సంస్కృతకలావిలాసము: ఆంధ్రకవులపై క్షేమేంద్రుని ప్రభావంరచన: ఏల్చూరి మురళీధరరావు

0 views
Skip to first unread message

gabbita prasad

unread,
Sep 7, 2025, 10:09:32 PM (2 days ago) Sep 7
to sahiti...@googlegroups.com, Andukuri Sastry, Narasimha Sarma Rachakonda, Gopala Myneni, Krishna, S. R. S. Sastri, mrvs murthy, GITANJALI MURTHY

సంస్కృత కలావిలాసము: ఆంధ్రకవులపై క్షేమేంద్రుని ప్రభావం

రచన: ఏల్చూరి మురళీధరరావు

మార్చి 2014

అల్లఅంటే, ఎక్కడో దూరాన ఉన్నవాళ్ళు. పద్యం చెప్పినది భాగవత రచన కొనసాగుతున్నప్పుడో, కొసదాకా వచ్చినప్పుడో. క్రీస్తుశకం 1478-1480 ప్రాంతాల నాటి కథ. అప్పుడు విజయనగర రాజు విరూపాక్షరాయలు. ఓరుగల్లుకు విజయనగరం దూరదేశమే. విరూపాక్షరాయలు 1478 దాకా ఉన్నాడు. పరమనీచుడు. ఆ తర్వాత అతని కొడుకు నాలుగవ ప్రౌఢదేవరాయలు 1485 దాకా ఉన్నాడు. ఆ తండ్రీ ఈ కొడుకూ ఇద్దరూ కర్ణాటకీచకులు.

కిరాటులు అంటే మ్లేచ్ఛులు అని నైఘంటికార్థం. బహుమనీ సుల్తానులన్నమాట. కిరాతులు అన్నా మ్లేచ్ఛులనే భావం ఉన్నది కాని, ‘కర్ణాట కిరాట కీచకులుఅన్నప్పటి అనుప్రాసకు లోపం. కిరాతో మ్లేచ్ఛభేదే స్యా ద్భూనిమ్బేఽల్పతనావపిఅని మేదినీ కోశం. కిరాతుడు అంటే మ్లేచ్ఛుడు, అల్పశరీరుడు, నేలవేము అని. కిరాట శబ్దాన్ని నిఘంటువులు కొంత ఆలస్యంగా గుర్తించాయి. ద్వే తు కిరాటః స్యా న్మ్లేచ్ఛే వణిజి చాపిఅని నానార్థార్ణవసంక్షేపం. కిరాటుడు అంటే మ్లేచ్ఛుడు అని, వ్యాపారి అని అర్థాలు. కిరాటకీచకులు అంటే బహుమనీ సుల్తానులు.

దుష్టత్వం కర్ణాటకీచకులకు, కిరాటకీచకులకు సమానధర్మం. నీవిచ్చిన ప్రసాదాన్ని ఆ దుష్టులకు తీసికొనివెళ్ళి అమ్మను అని కవి వాగ్దానం. భాగవతంలో ఇమ్మనుజేశ్వరాధములుఅన్నది కూడా ఈ కర్ణాట కిరాట కీచకులనే. పోతనగారి మనస్సులో నిలిచిన కిరాటకీచకులు క్షేమేంద్రుడు సాహిత్యంలో ప్రవేశపెట్టిన కుటిలకిరాటులే అన్నమాట మాత్రం స్పష్టం. కీచకశబ్దాన్ని బహుళ నిందావాచకంగా ప్రచారంలోకి తెచ్చినవాడు కూడా క్షేమేంద్రుడే. ఆ చందాన స్మృతినిక్షిప్తమైన శబ్దశిల్పాన్ని పోతన్న తన పద్యంలో సందర్భవిదర్భంగా సంయోజించాడు. క్షేమేంద్ర పారాయణికుడని చెప్పటానికి ఇంకేమి విశదిమ కావాలి!

క్షేమేంద్రుని కలావిలాసం ప్రథమసర్గంలో సుదీర్ఘమైన చంద్రోదయవర్ణనం ఉన్నది. క్షేమేంద్రుని ప్రకృతిదృశ్యదర్శనానికి, వర్ణననైపుణికి ఆస్కారం లభించిన సన్నివేశం అది. ఆహ్లాదకరమైన ఆ సమయంలోని కొన్ని రూపణలివి:

గగనాఙ్గణకమలవనే సన్ధ్యారాగే గతే శనైః క్వాపి
అప్రాప్తస్థితివికలం బభ్రామ భ్రమరవిభ్రమం తిమిరమ్. (1-27)

(సాయంకాలం గడిచి సంధ్యారుణకాంతులు సన్నగిల్లుతుంటే ఆకాశమండలంలోని కలువకొలనిలో నల్లతుమ్మెదలు దిక్కుతోచక నలుదెసలకు పరుగులుతీసినట్లు చిమ్మచీకటులు వ్యాపింపసాగాయి.)

రజనీ రరాజ సితతరతారకముక్తాకలాపకృతశోభా. (1-29)

(కాముకులకు రాగాతిశయాన్ని కలిగించే ఆ రజనీసమయం తెల్లని ముత్యాలదండల వంటి తారకాసముదాయంతో రంజకంగా రాజిల్లసాగింది.)

మన్మథసితాతపత్రం దిగ్వనితాస్ఫటికదర్పణో విమలః. (1-31)

(మదనుని తెల్లగొడుగువలె, అపరదిక్కు అనే వనిత చేతనున్న స్ఫటికపు అద్దం లాగానూ )

గగనతటినీతటాన్తే రజనికరో రాజహంస ఇవ. (1-32)

(ఆకాశగంగానదిలో నడయాడుతున్న రాజహంస వలె కానవచ్చాడు చంద్రుడు.)

ఈ చిత్రకల్పనలను యథాతథంగా స్వీకరించిన మహాకవి ధూర్జటి కాళహస్తి మాహాత్మ్యము ద్వితీయాశ్వాసంలో గజరాజు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొండమీది శివలింగం వద్ద తాను సమర్పించిన పూజాద్రవ్యాలను ప్రతినిత్యం నాశనం చేస్తున్న గూఢశత్రువును ఎదుర్కొనటంకోసం ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేనక్కడికి చేరుకొంటానా అని నిద్రాహారాలు లేక వేచి ఉన్న తరుణంలో కావించిన వర్ణనమిది:

శా. తారాలోకమునం బ్రకాశమొక చందంబై ప్రసాదింప సం
      
ధ్యారాగావృతమై తమఃపటలసంతానంబు గప్పంగ … (2-129)

మ. గగనాహార్యమృగేంద్రశాబకము నక్షత్త్రాంబుజారణ్యమ
      
ధ్యగహంసంబు నిశావధూకరతలోద్యన్మల్లికాగుచ్ఛ మ
      
ధ్వగబాధావహచిత్తభూకటకయాత్రామౌక్తికచ్ఛత్త్ర మొ
      
ప్పు గతిం జంద్రుఁడు తోఁచె …(2-134)

సన్ధ్యారాగే గతే శనైః క్వాపి, అప్రాప్తస్థితివికలం బభ్రామ భ్రమరవిభ్రమం తిమిరమ్అన్నదే, ఉన్నదున్నట్లుగా తారాలోకమునం బ్రకాశమొక చందంబై ప్రసాదింప సం, ధ్యారాగావృతమై తమఃపటలసంతానంబు గప్పంగఅని తెలుగులోకి వచ్చింది. గగనాఙ్గణకమలవనేరజనికరో రాజహంస ఇవఅన్నదే నక్షత్త్రాంబుజారణ్యమ, ధ్యగహంసంబుఅయింది. దిగ్వనితా మన్మథసితాతపత్రంఅన్న ప్రసిద్ధకల్పనను కార్యకారణానువర్తితంగా ధూర్జటి కవి నిశావధూకరతలోద్యన్మల్లికాగుచ్ఛ మ, ధ్వగబాధావహచిత్తభూకటకయాత్రామౌక్తికచ్ఛత్త్ర మొ, ప్పు గతిన్అని వ్రాశాడు. ధూర్జటి కరకమలాలలో క్షేమేంద్రకృతిప్రసూనం ఉన్నమాటను కాదనగలమా.

కలావిలాసమే గాక దేశోపదేశ నర్మమాలా సమయమాతృకాదుల నిత్యానుశీలనఫలితం ఆంధ్ర క్రీడాభిరామానికి వన్నెతెచ్చింది. మరి రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామమే తత్ప్రభావితమేమో! అనటం గతజలసేతుబంధనమే అవుతుంది. విటానాం కేలిపటహం తప్తతామ్రఘటోపమమ్, దధానం రోమమాలాన్తం స్థూలఖల్వాటకర్పరమ్’ (సమయ. 1-10), ‘మృజ్యమానస్య వైమల్యం తామ్రసంజ్ఞస్య నాన్యథా’ (సమయ. 5-23), అన్నవి క్షేమేంద్రుని చిత్రకల్పిత సంకేతాలు. ఇవి ఇతరకవులు నిరూపించినవి కావు. రోమాలను తొలగించిన తర్వాత మదవతి మదనమందిరానికి తప్తతామ్రఘటం తోడి పోలిక క్షేమేంద్రునిది. అది చదువుకొన్న వల్లభరాయలు దానికి మెరుగులు దిద్ది, ‘కసటువోవఁగఁ దోమి కడిగి బోరగిలంగఁ బెట్టిన తామ్రంపు బిందెవోలె’ (క్రీడాభి. ప.80), అని క్రీడాభిరామంలో సుసరభేత్ అన్న రోమసంహారిణి మందు ప్రభావనిరూపణకు ఉపస్కరించుకొన్నాడు.

క్షేమేంద్రుని నర్మమాలా సమయమాతృకలనే చదువుకొన్న మరొక కవి కళావతీ శతక కావ్యకర్త తేళ్ళపూడి కసవరాజు. పరస్పరప్రార్థనయా సుముణ్డితభగధ్వజౌ, భూకమ్పకారిణౌ, రాత్రౌ తౌ రణ్డాబ్రహ్మచారిణౌ’ (నర్మమాల. 3-39) అని మొదలయ్యే శ్లోకాలలోని అశ్లీలవాచ్యతాదోషాన్ని తన కాలానుసారం సంస్కరించి, ఆ ప్రాకృతకాముకుల వర్ణనకు అప్రకృతవర్ణనతో ప్రకృతార్థాన్ని కవిప్రౌఢోక్తిసిద్ధంగా చమత్కరించి కసవరాజు, ‘ఆ కంజానన యుపరతి, కాకాశము వడఁకెఁ దార లటునిటు వడియెన్, జోకైన గిరులు గదలెను, భీకరమగు తమము చంద్రబింబముఁ గప్పెన్అని రూపకాతిశయోక్తిని అభినందనీయంగా నిర్వహించాడు. కసవరాజు పద్యానికి ఇతరశ్లోకమూలాలు కూడా లేకపోలేదు కాని, ఆయన రూపించిన కళావతీ వృత్తాంతం సమయమాతృకాంతర్గతమని గుర్తింపనందువల్ల పరిష్కర్తలు, వాఙ్మయచరిత్రకాథికులు ఆ రచనలోని గురుకుచకుంభముల్ గదలఁ గ్రొమ్ముడి వీడఁగ రాలఁ గ్రొవ్విరుల్, కరమణికంకణక్వణన కాచనగ (?) ధ్వను లుల్లసిల్లఁగామొదలైన పంక్తులలో ప్రశ్నార్థకాలను నిలుపవలసివచ్చింది.

కాచము అంటే గాజు. ధాతువిశేషో వలయాది ర్యేన రచ్యతేఅని అమరకోశంలోని కాచాః శిక్యమృద్భేదదృగ్రుజఃఅన్న (3-3-28) శ్లోకానికి కృష్ణమిశ్రుని టీక. ఉపపతితో సంయోగవేళ నాయిక కళావతి చేతి గాజులు మహానగాలు ఊటాడుతున్నట్లు చప్పుడు చేశాయని భావం. ఇది సామాన్యార్థం. సమయమాతృకకు ప్రామాణికాలైన వ్యాఖ్యలేవీ ఆ రోజులలో వెలువడనందువల్ల అందులోని పెక్కు పదాలు నిఘంటువులలోని కెక్కకపోవడమూ, సుప్రమాతాలు కాకపోవడమూ సంభవించింది.

స్వభావభిదురః కాచసంజ్ఞ శ్ఛలనిరీక్షకః, శైలోఽపి గౌరవస్థాయీ హృదయాభావనీరసఃఅని సమయమాతృక (5-26). అక్కడ క్షేమేంద్రుడు చెప్పిన ఎనభై రాగభేదాల స్వరూపం, ఈ కాచరాగస్వరూపం నాకు సరిగా బోధపడలేదు. సంగీత లక్షణగ్రంథాలలో కనబడలేదు. దానిని అన్వయించికొని కళావతీ శతకపద్యం అంతరార్థాన్ని పునఃపరిశీలించాలి. ఆ విధంగా కలావిలాసం ప్రతీతి, ప్రథిమ మనకు బోధపడతాయి. సమాజంలోని లోపజాతాన్ని తీవ్రమైన కంఠస్వరంతో విమర్శించిన ఆ దేశోపదేశ నర్మమాలాది కృతులతో పోలిస్తే కలావిలాసం కొంత వెలవెలపోయేమాట నిజమే. ఏమైతేనేమి, ఒకప్పుడు మధ్యయుగీనాంధ్రకవులకు అధీతిబోధల వల్ల సువిదితమైనప్పటికీ, ఆధునికకాలంలో మాత్రం ఉపేక్షా రాహుగ్రస్తమైన చంద్రబింబం వలె మరుగునపడిపోయింది.

1937లో క్రొత్తపల్లి సూర్యారావుగారు కలావిలాసానికి గుజరాతీ హిందీ భాషలలో వెలువడిన అనువాదాలను పరికించాక, సంస్కృతవిధేయంగా చక్కటి శైలిలో తెలుగులోకి వచనీకరించారు. 1968లో శ్రీ నరేంద్రనాథ సాహిత్యమండలి వారు తణుకు నుంచి ప్రచురించిన ముళ్ళపూడి తిమ్మరాజు అభినందన సంపుటి సాహితీవాల్లభ్యములో సుగృహీతనామధేయులు ఈయూణ్ణి వేంకట వీరరాఘవాచార్యులవారు మహాకవి క్షేమేంద్రకర్ణపూరము అన్న పేరుతో సర్వార్థసమాకలనపూర్వకంగా ఒక మంచి వ్యాసాన్ని వ్రాశారు.

ఇంతమందిని ప్రభావితం చేసి, ఇన్ని విధాల మహనీయమైన క్షేమేంద్రకృతిని నన్నెచోడుడో మరొకరో తెలుగు చేయాలనుకోవటం సహజమే.

 

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి:

ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు నయాగరా కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికంఅన్న ప్రశంస పొందారు. ఆకాశవాణిలో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.

ఏల్చూరి వారికికృతజ్ఞత తో

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-25-ఉయ్యూరు

1

 

image.png

 


--

SriRangaSwamy Thirukovaluru

unread,
Sep 8, 2025, 8:08:49 AM (yesterday) Sep 8
to sahiti...@googlegroups.com
ముళ్ళపూడి తిమ్మరాజు అభినందన సంచికను నేను 1988లో కాకతీయ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో చదివాను. ఆ సంచికలో కొన్ని వ్యాసాలు నా పరిశోధనకు ఉపకరించాయి. మీ పోస్ట్ అది గుర్తు చేసింది. నమస్సులు. 
--
You received this message because you are subscribed to the Google Groups "సరసభారతి సాహితీ బంధు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z_V5fJaXoGdCYQ%2BpShkuXjXbZrjtbUEyoJEo7d%2BTeuj1w%40mail.gmail.com.
Reply all
Reply to author
Forward
0 new messages