సెల్ ఆత్మఘోష -చలపాక సెల్ నానీలు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 30, 2026, 10:16:48 PM (8 days ago) Jun 30
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

ఇప్పటికే నానీలలో పీకలలోతు నానిన చలపాక ప్రకాష్ కొత్తగా’’ సెల్ నానీలు ‘’పేని 28-6-26-ఆదివారం ఆంధ్రప్రదేశ్ రచయితలా సంఘం నిర్వహించిన మూడవ గ్రంథాలయ సందర్శన ముగింపు లో పురుషోత్తమ గ్రంధాలయం లో జరిపిన ముగింపు సభలో నాకు గౌరవ సన్మానం చేసి ఈ పుస్తకాన్ని నాతో ఆవిష్కరి౦పజేసి  మరింత గౌరవం కల్పించాడు .పేజీకి ఒక్కటే ఉండటం, ప్రతినానీకి అర్ధవంతమైన బొమ్మ ఉండటం ఈ సంపుటి ప్రత్యేకత .ఇవి నేటిజనం సెల్ ఫోన్ బందీలుకావటం మాత్రమేకాదు పరిస్థితుల సెల్ లో కూడా బందీలుగానే ఉన్నారన్న భావం కూడా ఇందులో ఉందని ప్రకాష్ చెప్పాడు.అర్ధవంతమైన ముఖచిత్రాలు పుస్తకానికి అదనపు ఆకర్షణ .

ఇందులో 48 నానీలున్నాయి .వీటికి చలపాక సూచిన రీతిలో జెమిని ఎ.ఐ.తగిన బొమ్మల్ని తయారు చేసిచ్చి భావానికి మరింత బలం చేకూర్చి అభిన౦దనీయమైనది .ఇందులో నన్ను బాగా  ఆకర్షించిన  కొన్ని నానీలు మీ ముందు ఉంచుతున్నాను .

  దొంగలుమత్రమేకాదు ఇవాళ అందరూ అరచేతిసెల్ల్ బాధితులే అనేది మొదటినానీ .ఆలస్యానికి కతలు చెప్పేవాడు ఇప్పుడు రచయిత అయ్యాడు అని వ్యంగ్యబాణ౦ వదిలి ముగించాడు .యూజర్ నిద్రపోతేనే తనకు సుఖనిద్ర అని మూగ రోదన చేసింది సెల్ .అరచేతి వేళ్ళతో నలిపేస్తున్నాడు దొంగసచ్చినోడు  అని వేదన .పాముపడగలున్నంతగా సెల్ లోవిషం చిమ్మే  యాపులే యాపులు .మనుషుల్లోనేకాదు వాట్సాప్ గ్రూపులూ ఎక్కువయ్యాయి .సెల్ విశ్వరూపం చూసి పుస్తకాలు మౌన౦గా రోదన.మనం డాలర్ యావలో ఉంటె విదేశీయులు మన  సంస్కృతియావలో .అంటే క్వయట్  ఆపోజిట్ .చదువుకోసం ఊరు ఉద్యోగం కోసం దేశం వదిలేస్తున్నారు .చిన్న సినిమా నరసింహ సూపర్ హిట్ అయి ‘’తంతే గారెలబుట్టలో’’ సామెత రుజువు చేసింది .

  పంచ పల్లెటూరివేషం షార్ట్ పట్నపు పోకడ .నీడనిచ్చే చెట్టు న్నచోట ఫ్లైఓవర్ సంస్కృతి .కవిత్వం ఏరులై ప్రవహిస్తున్నా ,’’తాగి దాహంతీర్చుకొనే వాడే కరువైపోయాడు ..తీరని లంచగొండి దాహం లాగా నిండిన ఎ. టి .ఎం .పనిచేయదు.కవి సూక్ష్మ దృష్టికి చక్కని తార్కాణ.బుల్లితెరకైనా పెద్ద తెరకైనా అక్షరాలూ అల్లుకు౦టేనే జీవిక .అరిటాకు స్థానం బిర్యానీ ఆకు కాజేసింది .ఆదివారం ఆడాళ్ళకు సెలవు మాట దేవుడికెరుక కోళ్ళకు,ఇల్లాళ్ళకు  మాత్రం ప్రాణాంతకం .  వెతికితెకాని దొరకని అన్నం హోటలు బిర్యానీ స్టాల్స్ ఫుల్ .స్టార్’’ ఒటేలు’’లోతడుముకుంటా  ‘’డిం లైట్లు’’ భరిస్తారు కానీ, ‘’లో వోల్టేజ్’ వస్తే అగ్గిమీదగుగ్గిలం అవుతారు .పెళ్ళితో ఇల్లు మారి ఆడపిల్ల వస్తే ,మగాడు ఉమ్మడి నుంచి వేరుకాపురానికి తయార్ .వేసవిలో  బిందెలో నీళ్లునిల్ బీరు బాటిల్స్ లో ఫుల్.ఇదేరా లోకరీతినాయనా .అప్పు చేసినోడుహాయిగా –ఇచ్చినోడిపని గోవి౦దోహరి .సంతాపసభలలో పొగడ్తలు  వినలేక యేడుపోస్తుందట . ఇదేనేటి సభాన్యాయం .ఊబర్ రాపిడోలకాలం ఇది. చేఎత్తితే లాభం నిల్ .రుక్కులస్థానం లో బుక్కులు వీటిబదులు ‘’ఈబొక్కులు’’ .కన్నీటికి కరువులేదు తాగేనీటికే .నేటి సినెమా ఊసరవెల్లి –దియేటర్ ను౦చి వోటిపి కి జంప్ .ఇప్పుడు ఫోన్ యాప్ నిండా అప్పులే .అప్పులివ్వడంలో బ్యాంక్ లు రాంకులు కడుతున్నాయి .పొదుపుపుమాట దేవుడికే ఎరుక .పిల్లలు పుట్టీ, పుట్టకయేడిపిస్తూనే ఉంటారు .సెల్ లేని మనిషి ఇప్పుడు వింత గ్రహా౦తర వాసి అవుతున్నాడు .

చక్కని సామాజిక స్పృహ ఉన్న నానీలివి .సూక్ష్మ౦లో మోక్షం .అల్పాక్షరాల్లో అనంతభావ వైవిధ్యం .చురుక్కు మనిపించేవీ .పెదవులపై హాసం తొణికి౦చేవీ . చెళ్ళున చెంపదెబ్బ తినిపించేవీ .కక్కాలేక మి౦గా లేక చెప్పుకోలేనివీ .గడుసుదనం చురుకుదనం ని౦డుకున్నవీ .వీటినిసక్రమంగా సమాజహిత౦ గా వాడుకొన్నాడు చలపాక ప్రకాష్ అభినందనలు ..ఇవన్నీ’’ సెల్ సేల్ఫీ షౌట్స్’’ అనచ్చునేమో .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-6-26-ఉయ్యూరు .


an2.jpg
--
Reply all
Reply to author
Forward
0 new messages