బద్ర్ (పూర్ణ చంద్) దిట్టమైన అచ్చతెనుగు కవితా పేటిక ‘’ నిట్ట’’

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Jun 8, 2026, 8:56:10 AM (8 days ago) Jun 8
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY, Mandali Buddha Prasad, Subbarao Guttikonda, D. G. V. Purnachand

బద్ర్ (పూర్ణ చంద్) దిట్టమైన అచ్చతెనుగు కవితా పేటిక ‘’ నిట్ట’’

అరబిక్ భాషలో బద్ర్ అంటే పూర్ణ చంద్రుడు అని అర్ధం.నిష్ఠ ప్రకృతి నిట్ట వికృతి అని చిన్నప్పుడు చదివిన గుర్తు .నిలువుగా నిలిచినవాడిని వెన్నెముక గలాడు అంటాం .స్స్నేహం ప్రకృతి నెయ్యం వికృతి .విడదీయలేని దోస్తీ గుత్తికొండ,పూర్ణ లది .ఆ స్నేహానికి ఉడుగర తమ్ముడు పూర్ణ అన్న సుబ్బన్నకు ఇచ్చిన ఈ నిట్ట.అదీ అనుగు తమ్ములుం గారు  తన నెచ్చెలి ,సచివుడు ,మార్గదర్శి,ఆత్మబంధువు , పెద్దన్న ’’ గుత్తికొండ @80 ‘’కి కష్టపడి రాసి అందించిన ఇష్టమైన ఆత్మీయ అక్షర కానుక’’నిట్ట’’.కనుక విశిష్ట కానుక .

 ఇది 18కవితా శీర్షికల సంపుటి .ఇవి వట్టి మాటలుకావు .గట్టి నేర్పున అల్లిన అచ్చమాటల పల్లికలు .ఇవి అలవడితే బుర్రబలిమి మంచుమిట్టై  మింటిని తాకి చల్లగా తాకేను .అని భరోసా ఇచ్చాడు కవి .మట్టిపిలుపే మనపుట్టువు .’’పరుల కడగండ్ల లో పలకరించే పంచదార తలపు మనది ‘’అంటాడు అందంగా .’’నొవ్వు ఓ కైపు ,మిసిమి ,నిక్కచ్చిని తెలిపే నవ్వుకూడా ‘’అంటాడు .ఒకప్పటి తోడూ,నీడ ఇప్పుడు పీడ.మరపులోకి జారిన –ఉబుసు ఊసులకు విడిదిల్లు ‘’అనేది చక్కని నుడికారం .నలుతెరగల కూడళ్ళలో –నవ్వులపాలైన బతుకుల్లో –‘’నేను ‘’బతికుందా?’’అని ప్రశ్నిస్తాడు .బతికి ఉన్నది మేనుకాదు-నేను ‘’అని జేజయ్యకు గుర్తు  చేస్తాడు .

 ప్రసాదం అనే ‘గుడిబువ్వ ‘’ము౦దుకుక్కకే తర్వాతే నాకు .’’జేజి ఉన్నది బువ్వలోనా ?ఆకలిలోనా’’?అనిమిలియన్ డాలర్ల ప్రశ్న . తృప్తి (ఆపోవుట )ఎరగని రామిగాడికి .’’ఆదరాబాదరగ అల్లిన – బతుకు కతలే అందరివీ ‘’అనే మెట్ట వేదాంతం .ఉప్పెనకు  ఊళ్లు ఉప్పనై పోయాయి .రెచ్చిపోయిన అలలు సోలసిపోయాక కన్నీటి చారికలు తుడుచుకుందిట ‘’నేలతల్లి ‘’.బూడిదలోంచి లేచే ఫీనిక్స్ పక్షిలా –‘’తొమ్మాడిన (నాశనమైన )నేలలోంచి –కూటి గింజైమొలిచాడు –చైతన్యానికి ఆటపట్టు –తరువులకు తోడబుట్టు ‘’అనే కవిత దివి సీమ ఉప్పెన భీభత్సం .మనం నిట్ట గా నిలిస్తే –అదను మనదౌతుంది –బాటతేటగా ,మాట పదునుగా –మేను నిటారుగా –తనలో తానై నిలుస్తుంది ‘’అనేది ఈ నిట్టకు ఫలశ్రుతి .

 కస్టపడి సేకరించి వాడిన అచ్చ తెనుగు పదాలకు మన వాడుకభాష లో అర్ధాలు ఇచ్చారు ‘’బద్ర్’’.ఇదిప్రయోగమే .ఆచరణకు అందరికీ ఎంత సాధ్యమో తెలీదు .కన్యాశుల్కం లో గిరీశం అన్నట్లు ‘’ఆల్జీబ్రా మేడ్ డిఫికల్ట్?’’అవుతుందా?

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-6-26-ఉయ్యూరు 


--
3.jpg
2.jpg
1.jpg
Reply all
Reply to author
Forward
0 new messages