శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Dec 9, 2025, 9:53:03 PM (3 days ago) Dec 9
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాలు

17-12-25 శ్రీ  విశ్వావసు నామ సంవత్సర మార్గశిర బహుళ  త్రయోదశి  (తెల్లవారితే బుధ వారం )నుంచి పుష్యబహుశి  ద్వాదశి 14-1-2026  బుధవారం  భోగి  వరకు ధనుర్మాస సందర్భంగా ఉయ్యూరు లోని శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి రోజూ ఉదయం 5గం .లకు సుప్రభాత సేవ ,గోదాదేవి’’ తిరుప్పావై’’ ,కులశేఖర ఆళ్వారుల’’ముకుందమాల ‘’పఠనం ,శ్రీ సుందర కాండ పారాయణం ,ఉదయం 5-30గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు ,అష్టోత్తర సహస్రనామార్చన ,శ్రీ గోదా, రంగనాథ స్వామి వారలకు అష్టోత్తర పూజ,.ఉదయం 6-30గం లకు  నైవేద్యం ,హారతి ,మంత్రపుష్పం , తీర్ధ ప్రసాద వినియోగం జరుగును .భక్తులందరూ పాల్గొని తరించ ప్రార్ధన.

                    ప్రత్యేక కార్యక్రమాలు

30-12-25-మంగళ వారం -పుష్య శుద్ధ ఏకాదశి -వైకుంఠ ఏకాదశి (ముక్కోటి )సందర్భంగా-ఉదయం 4గం .లకు స్వామివార్లకు విశేష అలంకరణ,అష్టోత్తర శతనామార్చన -5గం .లకు ‘’ఉత్తర ద్వార దర్శనం ‘’.

1-1-2026 -గురువారం  నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా స్వామి వారలకు ఉదయం 5-30గం లకు ‘’లడ్డూ లతో ‘’ప్రత్యేక పూజ ,అనంతరం భక్తులకు లడ్డు ప్రసాద వినియోగం .

7-1-26-బుధ వారం  -పుష్యబహుళ పంచమి -సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా -సాయంత్రం 6గం లకు శ్రీ త్యాగరాజస్వామి వారి అష్టోత్తర పూజ ,అనంతరం సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి బృందం చే శ్రీ త్యాగరాజపంచరత్న కీర్తనల గానం  

10-1-26- శనివారం   ఉదయం 5-30గం లకు స్వామివార్లకు –‘’అరిసెలతో’’ ప్రత్యేకపూజ ,ప్రసాద వినియోగం .

13-1-26-మంగళవారం -ఉదయం -5--30గం .లకు శ్రీ ఆంజనేయస్వామి ‘’మూల విరాట్’’ కు ‘’వెన్నతో అభిషేకం’’. 

14-1-26-బుధవారం  భోగి పండుగ ఉదయం 5-30గం లకు స్వామివార్లకు ‘’శాకంబరీ పూజ ‘’(వివిధ కాయగూరలతో పూజ )

ఉదయం -9-30 గం లకు శ్రీసువర్చలా౦జనేయ ,శ్రీగోదా రంగనాథ  స్వామి వారలకు ‘’ శాంతి కళ్యాణ మహోత్సవం’’ .

15--1-26-గురువారం   మకర సంక్రాంతి

16-1-26-శుక్రవారం  కనుమ పండుగ

గబ్బిట దుర్గాప్రసాద్ ఆలయ ధర్మకర్త

మరియు భక్త బృందం

10-12-25 ఉయ్యూరు .

 


--
1.jpg
2.jpg
Reply all
Reply to author
Forward
0 new messages