గర్వాన్ని అధిగమించడం ఎలా?

107 views
Skip to first unread message

Kb Narayana Sarma

unread,
Dec 17, 2013, 12:33:56 AM12/17/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, vem...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, sridh...@yahoo.com, Jayaraman VS, tangirala ramana, Uday Kiran
విజయానికి మూలం విశ్లేషించుకోండి?
గర్వాన్ని దూరంగా ఉంచడానికి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి.  అదేమిటంటే, మీ విజయానికి మూలం ఏమిటి? ఉదాహరణకు సామర్థ్యం అని అవతలి వారు కీర్తించారనుకుందాం.  అప్పుడు ఆ సామర్థ్యానికి మూలమేమిటని కూడా ప్రశ్నించుకోవాలి.  అవతలి వారు మనని రకరకాల పొగడ్తలతో ముంచెత్తి ఉండవచ్చు.  కానీ, అవన్నీ నిజమనే నమ్మకమేమిటి?  ఒకవేళ నిందించారనుకుందాం.  దానిని అంగీకరిస్తామా?  నిందలకు మూలం లేనిపోని కల్పనలైనప్పుడు, పొగడ్తలకు మాత్రం ఎందుకు కాకూడదు?  ఈ భ్రమ నుండి బయటపడాలంటే మనలో మనమే ప్రశ్న వేసుకోవాలి. ​


​మనకు లభించిన అవకాశాలను మనం వినియోగించుకోగలమే కానీ, వాటిని సృష్టించుకోలేము.  ఎంతో ప్రతిభ ఉన్నా, మీ విజయానికి అదొక్కటే కారణం కాలేదు.  ఒక విజయం వెనుక ఎన్నో కారణాలున్నాయి.  అవేవీ మీరు సృష్టించ గలిగినవి కావు.  మీకు సమకూరిన కొన్ని అవకాశాల వల్ల విజయం సాధ్యమయింది.  ఈ రహస్యాన్ని గుర్తించినపుడు మీకున్న సామర్థ్యాన్ని గ్రహించి, ఆనందపడడంతో పాటు మీకు సహకరించిన అనేక ఇతర కారణాలకు మీరు కృతజ్ఞతతో ఒదిగిపోతారు.  ఎవరో మెచ్చుకోవాలన్న తపన కూడా క్రమేపీ మటుమాయమవుతుంది.

గర్వం వెర్రితనమే!
నాలో ఫలానా గొప్పదనం ఉందనీ, దానిని ఇతరులు మెచ్చుకోవాలని ఆరాటపడడం, అలా జరగనప్పుడు సంఘర్షణకు లోను కావడం ఇవన్నీ గర్వానికి మూలమని చెప్పుకున్నాం.  ఏదైనా గొప్పదనం ఉన్నా, దానికి గర్వించాల్సిన పనేమీ లేదు.  ఎందుకంటే, ఆ గొప్పదనానికి కారణం మీరు ఒక్కరే కాదు.  అసలైన కారణాలలోకి వెళ్ళే సరికి మనలో తలెత్తే కృతజ్ఞతా భావం సంఘర్షణలను పారదోలుతుంది.  ఈ భావన మనలోని గర్వాన్ని అధిగమించడానికి మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగుంది.  అదేమిటంటే, ఎదుటి వారి నుంచి గౌరవాన్ని పొందాలనుకోవడానికి కారణం అది మీకు తృప్తినివ్వడమే.  మీ సామర్థ్యం మీద మీకు పూర్తి నమ్మకం లేనప్పుడే, మీరు ఎదుటి వారి నుంచి పొగడ్తలను ఆశించి, దానివల్ల లభించే తృప్తిని కోరుకుంటారు.  మీ గురించి మీకు తృప్తి ఉన్నప్పుడు, ఇతరులు చేసే సన్మానాల అవసరమే ఉండదు.  ఆత్మ విశ్వాస లోపాన్ని గర్వంతో పెంచి పోషించుకుంటున్నామని పదే పదే గుర్తుచేసుకోవాలి.

సమర్థతకి స్వతః ప్రకాశం:
సామర్థ్యం కలిగి ఉండడం, దానిని వినియోగించుకోగలగడం మంచిదే.  కానీ, అది స్వతస్సిద్ధంగా ప్రకాశించాలి.  సువాసనలను వెదజల్లే అందమైన పువ్వులను విరగబూయించే చెట్టు, తానెక్కడున్నా, ఎవరు చూసినా, చూడకపోయినా,  తన పనిని తాను ఏ గుర్తింపు పొందాలనీ ఆశించకుండా నిర్వర్తిస్తుంది.  నేను విరగబూస్తున్నానొహో అని చాటింపు వేయించదు.  మీలోని ప్రజ్ఞాపాటవాలను, సామర్థ్యాలను మీరూ అలాగే వినియోగించాలి.  అవి మీకే ఎందుకు వచ్చాయి? దీనిపై ఎవ్వరూ సూటిగా సమాధానం చెప్పలేరు.  అందుకే దానిని భగవంతుని అనుగ్రహంగా భావించి, వినియోగించాలి. మీ విలువను గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించవచ్చు, లేనివారు పట్టించుకోకపోవచ్చు.  దేనికీ చలించ కూడదు.

ఈ అవగాహనతోనే వ్యక్తి గర్వాన్ని సునాయాసంగా అధిగమించగలడు.  నిగర్వి లో సంఘర్షణలకు తావులేదు.  వెలితి అసలే కానరాదు.  నిర్మలంగా ప్రశాంత చిత్తుడై ఉంటాడు.  ఈ పరిణతి ఆత్మ జ్ఞానానికి ఊతమిస్తుంది. 

ఈ నిర్మలత లేని వ్యక్తిలో దంభం చెలరేగుతుంది.  అది వ్యక్తిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.

--

ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

Kb Narayana Sarma

unread,
Dec 18, 2013, 2:12:37 AM12/18/13
to vijaya ramalaxmi, SD...@googlegroups.com, సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, sadh...@googlegroups.com, vem...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, sridh...@yahoo.com, Jayaraman VS, tangirala ramana, Uday Kiran
నమస్తే
వీలైతే మీరు ఒకసారి ఈ లింకు లో ఉన్న భగవత్ గీత 13వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు వినండి.  అది పూర్తిగా వినడానికి కూడా చాలా కష్ట పడాల్సి ఉంటుంది.  కొంత ఓపిక చేసుకుని వినండి.  చాలా విషయాలు అవగాహన అవుతాయి. 

ఇంకొక విషయం ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతం మీద పూర్తి నమ్మకం ఉన్నవారికి ధర్మాధర్మాల మీద ధ్యాస నిలకడగా ఉంటుంది.  అది లేని వారు మాత్రం ఎప్పటికీ డోలాయమాన స్థితిలోనూ లేక వ్యతిరేక భావనలతో ఉంటారు.  ఈ డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు తనకి అనుకూలంగా ఉన్న సంఘటనలను ధర్మాలుగాను అనుకూలంగా లేని సంఘటనలను అధర్మం గాను తీసుకోవడం జరుగుతుంది.  

ఇక మన జీవితం, జీవన స్రవంతి అన్నవి విడిచి పెట్ట బడిన బాణం వంటివి.  సత్ప్రవర్తనల వలన + భగవత్ భక్తీతో + దైవ కృప తో కొంత తీవ్రత తగ్గ వచ్చు.  దానికి భగవంతుని పాదాలను పట్టుకోవడమే శరణ్యం. 

గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలాలని అనుభవిస్తూ ప్రస్తుతం మనం చేస్తున్న కర్మల ఫలం రాబోయే జన్మలో ఎట్లా ఉంటుంది అన్న విషయం విశ్లేషించుకుంటూ ఒక సాత్విక మార్గంలో కర్మలను కొనసాగించడం వలన ఆ కర్మ ఫలాలు తరువాతి జన్మల గతిని నిర్దేశిస్తాయి. 

ఇక మీరు ధర్మం ఆచరించేవారికి ఈ లోకంలో ప్రశాంతత ఉండడం లేదు అన్నారు.  అది సరి కాదు.  కుచేలుడు ప్రశాంతత తో ఉండలేదా?   ధర్మం ఆచరించేవారికి ఉన్నంత ప్రశాంతత వేరెవ్వరికి ఉండదు.  ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది ఏమిటంటే ఆబద్ధాలు చెప్పేవాడు ఎవరికి ఏ విధంగా చెప్పాడో బాగా గుర్తు పెట్టుకోవాలి.  లేకపోతె ఇబ్బందుల్లో పడుతాడు. అదే సత్యాన్ని చెప్పే మనిషికి ఆ ఇబ్బంది ఉండదు.  

ఇక్కడ గుర్తుంచుకొన వలసిన ఇంకొక విషయం ఏమిటంటే పరీక్ష వ్రాసే వారికే ప్రశ్నా పత్రం ఇస్తారు.   వాళ్ళే కష్ట పడి చదువుకోవాలి.  వాళ్ళే పరీక్ష వ్రాయాలి.  అంతే కాని అందరికీ ఇవ్వరు కదా.  ఈ కష్టాలు, సుఖాలు అన్నవి పరీక్షలు మాత్రమే.  ఆయా పరిస్థితులలో మనము ధర్మ మార్గంలో నిలబడగలుగుతామా లేక చతికిల పడుతామా అన్నదే పరీక్ష.  అందులో ఉత్తీర్ణులైన వారు మాత్రమే మెట్లు ఎక్క గలుగుతారు.  పరీక్ష కోరుకొని వారికి అదే తరగతి.  లేదా క్రింది తరగతులు అయితే ఇంకా తేలికగా ఉంటాయి.  దిగడం కూడా చాలా తేలిక. 

ధర్మం అన్న విషయం పై మన గురువు గారి ప్రవచనాలు మీకు www.srichaganti.net అన్న సైట్ లో ఉన్నాయి.  మన పాత మెయిల్స్ పరిశీలిస్తే కూడా చాలా విషయాలు అందులో ఉన్నాయి.   ఒకసారి పాత మెయిల్స్ చూడండి.
ధన్యవాదాలతో,



2013/12/18 vijaya ramalaxmi <vrl...@gmail.com>
Namasthenandi!  

mi visleshana bagundi..ilage "dharmam-adharmam" gurinchina visleshana telusukovalani undi..manaki dharmam anipinchina vishayam avatalivariki adharmam anipinchinapudu dani valla upayogam emundi? dharmam aacharinchevariki ee lokamlo prasantata undatam ledu. 
 prasantata lenapudu  aa vyakti kontakalaniki..."ee dharmam valla upayogam ae matram ledani.." adi vidanade pramadam kuda untundi kada?

Kb Narayana Sarma

unread,
Jan 10, 2014, 3:56:14 AM1/10/14
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, vem...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, sridh...@yahoo.com, Jayaraman VS, tangirala ramana, Uday Kiran
2) డాంభికం తో తలనొప్పులు

తనలో లేని లక్షణాలని చెప్పుకోవడం దంభం.  అదే డాంబికం.  భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ఇరవై విలువలలో రెండోది అదంభిత్వం.  అంటే డాంబికం లేకపోవడం.

మొదట మనం చూసిన ‘మానిత్వం’ లో కూడా గొప్పలు చెప్పుకుంటారు.  కానీ, ఈ రెండింటి మధ్య చిన్న తేడా ఉంది.  మానిత్వమున్న వ్యక్తిలో ఏవో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి.  వాటిని గోరంతలు కొండంతలు చేసి, చెప్పుకోడానికి తాపత్రయ పడుతూ ఉంటారు.  కానీ, దంభం అనే అవగుణం ఉన్న వాడికి నిజంగా చెప్పుకోవడానికి ఏ సామర్థ్యమూ  ఉండదు.  విచిత్రమేమిటంటే ఏ గొప్పదనమూ తన వద్ద లేదని తెలిసినా కూడా తన గురించి తాను ఎక్కువగా చెప్పుకుని, అందరి దృష్టిని ఆకర్షించాలని తెగ తపన చెందుతుంతాడు.  చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఆగర్భ శ్రీమంతుడిలా చెప్పుకుంటూ ఉంటారు.  అలాగే, నాకు పలు భాషలు తెలుసుననీ, పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాసేశానని గొప్పలు చెబుతారు ఇంకొందరు.  నిజానికి, వేరే వారు వ్రాసిన పుస్తకాలకు డబ్బులిచ్చి, తమ పేరు పెట్టించు  కుంటారు. లేదా, గ్రంథ చౌర్యం చేసి, తమ పేరుతొ ముద్రించు కుంటారు.  ఎవ్వరూ ఇవ్వకపోయినా, కొన్ని బిరుదులను వారే తగిలించుకుని మురిసిపోతుంటారు.  అందరూ తనను ఆ బిరుదులతోనే గుర్తించాలని తెగ ఉక్కిరి బిక్కిరై పోతుంటారు.

 

ఇంతకూ, ఈ దంభం ఉన్న వారి గురించి లోతుగా పరిశీలిస్తే, వారిలో ఏ గొప్పా లేదన్న విషయం వారికి బాగా తెలుసు.  వారిలో వారికే నచ్చని, ఎవరూ మెచ్చని గుణాలున్నాయని కూడా వారికి ఇంకా బాగా తెలుసు.  అయినా, వాటిని కప్పి పుచ్చుకుని బయటకు ప్రగల్భాలు పలుకుతూ, చలామణి అయిపోదామని చూస్తుంటారు.  సందు దొరికినప్పుడల్లా వారి గురించి వారు డప్పు కొట్టుకుంటారు.

 

నన్ను అందరూ గుర్తించాలి.  లేదా కొందరైనా నన్ను పోగుడుతుండాలి.  అలా ఎంతకాలం కోరుకుంటారు.  అయినా, ఎదుటి వాళ్ళు కూడా ఎంత కాలం ఈ భజన చేస్తారు? వాళ్లకు మాత్రం విసుగు పుట్టదా?  ఈ విషయంపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే, క్రమేపీ దంభిత్వం తరిగి పోతుంది.

 

ఈ దంభిత్వంలో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది.  ఎదుటి వారు తనని గొప్పగా గుర్తించాలని కోతలు కోస్తూ పోతారు.  ఉన్నవీ లేనివీ అన్నీ తన గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు.  ముందేం చెప్పారో మరచిపోయి రెండో సారి దానికి భిన్నమైన అంశాలను చెప్పి, ఎదుటి వారికి అడ్డంగా దొరికిపోయే ప్రమాదముంది.  ఈ కోతలు కోయడానికి కూడా జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉండాలి.  లేకుంటే, యిట్టే పట్టుబడి పోయే ప్రమాదముంది.  ప్రగల్భాలు పలికేవాడు సమయం, సందర్భం చూసుకోవాలి.  అదే, అందరూ తనను గుర్తించాలనీ, పొగడాలనే ఆలోచనను అధిగమిస్తే చాలు అతడు ఇన్ని జాగ్రత్తలపై దృష్టి సారించనవసరం లేదు.  నిజం చెప్పే వాడిని నిద్రలో లేపి అడిగినా, ఒక్క మాటే చెబుతాడు.

 

కొందరిలో మానిత్వం, దంభత్వాలు ఉండక పోవచ్చు.  కానీ, వారిలో ఆత్మన్యూనతా భావం ఉండే అవకాశముంది.  పదిమందితో కలవలేకపోవడం, ఎదుటి వారితో నిస్సంకోచంగా మాట్లాడలేక పోవడం, పక్క వారితో బిడియంతో వ్యవహరించడం ఇవన్నీ కూడా వ్యక్తిలో ఆత్మన్యూనతా భావాన్ని ఎత్తి చూపుతాయి.  మానిత్వం, దంభిత్వంతో భేషజాలు పొడచూపుతాయి.  ఆత్మన్యూనతతో బిడియం తలెత్తుతుంది.  ఈ రెండు ఆథ్యాత్మిక సాధకుడికే కాదు, లౌకిక ప్రపంచంలో వ్యక్తిత్వ నైపుణ్యానికి కూడా అవరోధాలే.  వీటిని సరిగ్గా అర్థం చేసుకుని ఎదుగుదలకు పెద్ద పీట  వేయాలి!



2013/12/17 Kb Narayana Sarma <kbns...@gmail.com>

1) గర్వాన్ని అధిగమించడం ఎలా?

Kb Narayana Sarma

unread,
Feb 25, 2014, 2:08:27 AM2/25/14
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, vem...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, sridh...@yahoo.com, Jayaraman VS, tangirala ramana, Uday Kiran
3) హింసను వదలు ........ హంసలా బ్రతుకు 

"హింస" అంటే, బాధించడం, హాని కలగజేయడం.  దీనికి విరుగుడుగా భగవద్గీతలో శ్రీ కృష్ణుడు బోధించిన మూడవ విలువ "అహింస".

ఎందుకు అహింసా మార్గాన్ని అవలంబించాలి:
ఈ ప్రశ్నకు సమాధానం చాలా తేలిక.  ఇతరులు తనకు హాని కలిగించాలని, తనను బాధ పెట్టాలని ఏ వ్యక్తీ కోరుకోడు.  అలా జరిగే సందర్భం ఎదురైతే, అంగీకరించలేడు కూడా.  అంతెందుకు? ఇతరులు తన గురించి ఏమాత్రం కొంచెం చేదుగా మాట్లాడితేనే తట్టుకోలేడు.  సహించలేడు కూడా.  మరి, ఇదే న్యాయం అందరికీ వర్తిస్తుందనే ఇంగిత జ్ఞానం ఉంటే చాలు.  "అహింస" ఆధ్యాత్మికతకు మాత్రమె పరిమితమైన విలువ కాదు.  పటిష్టమైన సమాజానికి పునాది రాయి.  సమాజంలో హింసా ప్రవృత్తి పెచ్చు మీరితే, నీతి, నియమాలు లోపిస్తాయి.  రాక్షసత్వం ప్రబలుతుంది.  మొత్తం సమాజం అతలాకుతలమౌతుంది. ఇలా జరగ కూడదనే "అహింసా పరమోధర్మః" అని బోధిస్తుంది వేదం. 

అహింసను అవలంబించాలంటే ముఖ్యంగా సంస్కారం అవసరం.  మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో సంస్కారాన్ని పెంపొందించుకోవాలి.  నా నోరు, నా యిష్టం - నేనెలా మాట్లాడినా ఎదుటి వ్యక్తి పడాల్సిందేనన్న దురహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడడం, అవసరమున్నా, లేకున్నా ఇతరుల గురించి ఆరాలు తీయడం, వారు అలాగ, వీరు ఇలాగ అని లోడ లోడా వాగాడాన్ని వాచిక హింస అని అంటారు.

దీనికి విరుగుడుగా మన పూర్వీకులు "మంత్రం" అనే దండాన్ని ప్రయోగించారు.  ఖాళీ దొరికింది కదా అని లోడ లోడా వాగాకుండా, సమయాన్ని వృథా చేసుకోకుండా, మంత్రాన్ని, లేదా నామాన్ని స్మరించమని హితవు పలికారు.  అందుకే, "జిహ్వామే మధుమత్తమా, కర్ణాభ్యాం భూరి విశ్రువమ్" ఓ పరమాత్మా, నేను మాట్లాడే మాట తియ్యనిదై ఉండాలి.  హితకరమై ఉండాలి.  ఎవ్వరినీ నొప్పించకూడదు. చెవులతో ఎప్పుడూ శుభవాక్యాలనే వినాలి అని ప్రార్థించమంటుంది శాంతి వచనం.

వాగ్భూషణం భూషణం
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందని పెద్దల మాట.  ఈ సృష్టిలో ప్రతి జీవికీ నోరు ఉంది.  అది తినటానికే పనికొస్తుంది.  కానీ, మాట్లాడలేదు.  మాట్లాడే శక్తి ఒక్క మనిషికే ఉంది.  ఆ మాట అందరినీ దగ్గరకు చేర్చేదిగా ఉండాలే కానీ, కత్తిరించినట్లు, పుల్ల విరచినట్లు ఉండకూడదు.  మాట అణు బాంబు కన్నా ప్రమాదకరమైనది కూడా.  దానితో నిర్మాణం చేయవచ్చు.  నాశానమూ చేయవచ్చు.  అందుకే మాటను మంత్రంగా మార్చుకో.  రోజులో కొంత కాలం మౌనం వహించు అంటారు పెద్దలు.  వ్యక్తిలోని సంస్కారం తన మాట ద్వారా వ్యక్తమౌతుంది.  మాట్లాడవలసిన సందర్భంలో మౌనం పాటించడం, మౌనం వహించాల్సిన సమయంలో బడ బడా మాట్లాడడం - రెండూ ప్రమాదాలే.

"హితంగా మాట్లాడు.  మితంగా మాట్లాడు" అని చెబుతుంది వేదం.  ఈ విధమైన సంస్కారంతో హింసను దూరం చేసుకోవచ్చు.  అహింసను అలవరచుకోవచ్చు.  అలాగే, హాని కలిగించే విధంగా, ఇతరులను బాధ పెట్టేలా ప్రవర్తించడం కూడా హింసా ప్రవృత్తి అనే చెప్పాలి.  మనం చేసే ఏ పని అయినా, అది ఎవ్వరినీ బాధ పెట్ట కూడదు.  ఏ విధంగానూ హాని కలగజేయ కూడదు.  అందుకే 
"కాయేన వాచా మనసేంద్రియైర్వా     బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమియద్యత్ సకలం పరస్మై     నారాయణయేతి సమర్పయామి"
ఓ జగద్రక్షకా, నారాయణా! నా చేతులు, వాక్కు, మనసు, ఇంద్రియాలు, బుద్ధి అనే ఈ పరికరాలు వికృతం చెందకుండా, ప్రకృతి స్వాభావికములై ఉండాలి.  వీటి ద్వారా జరిగే సమస్త క్రియాకలాపాలు నీకు సమర్పణ చేసేవిగా, యోగ్య మైనవిగా ఉండాలని పరమాత్మను అనుగ్రహించ మంటుంది. 

"చేతులారంగ శివుని పూజించడేని,
నోరు నోవ్వంగ హరికీర్తి నుడువడేని
సంతత శ్రీహరి నామస్మరణ సలుపడేని......"
మాటకు, చేతకు రెంటికీ మూలం ఆలోచనే.  ఆలోచన అనే పదంలో లోచన శబ్దం ఉంది.  లోచనం అంటే కన్ను.  అందుకే, ఎవరైనా తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా, నీ కళ్ళు మూసుకు పోయాయా? అని ప్రశ్నిస్తారు.  కళ్ళు మూసుకోవడం అంటే, సంస్కార రహితమని, అహంకారమని అర్థం.  కాబట్టి, ఆలోచన అంటే, మనసులో కదిలే భావన.  అది శుద్ధమైనదిగా ఉండాలంటే సంస్కారం అవసరం.  భావ శుద్ధితోనే బయటకు వ్యక్తమయ్యే మాట, చేత రెండూ పరిశుద్ధంగా ఉంటాయి.  ఈ సంస్కారమే హింసను తప్పించడానికి, అహింసను అవలంభించడానికి మూలమై నిలుస్తుంది.

అహింసకు మూలం సంస్కారమని గుర్తించకుండా, కేవలం "అహింసా పరమో ధర్మః" అని మంత్రం వల్లె వేస్తె ఏ ప్రయోజనమూ కలుగదు.  సంస్కారంతో మాత్రమే హింసను వీడి, హంసలా బ్రతకవచ్చు.  దీనిని అలవరచు కోవడం ఆథ్యాత్మిక సాధకుడికి అత్యంత ప్రధానమైనదిగా చెప్పాలి. 

క్షాంతి గురించి మళ్ళీ ............
 

Kb Narayana Sarma

unread,
Apr 17, 2014, 11:27:59 PM4/17/14
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, vem...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, sridh...@yahoo.com, Jayaraman VS, tangirala ramana, Uday Kiran
4) శాంతమే ... సౌఖ్యము  

శాంతం అనేది సానుకూల దృక్పథం.  శాంతం వహిస్తాను అంటే, ఇబ్బందికరమైన సందర్భాలు ఎదురైనప్పటికీ కలత చెందకుండా వాటిని స్వీకరిస్తానని అర్థం.  పరిస్థితులు ఎలా ఉన్నా, వాటి ప్రభావాలకు తలవంచకుండా మానసిక సమతుల్యతను నిలబెట్టుకోవడమే 'శాంత' మనే విలువకు అసలైన లక్షణం.

క్షణికావేశాన్ని అధిగమించాలంటే ఆలోచనకు అవకాశమివ్వాలి.  ఆవేశానికి కాదు.  ఇదే సాధన.
 

మనుషుల స్వభావాలను అర్థం చేసుకోవడంలో ఈ విలువను పెంపొందించుకోవాలి.  ఏ ఒక్కరిలోనూ మీకు కావలసిన అన్ని మంచి గుణాలూ పోత పోసినట్లు ఉండవు.  మనిషి అంటేనే మంచి, చెడుల కలయిక.  ఆ మాటకొస్తే, మీరూ, నేనూ అందరమూ అంతే.  కొందరిలో మంచి ఎక్కువ నిష్పత్తిలో ఉండవచ్చు.  అయినంత మాత్రాన చెడు ఏ మాత్రం లేదని నిర్ధారించడానికి వీలులేదు.  "మచ్చ లేని పచ్చ, పుచ్చు లేని పగడం" దొరకడం దుర్లభమంటారు.  అలాగే, నూటికి నూరు పాళ్ళూ మంచితనం మూర్తీభవించిన ఓ వ్యక్తిని ఎక్కడైనా చూడగలమా..?  దూరపు కొండలు నునుపు అన్నట్లు ప్రతి వ్యక్తిలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయనే సత్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  ఈ విషయాన్ని గ్రహించగలిగితే, ఏ బంధంలో అయినా సరే, అవగాహనతో కూడిన సర్దుబాటు అవసరమని గ్రహించగలం.

ఎదుటి వాళ్లకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఎలా ఇష్టపడరో, అలాగే ఇతరులు కూడా మీకు కావలసినట్లుగా, నూటికి నూరు పాళ్ళూ మారలేరు.  ఎదుటి వారిలో మీకు కొన్ని విషయాలు నచ్చకపోతే ఎం చేస్తారు? వారిని దూరం పెట్టగలిగితే సరి.  ఒకవేళ వారు మీకు బాగా సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు లేక భార్య, భర్త, పిల్లలు అయితే, వారిలో మార్పు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తారు.  ఇది మంచి ప్రయత్నమే.  అంత మాత్రాన వారు పూర్తిగా మారిపోతారని నిర్ధారించకండి.  అది ఎంతసేపు నిలుస్తుందో చెప్పలేం కదా!

సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ చెలరేగి పోతున్నా, ఆ తాపాన్ని తగ్గించమని వేడుకొం.  అలాగే తేనెటీగ కుట్టినా, అది అందించే తేనే కోసం దానిని క్షమించేస్తాము.  అందమైన గులాబీ పువ్వుల కింద ముళ్లుంటే అది ప్రకృతి ధర్మం అని మనసారా స్వీకరిస్తాము.  కానీ, మనిషి వల్ల ఏ కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా, అసలు భరించలేము.  ఎందుకో తెలుసా...? లోపల అహం అడ్డు తగులుతుంది.  ఇది సూర్యున్ని, తేనే తీగను, గులాబీని అంగీకరించినట్లుగా సాటి మనిషిని
అంగీకరించనివ్వదు.  ఎందుకు ఈ తారతమ్యం?  ఎందుకు ఈ తిరస్కార భావం? ఇదే అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒక పెంపుడు కుక్క అభిమానంతో ఉన్నట్లుండి యజమాని పైకి దూకింది.  అది ముఖంపై దూకిన అదురుకి పెదవి గాయపడింది.  ఆ క్షణంలో వ్యక్తి పెదవిని చటుక్కున పట్టుకున్నాడు.  తన దృష్టి గాయం వైపు మరలిందే కానీ, కుక్కపిల్లను కనీసం మందలించలేదు.  అదే ఈయనను ఇంటిలోవాళ్ళే ఒక చిన్న మాట అంటే, చాలా రియాక్ట్ అయిపోతాడు.  ఈ తారతమ్యం ఎందుకు? కుక్కపిల్లను అంగీకరించగలిగిన వ్యక్తి, తోటి మనిషిని ఎందుకు అంగీకరించలేక పోతున్నాడు?  ఈ భావన నుండే వ్యక్తి ఎదగాలి.  దీనినే సాధన అంటారు.  సాధన అంటే మానసిక ఎదుగుదల.  ఇందుకు ఓ ఉపాయం చెబుతాను.  కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు.  నిజమే.  దానిని వారు మార్చుకోలేనప్పుడు వారిపై మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు.  తీవ్రంగా ప్రవర్తించే ఆ వ్యక్తి గుండె లోతుల్లోకి తరచి చూడగలిగితే, అతనిని పట్టి వేధిస్తున్న భావమేదో అర్థమవుతుంది.  ఆ భావానికి వెనుక ఉన్న బలహీనతను మీరు గుర్తిస్తే, క్రమంగా ఆ వ్యక్తితో సర్దుకు పోగలుగుతారు.  అయితే, ఇది అనుకున్నంత తేలిక కాదు.

ఇక్కడే ఓ చిక్కుముడి ఉంది.  మన మనసు అలా చూడనివాడు.  మన ఆలోచనల చుట్టూ ఇనుపగోడను కట్టివేస్తుంది.  ఆ సమయంలో మనకున్న జ్ఞానం, బుద్ధి, అనుభవాలు ఏవీ పనిచేయవు.  ఇవన్నీ తెర వెనుకకు వెళ్ళిపోతాయి.  సహనం, సర్దుబాటు అనే విలువలు తెరమరుగవుతాయి.  క్షణికావేశం కమ్ముకుంటుంది.  ఇంతే సంగతులు.....! దీనిని అధిగమించాలంటే, ఆలోచనకు అవకాశమివ్వాలి.  ఆవేశానికి కాదు.  సాధకుడిలో అవగాహన పెరిగితేనే శాంతిని పూర్తిగా ఆస్వాదించగలుగుతాడు.

శాంతి అంటే అవగాహనతో కూడిన సర్దుబాటు తత్త్వం.  అహింస, శాంతి - ఈ రెండూ సాధకులకు ముఖ్య లక్షణాలు.  శాస్త్రాలు అధ్యయనం చేయకపోయినా పర్వాలేదు కానీ, ఈ రెండు విలువలు మాత్రం సాధకులకు తప్పక దోహదపడతాయి.  ఎదుటి వారిలోని లక్షణాలను ఉన్నవి ఉన్నట్లుగా స్వీకరించి, వాళ్ళతో సర్దుబాటు తత్త్వం అలవరచుకోవాలి.  దీని ద్వారానే మనసులో సమతుల్యత నిలిచి ఉంటుంది.  ఆ సమతుల్యతను పెంపొందించుకోవడమే సాధన.  ఈ సాధనతోనే మనుషులు, పరిస్థితులు ఎలా ఉంటే అలాగే వాటిని స్వీకరించడాన్ని నేర్చుకుంటాడు సాధకుడు.  ఇదే శాంత స్థితి, సమతుల్యత.  శాంతమూ లేక సౌఖ్యమూ లేదు! అంటారు పెద్దలు.

'ఆర్జవం' గురించి మళ్ళీ..........

Reply all
Reply to author
Forward
0 new messages