వేద విజ్ఞానానికి ‘’తుమ్మోజు’’ రాసిన పాకెట్ గైడ్

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jul 5, 2026, 10:38:36 PM (3 days ago) Jul 5
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

వేద విజ్ఞానానికి ‘’తుమ్మోజు’’ రాసిన పాకెట్ గైడ్

మిత్రుడు బ్రహ్మశ్రీ శ్రీతుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ‘’అన్నిట ఆరియు తేరిన దిట్ట ‘’.ఇటీవలే వేదభావ సూచక ముఖ చిత్రాలతో ‘’వేద విజ్ఞానం ‘’అనే చిరుపొత్తాన్ని వెలువరించారు .విశ్వాన్ని ఎవరు సృష్టించారు ,ప్రళయం అంటే ఏమిటి అనే ప్రాధమిక ప్రశ్నలు సంధించుకొని ఋగ్వేద సూక్తం ఆధారంగా విలువైన సమాదానం  చెప్పారు .అతడిని యే పేరుతొ పిలవాలి అని మరోప్రశ్న వేసుకొనిసృష్టికర్తను విశ్వకర్మ అని పిలవాలన్నారు .సృష్టి స్థితి లయాది సర్వకార్యాలు చేస్తాడు కనుక ఆపేరు సమర్ధనీయం అని సాయణాచార్య ఉవాచ  అన్నారు .విశ్వకర్మ పరమాత్మయే .వాచస్పతి అనీ అంటారు .ఆయన పిత ,జనిత ,దాత విధాత ,విహాయా .విహయా అంటే విశ్వాన్ని లయం చేసుకొనేవాడు .

  కృష్ణ యజుర్వేదం లో విశ్వకర్మ యజ్ఞ ప్రీతికరుడు అనీ మంత్రపూర్వక వివరణ ఇచ్చారు .ఆయన పుట్టిన రోజే విశ్వ కర్మ జయంతి జరపటం అవివేకమన్నారు-కారణం ‘’ఏష దేవో మహాత్మా సదా జనానాం హృదయే సంనివిస్టః’’అని శ్వేతాశ్వతర ఉపనిషత్ వాక్యాన్ని ఉటంకించారు .సెప్టెంబర్ 17 న రవి కన్యారాశిలో ప్రవేశిస్తాడు .ఈ రోజే భౌమన మహర్షి విశ్వకర్మ పరమాత్మను దర్శనం చేసుకొన్నరోజు కనుక దాన్ని జయ౦తిగా కాకుండా ‘’విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ‘’గా నిర్వహించుకోవాలన్నారు .వాక్కుకు వాగ్రూప మంత్రానికీ అధిపతి కనుక వాచస్పతి .వైదిక మార్గమే వైశ్వ కర్మణం .ఈపదం కృష్ణ యజుర్వేదం లో  చాలాసార్లు వస్తుందని చెప్పారు .ఏమ౦చి పని ప్రారంభించటానికైనా ముందు –‘’వాచస్పతిం విశ్వకర్మాణమూతయే మనోయుజం వాజే అధ్యాయు వేమ – సనో నేదిష్టా  హవనాని జోషతే విశ్వశంభూ రవసే సాధుకర్మా ‘’అనే కృష్ణ యజుర్వేద మంత్రాన్ని స్మరిస్తే సర్వ సిద్ధి జరుగుతుందని ఈ పాకెట్ గైడ్ ముగించారు .చివర విశ్వకర్మ అష్టోత్తర నామావళి అందజేశారు .సూక్ష్మం లో మోక్షం అంటే ఇదే .  

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-26-ఉయ్యూరు .

--
WhatsApp Image 2026-07-06 at 7.49.53 AM.jpeg
WhatsApp Image 2026-07-06 at 7.49.53 AM (3).jpeg
WhatsApp Image 2026-07-06 at 7.49.53 AM (2).jpeg
WhatsApp Image 2026-07-06 at 7.49.53 AM (1).jpeg
Reply all
Reply to author
Forward
0 new messages