పంచకేదార క్షేత్రాలు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 11, 2026, 10:42:13 PM (4 days ago) Jun 11
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

పంచకేదార క్షేత్రాలు

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ హిమాలయాలలో ఉన్న ఐదు పవిత్ర శివాలయాలను "పంచ కేదారాలు" అంటారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు శివుని కోసం వెతుకుతూ హిమాలయాలకు వెళ్లగా, శివుడు ఎద్దు రూపంలో ఐదు వేర్వేరు ప్రదేశాలలో దర్శనమిచ్చాడు. కేదార్‌నాథ్ (Kedarnath): పంచ కేదారాలలో ఇది మొదటిది. ఇక్కడ శివుని మూపుర భాగం (ఎద్దు వీపు భాగం) పూజలందుకుంటుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.1

·         తుంగనాథ్ (Tungnath): ఇది సముద్ర మట్టానికి సుమారు 12,000 అడుగుల ఎత్తున ఉన్న అత్యంత ఎత్తైన శివాలయం. ఇక్కడ శివుని చేతులు వెలిశాయని నమ్ముతారు.

·         రుద్రనాథ్ (Rudranath): ఈ క్షేత్రంలో శివుడు ముఖం (ముఖ రూపం) లింగ రూపంలో పూజలందుకుంటాడు.

·         మధ్యమేశ్వర్ (Madhyamaheshwar): ఇక్కడ శివుని నాభి (బొడ్డు భాగం) లింగ రూపంలో కొలువై ఉంది.

·         కల్పేశ్వర్ (Kalpeshwar): ఇక్కడ శివుని జటాజూటం (తల వెంట్రుకలు) పూజలందుకుంటాయి. సంవత్సరం పొడవునా తెరిచి ఉండే ఏకైక పంచ కేదార క్షేత్రం ఇది.

ప్రతి ఏటా వేసవి కాలంలో ఈ ఆలయాల తలుపులు భక్తుల దర్శనార్థం తెరవబడతాయి. పూర్తి వివరాలు మరియు యాత్ర ప్రణాళికల కోసం ABP Live లేదా Times of India కథనాలను చూడవచ్చు.

1-కేదార్‌నాథ్

కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా లోని ఒక నగర పంచాయితీ. కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం. శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్.

కేదార్‌నాథ్‌లో 2013 జూన్ 16,17 తేదీలలో అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా చాల మార్పులు సంభవించాయి. ఈ క్రింది సమాచారం వరదలకు ముందు సమకూర్చబడింది, గమనించగలరు."

జనాభా గణాంకాలు

కేదార్‌నాథ్ ఆలయం

2001 జనాభా లెక్కలను అనుసరించి కేదార్‌నాథ్ జనసంఖ్య 429.పురుషులు 98% స్త్రీలు 2%.అక్షరాస్యత 63%. పురుషుల అక్షరాస్యత 63%, స్త్రీల అక్షరాస్యత 36%. 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్య 0%

కేదార్‌నాథ్ ఆలయం

కేదార్‌నాథ్

కేదార్‌నాథ్ ఆలయం పవిత్రమైన శైవక్షేత్రం.గర్వాల్ కొండల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలో ప్రతిష్ఠితమయిన లింగం యొక్క కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించబడలేదు. గుడి చేరటానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుండి గుర్రాలు, డోలీలు, కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్గుడి వెనుక భాగంలో ఆదిశంకరుల సమాధి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్ లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రియమునోత్రిబద్రీనాథ్, కేదార్‌నాధ్ లను ఛోట చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.
ఆలయం ముందరి భాగంలో కుంతీదేవిపంచ పాండవులుశ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం నేపాల్ లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.

ప్రత్యేకత

కేదార్‌నాథ్ ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. హిమాలయాల్లోని చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఆదిశంకరులు ఈక్కడ ఈశ్వర సాన్నిధ్యం చెందటం ఇక్కడి ప్రత్యేకత. అతి పురాతన శివలింగాలలో ఇది ఒకటి.

ప్రయాణ సౌకర్యాలు

రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డు మార్గంలో దాదాపు 16గంటల ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో గంటకు 20 కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు. ఒకవైపు కొండ, మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది. కేదార్ నాథ్ కు రావాలంటే హరిద్వార్ నుంచే ట్రావెల్స్ మాట్లాడుకుంటే మంచిది. రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బద్రీనాథ్ లకు రూ.1500 నుంచి 2000 మధ్య ఛార్జ్ చేస్తారు. సొంతంగా ప్రయాణించాలంటే మాత్రం రిషికేశ్ కు రావాల్సిందే. ఉదయం 8గంటలకు రిషికేశ్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సర్వీస్ స్టాండ్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు దొరుకుతుంది. ఆలస్యమయితే మళ్లీ మరుసటి రోజు తెల్లవారుజామునే బయల్దేరాలి. రిషికేశ్ నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ మీదుగా అగస్తముని, గుప్త్ కాశీ, ఫాటా ద్వారా గౌరీ కుండ్ చేరుకుంటారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల కొద్దీ వేచిచూడాల్సి రావొచ్చు. అన్నింటికీ సిద్ధమై ముందుకు కదలాలి. సాయంత్రం 7తర్వాత ఈ రూటులో ప్రయాణం చేయడం అతి కష్టం. ఈ రూటులో ఉండే ఏటీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు. కొండ ప్రాంతాలు కాబట్టి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయదు. ముందుగానే నగదు చేతిలో ఉంచుకుంటే మంచిది. ఇక్కడి ప్రజలు చాలా నిజాయితీపరులు. దొంగతనం అన్న విషయమే ప్రస్తావనకు రాదు. డబ్బైనా, వస్తువులైనా ఇబ్బంది లేదు. గౌరీకుండ్ నుండి కాలిబాటలో 14 కిలోమీటర్ల దూరంలో కేదార్‌నాధుని గుడి ప్రతిష్ఠితమై ఉంది. గౌరీకుండ్ ఒక చిన్న ప్రాంతం. 20 నుంచి 30 ఇళ్లున్న ఈ ప్రాంతం కేదరీనాథ్ వెళ్లేందుకు బేస్ పాయింట్. 100కు మించి వాహనాలు కూడా నిలపలేని ప్రాంతమిది. ఉదయాన్నే ఇక్కడున్న వాహనాలను తిప్పిపంపిస్తారు. అంత సమయం వరకు బయటనుంచి వాహనాలను అనుమతించరు. గౌరీకుండ్ లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కౌంటర్ ఉంటుంది. ఇక్కడే గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.1100 తీసుకుంటారు. ముందుగానే డబ్బు చెల్లించి రసీదు తీసుకోవాలి. గుర్రం ద్వారా ప్రయాణం నాలుగు గంటలు సాగుతుంది. మామూలు వ్యక్తులెవ్వరికీ గుర్రం ప్రయాణం అలవాటు ఉండదు కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు. వీళ్లంతా నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది. కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి. చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు.

ఆలయ మార్గం

కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను, బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతంవర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది, పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.

గర్భగుడి

కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు. ఎన్నో రోజులు కష్టించి గాలించినా శివదర్శనం కాదు. చివరికి కేదార్ నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తు పట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు. మరో వైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు. ఒక్కో ఆవు/ఎద్దు భీముడి కాలు కింది నుంచి బయటకు వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశంతో, భీముడి కాళ్ల కింది నుంచి వెళ్లలేడు కాబట్టి .. హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది. అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్ నాథ్ లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్ నాథ్ లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి ఖాట్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని మనకే తెలుస్తుంది.

2-తుంగనాథ్

తుంగ్‌నాథ్ అనేది ప్రపంచంలోని ఎత్తైన శివాలయాలలో ఒకటి.[1] ఉత్తరాఖండ్ రాష్ట్రంరుద్రప్రయాగ్ జిల్లాలోని ఐదు పంచ కేదార్ దేవాలయాలలో ఇది ఎత్తైనది. ఇక్కడి పర్వతాలు మందాకినిఅలకనంద నదీ లోయలను ఏర్పరుస్తాయి. ఇది 3,690 (12,106 ft) ఎత్తులోచంద్రశిలా శిఖరానికి కొంచెం దిగువన ఉంది.[2] మహాభారత ఇతిహాసంలోని పాండవుల నేపథ్యం ఇక్కడ ఉంది.

హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులు ఇద్దరూ హిమాలయాలలో నివసిస్తారు. శివుడికి కైలాస పర్వతం ఉంది. పార్వతిని శైలపుత్రి (పర్వత కుమార్తె) అని కూడా పిలుస్తారు. గర్వాల్ ప్రాంతంలో శివుడు, పంచకేదార్ దేవాలయాల సృష్టికి సంబంధించి అనేక కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి. గర్వాల్ ప్రాంతం శివుడు, పంచ కేదార్ దేవాలయాల సృష్టి గురించి అనేక జానపద ఇతిహాసాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంకోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించిశివుడిని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారణాసి (కాశీ)కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి, గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.

వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి, ఎద్దును దాని తోక, వెనుక కాళ్ళను పట్టుకున్నాడు. కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్‌నాథ్‌లో మూపురం పెరగడం, తుంగనాథ్‌లో చేతులు కనిపించడం, రుద్రనాథ్‌లో ముఖం, నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు.

ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌లోని ఐదు ప్రదేశాలలో కనిపించింది. పంచ కేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత, పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానంచేసియజ్ఞంచేసి, ఆపై మహాపంత్ (స్వర్గరోహిణి) అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాలు ఉత్తర-భారత హిమాలయ దేవాలయ నిర్మాణంలో కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

పంచ కేదార్ దేవాలయాల వద్ద శివ దర్శన తీర్థయాత్రను పూర్తిచేసిన తర్వాతబద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం ఒక అలిఖిత మతపరమైన ఆచారం.

పూజ

ఈ దేవాలయంలో పూజారి మక్కుమత్ గ్రామానికి చెందిన స్థానిక బ్రాహ్మణుడు, ఇతర కేదార్ దేవాలయాల మాదిరిగా కాకుండా దక్షిణ భారతదేశం నుండి పూజారులు ఉన్నారు. ఇక్కడి సంప్రదాయం ఎనిమిదవ శతాబ్దానికి చెందిన హిందూ దార్శనికుడు శంకరాచార్యచే స్థాపించబడింది. మక్కుమత్ గ్రామానికి చెందిన మైథాని బ్రాహ్మణులు ఈ దేవాలయంలో పూజారులుగా వ్యవహరిస్తారని కూడా చెబుతారు. చలికాలంలో ఈ దేవాలయం మూసివేయబడుతుంది. ఆలయ పూజారులు దేవతకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం ఇక్కడి నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కుమత్ గ్రామంలోని మార్కండేశ్వర్ దేవాలయానికి తరలిస్తారు.

భౌగోళికం

మందాకిని నది జలాలను అలకనంద నది నుండి విడిపోయే ప్రాంతంలో శిఖరం పైభాగంలో ఉంది. ఇక్కడ గర్హ్వాల్ విశ్వవిద్యాలయం ఎత్తైన బొటానికల్ స్టేషన్ ఉంది. దేవాలయ శిఖరానికి సమీపంలో కేదార్‌నాథ్ కొండల శ్రేణికి ఎదురుగా దుగలిబిట్ట వద్ద అటవీ విశ్రాంతి గృహం ఉంది. కేదార్‌నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం, కేదార్‌నాథ్ కస్తూరి జింక అభయారణ్యం అని కూడా పిలుస్తారు. అంతరించిపోతున్న కస్తూరి జింకలను సంరక్షించడానికి 1972లో ఈ అభయారణ్యం ఏర్పాటుచేయబడింది. చోప్టా సమీపంలోని ఖరక్‌లో కస్తూరి జింకల పెంపకం కేంద్రం కూడా ఉంది.

వాతావరణం

ఈ ప్రాంతంలో వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవి కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత పగటిపూట 16 డిగ్రీల సెల్సియస్‌గా, చలికాలం మరింత చల్లగా ఉంటుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు దేవాలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. శీతాకాలంలో భారీ మంచువర్షం కారణంగా ఈ దేవాలయం దాదాపు 6 నెలలపాటు మూసివేయబడుతుంది.

రావణ శిల

ఈ దేవాలయపై రావణ శిల ఉంది. చంద్ర శిల అని పిలువబడే ఒక చిన్న గుడి కూడా ఉంది. ఈ రావణ శిల రామాయణానికి సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రావణుడిని చంపిన తరువాత రాముడు అపరాధభావంతో శివుని కోసం తపస్సు చేసి, రావణుడిని చంపిన అపరాధం నుండి తనను విడిపించమని శివుడిని అభ్యర్థించాడు. తపస్సు సమయంలోనేతమిళనాడు రాష్ట్రంరామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. 12 జ్యోతిర్లింగాలలో రామేశ్వరంలోని దేవాలయం ఒకటి.

3- రుద్రనాథ్

రుద్రనాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న శివుని ఆలయంఇది పంచకేదార్ లలో మూడవది. ఇది సముద్ర మట్టానికి 2290 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ  ఆలయం సహజమైన  నీడతో ఉండే రాతి దేవాలయం. నేపాల్ రాజధాని ఖాట్మండులోని పశుపతినాథ్‌ ఆలయంలో శివుడి  శరీరం మొత్తం పూజించబడుతుండగా, రుద్రనాథ్ ఆలయంలో కేవలం శివుడి  ముఖాన్ని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ శివుడుని 'నీలకంఠ మహాదేవ' అనే పేరుతో పూజిస్తారు. రుద్రనాథ్ ఆలయం ముందు నుండి మంచుతో కప్పబడిన నందా దేవి, త్రిశూల శిఖరాలు కనిపిస్తాయి. పంచకేదార్ లలో మూడవది అయిన  రుద్రనాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలంటే మొదట కేదార్‌నాథ్, తుంగనాథ్ ఆలయాలను దర్శించి ఆ తరువాత గోపేశ్వర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ గ్రామం నుండి ట్రెక్కింగ్ చేయాలి. ఆ తరువాత గోపేశ్వర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల్ గ్రామం నుండి మళ్ళి ఇంకొక ట్రెక్ ఉంటుంది. ఇది  అనసూయ దేవి ఆలయం గుండా వెళుతుంది. దాదాపు 24 కి.మీ ట్రెక్కింగ్ మార్గం తరువాత ఈ  ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

పురాణం

రుద్రనాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడి ఆశీర్వాదం కోసం వెళ్తారు. మొదట వారణాసి (కాశీ) కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకుంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. వారిపై కోపంతో  శివుడు నంది రూపాన్ని ధరించి, హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలో దాచుకుంటాడు. వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి ("దాచిన కాశీ" - శివుడు దాక్కున్న స్థలం) సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపిస్తుంది. భీముడు వెంటనే ఆ ఎద్దును శివుడని గుర్తించి, ఎద్దు  తోకని, వెనుక కాళ్ళను పట్టుకుంటాడు కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమవుతాడు. కేదార్‌నాథ్‌లో మూపురం, తుంగనాథ్‌లో చేతులు, రుద్రనాథ్‌లో ముఖం - నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించి శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించి పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానం, యజ్ఞం చేసి, ఆపై  స్వర్గరోహిణి  అనే స్వర్గ మార్గం ద్వారా  మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాల శివ దర్శనం  పూర్తిచేసిన తర్వాతబద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం అనేది అనాదిగా వస్తున్న ఒక ఆచారం. ఇలా చేయడం వలన మోక్షం లభిస్తుందని ఒక నానుడి.

శీతాకాలంలో, రుద్రనాథ్ నుండి గోపేశ్వర్‌లోని గోపీనాథ్ మందిరానికి పూజ కోసం శివుని విగ్రహాన్ని తీసుకువస్తారు. డోలి యాత్ర గోపేశ్వర్ నుండి సాగర్ మీదుగా ప్రారంభమవుతుంది. డోలి యాత్రికులు లియుటి బుగ్యల్, పనార్ దాటి చివరకు పిత్రధర్ చేరుకుంటారు. ఇక్కడ పూర్వీకుల పూజలు జరుగుతాయి. అప్పుడు, ధలాబ్ని మైదాన్ దాటిన తర్వాత, డోలీ యాత్ర  రుద్రనాథ్ చేరుకుంటుంది. ఇక్కడ మొదట వనదేవిని పూజిస్తారు. ఈ ప్రాంతాన్ని వనదేవత కాపాడుతుందని స్థానికుల నమ్మకం. ఈ ఆలయంలో శ్రావణ (జూలై-ఆగస్టు) మాసంలో పౌర్ణమి రోజున వార్షిక జాతరను జరుపుతారు.  రుద్రనాథ్ ఆలయంలో పూజారులుగా గోపేశ్వర్‌లోని భట్‌లు, తివారీలు ఉన్నారు.

పాండవ సెర

పాండవ అంటే పాండవులు, సెర అంటే సాగు భూమి అని అర్ధం. దీనిని పాండవ్ సెర, పాండుసెరా అని కూడా పిలుస్తారు, ఇది నందికుండ్ మార్గంలో 4800 మీటర్ల ఎత్తులో ఉన్న లోయ. ఈ లోయ 3-4 కి.మీ వెడల్పు ఉంటుంది. పాండవులు బదిరికా ఆశ్రమంకి వచ్చిన తరువాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పాండవులు వ్యవసాయం చేయడం వలన ఈ లోయకి ఆ పేరు వచ్చింది. వారు ఇక్కడ కాలువ తవ్వి, పొలాలను సాగు చేసి, మొత్తం ప్రాంతాన్ని సాగుభూమిగా మార్చారు. ఇప్పటికి ఇక్కడ పాండవుల ఆయుధాలు పాండవ సెరలో పూజింపబడుతున్నాయి. ఇక్కడ పాండవులు సాగు చేసిన వరిపంట దాని అంతట అదే పెరిగి మళ్ళి దాని అంతట అదే భూమిలో కలిసిపోతుంది. పాండవులు నిర్మించిన నీటి పారుదల కాల్వలు ఇంకా ఇప్పటికి పాండవ సెరలో ఉన్నాయి. ఈ కాలువలో నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. రుద్రనాథ్‌కు ట్రెక్కింగ్ మార్గంలో నందకుండ్ (2,439 మీ లేదా 8,002 అడుగులు) వద్ద (మధ్య మహేశ్వర్ మీదుగా వస్తుంటే), యాత్రికులు పాండవ సెరలో ఉన్న పాండవుల కత్తులను పూజిస్తారు.

భౌగోళికం

ఆలయ సమీపంలో అనేక పవిత్ర జల సరస్సులు (కుండ్) కనిపిస్తాయి. వీటిలో సూర్య-కుండ్, చంద్ర-కుండ్, తారా-కుండ్, మన-కుండ్ మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ నందా దేవి, త్రిశూల్, నందా ఘుంటి వంటి ప్రసిద్ధ పర్వతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పవిత్రమైన వైతరణి లేదా బైతరణి లేదా రుద్రగంగా నది రుద్రనాథ ఆలయం సమీపంలో ప్రవహిస్తుంది. ఈ నదిని "ముక్తివాహిని" అని కూడా పిలుస్తారు. ఈ నదిని దాటడం ద్వారా చనిపోయిన వారి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయని, చనిపోయిన వారికీ ఇక్కడ ఒకసారి పిండాలను పెడితే పవిత్ర క్షేత్రమైన గయలో కోటి సార్లు పెట్టిన దానితో సమానం అని భక్తుల నమ్మకం.

ప్రయాణ సౌకర్యాలు

పంచ కేదార్ యాత్రలో రుద్రనాథ్ అధిరోహణ మార్గం అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది. రుద్రనాథ్ కి సమీప విమానాశ్రయం జాలీ గ్రాంట్, డెహ్రాడూన్ (258 కి.మీ లేదా 160 మైళ్ళు), సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్ (241 కి.మీ లేదా 150 మైళ్ళు). రుద్రనాథ్ కు ట్రెక్కింగ్ మార్గాలు చాలా వరకు గోపేశ్వర్ లేదా సమీప ప్రాంతాల నుండి ఉన్నాయి. గోపేశ్వర్ నుండి 5 కి.మీ (3 మైళ్ళు) దూరంలో, సాగర్ గ్రామం నుండి 5 కిమీ (3 మైళ్ళు) ఎత్తులో ఉంది, యాత్రికుల వసతి కోసం ఇక్కడ రుద్ర హోటల్ ఉంది. ఈ మార్గం పొడవైన గడ్డి భూములు, ఓక్ , రోడోడెండ్రాన్ అడవుల గుండా వెళుతుంది. ఈ దారి జారుడుగా ఉంటుంది. రుద్రనాథ్‌కు వెళ్లే ఇతర మార్గాలలో గంగోల్‌గావ్ నుండి 17 కి.మీ  మైళ్ళు) దూరం [3 కి.మీ (2 మైళ్ళు) గోపేశ్వర్ నుండి], అడవి గుండా పనార్, నైలా ప్రాంతాలకు చెందిన  గొర్రెల కాపర్ల నివాసాల గుండా వెళ్లాలి. మరొక ట్రెక్కింగ్ మార్గం మండల్ గ్రామం నుండి (గోపేశ్వర్ నుండి 13 కి.మీ లేదా 8 మైళ్ళు) వెళుతుంది, ఇది 6 కి.మీ (4 మైళ్ళు) దూరంలో ఉన్న అనసూయ దేవి ఆలయం మీదుగా వెళ్తుంది, ఆపై రుద్రనాథ్‌కు అదనంగా 20 కి.మీ (12 మైళ్ళు) ఉంటుంది. ఈ అనసూయ దేవి ఆలయంలో, అనసూయ దేవి కష్టాల్లో ఉన్న యాత్రికులకు సహాయం చేస్తుందని నమ్ముతారు. జోషిమఠ్ నుండి హెలాంగ్ మీదుగా మరో 45 కి.మీ (28 మైళ్ళు) పొడవైన మార్గం అందుబాటులో ఉంది (ఈ మార్గం కూడా కష్టంగా పరిగణించబడుతుంది). అదనంగా, కల్పేశ్వర్ నుండి రుద్రనాథ్ వరకు ట్రెక్కింగ్ మార్గం ఉంది, ఇది దుమాక్, కలంగోట్, కిమనా, పల్లా గుండా వెళుతుంది. ఈ రహదారి ఉర్గాం గ్రామానికి కొద్ది దూరంలో కల్పేశ్వర్ వెళ్లే రహదారిలో కలుస్తుంది.

4- మధ్యమహేశ్వర్

మధ్యమహేశ్వర్ (మద్మహేశ్వర్) అనేది ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని గర్వాల్ హిమాలయాలలోని గౌండర్‌ గ్రామంలో శివుడికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇది 3,497 m (11,473.1 ft) ఎత్తులో ఉంది. గర్వాల్ ప్రాంతంలోని ఐదు శివాలయాలను కలిగి ఉన్న పంచ కేదార్ తీర్థయాత్ర (కేదార్‌నాథ్, తుంగనాథ్రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్) లలో ఇదీ ఒకటి. శివుని మధ్య లేదా బొడ్డుభాగం లేదా నాభి ఇక్కడ పూజించబడుతుంది. ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు.

చరిత్ర

గర్వాల్ ప్రాంతం శివుడు, పంచ కేదార్ దేవాలయాల సృష్టి గురించి అనేక జానపద ఇతిహాసాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంకోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించిశివుడిని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారణాసి (కాశీ)కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి, గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.

వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి, ఎద్దును దాని తోక, వెనుక కాళ్ళను పట్టుకున్నాడు. కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్‌నాథ్‌లో మూపురం పెరగడం, తుంగనాథ్‌లో చేతులు కనిపించడం, రుద్రనాథ్‌లో ముఖం, నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు.

ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌లోని ఐదు ప్రదేశాలలో కనిపించింది. పంచ కేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత, పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానంచేసియజ్ఞంచేసి, ఆపై మహాపంత్ (స్వర్గరోహిణి) అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాలు ఉత్తర-భారత హిమాలయ దేవాలయ నిర్మాణంలో కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

పంచ కేదార్ దేవాలయాల వద్ద శివ దర్శన తీర్థయాత్రను పూర్తిచేసిన తర్వాతబద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం ఒక అలిఖిత మతపరమైన ఆచారం.

దేవాలయం

ఉత్తర-భారత హిమాలయ నిర్మాణ శైలిలో ఉన్న ఈ దేవాలయం ఎత్తైన శిఖరం క్రింద, పచ్చిక మైదానంలో ఉంది. పురాతనమైన, 'వృద్ధ్-మద్మహేశ్వర్' అని పిలవబడే ఈ దేవాలయం, చౌఖంబ పర్వత శిఖరాల వద్ద నేరుగా కనిపించే శిఖరంపై ఉన్న ఒక చిన్న నల్లటి మందిరం. నల్లరాతితో చేసిన నాభి ఆకారంలో ఉన్న శివలింగం గర్భగుడిలో ప్రతిష్టించబడింది.[2] పార్వతికిఅర్ధనారీశ్వరుడికి చేరో గుడులు ఉన్నాయి. రెండవ పాండవ సోదరుడైన భీముడు ఈ దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ శివుడిని పూజించాడని చెబుతారు. ప్రధాన దేవాలయానికి కుడివైపున ఒక చిన్న గుడి ఉంది, ఆ గర్భగుడిలో పాలరాతితో తయారు చేయబడిన సరస్వతి, హిందూ విద్యా దేవత ప్రతిష్ట ఉంది.[6]

పూజ

దేవాలయ ప్రాంగణం నుండి వచ్చే నీరు చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. పూజలు శీతాకాలం తర్వాత వేసవి నెలల ప్రారంభం నుండి నిర్దిష్ట కాల వ్యవధితో ప్రారంభమవుతాయి. శీతాకాలం ప్రారంభం నుండి అక్టోబరు/నవంబరు వరకు మంచు పరిస్థితుల కారణంగా దేవాలయ ప్రాంగణాన్ని చేరుకోలేము. శీతాకాలంలో, దేవుని ప్రతీకాత్మకమైన విగ్రహం నిరంతర ఆరాధన కోసం ఉఖిమత్‌కు మతపరమైన లాంఛనాలతో మార్చబడుతుంది. ఈ దేవాలయంలో పూజారులు, రాష్ట్రంలోని అనేక ఇతర దేవాలయాలలో వలెదక్షిణ భారతదేశానికి చెందినవారు. ఈ ప్రత్యేక దేవాలయంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన లింగాయత్ కులానికి చెందిన జంగమా అని పిలుస్తారు. 2 కి.మీ. దూరంలో బురా మధ్యమహేశ్వర్ అనే చిన్న దేవాలయం ఉంది. పెద్ద మూర్‌లు, లోయల గుండా 2 కిలోమీటర్లు నిటారుగా ట్రెక్కింగ్ చేసి, ఆపై ఒక చిన్న సరస్సుకి చేరుకోవాలి, అక్కడ శిఖరాలు, చౌఖంబ, కేదార్‌నాథ్, నీలకంఠ్, త్రిశూల్, కామెట్, పంచుల్లి మొదలైన హిమాలయాల పూర్తి విశాల శ్రేణి ఉంటుంది.[7]

భౌగోళికం

ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణులలో చౌఖంబ (నాలుగు స్తంభాలు లేదా శిఖరాలు), నీలకంఠకేదార్‌నాథ్ మంచు శిఖరాలతో చుట్టుముట్టబడిన ఆకుపచ్చ లోయలో ఈ దేవాలయం ఉంది.[8] కేదార్ మాసిఫ్ అని పిలువబడే కేదార్ కొండలు, మందాకిని నది మూలాన్ని కలిగి ఉన్న అనేక హిమానీనదాలతో కూడిన పర్వత నిర్మాణ దృశ్యం ఉంటుంది. ఈ ప్రాంతంలో గొప్ప వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ముఖ్యంగా కేదార్‌నాథ్ వన్యప్రాణుల అభయారణ్యంలో అంతరించిపోతున్న హిమాలయన్ మోనల్ ఫెసెంట్, హిమాలయన్ కస్తూరి మృగాలు (కస్తూరి జింక)లు ఉన్నాయి.

సందర్శన

ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు దేవాలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. అక్టోబరు నెల తరువాత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పంచ కేదార్‌లోని ఐదు దేవాలయాలను చూడడానికి మొత్తం ట్రెక్ పొడవు సుమారు 170 km (105.6 mi) (గౌరీకుండ్ వరకు రహదారి ప్రయాణంతో సహా), 16 రోజుల ప్రయాణం ఉంటుంది. గౌరీ కుండ్ నుండి ట్రెక్ ప్రారంభమవుతుంది, దీని నుండి హిమాలయ కొండల శ్రేణిఆల్ప్స్‌తో పోల్చదగిన విశాలమైన గర్వాల్ ప్రాంతం దృశ్యాలు ఉంటాయి.

ట్రెక్కింగ్ రెండు సీజన్లలో జరుగుతుంది; వేసవిలో మూడు నెలలు, వర్షాకాలం తర్వాత రెండు నెలలు, రుద్రనాథ్ మినహా మిగిలిన నాలుగు పంచ కేదార్ దేవాలయాలు మంచు కవచం కారణంగా ప్రవేశించడం వీలుకాదు.

5-కల్పెశ్వర్

కల్పేశ్వర్, అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలోని సుందరమైన ఉర్గామ్ లోయలో ఎత్తులో 2,200 m (7,217.8 ft) శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. గర్వాల్ ప్రాంతంలోని ఐదు శివాలయాలను కలిగి ఉన్న పంచ కేదార్ తీర్థయాత్ర (కేదార్‌నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్)లలో ఇదీ ఒకటి. ఈ దేవాలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు.[1] ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఏకైక పంచ కేదార్ దేవాలయం ఈ కల్పేశ్వర్.

చరిత్ర

గర్వాల్ హిమాలయాలలో కనిపించే మంచు శిఖరాల సాయంత్రం దృశ్యంనందా దేవి శిఖరం దృశ్యం

గర్వాల్ ప్రాంతం శివుడు, పంచ కేదార్ దేవాలయాల సృష్టి గురించి అనేక జానపద ఇతిహాసాలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంకోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించిశివుడిని ఆశీర్వాదం కోసం బయలుదేరారు. మొదట వారణాసి (కాశీ)కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకున్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి, గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు.

వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి, ఎద్దును దాని తోక, వెనుక కాళ్ళను పట్టుకున్నాడు. కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్‌నాథ్‌లో మూపురం పెరగడం, తుంగనాథ్‌లో చేతులు కనిపించడం, రుద్రనాథ్‌లో ముఖం, నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు.[3]

ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ ఖండ్‌లోని ఐదు ప్రదేశాలలో కనిపించింది.[4] పంచ కేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత, పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానంచేసియజ్ఞంచేసి, ఆపై మహాపంత్ (స్వర్గరోహిణి) అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాలు ఉత్తర-భారత హిమాలయ దేవాలయ నిర్మాణంలో కేదార్‌నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి.

పంచ కేదార్ దేవాలయాల వద్ద శివ దర్శన తీర్థయాత్రను పూర్తిచేసిన తర్వాతబద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం ఒక అలిఖిత మతపరమైన ఆచారం.[5]

భౌగోళికం

ఈ కల్పేశ్వర్ దేవాలయం హిమాలయ పర్వత శ్రేణులలోని ఉర్గాం లోయలో ఉర్గాం గ్రామానికి సమీపంలో ఉంది. హెలాంగ్ నుండి కల్పేశ్వర్ వరకు వంతెన మార్గంలో అలకనంద, కల్పగంగ నదుల సంగమం కనిపిస్తుంది. కల్పగంగా నది ఉర్గాం లోయ గుండా ప్రవహిస్తుంది.[6][7] ఉర్గాం లోయ దట్టమైన అటవీ ప్రాంతం. లోయలో ఆపిల్ తోటలు, బంగాళాదుంపలను విస్తృతంగా పండించే టెర్రస్ పొలాలు ఉన్నాయి.[8]

పూజ

ఆదిశంకర శిష్యులైన దాస్నామీలు, గోస్సైన్‌లు ఈ దేవాలయంలో పూజారులుగా ఉన్నారు. తుంగనాథ్ వద్ద కూడా పూజారులు ఖాసియా బ్రాహ్మణులు. ఈ పూజారులు దక్షిణ భారతదేశానికి చెందినవారుబద్రీనాథ్ వద్ద పూజించే కేరళ శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులు. కేదార్‌నాథ్ వద్ద జంగమలు కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన లింగాయత్‌లు. ఈ దేవాలయాలన్నింటిలో పూజా కార్యక్రమాలు ఆదిశంకరులచే రూపొందించబడ్డాయి. ఈ పూజారులు కూడా ఆదిశంకరులచే నియమించబడతారు. రుద్రనాథ్ దేవాలయంలో పూజారులు దస్నామీలు, గోసైన్లు. 

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-6-26-ఉయ్యూరు

 

 

 

                        

పొగమంచు వాతావరణంలో తెల్లవారు

--
1.jpg
9.jpg
11.jpg
12.jpg
14.jpg
13.jpg
15.jpg
5.jpg
2.jpg
3.jpg
4.jpg
6.jpg
7.jpg
8.jpg
10.jpg
Reply all
Reply to author
Forward
0 new messages