రఖ్యాతి గాంచింది. అటుపై ఎ హిష్టరీ ఆఫ్ సౌత్ ఇండియా చారిత్రికులకు, సామాన్యులకు అర్ధమయ్యేరీతిలో రచింపబడిన గ్రంథమిది. అత్యంత ప్రాచీన కాలము నుండి విజయనగర రాజులు, బహమనీ సుల్తానుల చరిత్ర వరకు దక్షిణ భారత రాజవంశాల చరిత్ర-సంస్కృతి సంక్షిప్తంగా ఇందు వివరింపబడింది. దక్షిణ భారత చరిత్రకి ఇది ఒక ప్రమాణగ్రంధము.
శాస్త్రి రచించిన ప్రధాన గ్రంథాలలో ఫర్దర్ సోర్సెస్ ఆఫ్ విజయనగర హిష్టరీ ఒకటి.ఇది డాక్టర్ నేలటూరి వేంకటరమణయ్యతో కలసి రచించాడు.దూర ప్రాచ్యదేశాల మత, సంస్కృతులపై దక్షిణ భారతముయొక్క ప్రభావము అను విషయంపై విస్తారమైన పరిశోధన గావించిన ప్రముఖులలో శాస్త్రి గణనీయులు. సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఫార్ ఈస్ట్ హిష్టరీ అఫ్ శ్రీవిజయ అనే గ్రంథాలు శాస్త్రి ఈ విషయంపై జరిపిన పరిశోధనా ఫలితాలు.
గుర్తింపు
నీలకంఠశాస్త్రి దక్షిణ భారతదేశపు చరిత్రకారులలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు.[9]తమిళ చరిత్రకారుడు ఎ.ఆర్.వెంకటాచలపతి ఇతడిని "తమిళనాడుకు చెందిన 21వ శతాబ్దపు అత్యుత్తమ చారిత్రకుడి"గా ప్రస్తుతించాడు.[11] ఇతడి గ్రంథం ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనేక విశ్వవిద్యాలయాలలో భారతీయ చరిత్ర విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఎంపిక చేశాడు.
రచనలు
ఇతడు ఆంగ్లంలో 25 చారిత్రక గ్రంథాలను రచించాడు. వాటిలో ఎక్కువ భాగం దక్షిణ భారత చరిత్రకు సంబంధించనవే.[]
కృత్రిమ మేధ(AI) అందించిన వివరాలు –
కె.ఎ. నీలకంఠ శాస్త్రి (కల్తీడైకురిచ్చి ఐయ్యర్ నీలకంఠ శాస్త్రి) గారు భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ చరిత్రకారులలో ఒకరు. ముఖ్యంగా దక్షిణ భారత చరిత్రపై ఆయన చేసిన పరిశోధనలు, రాసిన గ్రంథాలు ప్రామాణికంగా నిలిచాయి.
ఆయన గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
· జననం: 1892, ఆగస్టు 12న తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా 'కల్తీడైకురిచ్చి' గ్రామంలో జన్మించారు.
· మరణం: 1975, జూన్ 15.
· విద్య: మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చరిత్రలో ఎం.ఏ. (M.A.) పూర్తి చేశారు. ఆయన తన తరగతిలో ప్రథముడిగా నిలిచి బంగారు పతకాన్ని సాధించారు.
· ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లో చరిత్ర ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
· ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంలో హిస్టరీ అండ్ ఆర్కియాలజీ విభాగాధిపతిగా సుమారు 20 ఏళ్ల పాటు (1929–1946) పనిచేశారు.
· మైసూర్ విశ్వవిద్యాలయంలో ఇండాలజీ విభాగానికి ప్రొఫెసర్‌గా కూడా సేవలందించారు.
నీలకంఠ శాస్త్రి గారు రాసిన పుస్తకాలు నేటికీ చరిత్ర విద్యార్థులకు "బైబిల్" వంటివి. వాటిలో ముఖ్యమైనవి:
1. A History of South India (దక్షిణ భారత చరిత్ర): ఇది ఆయన అత్యంత ప్రసిద్ధ గ్రంథం. ప్రాచీన కాలం నుండి విజయనగర సామ్రాజ్య పతనం వరకు దక్షిణ భారత చరిత్రను ఇందులో వివరించారు.
2. The Cholas (చోళులు): చోళ సామ్రాజ్యంపై ఆయన చేసిన సమగ్ర పరిశోధన ఇది. రెండు సంపుటాలలో వెలువడిన ఈ గ్రంథం చోళుల పరిపాలన, కళలు, సంస్కృతిపై అద్భుతమైన అవగాహన కల్పిస్తుంది.
3. Pandyan Kingdom (పాండ్య రాజ్యం): పాండ్య రాజుల చరిత్రను వెలుగులోకి తెచ్చిన తొలి గ్రంథాలలో ఒకటి.
4. Further Sources of Vijayanagara History: విజయనగర సామ్రాజ్య చరిత్రకు సంబంధించిన సాహిత్య ఆధారాలను ఇందులో పొందుపరిచారు.
· శాస్త్రి గారు కేవలం రాజకీయ చరిత్రనే కాకుండా, సాంఘిక మరియు సాంస్కృతిక చరిత్రకు సమాన ప్రాధాన్యతనిచ్చారు.
· ఆధారాలను (శాసనాలు, నాణేలు, సాహిత్యం) క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన చారిత్రక వాస్తవాలను నిర్ధారించేవారు.
· భారత ప్రభుత్వం ఆయనను 1957లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
· ఆయన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
దక్షిణ భారతదేశానికి ఒక స్పష్టమైన చారిత్రక రూపాన్ని ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిని చాటిచెప్పిన మహనీయులలో నీలకంఠ శాస్త్రి గారు అగ్రగణ్యులు.
మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -7-5-26-ఉయ్యూరు .
·

,