ఉపనిషత్తుల సంక్షిప్త పరిచయం

2,345 views
Skip to first unread message

Kb Narayana Sarma

unread,
Aug 5, 2013, 7:21:34 AM8/5/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com
శ్రీ కళానిధి సత్యనారాయణ మూర్తిగారికి, "సంస్కృత మిత్ర" డా. రేమెళ్ళ అవధానులుగారికి, శ్రీ వేద భారతి, హైదరాబాద్ వారికి క్షమార్పణలతో

ఉపనిషత్తుల సంక్షిప్త పరిచయం
ప్రసిద్ధమైన 11 ఉపనిషత్తులు
సుమారు 200 ప్రశ్నలు - వాటి సమాధానాలు
శ్రీ వేద భారతి
'H' Block 34, Mdhuranagar
Hyderabad - 500038
Ph. No./Fax: 040-2381 2577
Mobile: 098494 59316 / shriveda...@gmail.com

వారి ప్రచురణ

శ్రీ వేద భారతి వారు వేద ప్రాచుర్యానికి ఎంతగానో శ్రమిస్తున్న వారు.
భగవంతుడు వారిపై సర్వదా ఆశీర్వచనాలు కురిపిస్తూ వారి ప్రయత్నాలని సఫలీకృతం చేయాలని ప్రార్థిస్తూ

ప్రకాశకుల ముందు మాట

శ్రీ వేదభారతి ద్వారా మేము లోగడ "ఉపనిషద్ రత్నావళి" అనే గ్రంధాన్ని నాలుగు భాగాలుగా ప్రచురించడం జరిగింది.  అందులో ఆదిశంకరులు వ్యాఖ్యానించిన పది ఉపనిషత్తులతో బాటు శ్వెతాశ్వతరోపనిషత్తు కూడా సంక్షిప్తంగా, సామాన్య పాఠకునకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో అతి తక్కువ సమయంలో జేరింది.  పరమేశ్వరుడి దయ వలన, ఉపనిషత్తులలోని ఆధ్యాత్మిక తత్వ బలం వలన, ప్రజాదరణ పొందింది.   నాల్గవ ముద్రణకు సిద్ధంగా ఉంది. 

ఉపనిషత్తుల సంఖ్య 108 గా ముక్తికోపనిషత్తు పేర్కొంది.  అందులో ప్రధానమైన ఉపనిషత్తులుగా ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులను పేర్కొంది.  దానికి కారణం ఈ ఉపనిషత్తులలో ఆధ్యాత్మ విద్య సమగ్రంగా ఉండటం, వీటిలో నాలుగు ఉపనిషత్తులలో మహా వాక్యాలు ఉండడమే కాక, సర్వ కాల సార్వజనీనమైన సూక్తులు ఉండటం వలన వీటిని ప్రధానమైనవిగా గుర్తించారు.

ఈ మహా వాక్యాలను, సూక్తులను పౌరాణికులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే పండితులు సందర్భోచితంగా ఉదాహరిస్తుంటారు. ఇవన్నీ వేదంలోనివే గనుక మన సనాతన ధర్మాన్నే బోధిస్తాయి.  అందుచే వీటన్నింటిని సేకరించి ఒక చిన్న పుస్తకంగా ప్రచురించి మన సనాతన ధర్మాన్ని సంక్షిప్తంగా అందరికి అందించాలనే భావం తోను, సందర్భోచితంగా వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటే అవి సరైన మార్గనిర్దేశం చేస్తాయనే తలమ్పుథోను, పిల్లలకు కంఠస్థం చేయిస్తే, వారికి భవిష్యత్తులో బాగా ఉపయోగిస్తాయనే అభిప్రాయంతోను ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము.

పెద్దలు చదివి పిల్లలకు కూడా భోధిస్తారనె ఆశతో, సనాతన ధర్మ ప్రచారమే ధ్యేయంగా అతి తక్కువ ధరకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం.  తెలుగు ప్రజలు ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

ప్రకాశకులు 
--

కళ్ళు మూసినప్పుడు దైవాన్ని ధ్యానంలోను,
కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ చూడగలిగితే సాధన సార్ధకమైనట్లు
ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.

Kb Narayana Sarma

unread,
Aug 5, 2013, 7:53:34 AM8/5/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com
ఉపనిషత్తులు అంటే ఏమిటి?
1. జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.
2. ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.
3. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండుట అని ఇంకొక అర్థము.

ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?
సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి.  అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది.

ఉపనిషత్తులను 'రహస్యం' అని ఎందుకు పిలుస్తారు?
'ఉపనిషత్' శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి 'రహస్యము' అను అర్థం.  రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే.  కాని దాని 'రహస్యం' అని అనం.  ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం.  ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం.  ఆత్మా అనేది 'నేను, నేను' అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు.  అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు.  ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.

ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలను వ్రాయండి?
1. జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం.
2. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.
3. జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.
4. అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే "గ్రంథం" అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన "విద్య" అని ఇంకొక అర్థం - ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.

"ఓం శాంతిః 
శాంతిః  శాంతిః" అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?
ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది.  వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.

శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మిక
దుఃఖాలు అంటారు.

పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక
దుఃఖాలు అంటారు.

అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక
దుఃఖాలు అంటారు.

పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాల
దుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.

పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః
ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా

శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?

శ్వేతాశ్వతరోపనిషత్తు

నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి? అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?

ఋగ్వేదం    - ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయోపనిషత్తు
యజుర్వేదం  - అహంబ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు
సామవేదం   - తత్వమసి - చాందోగ్యోపనిషత్తు
అథర్వణవేదం - అయమాత్మాబ్రహ్మ - మాండూక్యోపనిషత్తు
 


2013/8/5 Kb Narayana Sarma <kbns...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "VEMURI LAKSHMI NARAYANA" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to vemuri+un...@googlegroups.com.
To post to this group, send email to vem...@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/vemuri/CABjAiVzSOsk8O7cZVDMFP8g84Ah3meC6ho-UZ%3Dviq%2BuO-9BYxA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Kb Narayana Sarma

unread,
Aug 6, 2013, 6:40:13 AM8/6/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com
1. ఈశావాస్యోపనిషత్తు

ఈశావాస్యోపనిషత్తు ఏ వేదంలో  ఉంది?
ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలో ఉంది.

ఈశావాస్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఈ ఉపనిషత్తు 'ఈశావాస్య' అనే పదంతో ప్రారంభం అయ్యింది  ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది.   దీనినే ఈశోపనిషత్తు అని కూడా అంటారు.

ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?
ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి.

ఈశావాస్యోపనిషత్తు అందించిన ప్రధానమైన సందేశం ఏమిటి?
ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత 'నేను', 'నాది' అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనమనే ఉదాత్త సందేశంతో ప్రారంభామవుతుందీ ఉపనిషత్తు.

పరమాత్మ 'విశ్వవ్యాపి' అని చెప్పే మంత్రం ఏది?
ఈశావాస్య మిదగ్ం సర్వం
యత్కించ జగత్యాం జగత్
ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం.  ఈ దృశ్యమాన విశ్వం ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థం.
వివరణ: ఈ విషయం వేదంలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది.  ప్రసిద్ధమైన నారాయణ సూక్తంలో
"యచ్చ కించిజ్జగత్సర్వమ్ దృశ్యతే శ్రూయతే2పివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః"
అని ఉంది. 
ఈ ప్రపంచంలో కనిపించేది, వినిపించేది ఏది ఉందో, దాని లోపల, బయట ఉన్నవాడు నారాయణుడే (అంటే బ్రహ్మమే).  ఇలా అంతా బ్రహ్మ మయమే అని గ్రహించి మానవుడు ఆయన మీదే మనస్సు లగ్నం చెయ్యాలని సందేశం.

త్యాగం చెయ్యవలసిందని, పరుల ద్రవ్యాన్ని అపహరించ వద్దని చెప్పిన వచనం ఏది?
లోభం గర్హించదగింది అని చెప్పే మంత్రం ఇది.

తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనమ్

ఇది మొదటి మంత్రంలో రెండవ భాగం.  ఈ చరాచర ప్రపంచమంతా భగవన్మయమే అయినప్పుడు, ఈ వస్తువు నాది, నేను సంపాదించాను అనుకోవడం అజ్ఞానం.  భోగ్య వస్తువులను వేటినయినా తన ప్రయోజకత్వంతో సాధించాననే అహంకారంతో కాకుండా, భగవద్దత్తమైనవనే భావంతో, త్యాగ బుద్ధితో, అనాసక్తతతో అనుభవించుచూ ఎవరి ధనాన్ని ఆశించ వద్దు అని దీని అర్థం.

పరబ్రహ్మ పరిపూర్ణమూ లేక సంపూర్ణమూ అని చెప్పే శాంతి వచనం ఏమిటి?

బ్రహ్మ ఎప్పుడూ పూర్ణమే!

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతిః 
శాంతిః  శాంతిః

భగవంతుడు పూర్ణం (అదః పూర్ణం), ఈ విశ్వమూ పూర్ణమే (ఇదం పూర్ణం), పూర్ణమైన ఆ భగవంతుని నుండే ఈ పూర్ణమైన విశ్వం కూడా ఆవిర్భవించింది.  పూర్ణం నుండి పూర్ణమును పరిహరిస్తే మిగిలేదీ పూర్ణమే.
వివరణ: బ్రహ్మం నుండి నామ రూపాలుగా విశ్వం ఆవిర్భవించి నప్పుడు, మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు, విశ్వం బ్రహ్మంలో లీనమైనప్పుడు - అంటే అన్ని స్థితులలోనూ బ్రహ్మం పూర్ణమే.  విశ్వం అశాశ్వతం.  బ్రహ్మం శాశ్వతం.  విశ్వం శాశ్వతం అనుకోవడమే అవిద్య.  విశ్వం శాశ్వతం కాదని ఆధునిక సృష్టి సిద్ధాంతం కూడా చెపుతుంది.  ఆ విషయాన్ని వేల సంవత్సరాల నాడు వేదం ఈ మంత్రం ద్వారా సూచించింది.  సృష్టికి కావలసిన ద్రవ్యం ఏది అనే ప్రశ్నకు ఆధునిక శాస్త్రజ్ఞుల వద్ద సమాధానం లేదు.  బ్రహ్మమే - శుద్ధ చైతన్యమే ద్రవ్యంగా విశ్వావిర్భావం జరిగిందని ఈ మంత్రం ద్వారా సూచించి ఆధునిక శాస్త్రజ్ఞుల కంటే ఒకడుగు ముందరే ఉంది వేద విజ్ఞానం.

ఈ మంత్రం పిల్లలతో సహా అందరికి రావలసిన శుభకర మంత్రం.

పరమాత్మ యొక్క విశిష్ట లక్షణాలను వర్ణించే వచనం ఏమిటి?

ఆ వాక్యం ఇది:
  తదేజతి తన్నైజతి
  తద్దూరే తద్వంతికే
  త దంతరస్య సర్వస్య
  తదు సర్వస్యాస్య బాహ్యతః
ఇది ఈ ఉపనిషత్తులో ఐదవ మంత్రం.  దీని అర్థం - ఆత్మతత్వం చలిస్తుంది, చలించదు, దూరంగానూ ఉంటుంది.  జగత్తు లోపలా బయటా కూడా ఉంటుంది.  అలాగే పాండిత్యానికి పరిమితమైన వారికి అది దూరమే, యోగులకు దగ్గరే.
వివరణ:
ఆత్మ సర్వ వ్యాప్తం - తనలో నున్న ఆత్మతత్వం ఇతరులలో నున్న ఆత్మతత్వం ఒకటే అనే జ్ఞానం లోపించినపుడు గుడికి ఎంత దగ్గరగా నున్నా - అంటే ఎన్ని దేవాలయాలు సందర్శించినా, ఎంత పాండిత్యం సంపాదించినా దైవానికి దూరమే.  గుడికి దగ్గిర - దైవానికి దూరం అనే అర్థం వచ్చే ఆంగ్ల సామెత ఉద్భవించక ముందే ఈ విషయాన్ని ఉపనిషత్తు బోధించింది. ఆత్మావలోకనం చేసిన యోగులకు మాత్రమే ఆత్మతత్వం దగ్గరగా ఉంటుంది.

సర్వ వ్యాప్తమైన ఆత్మతత్వానికి అచంచలత్వం స్వాభావికం.  కాని మన ఇంద్రియాలు చలించేవి గనుక ఆ చలనం ఆత్మతత్వం మీద ఆరోపించి అది చలిస్తుందని మనం భ్రమలో ఉన్నాం.  అది పొరపాటని ఈ మంత్రం మొదట వివరించింది.

సకల జీవుల యెడల సౌభ్రాతృత్వాన్ని కలిగి ఉండాలని సందేశాన్ని అందించిన వచనం ఏది?

ఆ వచనం ఇది:
యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి
సర్వభూతేషుచాత్మానం తతో న విజుగుప్సతే
యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః
తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః

ఈ రెండు మంత్రాలు (6, 7) ఈ ఉపనిషత్తుకి గుండెకాయ వంటివి.  వీటి అర్థం ఇది:

"ఎవ్వడైతే ప్రపంచంలోని అన్ని ప్రాణులను ఆత్మస్వరూపుడగు తనలో చూచుచున్నాడో, అలాగే అన్ని ప్రాణులలోను ఆత్మ స్వరూపుడగు తనను చూచుచున్నాడో అతడు ఎవ్వరినీ ద్వేషించడు.  అలాగే బ్రహ్మజ్ఞాని అయినవాడు, సర్వాంతరాత్మగా ఉన్నది ఆ పరమేశ్వరుడే అని గుర్తెరిగి తనకు ఇతరులకు మధ్య భేద భావం పరిత్యజిస్తాడు.  అలాంటి వానికి శోకం గాని, మొహం గాని ఉండవు"

వివరణ:
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది భేద భావమే.  ఇది తొలగినపుడు వివాదాలకు, యుద్ధాలకు, ఉగ్రవాదానికి తావెక్కడుంటుంది? మత ఛాందస వాదం ఎక్కడ ఉంటుంది?  సర్వ మానవ సమానత్వం అన్నది అందరిలో నున్న పరమాత్మ ఒక్కడే అన్న ఉపనిషత్సూక్తిని గ్రహించిన వాళ్లలోనే కలుగుతుంది.

ఉపనిషత్సారం హిందువుల రక్తంలో ఉంది గనుక ఎన్నడూ మనం ఇతర దేశాల మీదకి దండయాత్ర చెయ్యలేదు.  అంటే కాక ఇతర దేశాల నుండి వచ్చిన అన్యమతస్తులకు ఆశ్రయం కూడా భారతదేశం కలిగించింది.

ఈశావాస్యోపనిషత్తు అందించిన సమన్వయ సిద్ధాంతం ఏమిటి?

ఏకాగ్రత సంపాదించి దేవతాజ్ఞానాన్ని అభ్యసించాలని పతిపాదించింది.  అలాగే భక్తీ, జ్ఞాన మార్గాలను విడివిడిగా కాక సమన్వయము చేసి ఆచరించాలని భోధించింది.  భార్య, పుత్రులు, సంపద - వీటి మీద వ్యామోహం వదలాలని ఉపదేశించింది.  దీనిని ఏషణాత్రయ పరిత్యాగం అంటారు, అలాగే సమాజ ప్రగతికి ప్రవ్రుత్తి మార్గంలోనూ, ఆత్మోధరణకు నివృత్తి మార్గంలో నిస్సంగంగాను ఉంటూ, ప్రవ్రుత్తి, నివృత్తి మార్గాల సమన్వయం పాటించాలి అని ఉపదేశించింది.

ఇలా ఆధ్యాత్మిక జీవనం, లౌకిక జీవనం పరస్పర విరుద్ధాలు కావని, వీటిని చక్కగా సమన్వయము చేసి పరిపూర్ణమైన జీవనం సాగించవచ్చుననే సమన్వయ దృక్పథాన్ని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది. 

ఈశావాస్యోపనిషత్తులోని చివరి ప్రార్థన ఏమిటి?

ఈ ఉపనిషత్తులోని చివరి ప్రార్థనా మంత్రము -

అగ్నే నయ సుపథా రాయే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ

అగ్నిదేవా! మమ్ము సరైన మార్గంలో, భాగ్యవంతులమగునట్లుగా నడిపింపుము.  నీవు అన్ని మార్గములను తెలిసినవాడవు. పాపము మమ్ములను చేరకుండునట్లుగా చేయుము.  నీకు అనేక ప్రార్థనా నమస్కారములను సమర్పించుచున్నాము.

 

Kb Narayana Sarma

unread,
Aug 7, 2013, 7:16:17 AM8/7/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com
2.  కేనోపనిషత్తు

కేనోపనిషత్తు ఏ వేదంలో, ఎక్కడ ఉంది?
కేనోపనిషత్తు సామవేదంలోని తలవకార బ్రాహ్మణంలో అంతర్భాగంగా ఉంది.  అందుచేత దానికి తలవకారోపనిషత్తనే నామాంతరం కూడా ఉంది.

కేనోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది? ఇందులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి?
"కేన" అనే పదంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవడం చేత కేనోపనిషత్తు అనే పేరు వచ్చింది.
నాలుగు భాగాలలో విభజింపబడిన ఈ ఉపనిషత్తులో 35 మంత్రాలు ఉన్నాయి.

కేనోపనిషత్తులోని శాంతి వాక్యం దేనితో ప్రారంభమవుతుంది?
"ఆప్యాయంతు మమాంగాని" నా జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఆరోగ్యంగా ఉంచమని పరమాత్మను ప్రార్ధించడంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది.

మానవులలోనే గాక స్థావర జంగమాలన్నింటి లోనూ ఆత్మ ఉన్నదని వేదాంతం చెప్తుంది.  అలాంటప్పుడు మోక్షం మానవునికొక్కనికే ఎందుకు సాధ్యం?
మానవునిలో మాత్రమె మనో బుద్ధ్యహంకారాలున్నాయి.  వాటి ద్వారానే మోక్షం సాధ్యం.  అవి ప్రకాశించాలంటే ఆరోగ్యమైన, దృఢమైన శరీరం అవసరం గనుక ఈ ప్రార్థన.  వేదాంతం శరీరాన్ని ఉపేక్ష చేయమని చెప్పదు; శరీరమే అంతా అనుకోకూడదని అంటుందంతే.

కేనోపనిషత్తులోని మొదటి మంత్రం ఏమిటి? అందులో ప్రస్తావించబడిన ప్రశ్నలేమిటి?  
కేనోపనిషత్తు లోని మొదటి మంత్రం -

కేనేషితం పతతి ప్రేషితం మనః
కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి

మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచిస్తుంది.  ఎవ్వని చేత ప్రేరేపింపబడి మనస్సు ఆయా విషయాలలో ప్రవర్తిస్తుంది? అన్నింటి కంటే శ్రేష్టమైనది ప్రాణం.  అది ఎవని చేత ఆజ్ఞాపింపబడి తన పనిని తాను చేసుకుపోతుంది? అలాగే మానవులు ఎవరిచేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నారు? కన్ను, చెవి, ఏ శక్తి చే నియంత్రించబడి వాటి పనులు చేసుకుపోతున్నాయి?

పైన ప్రస్తావించబడిన ప్రశ్నలకు సమాధానంగా ఈ ఉపనిషత్తు ఏమి చెప్తుంది?
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు జడమైనవి.  అందుచేత వాటికి క్రియాశక్తి ఉండదు.  కేవలం పనిముట్లు వంటివి.  పనివాడు వెనకాల ఉండి పనిముట్ల చేత పని చేయిస్తాడు.  పనివాడు చైతన్యవంతుడు.  అలాంటి చైతన్య శక్తి వల్లే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి.  ఆ చైతన్య శక్తి ఏది అన్నది వేదాంతంలో మౌళికమైన ప్రశ్న.  ఆ చైతన్య శక్తే ఆత్మ అని ఈ ఉపనిషత్తు చెప్తుంది.

ఆత్మ చేతనంగా ఉండి ఇంద్రియాల చేత తన శక్తితో పనిచేయిస్తుందంటే, ఇవన్నీ ఇలా పనిచెయ్యాలనే ఇచ్ఛ  ఆత్మకు ఉందా?
లేదంటుందీ ఉపనిషత్తు.  వాటికి దగ్గరగా ఉండడం వల్ల శక్తినిస్తుంది తప్ప అవి ఎలా పని చెయ్యాలి, ఒక మానవుని ప్రవర్తన ఎలా ఉండాలనేది ఆ మానవుని పూర్వజన్మ వాసనల మీద ఆధారపడి ఉంటుందని, ఆత్మ 'సాక్షి' మాత్రమేనని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది.

ఇంద్రియాలకు అగోచరమైన ఆత్మను మనో బుద్ధులతో తెలుసుకోగలమా?
అసాధ్యం అంటుందీ ఉపనిషత్తు.  శాస్త్ర జ్ఞానంతో కూడా అసాధ్యం అంటుంది.  ఏకాగ్రతతో ధ్యానం చేసి బ్రహ్మసాక్షాత్కారం చేసుకోవాలని బోధిస్తుంది.

సరియైన జ్ఞాని ఎవరు?
తనకు ఏమీ తెలియదనుకున్న వాడే జ్ఞాని.

యస్యామతం తస్య మతం
మతం యస్య న వేద సః
అవిజ్ఞాతం విజానతాం 
విజ్ఞాతమవిజానతామ్  (2,3)
ఎవరైతే తనకు తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును.  కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమె తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక.   ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు.  దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక. 

పరమాత్మ సాక్షాత్కారానికి ఏమేమి సాధనాలు కావాలి?
తపస్సు, శమదమాది సద్గుణాలు సాధనాలుగా ఉండాలి.

తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్ఠా వేదాః
సర్వాంగాని సత్యమాయతనం (4,8)

బ్రహ్మ సాక్షాత్కారానికి తపస్సు, శమ, దమాది సద్గుణ సంపత్తి, సత్యవ్రతం ముఖ్యమని వేదం ప్రతిపాదిస్తుంది.  తపస్సు శరీరానికి క్రమ శిక్షణ నిస్తుంది.  మనస్సుకు, ఇంద్రియాలకు ఏకాగ్రతను చేకూరుస్తుంది.  శమదమాలు అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తాయి.  ఇవన్నీ సత్య శోధనకు కావలసిన శారీరక,  మానసిక, ఇంద్రియ నియంత్రణాలు.

చివరగా మనందరికీ జ్ఞానోదయం కలగడానికి ఈ ఉపనిషత్తులో చెప్పిన కథ ఏమిటి?
చివరగా మనందరికీ జ్ఞానోదయం కలగడానికి చెప్పిన కథ ఒకటుంది.  రాక్షసులను జయించాం, మనకంటే గొప్పవాళ్ళు ఇంకెవ్వరు లేరని ఇంద్రుడు, అగ్ని, వాయువు మొదలైన దేవతలు అహంకరించారు.  వారికొక పాఠం చెప్పడానికి వారి ముందర ఒక యక్షుడు నిలబడతాడు.  అతని ముందర వీరి శక్తులేవీ పనిచెయ్యక భంగపడతారు.  చివరకు ఆ వచ్చిన యక్షుడే పరబ్రహ్మమని, ఆయనే తమకున్న శక్తునలనన్నింటినీ ప్రకాశింప జేస్తున్నాడని జ్ఞానోదయం అవుతుంది.

ఈ దేవతలందరూ మన ఇంద్రియాలకు ప్రతీకలు.  మన ఇంద్రియాలను పనిచేయించే శక్తి బ్రహ్మమని, అదే బ్రహ్మం మనలో జీవాత్మగా ప్రవేశిస్తుందని, అందుచేత మనకేదో స్వతంత్రమైన శక్తి ఉందని అహంకరించ కూడదనే సందేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది.   



2013/8/6 Kb Narayana Sarma <kbns...@gmail.com>

Kb Narayana Sarma

unread,
Aug 8, 2013, 6:11:30 AM8/8/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
3. కఠోపనిషత్తు

కఠోపనిషత్తు ఏ వేదానికి చెందినది?

కఠోపనిషత్తు కృష్ణయజుర్వేదానికి చెందినది.

కఠోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
కృష్ణయజుర్వేదానికి చెందిన వేదశాఖలలో ఒక వేద శాఖ పేరు '
కఠ'.  ఆ కఠ శాఖకు చెందిన బ్రాహాణములో లభిస్తున్న ఉపనిషత్తు గనుక దీనికి కఠోపనిషత్తు అనే పేరు వచ్చింది.  


కఠోపనిషత్తు లోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?
కఠోపనిషత్తులోని మంత్రాలు 2 అధ్యాయాలలొ, ఒక్కొక్క అధ్యాయంలో 3 విస్తరించి ఉన్నాయి.

ఈ ఉపనిషత్తులోని ప్రధాన పాత్రధారులెవరు?
నచికేతుడు, యమధర్మ రాజు ప్రధాన పాత్రధారులు.


కఠోపనిషత్తు లోని ప్రధాన ప్రశ్న ఏమిటి? దాని ద్వారా ఈ ఉపనిషత్తు అందించిన విషయమేమిటి?
నచికేతుడనే స్నాతకుడు యముణ్ణి 'మనిషి మరణించిన తరువాత ఏమీ మిగలదని కొందరు, మిగులుతుందని మరి కొందరు అంటారు; ఇందులో ఏది నిజమో నాకు ఉపదేశించండి' అని ప్రశ్నించాడు.  ఈ ప్రశ్నతో ప్రారంభం అయిన ఉపనిషత్తు సత్య స్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించి, దాన్ని దర్శించేటట్టు చేసే సాధన క్రమాన్ని కూడా వివరించింది.

ప్రేయోమార్గం, శ్రేయోమార్గం అంటే ఏమిటి?
భౌతిక స్థాయిలో సుఖంగా జీవించడం 'ప్రేయోమార్గం' అని, జీవిత సాఫల్యానికి (మోక్షానికి) కృషి చెయ్యడం 'శ్రేయోమార్గం' అని ఈ ఉపనిషత్తు పేర్కొంది.  భోగలాలసత్వానికి పెద్ద పీట వేసే ప్రస్తుత సమాజానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఈ మార్గాల వివరణ జరిగింది.

ఆత్మతత్త్వాన్ని గూర్చి యమధర్మరాజు చేసిన బోధ ఏమిటి?
శాశ్వతమైనది ఆత్మేనని, అది అణువుకన్నా చిన్నదని, అతి పెద్దదానికన్నా పెద్దదని, సూర్యచంద్రాదులు కూడా దాన్ని ప్రకాశింపజేయజాలరని, అది స్వయం ప్రకాశమైనదని, జీవి శరీరంలో ఉన్నప్పుడు అంగుష్టమాత్రంగా హృదయకుహరంలో జ్యోతి వలె ఉంటూ శరీరాన్ని చైతన్య పరుస్తుందని యముడు ఆత్మస్వరూపాన్ని (అది మాటలకందనిదే అయినా) వివరించాడు.  అక్కడితో ఆగలేదు.

లక్ష్య సాధన కొరకు యమధర్మరాజు ఇచ్చిన సందేశం ఏమిటి?   
నైతిక విలువలను పాటిస్తూ, శ్రేయోమార్గంలో పయనిస్తూ ఉంటే ఇంద్రియ నిగ్రహం సాధ్యమవుతుంది.  అప్పుడు ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరలించి అంతర్ముఖం చేసి సాధన చేస్తే ఆత్మావలోకనం సాధ్యమవుతుంది.   అయితే ఇది అంత సులభమైనది కాదు.  కత్తిమీద సాము లాంటిది.   అందుచేత, 'మేలుకో! ఉద్యుక్తుడవు కమ్ము! లక్ష్య సిద్ధి అయ్యే వరకు ఆగకు!' అని ప్రబోధించి యముడు ముగిస్తాడు.

మనోబుద్ద్యహంకారాల మీద, నైతిక విలువల మీద ఇంకా అనేక మౌలిక విషయాల మీద చర్చించి సదుపదేశాన్నిచ్చిన సమగ్రమైన ఉపనిషత్తు ఇది. 

చివరకు మిగిలేదేమిటి?
మరణానంతరం మిగిలేది ఆత్మ అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.

యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే
అస్తీత్యేకే నాయమస్తీతి చైకే
ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం
వరాణామేష వరస్త్రుతీయః (1.1.20)
"మనిషి మరణించిన తరువాత 'జీవి' ఉంటాడని కొందరు, ఉండడని కొందరు అంటారు.  ఏది నిజమో నీవే నాకు ఉపదేశించాలి" అని నచికేతుడనే బాల బ్రహ్మచారి, స్నాతకుడు యముణ్ణి వరంగా అడుగుతాడు.  ఈ ప్రశ్నతోనే అత్యాసక్తికరమైన విషయ వివేచనకు ఈ ఉపనిషత్తు తెరలేపుతుంది.

ఈ ప్రశ్నకు ఇప్పటికి కూడా అందరికి ఆమోదయోగ్యమైన సమాధానం దొరకలేదు.  చార్వాకుని వారసులైన ఆధునిక హేతువాదులు మరణించిన వ్యక్తిని దహనం చేసిన తరువాత బూడిద మిగుల్తుంది తప్ప జీవుడనే వాడు లేడంటారు.  తద్విరుద్ధంగా, వేదాంతం శరీరం నశ్వరమైనదని, శరీరి అంటే ఆత్మ శాశ్వతమైనదని, శిథిలమైన శరీరం వదలి సంచిత కర్మానుభావానికి వేరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటారు.  కొంచెం ఇంచుమించుగా ఈ వాదాన్ని అన్ని మతాలూ అంగీకరిస్తున్నాయి.

భోగాల స్వభావం ఏమిటి?
భోగములు అశాశ్వతం అని ఉపనిషత్తు వర్ణించింది.
శ్వోభావా మర్త్యస్య యదంత కైతత్
సర్వేంద్రియాణాం జరయంతి తేజః
(నీవు ఇస్తానన్న) భోగాలు శాశ్వతము కాదు.  మరుసటి రోజునే నశించవచ్చు.  అంతేకాక ఇవన్నీ ఇంద్రియాల సత్తువను నాశనం చేస్తాయి.  నచికేతుని ద్వారా ఈ ఉపనిషత్తు భోగలాలసత్వాన్ని నిరసించింది.  

సంపదలతో తృప్తి లభిస్తుందా?
సంపదలతో తృప్తి లభించదని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.

న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్త మద్రాక్ష్మ చేత్వా! (1.1.27)
ఆత్మతత్త్వాన్ని గూర్చిన విచారణ విరమిమ్చుకుంటే అనేక సంపదలు, భోగ్య వస్తువులు ఇస్తానని యమధర్మరాజు నచికేతుణ్ణి మభ్య పెడతాడు.  దానికి సమాధానంగా నచికేతుడు "సంపదతో మానవుడికి తృప్తికలుగదు.  ఒక సంపద సమకూరితే మరొక సంపద కావాలనిపిస్తుంది.  నీ దర్శనం సకల సంపదలూ కలుగజేసేదే కనుక నాకు సంపదల మీద ఆశలేదు" అని తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేస్తాడు.

గమ్యాన్ని చేర్చే మార్గాలేమిటి?
శ్రేయోమార్గం - ప్రేయో మార్గం అనే రెండు మార్గాలను ఉపనిషత్తు వివరించింది.

శ్రేయస్చ ప్రేయస్చ మనుష్యమేతః
తౌ సంపరీత్య వివినక్తి ధీరః (1.2.2)
జీవన యానంలో మానవుని ముందు రెండు మార్గాలున్నాయి.  మొదటిది శ్రేయోమార్గం - ఇది జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపుకు నడిపించి శాశ్వతానందాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తుంది.  రెండవది ప్రేయో మార్గం - ఇది ప్రియం కలుగజేసేది.  కర్మానుష్టానం ద్వారా కొంత అభ్యుదయం కలిగించినా అది అశాశ్వతము, దుఃఖ హేతువు అవుతుంది.

ఈ రెండు మార్గాల గుణ దోషాలను వివేచనాత్మకంగా పరిశీలించి వివేకవంతులు శ్రేయోమార్గాన్ని, మంద బుద్ధులు ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటారు. 

అజ్ఞానుల లక్షణం ఏమిటి?
ఆత్మ ప్రశంసకు పాల్పడడం అజ్ఞానుల లక్షణం.

అవిద్యయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పండితంమన్యమానాః (1.2.5)

అవిద్యారూపమైన ప్రేయోమార్గాన్ని ఎంచుకున్న అజ్ఞానులు తామే ప్రజ్ఞావంతులమని ఆత్మ ప్రశంసకు పాల్పడతారు.  వారి జీవితం ఒక గ్రుడ్డివాడిని మరొక గ్రుడ్డివాడు నడిపించినట్టుంటుంది.

'ఆత్మ విద్య' ఎలా లభిస్తుంది?
ఆత్మ విద్య తర్కానికి అతీతం గనుక గురువు అనుగ్రహంతోనే లభిస్తుంది.
నైషా తర్కేణ మతిరాపనేయా (1.2.9)

ఆత్మ విద్య తర్కంతో పొందరానిది.  బ్రహ్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే ఉపదేశించగలడు.

ఆత్మ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి?
నాశం లేకపోవడం ఆత్మా యొక్క ప్రధాన లక్షణం.
న హన్యతే హన్యమానే శరీరే (1.2.18)

శరీరం నశ్వరం.  ఆత్మ శాశ్వతం, శరీరం హతమైనా ఆత్మ హతం కాదు.

ఉపనిషత్తు ఆత్మను ఎలా వర్ణించింది?
చాలా చిన్న దాని కంటే చిన్నది - చాలా పెద్ద దాని కంటే పెద్దది - అని వర్ణిస్తుంది.
అణోరణీయాన్మహతో మహీయాన్ (1.2.20) - అని వర్ణించింది. ఆత్మ సర్వవ్యాపకమైన తత్త్వం అని దీని అర్థం.   

వేదాధ్యయనం తో ఆత్మ లభిస్తుందా?
వేదాధ్యయనంతో ఆత్మ లభించదు.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహూనా శ్రుతేన (1.2.23)
వేదాధ్యయనం వలన గాని, వేదాంత గ్రంథ పఠనం వలన గాని ఆత్మ లభించదు.  సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది.

ఆత్మను, శరీరాన్ని, ఇంద్రియాలను ఉపనిషత్తు వేటితో పోల్చింది?
రథం యొక్క ఉపమానంతో ఈ క్రింది విధంగా వర్ణిస్తుంది.

ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఇన్ద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్
ఆత్మేన్ద్రియమనోయుక్తమ్ భోక్తేత్యాహుర్మనీశిణః (1.3.3,4)

ఆత్మ రథికుడని తెలుసుకో.  శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఆ గుర్రాలు విషయాల వైపుకు పరుగులు తీస్తాయి.  ఇటువంటి శరీరేంద్రియ మనస్సులతో కూడిన జీవుడు భోక్త అని పెద్దలు అంటారు.

శరీరస్థుడైన ఆత్మ మనోబుద్దుల ద్వారా ఇంద్రియాలను నియంత్రించి, అవి విషయాల వైపుకు వెళ్ళకుండా చూచుకుంటేనే గమ్యం చేరతామని - అంటే ఆ విధంగా జాగ్రత్త పడినప్పుడే ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మవైపుకు మరలించడం సాధ్యం అని ఈ ఉపనిషత్తు చెబుతోంది! వేదాంత ప్రవచనాలలో తరచుగా ఉదాహరించే మంత్రం ఇది. 

మానవునిలోని స్థూల, సూక్ష్మాలు ఏవి?
ఇంద్రియాలు స్థూలం, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం.  స్థూలం నుండి సూక్ష్మాతి సూక్ష్మానికి ఆరోహణ క్రమం ఈ ఉపనిషత్తు ఇలా హృద్యంగా వర్ణించింది.

ఇంద్రియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః
మనసస్తు పరా బుద్ధిః బుద్ధే రాత్మా మహాన్ పరః (1.3.10)

ఇంద్రియాల కంటే వాటికి గోచరించే పదార్థాలు ఉత్కృష్టమైనవి; వీటికంటే మనస్సు, దాని కంటే బుద్ధి, దాని కంటే ఆత్మ సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ మైనవి; ఒక దాని కంటే ఒకటి ఉత్కృష్టమైనవి.

అలాగే మహాత్తత్త్వం కంటే (మొదట వ్యక్తమైన హిరణ్య గర్భుని కంటే) అవ్యక్తం (భీజరూపంలో నున్న అవ్యక్త విశ్వం) అంటే ప్రక్రుతి (Matter) ఉత్కృష్టమైనది, దాని కంటే పురుషుడు, అంటే ఆత్మ ఉత్కృష్టమైనది.  దాని కంటే ఉత్కృష్టమైనది ఇంకేదీ లేదని ఉపనిషత్తు ఈ విధంగా వర్ణించింది.

మహతః పరమవ్యక్తం, అవ్యక్తాత్ పురుషః పరః
పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతిః (1.3.11)

లక్ష్య సాధన విషయంలో  ఏమి బోధించింది?
ప్రతి మానవునకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యసాధనకు అలుపెరగని ప్రయత్నంతో ముందుకు సాగాలి.  ఆ లక్ష్యం ఆత్మావలోకనమే, అయితే అది కత్తి మీద సాము వంటిది అని పెద్దలు చెప్తారు.  అందుచేత మానవులారా! అవిద్య నుండి మేల్కొనండి, లేచి ఎన్ని కష్టాలెదురైనా, మహానుభావుల శిక్షణలో లక్ష్య సాధన చేసేటంత వరకు ఆగవద్దు.  ముందుకు పదండి అని ఈ ఉపనిషత్తు ఈ మాదిరిగా ఎలుగెత్తి ఉత్తేజ పరుస్తుంది.

ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్య వరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్కవయో వదంతి
'Arise! Awake! And stop not till the goal is reached' అని వివేకానంద స్వామి ఈ మంత్రం వల్ల ప్రభావితమై విశ్వమానవ లోకానికి ఎలుగెత్తి ప్రవచించాడు.

ఆత్మకు ప్రకృతి లక్షణాలు ఉంటాయా?
ఆత్మకు ప్రకృతి లక్షణాలైన రూప రస గంధాలుండవని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది .

ఆశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథా 2 రసం నిత్యం, అగన్ధవచ్చయత్ (1.3.15)
ఆత్మకు రూప, రస గంధాలు గాని, శబ్ద స్పర్శలు గాని ఉండవు.  అది శాశ్వతమైనది.

అంతరాత్మను దర్శించడానికి ఏమి చెయ్యాలి?
ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యాలి.

పరాంఛి ఖాని వ్యయత్రుణత్స్వయంభూః
తస్మాత్పరాజ్ పశ్యతి నాంతరాత్మన్
కశ్చిద్దీరః ప్రత్యగాత్మానమైక్ష
దావృత్తచక్షురమృతత్వమిచ్చన్ (2.1.1)

ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో ప్రవర్తించే విధంగా భగవంతుడు సృష్టించాడు. అందువలన అవి అంతరాత్మను చూడలేక పోతున్నాయి.  ధీరుడైన వాడు వాటిని నియంత్రించి అంతర్ముఖం చేసి అంతరాత్మను దర్శించుకుంటున్నాడు.

ఆత్మ పరిమాణం ఎంత?
పురుషుడు (ఆత్మ) అంగుష్ఠ మాత్రుడు.
అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి (2.1.12)

ఆత్మా బొతనవ్రేలన్త పరిమానమ్తో శరీర మధ్యంలో ఉంటుంది.   అంటే కాకుండా 'జ్యోతిరివ అధూమకః' పొగలేని జ్యోతిలాగ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించినది జీవాత్మ (embodied soul).

ఉపనిషత్తు శరీరాన్ని దేనితో పోల్చింది?
పదకొండు ద్వారాలు గల కోట వంటిది శరీరం అని ఈ విధంగా వర్ణించింది ఉపనిషత్తు.

పురమేకాదశ ద్వారం, అజస్యావక్రచేతసః
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే (2.2.1)

శరీరానికి పదకొండు ద్వారాలున్నాయి.  ఇది కూడా ఒక కోట లాంటిదే.  కోటలో రాజుగారిని దర్శించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో, ఎంత తహతహ లాడుతారో అలాగే శరీరంలో అంతర్నిహితంగా ఉన్న ఆత్మను పొందడానికి కూడా అంతే ప్రయత్నం, ఆసక్తి ఉండాలని, ధ్యానం చేసి ఆత్మను తెలుసుకున్న వానికి పునర్జన్మ ఉండదని, వర్ణనా రూపకంగా వివరిస్తుంది ఉపనిషత్తు. 


నేత్రాలు రెండు, కర్ణేంద్రియాలు రెండు, ముక్కు రంధ్రాలు రెండు, నోరు, నడినెత్తిన గల బ్రహ్మ రంధ్రం, నాభి, మల మూత్ర విసర్జన ద్వారాలు రెండు - మొత్తం పదకొండు ద్వారాలు శరీరానికున్నాయి.  మరణ సమయంలో ఈ ద్వారాల్లో దేని నుండైనా ఆత్మ నిష్క్రమించవచ్చును.  అయితే బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. 


ఏది నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది?
ప్రాణం పోవడం వల్ల మరణం సంభవించదు.  ఆత్మ నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది.

న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన
ఇతరేణ తు జీవంతి యస్మి న్నేతావుపాశ్రితౌ (2.1.5)

ప్రాణాపానాదులకు కూడా ఆశ్రయమైనది ఆత్మ.  దాని ప్రభావం వల్లే ప్రాణ వాయువు మొదలైనవి పనిచేస్తున్నాయి.  ఆత్మ నిష్క్రమిస్తే మరణం సంభవిస్తుంది.  మనిషి జీవించేది ఆత్మ వలన కాని ప్రాణాపానాదుల వలన కాదు, వాటి కంటే వేరైన ఆత్మ తత్త్వం ఉందని తాత్పర్యం.

అవ్యక్తాన్ని, వ్యక్తాన్ని ఉపనిషత్తు ఏ ఉపమానంతో వర్ణించింది?
వ్రేళ్ళు ఆకాశంలో, కొమ్మలు భూమిలో గల రావి చెట్టుతో పోలుస్తుంది.

ఊర్ధ్వమూలో అవాక్శాఖః
ఏషో 2 శ్వత్థః సనాతనః (2.3.1)

జనన మరణాలతో కూడుకున్న జీవితమే సంసారం. ఇది ఒక రావి చెట్టు లాంటిది.  మరి దీనికి మూలం ఎక్కడ? ఆకాశంలో.  అంటే అవ్యక్త పరబ్రహ్మంలో.  అందుచేత సంసారానికి వేళ్ళు ఆకాశంలో ఉన్నాయని అభివర్ణించింది.  అయితే ఈ సంసార జీవితం గడపటానికి కావలసిన విశ్వం క్రింద ఉంది.  అంటే సంసారానికి మూలమైన పరబ్రహ్మం పైన ఉండగా, కార్య రూపమైన విశ్వం, దానిలోని మానవులు మొదలైన జీవజాలం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంటాయి.  వేదాంత పరిభాషలో కారణమైన బ్రహ్మం పైన, కార్యరూపమైన జగత్తు క్రింద అని అభివర్ణించబడింది.  భగవద్గీత 15వ అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలలో ఈ మంత్రం కొంచెం మార్పుతో కనిపిస్తుంది.


2013/8/7 Kb Narayana Sarma <kbns...@gmail.com>

For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Kb Narayana Sarma

unread,
Aug 12, 2013, 5:24:04 AM8/12/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
4. ప్రశ్నోపనిషత్తు

ప్రశ్నోపనిషత్తు ఏ వేదానికి సంబంధించినది?
ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినది.

ప్రశ్నోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?    
సుకేశుదు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి అనే వారు ఆరుగురూ ఋషులు.  వారు పిప్పలాద మహర్షి నాశ్రయించి, సృష్టి క్రమాన్ని గురించి, ఇతర  గురించి మూడు ప్రశ్నలు, నిత్యమైన పరమాత్మ సంబంధమైన విషయాల మీద మూడు ప్రశ్నలు వేశారు.  ఈ ఆరు ప్రశ్నలకు పిప్పలాదుడిచ్చిన సమాధానములే ఈ ఉపనిశత్తులోని విషయాలు.  అందుచేత దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు వచ్చింది. 

ప్రశ్నోపనిశత్తులోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?

ప్రశ్నోపనిషత్తు లోని మంత్రాలు 6 ప్రశ్నలకు అనుబంధంగా విస్తరించి ఉన్నాయి.


ప్రశ్నోపనిషత్తు లోని ప్రధాన పాత్రధారులెవరు? 
పిప్పలాద మహర్షి,
సుకేశుడు, సత్యకాముడు, సౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి - ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు.

కబంధి అను ఋషి అడిగిన ప్రశ్న ద్వారా ఈ ఉపనిషత్తు ఏమి తెలియజేస్తోంది?
మొదట కబంధి ఈ ప్రాణి కోటి ఎక్కడ నుండి వచ్చింది?  అంటే సృష్టి ఎలా జరిగిందని ప్రశ్నించాడు.  దానికి సమాధానంగా పిప్పలాదుడు, ప్రజాపతి తపస్సుచేసి 'రయి', 'ప్రాణం' అనే రెండింటిని సృష్టించాడని, 'రయి' అంటే చంద్రుడు, అన్నం అని (matter); 'ప్రాణం' అంటే సూర్యుడు, అగ్ని (life force) అని, ఇందులో 'ప్రాణం' భోక్త, 'రయి' భోజ్యమని వివరించాడు.  మొదటిది స్థూలం, రెండవది సూక్ష్మం.  వీటి సంయోగమే సృష్టి అని తాత్పర్యం.  సూర్యచంద్రులు ఉండడానికి ఆకాశాన్ని కూడా సృష్టించాడని వేరే చెప్పనక్కర లేదు కదా!

భార్గవుడు అను ఋషి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఏమిటి?
తరువాత భార్గవుడు ఈ శరీరాన్ని చైతన్యపరచే దేవత ఎవరు?  అని ప్రశ్నించాడు.  దానికి పిప్పలాదుడు - ఈ శరీరం కర్మ కారణంగా పంచభూతాత్మకమై ఏర్పడుతుందని, శరీరం, ఇంద్రియాలు అన్ని జడమైనవని, వీటన్నిటిలోనూ అంతర్వాహినిగా ప్రాణం ఉండి వాటిని నడిపిస్తూ ఉందని వివరించాడు.  పరమాత్మ ఉత్క్రుష్టుడని, ఆయన మొదటి సృష్టి సమిష్టి రూపమైన హిరణ్యగర్భుడు, ప్రజాపతి లేక ఈశ్వరుడు. ఆయనే ఈ వ్యష్టిరూపమైన సృష్టిని చేశాడని, ఆయన ప్రాణంగా అన్నింటిలోను ఉంటున్నాడని వివరించాడు.

అశ్వలాయనుడు అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానం ఏమిటి?
తరువాత అశ్వలాయనుడు మూడవ ప్రశ్నగా 'ప్రాణం' ఎక్కడ నుండి వచ్చింది? అది ఈ శరీరంలో ఎలా పనిచేస్తుంది? అని ప్రశ్నించాడు.  దానికి పిప్పలాదుడు - పరమాత్మ ఛాయా రూపమే ప్రాణం అని, అది ప్రాణం, సమానం, అపానం, వ్యానం, ఉదానాలనే ఐదుగా విభజించుకుని శరీరంలో ఆయా స్థానాలలో ఉండి పనిచేస్తుందని శరీర విజ్ఞాన శాస్త్రాన్ని వివరించాడు.

సౌర్యాయణి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి ఏమిటి వివరించాడు?
నాల్గవ వాడైన సౌర్యాయణి, శరీరంలో ఏ అవయవాలు నిద్రిస్తున్నాయి? ఏవి నిరంతరం పనిచేస్తున్నాయి? స్వప్నానుభావం ఎవరిదీ? అనే ప్రశ్నలు వేస్తే పిప్పలాదుడు - జాగ్రత్ స్థితి, స్వప్న స్థితి, శుశుప్తి స్థితి అనే అవస్థాత్రయాన్ని, వాటిలోని విశేషాలను వివరించాడు.

సత్యకాముడు ప్రణవోపాసన గురించి అడిగిన ప్రశ్న ఏమిటి? దానికి పిప్పలాద మహర్షి చెప్పిన సమాధానం ఏమిటి?
జీవితాంతం నిశ్చలంగా నిర్విరామంగా ప్రనవోపాసన చేస్తె ఏ లోకాలు లభిస్తాయి? అనే ప్రశ్నను సత్యకాముడు అడిగాడు.

సత్యకాముడు వేసిన అయిదవ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాదుడు ప్రణవోపాసనకు సంబంధించిన విషయాలు వివరించాడు.

ఓంకారం అనేది అకార, ఉకార, మకారాల మేళవింపు.  అందులో అకారం మీద మాత్రమే దృష్టి ఉంచి ఉపాసన చేస్తే, సదాచార సంపన్నుల గృహంలో జన్మించి, లౌకిక సుఖాలు అనుభవిస్తాడు.  ఓంకారంలోని ఉకారాన్ని ఉపాసన చేస్తే, చంద్రలోకం చేరి అక్కడ సుఖాలు అనుభవిస్తాడు.  ఓంకారాన్ని ఉపాసించిన సాధకుడు సూర్యలోకాన్ని చేరుకొని మోక్షాన్ని పొందుతాడు.

సుకేశుడు అడిగిన ప్రశ్న ఏమిటి?  దానికి సమాధానంగా పిప్పలాద మహర్షి చెప్పినదేమిటి?
తరువాత ఆరవ ప్రశ్నగా సుకేశుదు 'పదహారు కళలతో వెలుగొందే ఆ పరమపురుషుడు ఎవరు?' అని ప్రశ్నించాడు.  దానికి పిప్పలాదుడు ఆ పదహారు కళలను వివరించి, అవి పరమాత్మ వ్యక్త స్వరూపమని, అశాశ్వతాలని, పరమాత్మ వీటన్నిటికి అతీతుడని చెప్పి పరమాత్మ అమృతత్వాన్ని వివరించాడు.

ఆరుగురు జిజ్ఞాసువులు సంతృప్తి చెంది, పిప్పలాద మహర్షికి నమోవాక్కాలర్పించి నిష్క్రమించారు. 

ప్రాణి కోటి విస్తరణ ఎలా జరిగింది?
ప్రాణం, దానికి కావలసిన ఆహారంతో ప్రాణికోటి విస్తరణ జరిగిందని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.
ఆదిత్యో హ వై ప్రాణో రయిరేవ చంద్రమాః
ఈ ప్రాణికోటి ఎక్కడినుండి ఉద్భవించింది? అన్న ప్రశ్నకు సమాధానంగా, ముందుగా ప్రాణ రూపమైన సూర్యుడు; ఆ ప్రాణం యొక్క కార్యకలాపానికి కావలసిన అన్నం (రయి) రూపంగా చంద్రుడు సృష్టించ బడ్డారని చెప్తుంది ఈ ఉపనిషత్తు.  సృష్టి క్రమంలో మొదటి ఘట్టం ఇది.  ప్రాణం, దానికి కావలసిన ఆహారం ఉంటే సృష్టి విస్తరిస్తుందని భావం.

ఉపనిషత్తు సంవత్సరాన్ని ఎలా అభివర్ణించింది?
సంవత్సరో వై ప్రజాపతిః తస్యాయనే దక్షిణం చోత్తరం చ (1.9)
సంవత్సరం అంటే ప్రజాపతే! ఆయనకు ఉత్తరాయణ, దక్షిణాయన మార్గాలుంటాయి. సూర్యచంద్రులు కాలానికి ప్రతినిధులు.  చంద్రుని వృద్ధి క్షయాల వల్ల తిథులు ఏర్పడుతున్నాయి.  సూర్యుని ఉదయాస్తమయాల వల్ల అహోరాత్రాలు, ఉత్తర, దక్షిణ గమనాల వల్ల అయనాలు ఏర్పడుతున్నాయి.  మరి వీరిద్దరిని సృష్టించిందెవరు!  ప్రజాపతి.  అందుచేత సంవత్సరం అంటే ప్రజాపతే అంటుందీ ఉపనిషత్తు.  ఆయనే కాలకారకుడు.  భారతీయ సంప్రదాయంలో కాలం పరబ్రహ్మ స్వరూపం.

శరీరానికి ఏది ఆధారం?
శరీరానికి ఆధారం ప్రాణం అని ఉపనిషత్తు నుదివింది. 

అరా ఇవ రథనాభౌ ప్రానే సర్వం ప్రతిష్ఠితం (2.6)

రథచక్రానికి నాభి ఉంటుంది.  దీన్ని కుంచం అని కూడా అంటారు.  ఈ నాభి మీదే చక్రం యొక్క ఆకులు ఆధారపడి చక్రాన్ని శిథిలం కాకుండా చూస్తాయి.  ప్రాణం శరీరానికి నాభి వంటిది.  జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనస్సు కూడా ప్రాణం మీదే ఆధారపడి ఉన్నాయి.  ప్రాణం ఉన్నప్పుడే కదా వేదోఛ్చారణ జరిగేది.

ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది?   
ఆత్మ నుండి ప్రాణం వచ్చిందని ఈ ఉపనిషత్తు చెబుతోంది.
ఆత్మన ఏష ప్రాణో జాయతే (3.2)

ప్రాణం ఆత్మ నుండే జనిస్తుంది.

పునర్జన్మ దేని మీద ఆధారపడుతుంది?
యచ్చిత్తస్తేనైష ప్రాణమాయాతి, ప్రాణస్తేజసా యుక్తః
సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి (3.10)

మరణ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతోనే ముఖ్య ప్రాణం సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది.  ఆ ఆలోచనకు అనుగుణమైన జన్మ లభిస్తుంది.  అందుచేత మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి .  మంచి వానికి చెడ్డ ఆలోచనలు, చెడ్డవానికి మంచి ఆలోచనలూ రావు.



2013/8/8 Kb Narayana Sarma <kbns...@gmail.com>

For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

Kb Narayana Sarma

unread,
Aug 13, 2013, 5:56:10 AM8/13/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
5. ముండకోపనిషత్తు

ముండకోపనిషత్తు ఏ వేదంలో ఉంది?
ముండకోపనిషత్తు అథర్వణ వేదంలో ఉంది.
 

ముండకోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ముండనం అంటే శిరసుపై జుట్టును తొలగించుట అని అర్థం. 
ముండనం చేయించుకోవడం ద్వారా, అన్ని కోరికలను పరిత్యజించి, మోక్షప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దీని కొరకు సన్న్యాసాన్ని స్వీకరించడం అనేది సంకేత రూపంలో తెలుప బడింది.  అటువంటి మోక్షేచ్చ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు గనుక ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది.

ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలున్నాయి? ఎన్ని అధ్యాయాలుగా ఉన్నాయి?
ఈ ఉపనిషత్తులో 64 మంత్రాలు మూడు అధ్యాలుగా ఉన్నాయి.

ఈ ఉపనిషత్తులో శౌనకమహర్షి అడిగిన ప్రశ్న ఏమిటి?
"దేనిని తెలుసుకుంటే సమస్తమూ అవగతమవుతాయో, అది ఏమిటి?"

పైన ప్రస్తావించబడిన ప్రశ్నకు అంగిరస మహర్షి ఇచ్చిన సమాధానం ఏమిటి?
"పరబ్రహ్మమును అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటే, సమస్తమూ అవగతమవుతాయి".

ఈ ఉపనిషత్తులో వివరింపబడిన సృష్టిక్రమం ఏమిటి?
అక్షర పరబ్రహ్మమే మూలకారణమని (material cause), దానినుండే నామరూపాత్మకమైన  ఆవిర్భావిమ్చిమ్దని (effect), మళ్ళీ అందులోనే లయం అవుతుందని, అది ఇంద్రియ  గోచరమ్కాదని,సృష్టిక్రమాన్ని వివరిస్తుంది. 
సద్గురువునాశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని ఉపదేశించి, ఉత్తమ గురువు లక్షణాలను కూడా ఈ ఉపనిషత్తు వర్ణిస్తుంది. 

విద్యలు ఎన్ని రకాలు? అవి ఏమిటి?
విద్యలు రెండు రకాలు - అపరా విద్య (lower knowledge), పరా విద్య(higher knowledge).  వేద వేదాంగాలు అపరావిద్యే! అందులో నిర్దేశించిన రీతిలో సాధన చేసి బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటే ఆ అనుభవమే పరావిద్య.  కేవలం పుస్తక పరిజ్ఞానానికి ఉపనిషత్తులు ప్రాధాన్యం ఇయ్యవు.

యజ్ఞ యాగాదులు (ఇష్టములు), పుణ్య కార్యాలు (పూర్తములు) చెయ్యడం వలన ఏమి పొందగాల్గుతారు? ఏమి పొందలేరు?
యజ్ఞ యాగాదులు, పుణ్యకార్యాలు చెయ్యడం వలన పుణ్యాన్ని సంపాదించుకొని, దాని ద్వారా, ఈ లోకంలో అఖండమైన కీర్తిని, భోగభాగ్యాలను, పరలోకంలో స్వర్గాది సుఖాలను పొందగల్గుతారు.  కాని వీటి ద్వారా మోక్షాన్ని పొందలేరు.

మోక్షం దేనివలన లభిస్తుంది?
ధ్యానమార్గం ద్వారానే మోక్షం లభిస్తుంది.

జన్మ రాహిత్యం లేక మోక్షం అంటే ఏమిటి?
జీవునికి సూక్ష్మ శరీరం ఉంటుంది.  దీనినే లింగ శరీరం అని కూడా అంటారు.  జీవుడు చేసే ప్రతి కర్మకూ, కర్మఫలం ఉంటుంది.  అది పుణ్య రూపంలోనో, పాపరూపంలోనో ఉంటుంది.  కర్మఫలాన్ని ఈ జన్మలో కొంత అనుభవించడం జరుగుతుంది.  మిగిలిన కర్మఫలాన్ని అనుభవించడానికి ఇంకా కొన్ని జన్మలను ధరించవలసి వస్తుంది.  ఆ జన్మలలో మరల క్రొత్త కర్మ ఫలాన్ని సేకరించుకుంటూ ఉంటాడు.  ఈ విధంగా జీవుడు జన్మ పరంపరలో చిక్కుకొని ఉంటాడు.

చివరకు ఏదో ఒక జన్మలో ధ్యాన మార్గాన్ని ఆశ్రయించి పరబ్రహ్మను గూర్చి తెలుసుకోవడం ప్రారంభించవచ్చు.   అపుడు కర్మ ఫలం క్షీణించడం ప్రారంభమవుతుంది .  మొత్తం కర్మఫలం క్షయమైనప్పుడు ఇంక జన్మ ఉండదు.  దీనినే జన్మ రాహిత్యం, లేక మోక్షం అంటారు.

ఆత్మను ఎవరు ప్రకాశింప జేస్తున్నారు?
ఆత్మ స్వయం ప్రకాషకుడు అని ఈ ఉపనిషత్తు ఉద్ఘోషిస్తుంది. 
సూర్యుడు స్వయంప్రకాశకుడు, ఆయన కాంతి చంద్రుని మీద వ్యాపించి చంద్రుడు ప్రకాశిస్తున్నాడని మనం అనుకుంటున్నాం (కారణం ఇది మన కంటికి కనిపిస్తుంది గనుక).  కాని మన చర్మ చక్షువుకు గోచరం కాని అసలు సత్యం దీనికి విరుద్ధమైనదని మనం తెలుసుకోవాలి.  బ్రహ్మమొక్కడే  స్వయంప్రకాశకుడు. ఆయన శక్తితోనే నక్షత్రాలతో సహా ఈ గోళాలన్నీ ప్రకాశావంతమవుతున్నాయి.  మనం దేవతా మూర్తులుగా భావించే ఈ గోళాలకే స్వయంప్రకాశకత్వం లేనప్పుడు అగ్నికి స్వయం ప్రకాశం ఎక్కడ? అన్నింటినీ చైతన్యవంతం చేసేది భాసింపజేసేది బ్రహ్మమే అని తాత్పర్యం.  ఈ మంత్రం కఠొపనిషత్తులోను, శ్వెతాశ్వతరోపనిషత్తు లోనూ కూడా ఉంది.

ఆత్మా సాక్షాత్కారం ఎవనికి సాధ్యం?
సాధన చేసే వానికే ఆత్మసాక్షాత్కారం సాధ్యము.
ఆత్మ సాక్షాత్కారం బలహీనునికి, ఐహిక వాంఛలలో ఉండే వానికి సాధ్యం కాదు (ప్రమాదం ఇదే).  విద్వాంసుడై ఉండి నిరంతర సాధన చేసే వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

జీవాత్మ పరమాత్మలను వర్ణించిన మంత్రం ఏది?
ఆ మంత్రం ఇది:
ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి
అనశ్నన్నన్యో అభిచాకశీతి (3.1.1)
ఎంతో అన్యోన్యంగా ఉండే రెండు పక్షులు ఒకే చెట్టుమీద కూర్చున్నాయి.  అందులో ఒకటి పళ్ళని ఆస్వాదిస్తూంది.  రెండవది నిర్లిప్తంగా చూస్తుంది.  ఈ రెండు పక్షులు జీవాత్మ పరమాత్మలకు ప్రతీకలు.  చెట్టు శరీరానికి ప్రతీక. జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తుంది.  దీనికి భిన్నుడు పరమాత్మ.  ఆయన నిష్క్రియుడు.  కర్మలను చెయ్యడం గాని, అనుభవించడం గాని ఆయనకు ఉండదు.  ఆయన స్సాక్షి మాత్రమే.  ప్రసిద్ధమైన ఈ మంత్రం ఈ తత్వానికి రూపకల్పన చేసింది.

ఆత్మజ్ఞానం సిద్ధించినపుడు ఏమి జరుగుతుంది?
ఆత్మజ్ఞానం సిద్ధించినపుడు కోరికలు, సంశయాలు నశిస్తాయి.
ఆత్మసాక్షాత్కారం అయిన వ్యక్తికి కోరికలు, సంశయాలు, కర్మలు నశిస్తాయి.  తన స్వస్వరూపం తెలుసుకున్న వాని స్తితిని ఈ మంత్రం హృద్యంగా వర్ణిస్తుంది.

అజ్ఞానుల పరిస్థితి ఏమిటి?
విద్యాగర్వంతో విర్రవీగడం అజ్ఞానుల ప్రధాన లక్షణం.
తాము బ్రహ్మజ్ఞానులమనుకొని విర్రవీగే మూర్ఖులు ఒక గ్రుడ్డి వానిచే తీసుకొని వెళ్ళబడే ఇంకొక గ్రుడ్డివాడు చిక్కుల్లో పడినట్లుగా జరామరణాలతో కూడిన జననమరణ వలయంలో తిరుగుతూ ఉంటారు.

భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉన్న 'సత్యమేవ జయతే' అనే వచనం ఎక్కడిది? పూర్తి వాక్యాన్ని, దాని అర్థాన్ని వివరించండి.
ఈ వచనం ముండకోపనిషత్తులోనిది. వివరాలు ఇవి

సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయానః (3.1.6)
సత్యమే గెలుస్తుంది.  అసత్యం ఎప్పటికీ గెలవదు.  సత్యవ్రతాన్ని నిష్ఠతో అనుష్టించిన వారు దేవయానంతో ప్రయాణించి పునర్జన్మ రహితమైన సత్యలోకం చేరుకుంటారు.  ఈ ఉపనిషత్తులోని 'సత్యమేవజయతే' అనే ఈ సూక్తి భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉండడం భారతజాతి గర్వించదగిన విషయం. 


2013/8/12 Kb Narayana Sarma <kbns...@gmail.com>

Kb Narayana Sarma

unread,
Aug 14, 2013, 4:31:08 AM8/14/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
6. మాండూక్యోపనిషత్తు

మాండూక్యోపనిషత్తు ఏ వేదంలో ఉంది?
మాండూక్యోపనిషత్తు అథర్వణ వేదంలోనిది.

మాండూక్యోపనిషత్తు అనే  వచ్చింది?
ఇందులో చెప్పబడిన విషయాలు సామాన్య క్రమ పద్ధతిలో గాక, కప్ప(మండూకము) గంతులు వేసినట్లుగా అనిపిస్తాయి గనుక ఈ ఉపనిషత్తుకు మాండూక్యోపనిషత్తు అని పేరు వచ్చింది.

ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు వున్నాయి?
ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలు ఉన్నాయి.  అతి క్లుప్తంగా ఉండడం వలన అర్థం చేసుకోవడం కష్టమని శ్రీ గౌడపాదులు దీనిపై నాలుగధ్యాయాల కారికలు వ్రాశారు.

ఈ ఉపనిషత్తు యొక్క విశిష్టత ఏమిటి?
ఈ ఉపనిషత్తు చదివితే చాలు, మోక్ష మార్గం సులభం అవుతుందని వ్యాఖ్యాతల అభిప్రాయం.  అవస్థాత్రయ అవగాహన ద్వారా పరమాత్మ ఉనికిని నిరూపించడం, ఓంకారం పరమాత్మ అనీ, పరమాత్మకు శబ్ద సంకేతమని కూడా వివరించడం ఈ ఉపనిషత్తు యొక్క విశిష్టత.

అథర్వణ వేదానికి చెందిన మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉందంటారు.  అది ఏది?
"అయమాత్మా బ్రహ్మ" అనే వాక్యం.  దీని అర్థం - "ఈ జీవాత్మయే పరబ్రహ్మము"

స్వప్నావస్థలో జీవుడు పొందే ఆనందం ఎటువంటిది?
జాగ్రదావస్థలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పని చేస్తూ ఉంటాయి; స్వప్నావస్థలో మనస్సు తన పని తాను చెయ్యడమే కాక, ఇంద్రియాల పని కూడా చేస్తుంది; సుషుప్తిలో మానసిక వృత్తులు కూడా పని చెయ్యవు గనుక, జీవుడు అవిద్య యొక్క ఆధీనంలో ఉండి ఆనందానుభూతిని పొందుతాడు.   అయితే అది శాశ్వతానందం కాదు.  మేల్కొన్న తర్వాత అంటా మామూలే.

ఈ ఉపనిషత్తు అందించే ప్రధాన సందేశం ఏమిటి?
మనం స్వప్న,సుషుప్తుల నుండి మేల్కొన్న తరువాత స్వప్న విశేషాలు, ఆనందం జ్ఞప్తికి తెచ్చుకుని చెప్పగలుగుతున్నాం.  అంటే ఈ అవస్థలకు దేనికి గురికాని తత్వం ఒకటి సాక్షీభూతంగా ఉందన్న మాట.  అదే జీవుడు.  ఈ మూడవస్థలూ దాటిన తర్వాత జీవుడు చేరేది తురీయావస్థ.  ఇది సమాధి స్థితి.  అనిర్వచనీయమైన ఈ అవస్థలో అవిద్య నశించి సంపూర్ణ జ్ఞానానందం కలుగుతుంది.  ఈ తురీయుడే ఓంకారం అంటుందీ ఉపనిషత్తు.

కల నుండి మేల్కొన్న తరువాత అది నిజం కాదని మనకు తెలుస్తుంది.  అలాగే ఈ జీవితం ఒక పెద్ద కల.  మోక్షప్రాప్తితో ఇది నిజం కాదని తెలుస్తుందని ఈ ఉపనిషత్తు ప్రధాన సందేశం.

ఓంకారం (ప్రణవం) యొక్క విశిష్టత ఏమిటి?
'ఓమిత్యేతదక్షరమిదగ్ం సర్వం!'(1)
ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సూచించాలంటే ఒక పదంతో సూచిస్తాం.  పదం శబ్ద స్వరూపం.  పదం చేత సూచించబడేది పదార్ధం, అనగా వస్తువు.   అందుచేత పదానికి పదార్థానికి - అంటే వాచకానికి, వాచ్యానికి అభేదమని పెద్దలు సూచించారు.

ఈ ప్రపంచంలో కనబడే వస్తువుకి, కనబడని వస్తువుకి కూడా ఒక శబ్దసంకేతం ఉండాలి.  అలాంటి శబ్దసంకేతమే 'ఓం'.  ఈ దృశ్యమాన విశ్వానికంతా 'ఓం' అనేది శబ్దసంకేతమ్.  అలాగే పరబ్రహ్మమ్ కూడా ఓంకారము చేతనే తెలియబడుచున్నది.  ఓంకారాన్ని ప్రణవమని కూడా అంటారు.  ఇది హిందూమతానికి మరియు భారతదేశంలో పుట్టిన జైన, బౌద్ధ, సిక్కు మతాలకు శబ్ద సంకేతంగానూ, పరమాత్మ సూచకంగానూ అతి పవిత్రమైనదిగా పరిగాణించబడుతూ ఉంది.  స్వరమూ ఓంకారమే అనే ఈ మంత్రంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది.  

'ఆత్మయే బ్రహ్మము' అని సూచించే మహావాక్యం ఏది?
'అయమాత్మా బ్రహ్మ' అనే వాక్యం జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని సూచించే అథర్వవేదానికి చెందిన మహావాక్యం. 

పరమాత్మ అనంతుడు (infinite).  జీవుడు శరీరంలో చేరినపుడు మనో బుద్ధులకు చేరువవడం వలన, జీవుడు తాన బ్రహ్మం కంటే వేరు అనుకొనే ప్రమాదం ఉంది.  దీన్ని ఉపాధి దోషం అంటారు.  ఈ భావన సరైంది కాదని చెప్పటానికి ఆత్మయే బ్రహ్మము - రెండూ ఒకటే అని ఈ మహావాక్యం ఉపదేశిస్తుంది.

అంతే కాకుండా జీవునికి, జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, తురీయావస్థ అనే నాలుగు అవస్థలు ఉంటాయి.  ఈ నాలుగు అవస్థలు జీవుని నాలుగు పాదాలని, అన్ని పాదాలలోనూ ఉండేది ఆత్మ అని, జీవాత్మకు, పరమాత్మకు చైతన్యాంశ లో భేదం లేదని ఈ మహావాక్యం సూచిస్తుంది.

'వైశ్వానరుడు' అంటే ఎవరు?
మనకు కనిపించే ప్రపంచం దృశ్య జగత్తు.  చూచేవాడు ద్రష్ట - ఈయనే జీవుడు.  ఈయనకు నాలుగు పాదాలని ఉపనిషత్తు చెపుతుంది.  ప్రథమ పాదం వైశ్వానరుడు. 
స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమపాదః (3)
ఈయన బాహ్య ప్రపంచంలోని విషయాలను గ్రహించి మనస్సుకు అందజేస్తాడు.  మనస్సు బుద్ధికి నివేదిస్తే, బుద్ధి నిర్ణయం ప్రకారం కర్మేంద్రియాలతో క్రియలను చేస్తాడు.  ఈయన మెలకువగా నున్నప్పుడు పనిచేసేవాడు గనుక వైశ్వానరుడని, విశ్వుడని పిలువబడతాడు - అంటే ఈ విశ్వం లోని స్థూల విషయాలను గ్రహించేవాడని అర్థం.

'తైజసుడు' అంటే ఎవరు?
'స్వప్నస్థానో అంతః ప్రజ్ఞః (4)
స్వప్నావస్థలో అంతః ప్రజ్ఞ తో సంచరించేవాడు అని దీని అర్థం.  స్వప్నావస్థలోని జీవుణ్ణి 'తైజసుడు' అంటారు.  అంటే జాగ్రదావస్థ లోని స్థూల శరీరంతో కాకుండా తేజోమూర్తుడై ఉంటాడు.   జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు పని చెయ్యవు.  మనస్సు మాత్రమే పనిచేస్తుంది.  ఇది స్వప్నావస్థ.  స్వప్నాలను చూస్తూ ఉంటాడు.  మరి స్వప్నంలో చూడడం, నడవడం, మాట్లాడడం, వినడం జరుగుతున్నాయిగా.  మరి ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి? అనే ప్రశ్నకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల పనులన్నీ మనస్సే చేస్తుందని సమాధానం.  ఇది జీవుని రెండవ పాదం.

'ప్రాజ్ఞుడు' అంటే ఎవరు?
యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి, తత్ సుషుప్తమ్ (5)
నిద్రించినప్పుడు ఏ విధమైన కోరికలూ ఉందని స్థితిని సుషుప్తి అంటారు.  గాఢనిద్రలో మనస్సు కూడా పనిచెయ్యదు.  ఈ అవస్థలో కేవలం అనిర్వచనీయమైన ఆనందానుభూతి మాత్రమె ఉంటుంది.  జీవున్ని ఈ స్థితిలో 'ప్రాజ్ఞుడు' అంటారు.  ఇది జీవుని మూడవ పాదం.

'తురీయుడు' అంటే ఎవరు?
'అమాత్రశ్చతుర్థో2 వ్యవహార్యః ప్రపంచోపశమః
శివో2 ద్వైత, ఏవమోంకార ఆత్మైవ (12)
'అ', 'ఉ', 'మ' అనేవి మూడు మాత్రలు, అనగా, అంశాలు.  ఈ మూడు కలిస్తే 'ఓం' అవుతుంది.  జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలు ఓంకారంలోని 'అ', 'ఉ', 'మ' అనే మూడు అంశాలు.  ఈ మూడు అంశాలు లేనిదే ఈ నాల్గవ అవస్థ అయిన తురీయావస్థ.  ఇది జీవుని నాల్గవ పాదం.  ఈ అవస్థలో వ్యవహారం గాని, జగత్తుతో సంబంధం గాని ఉండవు.  ఈ స్థితిలో కేవలం పరమానందంతో పరమాత్మలో ఐక్యం అవడం అని అద్వైతులు, పరమాత్మ సన్నిధిలో వైకుంఠంలో ఉండటం అని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు.


2013/8/13 Kb Narayana Sarma <kbns...@gmail.com>

Kb Narayana Sarma

unread,
Aug 16, 2013, 2:41:11 AM8/16/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
7. తైత్తిరీయోపనిషత్తు:

తైత్తిరీయోపనిషత్తు ఏ వేదంలో, ఏ శాఖలో ఉంది?
తైత్తిరీయోపనిషత్తు కృష్ణయజుర్వేదంలో తైత్తిరీయశాఖలో ఉంది.

తైత్తిరీయోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
తిత్తిరి పక్షుల ద్వారా గ్రహించబడి, ప్రకటించబడిన కృష్ణయజుర్వేదం లోని వేదశాఖకు తైత్తిరీయశాఖ అని పేరు వచ్చింది.  ఆ వేద శాఖలో ఉన్న ఉపనిషత్తు గనుక తైత్తిరీయోపనిషత్తు అని పేరు వచ్చింది.

తైత్తిరీయోపనిషత్తులో ఎన్ని భాగాలు ఉన్నాయి.
తైత్తిరీయోపనిషత్తు లో నాలుగు భాగాలున్నాయి.  అవి శీక్షావల్లి, ఆనందవల్లి, భ్రుగువల్లి, మహానారయణోపనిషత్తు.

శీక్షావల్లి లోని ప్రధానాంశాలు ఏమిటి?
శీక్షావల్లిలో వేదాభ్యాసంలో ముఖ్యమైన ఆరు అంశాలు వివరించబడ్డాయి.  విద్యార్థిగా అధ్యయనం, గృహస్థుగా అధ్యాపనం, అతిథి సత్కారం, నిత్యకర్మానుష్టానం, దేవపిత్రుకార్యాలు ధర్మాలని ప్రవచించింది .  విద్యార్థులు అధ్యయనం పూర్తి చేసుకుని గురుకులం వదలి గృహస్థాశ్రమం స్వీకరించబోయే సమయంలో వీడ్కోలుగా గురువిచ్చిన స్నాతకోపన్యాసం, జగత్ ప్రసిద్ధం, ఉత్తేజకరం, మన సనాతన ధర్మ సారం.

ఆనందవల్లి లోని ప్రధానాంశాలు ఏమిటి?
ఆనందవల్లి 'బ్రహ్మవిదాప్నోతి పరం' బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడనే ప్రసిద్ధమైన వాక్యంతో ప్రారంభంఅవుతుంది .  బ్రహ్మము నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి నీరు, దాని నుండి పృథివి, దానినుండి ఓషధులు (అన్నం), దానినుండి పురుషుడు ఉద్భవించారని సృష్టిక్రమాన్ని వివరించింది.  మానవునిలో అన్నమయకోశం, ప్రాణమయకోశం, మనోమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశాలనే కోశాలు - ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైనవి - ఉంటాయని, అందులో ఆనందమయకోశంలో ఆనందస్వరూపంగా పరమాత్మ ఉంటాడని వివరించింది.  పరమాత్మ వాన్జ్మానసులకు అవగతమయ్యే వాడు కాడని, సర్వోత్తముడని చెప్పి ఆనందంలో తరతమ భేదాలను విశదపరచింది.

భ్రుగువల్లిలోని ప్రధానాంశాలు ఏమిటి?
భ్రుగువల్లిలో, భ్రుగువు తన తండ్రి వరుణున్ని తనకు బ్రహ్మమునుపదేశించమని అర్థించగా, తండ్రి "అన్నం, ప్రాణం, చక్షువు, శ్రోత్రం, మనస్సు, వాక్కు దేనినుండి ఉద్భవిస్తున్నాయో, దేనివల్ల వర్ధిల్లి, దేనిలో లయం అవుతున్నాయో అదే బ్రహ్మము, దాన్ని తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలవు" అని ఉపదేశించాడు.  భ్రుగువు అలాగే తపస్సు చేసి ఆనందమే బ్రహ్మమని చిట్టా చివరకు తెలుసుకున్నాడు.  ఈ వల్లిలో, అన్నప్రశంస, అతిథి సత్కారం, సృష్టి మూలం, బ్రహ్మోపాసన మొదలైన విషయాలు చక్కగా వివరించ బడ్డాయి.

ఈ ఉపనిషత్తు స్వరయుక్తంగా ఉండడంవల్ల గానం చేస్తుంటే మనోరంజకంగా ఉంటుంది.

నారాయణోపనిషత్తులోని ప్రధానాంశాలు ఏమిటి?
ఈ ఉపనిషత్తు పరిమాణంలో చాలా పెద్దది అవడం చేతనూ, పరమాత్మను నారాయణ స్వరూపంగా వర్ణించే ఉపనిషత్తు కావడం చేతనూ, దీనిని మహానారాయణోపనిషత్తని పిలుస్తారు.
ప్రతి పూజలోను మనం పఠించే మంత్రపుష్పం మంత్రాలు, యతీశ్వరుల సన్నిధిలో పఠించే మంత్రాలు, సంధ్యావందనంలో వచ్చే మంత్రాలు, విరజా హోమ మంత్రాలు, దుర్గాసూక్త మంత్రాలు మొదలైన అనేక ప్రసిద్ధమైన మంత్రాలన్నీ ఈ ఉపనిషత్తులోనివే. 

వేద వేదాంగములను అధ్యయనం చేసి, వేదోక్తమైన కర్మలన్నింటినీ సంగ రహితంగా అనుష్టించి, ఆధ్యాత్మమార్గంలో సంపూర్ణంగా లీనమై, పరమాత్మ తత్వంతో తాదాత్మ్యం చెంది, తన దేహంలోని ప్రతి అణువణువునూ వేదవేద్యుడు, యజ్ఞస్వరూపుడూ అయిన నారాయణునికి సర్వ సమర్పణ చేస్తూ, ఆత్మసాక్షాత్కారాన్ని అనుభూతిపరంగా పొందే ఆదర్శవంతమైన ఒక మహాయోగి జీవన విధాన వర్ణన ఒక మహాద్భుత ఘట్టం.

ఆధ్యాత్మ మార్గంలో ఆసక్తి ఉన్న ప్రతివారూ తప్పక పఠించ వలసిన భాగం ఇది.  ఈ సన్నివేశంతో ఈ ఉపనిషత్తు ముగుస్తుంది.  కృష్ణయజుర్వేదానికి చెందిన తైత్తిరీయ శాఖలో ఈ ఉపనిషత్తు ఆఖరి పన్నం అవడం చేత ఈ వేదశాఖ కూడా దీనితో పూర్తయినట్లే అవుతుంది.

వేద మంత్రాల ఉచ్చారణ లోని అంతర్భాగాలు ఏమిటి? 
ఓం శీక్షాం వ్యాఖ్యాస్యామః | వర్ణః స్వరః | మాత్రా బలం | సామ సంతానః | ఇత్యుక్తః శీక్షాధ్యాయః | (1.2)
'శీక్షా' అంటే స్వరశాస్త్రం (science of phonetics).  వేద మంత్రాల అర్థం, ఫలితం కూడా స్వరం మీద ఆధారపడి ఉంటుంది .  అందుచేత ఈ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయంలో వేదోచ్చారణ పద్ధతి వివరించబడింది.  ఈ ఉచ్చారణలో భాగాలు (1) అకారాది వర్ణములు; (2) ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే స్వర భేదాలు; (3) హ్రస్వ, దీర్ఘ, ప్లుతము (నిబ్బర గమనం - steady pace) అనే మాత్రలు; (4) ఉచ్చరించునప్పుడు చేయవలసిన ప్రయత్న విశేషం - దీన్ని బలం అంటారు; (5) అతి వేగంగాను, మందంగాను కాక మధ్యస్థ వృత్తిగా పలకడం - దీన్ని సామం అంటారు; (6) అక్షరాలను అలసత్వం లేకుండా పలకడం - దీన్ని సంతానం అంటారు.  ఈ విధంగా మంత్రోచ్చారణ చెయ్యాలని వేదం శాసిస్తోంది.

గురు శిష్య సంబంధాన్ని ఈ ఉపనిషత్తు ఎలా వర్ణించింది?
ఆచార్యః పూర్వరూపం | అంతేవాస్యుత్తర రూపం | విద్యా సంధిః | ప్రవచనగ్ం సంధానం (1.3)
విద్యా విధానంలో ఆచార్యుడు మొదటి స్థానం; శిష్యుడు రెండవ స్థానం; వీరి కలయిక విద్య; కలిపేది బోధన.

మహా సంహితలు ఏమేమిటి?
ఈ క్రింది ఐదింటిని మహా సంహితలంటారు.
అధిలోకము; అధిజ్యౌతిషము; అధివిద్యము; అధిప్రజము; అధ్యాత్మము.

తైత్తిరీయోపనిషత్తు సంక్షిప్త పరిచయం ఇంకా ఉంది .....................................  












 



2013/8/14 Kb Narayana Sarma <kbns...@gmail.com>
...

[Message clipped]  

Kb Narayana Sarma

unread,
Aug 16, 2013, 6:41:50 AM8/16/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
7. తైత్తిరీయోపనిషత్తు ..  Contd.....

మనం తోటి వారితో  మాట్లాడాలి?
మనం తోటివారితో మధురంగా భాషించాలి. నా నాలుక నుండి ఎప్పుడూ మధురమైన భాషణములే వెలువడు గాక! తోటి వారిని నొప్పించే విధంగా మాట్లాడడం వేదం అంగీకరించదు.

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం - సత్యం చెప్పండి, ప్రియం చెప్పండి, కాని సత్యమైనా నొప్పించే విధంగా చెప్పవద్దు అనేది భారతీయ సంప్రదాయం.

అన్నం ప్రాధాన్యత ఏమిటి?
అన్నం శ్రేశ్ఠమైనది.  దానితోనే ప్రాణికోటి జీవిస్తున్నది.   అందుచేత అన్నదానం గొప్పది.  అన్నాన్ని వ్యర్థం చెయ్యకూడదు.

గృహస్థ ధర్మం ఏమిటి?
ధర్మాన్ని అనుసరిస్తూ, అధ్యయన, అధ్యాపనాలు చేస్తూనే సత్య సంధత, శమ దమాది సద్గుణాలు కలిగి ఉండాలని, అగ్ని కార్యాలు చేస్తూ అతిథులకు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని, తొమ్మిదవ అనువాకం గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంది.

సత్య ధర్మాల ప్రాధాన్యత ఏమిటి?
సత్యం వద | ధర్మం చర | అని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
సత్య సంధత, ధర్మాచరణ ఈ రెండింటికి భారతీయ సంస్కృతి అపార ప్రాధాన్యత నిచ్చింది.  అవి లోపిస్తే వచ్చే పరిణామాలను మనం ఇపుడు చూస్తున్నాం.

ప్రధాన  నిత్య, నైమిత్తిక కర్మలేమితి?
వాటిని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
దేవ ప్రిత్రు కార్యాభ్యాం న ప్రమదితవ్యం (1.11.2)
నిత్యం దేవతార్చన చెయ్యాలి.  ఇది నిత్య కర్మ. 
గతించిన తల్లితండ్రులకు ప్రతి సంవత్సరం ఆబ్దీకాలు విధిగా నిర్వహించాలి.  ఇది నైమిత్తిక కర్మ. 
ఇవి రెండూ గృహస్తు విధిగా నిర్వర్తించాలని వేదం శాసిస్తుంది.

మనం ఎవరెవరిని దైవ స్వరూపులుగా పూజించాలి?
వారి వివరణ ఉపనిషత్తులో ఇలా ఉంది.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ - అని జన్మ నిచ్చిన తల్లితండ్రులను, జ్ఞానబిక్ష పెట్టి జన్మను సార్థకం చేసిన గురువును, ఇంటికి వచ్చిన అతిథిని దైవ స్వరూపులుగా ఆరాధించమని వేదం ఆదేశిస్తొంది.

దానం ఎలా చెయ్యాలి?
దాన నియమాలను ఉపనిషత్తు ఈ విధంగా అభివర్ణించింది.

శ్రద్ధయా దేయం | ఆశ్రద్ధయా2 దేయం | శ్రియా దేయం | హ్రియా దేయం | భియా దేయం | సంవిదా దేయం |  (1.11.3)
దానం చేయవలసినప్పుడు శ్రద్దగా చెయ్యాలి; అశ్రద్ద పనికి రాదు.  తాహతును దృష్టిలో పెట్టుకుని వినయంతోను, భయ భక్తులతోనూ, ప్రీతి పూర్వకంగాను దానం చెయ్యాలి.

బ్రహ్మజ్ఞానం లభిస్తే పొందేది ఏమిటి?
'బ్రహ్మవిదాప్నోతి పరం' అంటే బ్రహ్మజ్ఞాని మోక్షాన్ని పొందుతాడు అని ఉపనిషత్తు చెబుతుంది. బ్రహ్మజ్ఞానం మోక్షానికి ప్రధానం గనుక ఈ వాక్యానికి ఉపనిషద్ వాంగ్మయం లో చాలా ప్రాధాన్యత ఉంది.

సృష్టి జరిగిన క్రమం ఏమిటి?
సృష్టి క్రమాన్ని ఉపనిషత్తు ఈ విధంగా అభివర్ణించింది. 
బ్రహ్మము నుండి ఆకాశము, దాని నుండి వాయువు, దాని నుండి అగ్ని, దాని నుండి నీరు, దాని నుండి పృథ్వీ, దాని నుండి ఓషదులు, వాటి నుండి అన్నము, దాని నుండి జీవజాలము ఉద్భవించాయని సృష్టి క్రమాన్ని హేతుబద్ధంగా తిరుగులేని విధంగా వేదం వివరించింది.

మాటలకు, మనస్సుకు ఆత్మ అందుతుందా? 
అందదు అని సమాధానం.  దాని వివరణ ఈ విధంగా ఉంది.
పరమాత్మను మాటలతో వివరించలేము.  మనస్సుతో ఆలోచించలేము.  అందుచేత అవి రెండూ కూడా పరమాత్మను చేరుకోలేక వెనుదిరుగుతాయి.   నిష్కామకర్మ,అచంచల భక్తీ, గురూపదేశం, నిరంతర ధ్యానమే పరమాత్మను చేరే మార్గాలని ఉపనిషత్తులు బోధిస్తాయి.

సృష్టికి పూర్వం ఏమి ఉండేది?
సృష్టికి పూర్వం అవ్యక్తం ఉండేది.
సృష్టికి పూర్వం ఈ నామ రూపాత్మక ప్రపంచం అవ్యక్తంగాఉంది.  ఆ అవ్యక్తం నుండే జగత్తుపుట్టింది.  మహా విస్ఫోటనం ముందు పదార్ధమేముందో శాస్త్రజ్ఞులు చెప్పలేక పోతున్నారు.  అవ్యక్తం ఉందని ఇక్కడ స్పష్టంగా వేదం చెప్తుంది.  అవ్యక్తం అంటే వ్యక్తం కాని ద్రవ్యం (matter) దీన్ని ప్రక్రుతి లేక ప్రధానం అంటారు.  దాన్ని వ్యక్తం చెయ్యడం భగవంతుని లీల.

పరమాత్మ ఆనంద స్వరూపుడు అని చెప్పే వాక్యం ఏది?
యద్వైతథ్సుకృతం| రసో వై సః (2,7)
అవ్యక్త బ్రహ్మం విశ్వంగా వ్యక్తమవడాన్ని సుకృతం అంటారు.  ఆ వ్యక్త బ్రహ్మమే రస స్వరూపి, ఆనంద హేతువు.  అవ్యక్తంగా ఉన్నప్పుడు ఎవరిని ఆనందపరచాలి? వ్యక్తమైనపుడు జీవజాలం ఉంటుంది.  ఆ జీవ జాలానికి వ్యక్త బ్రహ్మం ఆనంద స్వరూపంగామారుతుంది .  కావ్యం నిర్మాణం పూర్తయినప్పుడే కదా రసస్వరూపంగా మారుతుంది.

ఆనందాన్ని ఎట్లా కొలవాలి?
ఆసిష్ఠొ ద్రఢిష్ఠొ బలిష్ఠః | తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాస్యాత్ | స ఏకో మానుష ఆనన్దః (2.8)
సదాశాయము, బలము, ధృఢ చిత్తము కలిగిన వేద విదుడు, సాదు స్వభావుడు అయిన యువకునికి, సకల  పృథివీ అంతా చెందితే అతడు పొందే ఆనందం ఒక మానుష ఆనందం అని ఉపనిషత్తునిర్ణయించింది.  నిజానికి ఈ ఆనందం అత్యల్పం.  ఆరోహణ క్రమంలో పదకొండవది హిరణ్య గర్భుని ఆనందం.  ప్రతి మెట్టు దగ్గర క్రింది మెట్టు కంటే వంద రెట్లు పెరిగి హిరణ్య గర్భుని ఆనందం వరకు చేరుతుందీ ఆనందం.  తరువాత బ్రహ్మానందం.  ఇది ఎంత అన్నది ఎవరూ నిర్ణయించ లేదు గనుక, దాని పరిమాణాన్ని ఉపనిషత్తు ఇదమిత్థంగా చెప్పదు.

పరమాత్మ అంటే ఎవరు?
యతో వా ఇమాని భూతాని జాయంతే | యేన జాతాని జీవంతి | యత్ప్రయంత్యభిసంవిశంతి | తద్విజిజ్ఞాసస్వ | తద్బ్రహ్మేతి |(3.1)
పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఈ భూత జాలం ఎవని నుండి ఉద్భవించి, వృద్ధి పొంది చివరకు ప్రళయకాలంలో ఎవనిలో లీనమవుతున్నాయో ఆయనయే పరబ్రహ్మమని, లేక పరమాత్మ అని తెలుసుకో అని వరుణుడు తన కుమారుడైన భ్రుగువుకు ఉపదేశించాడు.  అదే అందరికి శిరోధార్యము.

'తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ' అంటే అర్థం ఏమిటి?
తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకో.  బ్రహ్మమును తెలుసుకొనుటకు తపస్సు మాత్రమే ఏకైక మార్గము, అని ఉపనిషత్తు ప్రవచిస్తుంది (3.2).

జీవజాలానికి ఆనందానికి అవినాభావ సంబంధం ఏమిటి?
ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ | ఆనన్దాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే | ఆనన్దేన జాతాని జీవన్తి | ఆనందం ప్రయంత్యభిసం విశంతీతి | (3.6) అని ఈ ఉపనిషత్తు ప్రవచిస్తుంది.  దాని అర్థం ఇది.

ఈ భూతజాలం ఆనందం నుండే పుట్టి, ఆనందం చేత వర్ధిల్లి ప్రళయకాలంలో ఆనందంలో లయమవుతున్నాయి గనుక ఆనందమే బ్రహ్మము, జీవజాలం యొక్క సృష్టి, స్థితి, లయాలకు కారణం.

ఆహారాన్ని వ్యర్థ పరచకూడదు అని చెప్పే వాక్యం ఏది?
అన్నం న నిన్ద్యాత్ | తద్ వ్రతం (3.7) అని ఉపనిషత్తు నందు అన్నాన్ని నిందించకూడదు, అది వేద విదుల వ్రతం.  ప్రస్తుత కాలంలో విందుల్లో ఆడంబరానికి అనేక పదార్థాలను పెట్టి చివరకు వ్యర్థ పరుస్తున్నారు.  అంతకన్నా పాపం లేదని గ్రహించాలి.

హరిత విప్లవం (Green Revolution) ఎప్పుడు మొదలయింది?
అన్నం బహుకుర్వీత | తద్ వ్రతం | (3.9)
అన్నాన్ని (ఆహార పదార్థాలను) విశేషంగా ఉత్పత్తి చెయ్యండి.  దాన్నే వ్రతంగా పెట్టుకోండి అని హరిత విప్లవాన్ని సృష్ట్యాది లోనే మన వేద విజ్ఞానం బోధించింది.

దీనులను ఆడుకోవడం మన కర్తవ్యం! అని బోధించిన వాక్యం ఏది?
'న కంచన వసతౌ ప్రత్యాచక్షీత | తద్వ్రతమ్ | తస్మాద్యయా కయా చ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్ |'(3.10)
నిరాశ్రయులు వస్తే వారికి ఆశ్రయం కల్పించాలి.  నీతి నియమాలతో కూడిన పద్ధతులలో ఎక్కువ ఆహారాన్ని సంపాదించి నిరాశ్రయులకు, అన్నార్తులకు పెడితే అలాంటి దాతకు వృద్ధాప్యంలో అన్నానికి లోటుండదు.



2013/8/16 Kb Narayana Sarma <kbns...@gmail.com>

Kb Narayana Sarma

unread,
Aug 19, 2013, 2:50:23 AM8/19/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
8. ఛాందోగ్యోపనిషత్తు

ఛాందోగ్యోపనిషత్తు ఏ వేదంలో, ఎక్కడ ఉంది?
ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలో, తలవకార బ్రాహ్మణం లో ఉంది.

ఛాందోగ్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఛన్దాంసి గాయంతి ఇతి ఛన్దోగాః -
ఛందస్సులను (వేదములను) గానము చేయుదురు గావున ఛందోగులు అంటారు.  లేక ఛందస్సు లను (వేదములను) అధ్యయనం చేయుదురు గావున ఛందోగులు అంటారు. 
ఛన్దోగులకు చెందినది గనుక చాన్దోగ్యమ్ అని పేరు వచ్చింది.
ఛందస్సు అంటే వేదము అని అర్థం ఉన్నా, సామవేదము అనే అర్థం రూడ్యర్థంగా గ్రహించబడుతుంది. అందుచేత సామవేదానికి చెందిన తలవకార బ్రాహ్మణము ఛాందోగ్య బ్రాహ్మణమని, అందులో భాగంగా ఉండుటచే ఈ ఉపనిషత్తును ఛాన్దొగ్యోపనిషత్తు అని అంటారు.

ఈ ఉపనిషత్తులోని మంత్రాలు ఎన్ని అధ్యాయాలలో ఉన్నాయి?
ఇందులోని మంత్రాలు 8 అధ్యాయాలలో విస్తరించి ఉన్నాయి.

సామవేదానికి చెందిన మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉందంటారు.  ఆ మహావాక్యం ఏమిటి?
ఈ ఉపనిషత్తులో  మహావాక్యం - "తత్త్వమసి".  దీని అర్థం - "అది (అంతటా వ్యాపించి ఉన్న చైతన్యం) నీవు అయి ఉన్నావు".

ఈ ఉపనిషత్తు లోని ప్రత్యేకత ఏమిటి?
ప్రయోగాలతో సత్యాన్ని నిరూపించడం ఈ ఉపనిషత్తులోని ప్రత్యేకత.

ఛాందోగ్యోపనిషత్తులోని  కథలలోని ప్రధాన పాత్రధారులెవరు?
ఈ ఉపనిశత్తులోని కథలలో ప్రధాన పాత్రధారులు - సత్యకాముడు, శ్వేతకేతువు-ఉద్దాలకుడు, నారదుడు-సనత్కుమారుడు, ఇంద్రుడు-విరోచనుడు-ప్రజాపతి, మొదలైనవారు.

సత్యకాముని కథలోని ప్రధానమైన అంశం ఏమిటి?
ఆభిజాత్యం కంటే గుణం, జిజ్ఞాస ప్రధానమని సత్యకాముడి కథ ఉపదేశిస్తుంది.  ఇంద్రియాలనన్నిమ్తిని చైతన్యపరచేది ప్రాణం గనుక, అది ఉత్క్రుష్టమైనదని మరొక కథ నిరూపిస్తుంది.

గురుకుల వాసం  రాగానే  శ్వేతకేతునికి అతని తండ్రి ఉద్దాలకుడు వేసిన మౌలికమైన ప్రశ్న ఏమిటి?
"ఏ విద్యను అభ్యసించటం వలన వినశక్యం కానిది వినగలమో, చూడ శక్యం కానిది చూడగలమో, తెలియశక్యం కానిది తెలుసుకోగలమో, ఆ విద్యను మీ గురువు వద్ద నుండి అభ్యసించావా? అని ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతుని ప్రశ్నించాడు.  ఈ ఉపనిషత్తులో ఈ ప్రశ్న తోనె సత్యశోధన మొదలౌతుంది.

కారణాన్ని (cause) తెలుసుకుంటే కార్యం (effect) సులభగ్రాహ్యం అవుతుందనడానికి ఉపమానాలేమిటి?
మట్టి ముద్దను తెలుసుకుంటే దాని నుండి ఏర్పడిన కుండ మొదలయిన వికారాలు తెలుస్తాయి.   బంగారాన్ని తెలుసుకుంటే దానితో తయారైన ఆభరణాలు తెలుస్తాయి.  కార్య రూపమైన (effect) కుండ, ఆభరణాలు అసత్యం - అవి మార్పుకు లోనవుతాయి, అశాశ్వతం గనుక.  కారణ రూపమైన (material cause) మట్టి ముద్ద, బంగారం సత్యం.  అవి మార్పుకు లోను కావు.  శాశ్వతం గనుక.  అలాగే నామ రూపాత్మకమైన విశ్వం అసత్యం, అనిత్యం; కారణ రూపమైన బ్రహ్మము సత్యం అని నిరూపించడానికి ఈ ఉపమానాన్ని వేదాంత శాస్త్రంలో ఉదహరిస్తారు.  ఇదే దాని ప్రాముఖ్యం.

భేదాలు ఎన్ని రకాలు? అవి ఏవి?
వేదాంతం మూడు రకాల భేదాలను ప్రస్తావిస్తుంది.  మొదటిది 'స్వగత భేదం' - అంటే ఒక చెట్టు ఉందనుకోండి - దానిలో అంతర్భాగంగా ఉండే ఆకులు, పువ్వులు, కాయల నుండి చెట్టును వేరుగా పరిగణించడం; రెండవతి 'సజాతీయ భేదం' రెండూ చెట్లే అయినా మామిడిచెట్టు- వేపచెట్టు రెండూ వేరు వేరు; మూడవది 'విజాతీయ భేదం' కొండ కంటే నది వేరు.  ఇక్కడ జాతి భేదం ఉంది.  అద్వితీయం, నిరాకారం, నిరవయవం, నిర్గుణమైన బ్రహ్మానికి ఈ మూడురకాల భేదాలు ఉండవు.

బ్రహ్మ మొక్కటే! అని చెప్పే వాక్యం ఏది?
ఏకమేవ అద్వితీయం (6.2.1) అంటే సద్వస్తువు ఒకటే.  దానిని పోలిన మరొక వస్తువు లేదు.  మనవలె దానికి అవయవాలు లేవు గనుక స్వగత భేదం లేదు.  మట్టి ముద్దకు బంగారపు ముద్దకు స్వగత భేదాలు లేవు.  వాటి నుండి ఉత్పన్నమైన వస్తువులకు స్వగత భేదాలు ఉంటాయి అని ఉపనిషత్తు ప్రవచించింది.

అనేక జీవరాశులతో కూడిన ఈ సృష్టి పరమాత్మ సంకల్పం అని చెప్పే వాక్యం ఏది?
బహు స్యాం ప్రజాయేయేతి (6.2.3) అనే వాక్యం!
సృష్టికి పూర్వం ఏకంగా ఉన్న బ్రహ్మము తన మాయా శక్తి చేత అనేక జీవరాశులతో కూడిన, నామ రూపాత్మకమైన విశ్వంగా (బహుస్యాం) కావలెనని సంకల్పించింది.  అట్లు విశ్వంగా వ్యక్తమై అందులో ప్రవేశించి నామ రూపాలను అభివ్యక్తం చేసింది, చైతన్యవంతం కూడా చేసింది.

'తత్త్వమసి' అనే మహా వాక్యం యొక్క అర్థం ఏమిటి?
సద్వస్తువు - అంటే, ఆత్మ - అణు ప్రమాణమైనది - కంటికి కనబడదు.  దాని నుండే ఈ విశ్వం వ్యక్తమైంది.  దాని కంటే ఇతరము లేదు.  అందుచేత ఆ ఆత్మ నీవే!  You are that తత్త్వమసి అనేది ఒక మహా వాక్యం.  అద్వితీయమైన వేదాంత విషయాన్ని విశద పరచే వాక్యాలను మహా వాక్యాలంటారు (Great Sentence).  అవి నాలుగు.  అన్నీ కూడా ఆత్మ యొక్క ఏకత్వాన్ని సూచిస్తాయి.  

తెలుసుకొన వలసినది ఏది?
తెలిసికొనదగినది విజ్ఞానము.
యదా వై విజానాత్యథ సత్యం వదతి నావిజానన్ సత్యం వదతి (7.17.1)
విజ్ఞానం తెలిసికొనదగినది.  అపుడే సత్యం చెప్పడం సాధ్యం.  విజ్ఞానం అంటే ఏమిటి? జీవ జాలంలో ఆత్మతో బాటు ప్రాణం కూడాఉంటుంది.  ఇలా ప్రాణం కూడా సర్వత్ర ఉన్నందువల్ల ప్రాణాన్నే ఆత్మఅనుకుంటారు.  అది అజ్ఞానం.  మనిషి నడుస్తోంటే నీడ అనుసరిస్తుంది. కాని నీడ అసత్యం, మనిషి సత్యం.  అట్లే నామ రూపాత్మకమైన ప్రాణం అసత్యం, ఆత్మ సత్యం.  ఈ అవగాహన ఉన్నవాడే విజ్ఞానం ఉన్నవాడు.  అతడే సత్యాన్ని చెప్పగలడు.  ఆత్మ చైతన్య స్వరూపం.  ప్రాణం (bio-energy) జడం.  అందుచేత ఆత్మజ్ఞానమే నిజమైన విజ్ఞానం.

శరీరం అశాశ్వతం అని చెప్పే మంత్రం ఏది?
మఘవన్మర్త్యం వా ఇదగ్ం శరీరమాత్తం మృత్యునా (8.12.1)
ఆత్మతత్త్వం గురించి బోధించ వలసినదిగా ఇంద్రుడు ప్రజాపతి వద్దకు వచ్చి అర్థించినప్పుడు ప్రజాపతి అన్న మాటలివి.  'ఇంద్రా! మరణ ధర్మం  కలిగిన శరీరం - అశాశ్వతం; అది ఆత్మకు భోగాధిష్ఠానం.  అందుచేత శరీరమే ఆత్మ అనుకొని శరీరాన్ని సుఖ పెడుతూ భోగలాలసత్వంలో ఉండడం అవివేకం' అని ఉపదేశిస్తాడు.  

Kb Narayana Sarma

unread,
Aug 20, 2013, 6:08:55 AM8/20/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
9. ఐతరేయోపనిషత్తు

ఐతరేయోపనిషత్తు ఎ వేదం లోనిది?
ఐతరేయోపనిషత్తు ఋగ్వేదం లోనిది.

ఐతరేయోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
"ఇతర" అను పేరు గల స్త్రీ యొక్క కుమారుని పేరు ఐతరేయుడు.  ఇతని పూర్తీ పేరు మహీపాల ఐతరేయుడని కొందరు, మహీదాస ఐతరేయుడని మరి కొందరు పేర్కొంటారు.  ఈ ఉపనిషత్తులోని మంత్రాలకు ద్రష్ట ఐతరేయుడు గనుక దీనికి ఐతరేయోపనిషత్తు అను పేరు వచ్చింది.

ఇందులో  అధ్యాయాలలో ఉన్నాయి?
ఐతరేయ ఆరణ్యకం లోని 4, 5, 6 అధ్యాయాలను ఈ ఉపనిషత్తులోని మూడు అధ్యాయాలుగా గ్రహించారు.  ఈ ఉపనిశత్తులోని మొదటి అధ్యాయంలో మూడు ఖండాలు ఉన్నాయి.  రెండవ అధ్యాయంలో ఒక ఖండము, మూడవ అధ్యాయములో ఒక ఖండము ఉన్నాయి.  మొత్తం మీద ఈ ఉపనిషత్తులో 5 ఖండములు ఉన్నాయి.  

ఋగ్వేదానికి చెందిన మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉందంటారు.  ఆ మహావాక్యం ఏమిటి? సంక్షిప్తంగా దాని అర్థం ఏమిటి?
"ప్రజ్ఞానం బ్రహ్మ" అనే మహా వాక్యం ఈ ఉపనిషత్తులోఉంది .  దాని అర్థం - " సృష్టికి మూలమైన, నిరుపాధికమైన శుద్ధ చైతన్యమే పరబ్రహ్మ".  బ్రహ్మము సర్వజ్ఞుడు, సర్వ శక్తివంతుడు అని ఈ ఉపనిషత్తు అభివర్ణించింది.

సృష్టికి పూర్వం ఏముంది?
ఆత్మ ఒక్కటే ఉందని ఈ ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.

ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ (1.1.1)
సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ ఒక్కటే.  ఇది నిర్విశేషమైన ఆత్మ.  ఈ ఆత్మ వ్యక్తమైనప్పుడు నామరూపాత్మకమైన జగత్తుగా భాసిస్తుంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు ప్రత్యక్ష ప్రమాణానికి అందేది కాదు. విశ్వంగా వ్యక్తమైనపుడు ప్రత్యక్ష ప్రమాణానికి అందుతుంది.  ఒకే ఆత్మను అవ్యక్తంగా ఉన్నప్పుడు 'ఆత్మ' అని, వ్యక్తమైనప్పుడు 'విశ్వం' అని అంటున్నాము.  ఈ ఆత్మ మనలోనూ ఉంది.  జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలలోను ఆత్మ ఉంటుంది.  దీనికి భూత, భవిష్యద్వర్తమానాలు లేవు.  సృష్టికి ముందర ఏముంది అన్న ప్రశ్నకు అనుగుణంగా 'ఆత్మ' ఒక్కతే ఉందని సమాధానం చెప్పబడింది గాని, సృష్టికి తర్వాత, ప్రళయం సంభవించినప్పుడు ఆత్మ ఉండదని కాదు.  ఆత్మ నిత్యమైనది.

సృష్టి కార్యం చెయ్యాలని పరమాత్మ ఎందుకు సంకల్పించాడు?
స ఈక్షత లోకాన్ను సృజా ఇతి (1.1.1)
అద్వితీయుడైన పరమాత్మ లోకాలను సృష్టించాలని అనుకున్నాడట.  మరి ఆత్మ నిష్క్రియుడు కదా! ఆయన లోకాలను సృష్టించాలను కోవడం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది.  శ్వేతాశ్వతరోపనిశత్తు (3.19) లో చేతులు లేకపోయినా గ్రహించేవాడు, కాళ్ళు లేకపోయినా వడిగా నడిచేవాడు, కళ్ళు లేకపోయినా చూచేవాడు పరమాత్మ అని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు వర్ణించబడ్డాయి.  అందుచేత ఆయనకు అసాధ్యం ఏదీ లేదు.  అంతేకాక ఆయనలో క్రియాశక్తిగా మాయ ఉంది.  ప్రళయం నాటికి జీవులు అనుభవించకుండా మిగిలిన కర్మలు అనుభవానికి వచ్చే సమయం ఆసన్నమయినపుడు మాయ సృష్టికి ప్రేరేపిస్తుంది.  పరమాత్మ సృష్టికి ఉపక్రమిస్తాడు.

సృష్టి ఎన్ని అంచెలుగా జరిగినట్లు ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తుంది?
సృష్టి రెండంచెలుగా జరిగిందని ఈ ఉపనిషత్తు చెప్తుంది. మొదట సమిష్టిగా (విరాట్ పురుషుడుగా - macrocosm) తరువాత వ్యష్టిగా (జీవజాలంగా - microcosm) జరిగిందని చెప్పింది.  వ్యష్టిగా జీవజాలాన్ని సృష్టించి, అందులో ధర్మసాధనకు మానవ శరీరం అనువుగా ఉంటుందని మానవుణ్ణి సృష్టించడం జరిగింది.  ఈ జీవజాలానికి కావలసిన ఆహారం కూడా సృష్టించబడింది.  ఈ ఉపనిషత్తులో వివరించబడ్డ సృష్టి క్రమం ఆధునిక పరిణామవాదానికి కొంత వరకు అనుగుణంగా ఉండడం విశేషం.  మరొక ముఖ్యమైన విషయం, ఈ సృష్టి మొదటి సృష్టి అని, చివరి సృష్టి అని అనడానికి వీలులేదు.  సృష్టి, స్తితి, లయాలు నిరంతరం ఆవృత్తం అవుతూ ఉంటాయి.

శరీరంలోకి ఆత్మ ఎలా ప్రవేశించింది?
ఆ క్రమాన్ని ఉపనిషత్తు ఇలా అభివర్ణించింది.
స ఏతమేవ సీమానం విదార్య
ఏతయా ద్వారా ప్రాపద్యత
సైషా విదృతిర్నామ ద్వాః (1.3.12)
శరీరంలోకి జీవభావంతో ఎలా ప్రవేశించాలి? అని పరమాత్మ ఆలోచించి, చివరకు కపాలాన్ని చీల్చుకుని, అలా ఏర్పడిన రంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశించాడు.  ఈ రంధ్రాన్ని విదృతి అంటారు.  జ్ఞాన రూపమైన జీవాత్మ శిరోభాగం నుండి ప్రవేశించిందని క్రియారూపమైన ప్రాణం పాదాల నుండి ప్రవేశించిందని ఈ ఉపనిషత్తు చెప్తుంది.  జ్ఞానేంద్రియాలన్నీ శరీరానికి పై భాగంలోనే ఉండడం గమనార్హం.  



2013/8/19 Kb Narayana Sarma <kbns...@gmail.com>

Kb Narayana Sarma

unread,
Aug 22, 2013, 3:01:24 AM8/22/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
10. బృహదారణ్యకోపనిషత్తు
బృహదారణ్యకోపనిషత్తు ఏ వేదంలో ఉంది?
బృహదారణ్యకోపనిషత్తు శుక్లయజుర్వేదంలో శతపథబ్రాహ్మణంలో ఉంది.


బృహదారణ్యకోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?
ఈ ఉపనిషత్తు (అన్ని ఉపనిషత్తులకంటే) పరిమాణంలో చాలా పెద్దది (బృహత్తు).  అందుకే దీనిని బృహదారణ్యకోపనిషత్తు అని అంటారు.  ఇది పరిమాణంలోనే గాక, విషయ విశిష్టత, సమగ్రత, వివరణ లన్నిమ్తిలోనో కూడా విశేషమైనదే. 


బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయి?

బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాలు 6 అధ్యాయాల్లో విస్తరించి ఉన్నాయి.  1, 2 అధ్యాయాలను మధుకాండ అంటారు.  3, 4 అధ్యాయాలను యాజ్ఞావల్క్యకాండ అంటారు. 5, 6 అధ్యాయాలను ఖిలకాండ అంటారు.

బృహదారణ్యకోపనిషత్తులోని ప్రధాన పాత్రధారులెవ్వరు?
యాజ్ఞవల్క్యుడు, జనకుడు, గార్గి, మైత్రేయి - ఇలా అనేకమంది ఈ ఉపనిషత్తులో ప్రధాన పాత్రధారులు.  ఒకరు ఋషిపుంగవుడు, బ్రహ్మజ్ఞాని, ఒకరు రాజు, ఒకరు బ్రహ్మవాదిని, ఒకరు గృహిణి అయినా జిజ్ఞాసువు.  అందరు వారి వారి ధర్మాలను నిర్వర్తిస్తూనే సత్యావిష్కరణలో పాలు పంచుకోవడం భారతీయ చింతనలో ఒక విశిష్టతను తెలియజేస్తుంది - సత్యాన్వేషణకు అందరూ అర్హులే - జిజ్ఞాస ఉండాలంతే.

గార్గ్యుని కథ ద్వారా ఈ ఉపనిషత్తు అందించిన సందేశం ఏమిటి?
గార్గ్యుదనే వానికి విద్యాగర్వం మెండు.  ఆతను అజాతశత్రువు అనే రాజు వద్దకు వెళ్లి అర్థించబడకుండానే 'నేను నీకు బ్రహ్మ విద్యను  ఉపదేశిస్తా' నన్నాడు.  సరేనన్నాడు నిగర్వి, జ్ఞాని అయిన అజాతశత్రువు.  గార్గ్యుడు భంగపడతాడు.  చివరికి అజాతశత్రువు దగ్గరే ఉపదేశం పొందుతాడు.  విద్యాగార్వం పనికి రాదనీ, ఎదుటి వారి సత్తా తెలుసుకోకుండా అహంకరించకూడదనే సందేశంతో ఈ ఉపనిషత్తు మొదలవుతుంది.


బృహదారణ్యకోపనిషత్తులో లభిస్తున్న విశేషాలను, జనకుని యజ్ఞసభలో జరిగిన వాదోపవాదాలను సంక్షిప్తంగా తెలపండి?
జనకుని యజ్ఞం, అక్కడ జరిగిన సభ, అందులోని వాదోపవాదాలు ఈ ఉపనిషత్తులోని పెద్ద ముచ్చట.
ఆత్మను ప్రత్యక్షంగా చూపమన్న ఉషస్తుడికి, కహోలుడికి, ఆత్మ బాహ్య ప్రపంచంలోని వస్తువు (object) కాదని అది మనలోనే ఉండే కర్త (subject) అని యాజ్ఞవల్క్యుడు బోధించాడు.

యాజ్ఞావల్క్యునితో గార్గి వాదోపవాదాలు అత్యంత ఆసక్తికరం, భారతీయ తత్త్వశాస్త్ర సారస్వతంలో ఒక మధుర ఘట్టం.  మొదట హిరణ్య గర్భుడే మూలద్రవ్యం అని, ఆయన్ని ఆవరించేది ఇంకేది లేదని యాజ్ఞవల్క్యుడు ఉపదేశించాడు.  గార్గి రెండవసారి వాదనకు దిగినప్పుడు సూత్రాత్మ అవ్యక్త ఆకాశంచేత వ్యాపింపబడిందని, ఆ అవ్యక్త ఆకాశం అక్షర బ్రహ్మం చేత వ్యాపింపబడిందని చెప్పి, ఆ అక్షర బ్రహ్మం మాటలకు, ఊహకు అందనిదని, దాని నుండే జీవజాలం ఉద్భవించి, మళ్ళీ దానిలోనే లయం అవుతుందని ఉపన్యసించాడు.

జనకుడికి ఆత్మజ్ఞానం మీద, దేహాత్మల మీద ఇంకా అనేక విషయాల మీద ఉపదేశం ఇచ్చాడు.

'ద' అనే అక్షరాన్ని ఉపదేశించడం అనే కథ ద్వారా ఈ ఉపనిషత్తు మనకు అందించిన సందేశం ఏమిటి?
భోగలాలసత్వం (దేవతల ప్రకృతి), పరపీడన పరాయణత్వం (ఆసుర ప్రకృతి), లోభం (మానవ ప్రకృతి) - ఇవి మూడూ మన సమాజంలోనే ఉన్నాయని, అవి వరుసగా శమ దమాల వల్ల, దయ వల్ల, దానం వల్ల, నివారించుకోవాలని ఈ ఉపనిషత్తు ఒక చక్కని కథా రూపకంగా వివరించింది.

యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఇచ్చిన ఉపదేశం ఏమిటి?
భార్య మైత్రేయికి, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వలేవని, ఆత్మానందం అనుభవైకవేద్యమని, అది శ్రవణ, మనన, నిదిధ్యాసల ద్వారా మాత్రమే సాధ్యమని ఉపదేశించాడు.

ఈ ఉపనిషత్తులో లభిస్తున్న మహావాక్యం ఏమిటి? సంక్షిప్తంగా దాని అర్థం ఏమిటి?
ఈ ఉపనిషత్తులో లభిస్తున్న మహా వాక్యం "అహం బ్రహ్మాస్మి".   సంక్షిప్తంగా దీని అర్థం "నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను".

ఈ ఉపనిషత్తులో మరికొన్ని అతి ప్రసిద్ధమైన వచనాలేమిటి?
ఆసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయేతి (1.3.28)

'నన్ను అసత్తు నుండి (చెడు నుండి లేక జడత్వం నుండి), సత్తు (మంచి లేక చైతన్యం) వైపుకునడిపించు .  తమస్సు (చీకటి లేక అజ్ఞానం) నుండి జ్యోతి (వెలుగు లేక జ్ఞానం) వైపుకు నడిపించు.  మృత్యువు (death) నుండి (అశాశ్వతమైన దాని నుండి) అమృతత్వం (శాశ్వతమైన దాని వైపు) (immortality) వైపుకు నడిపించు.  అని ముముక్షువు ఆ పరమాత్మను వేడుకుంటున్నాడు.  భారతీయ సంప్రదాయంలో, ధనంతో పొందగలిగే భోగాల కంటే చైతన్యంతో కూడిన సత్ ప్రవర్తన, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం (అమృతత్వం) మాత్రమే ఉన్నతమైనవి.

ప్రతి జీవికి అన్నింటికంటే ప్రియమైనది ఏది?
ప్రతి జీవికి అన్నిటికంటే ప్రియమైనది - తానే.

బృహదారణ్యకోపనిషత్తు ఇంకా ఉంది .......................




































 



2013/8/20 Kb Narayana Sarma <kbns...@gmail.com>
...

[Message clipped]  

Kb Narayana Sarma

unread,
Aug 31, 2013, 6:15:55 AM8/31/13
to సత్సంగము (satsangamu), telugubrah...@googlegroups.com, SD...@googlegroups.com, sadh...@googlegroups.com, Lakshmi Deepthi, Shyam Sriram, Jayaraman VS, sridh...@yahoo.com, vem...@googlegroups.com, KBInfo
10. బృహదారణ్యకోపనిషత్తు (Contd......................)
తనకు అన్నిటి కంటే ప్రియమైనది తానే (ఆత్మయే) అని చెప్పే వాక్యం ఏది?
తదేతత్ప్రేయః పుత్రాత్ప్రేయో విత్తాత్ప్రేయో2
న్యాస్మాత్సర్వస్మాదన్తరతరం యదయమాత్మా (1.4.8)

ఈ ఆత్మతత్త్వం పుత్రుని కంటే, సంపద కంటే ఇతరములైన అన్నిటి కంటే ఉత్తమమైనది.  కనుక దానినే ప్రేమతో ఉపాసించవలయును.

నేను పరమాత్మ స్వరూపాన్నే అని చెప్పే వాక్యం ఏది?
బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావే
దాహం బ్రహ్మాస్మీతి, తస్మాత్తత్సర్వమభవత్ (1.4.10)
సృష్టికి పూర్వం ఉన్నది పర బ్రహ్మమే.  నేనే పరబ్రహ్మమని తనకు తానే ఆ పరబ్రహ్మమును తెలిసికొనెను.  మానవుడు కేవలం ఈ జడ స్వరూపం కాదు.  పుట్టుకకు ముందు, తర్వాత కూడా మానవుడు నిజానికి ఆత్మ స్వరూపుడే. తరువాత జ్ఞాన సముపార్జన చేత 'అహం బ్రహ్మాస్మి' నేను ఆత్మ స్వరూపుడను అని తెలిసికుంటాడు.  అదే ముక్తి.

బ్రహ్మోపాసన ఎందుచేత శ్రేష్టం?
తాను బ్రహ్మము కంటే వేరనే భ్రమతో ఇతర దేవతలనారాధిస్తే ఆ దేవతలు అటువంటి వారి చిన్న కోర్కెలు తీర్చి తమ ఆధీనంలో పెట్టుకొని పశువులను చూసినట్లు చూస్తారు.  అందుచేత అలాంటి దేవుళ్ళను ఉపాసించడం కంటే బ్రహ్మోపాసన మేలని చెప్తుందీ ఉపనిషత్తు.

సత్యం, ధర్మం వేరు వేరా?
సత్యం, ధర్మం వేరు కాదు.  ధర్మంలో భాగమే సత్యం అని ఈ మంత్రం చెప్తుంది.

తస్మాత్సత్యం వదంతమాహుర్ధర్మం వదతీతి ధర్మం వా
వదంతం సత్యం వదతీత్యేతద్దేవైతదుభయం భవతి (1.4.14)

సత్యం పలికే వాడిని ధర్మం పలికే వాడుగాను, ధర్మం పలికే వాడిని సత్యం పలికేవాడు గాను అంటారు. అంటే సత్యం, ధర్మంలో ఒక భాగమే అన్నమాట.  పురుషార్థాలలో సత్యాన్ని ప్రత్యేకంగా పేర్కొనక పోవడానికి కారణం ఇదే.

కోరికలను పూర్తిగా త్యజించాలా? 
కోరికలను పూర్తిగా త్యజించవలసిన అవసరం లేదు.  ధర్మబద్ధమైన కోరికలుండటంలో తప్పు లేదు.
మొదట జీవాత్మ ఒకటిగానే ఉన్నాడు.  తరువాత భార్య, సంతానం, సంపద కావాలనే కోరిక పుట్టి వాటిని పొందాడు.  తరువాత కర్మలు చెయ్యాలనుకున్నాడు.  ఈ విధంగా కోరికతోనే పరిపూర్ణత పొందాడు.  'అకామస్య క్రియానాస్తి' అని మనుస్మృతి.  కోరిక లేకపోతే కర్మలేదు, ప్రపంచం స్తంభిస్తుంది.  కనుక ధర్మబద్ధమైన కోరికలు ఉండవలసిందే.  అయితే ఈ కోరికలు దురాశకు దారి తీయకూడదు. 

ప్రపంచం అంటే ఏమిటి?
ప్రపంచం అంటే నామం, రూపం, కర్మ అని ఉపనిషత్తు చెప్పింది.  నామములకు ముఖ్యకారణం వాక్కు.  దీని నుండే నామాలన్నీ పుట్టుకు వస్తాయి.

అసలు సత్యమైనదేమిటి?
'సత్యస్య సత్యం' ఆత్మ అని ఉపనిషత్తు ప్రవచించింది.
ఏ ఆత్మ వలన సృష్టి, స్థితి, లయాలు జరుగుచున్నాయో, ఆ ఆత్మను గూర్చి చెప్పేది ఉపనిషత్తు.  అందుచేత ఉపనిషత్తును సత్యస్య సత్యం అంటారు.  అట్లాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణం  అన్నీ సత్యాలే.  కాని వాటికి మించిన సత్యం, అంటే ఆత్మను సత్యస్య సత్యం అని చెబుతుందీ ఉపనిషత్తు.

ఆత్మను ప్రత్యక్షంగా చూడగలమా?
చూడలేము.  ఆత్మ కర్తగా హృదయకుహరంలో ఉంటుంది.  గనుక దానిని చూడలేము. 
ఉషస్తుడు ఆత్మను ప్రత్యక్షంగా చూపమని యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినపుడు ఆయన ఆత్మ స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు.  కంటిలో చూచే శక్తి ఉంది.  ఆ శక్తిని కన్ను చూడగలదా? అట్లాగే చెవి శ్రవణ శక్తిని, మనస్సు మానస శక్తులను చూడగలవా?  ఆత్మ కర్త (subject) దానిని నీవు బాహ్య వస్తువుగా (object) చూస్తున్నావు.  ఆత్మ నీలోని కర్త గనుక దానిని నువ్వు ప్రత్యక్షంగా బాహ్య వస్తువుగా చూడలేవు.  అది సర్వాంతర్యామిగా ఉండే శక్తి.  దీనిని తెలుసుకో.

మునులుగా మారడం ఎలా?
ధ్యాన నిష్ఠ లో ఉండే వాడు మునిగా మారతాడు. 
బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసి, జ్ఞాన బలంతో ఉండి, ఆత్మ జ్ఞాన సంబంధిత విషయాల మీద మాత్రమే మననం చెయ్యాలి.  కేవలం పాండిత్యం సరిపోదు.  దాన్ని ప్రక్కన విడిచి పెట్టి అమాయక బాలునివలె, ధ్యాన నిష్ఠలో ఉండాలి.  ఆ విధంగా క్రమంగా మునులుగా పరివర్తన చెందాలి.

సూత్ర బ్రహ్మ అంటే ఎవరు?
సూత్ర బ్రహ్మ అంటే వాయువని ఉపనిషత్తు వివరించింది.  
ఈ జన్మను, తరువాతి జన్మను, సర్వ భూతాలను పూలమాల వలే కలిపేది వాయువే.  మన శరీర భాగాలను కూర్చి సంఘటితంగా ఉంచేది వాయువే.  అది నిష్క్రమించిన తరువాత అవి విడిపోతాయి.  అందుచేత వాయువే సూత్ర బ్రహ్మ.

'అక్షర బ్రహ్మం' అంటే ఎవరు?
అక్షర బ్రహ్మం అంటే నాశరహితమైన ఆత్మ.
అక్షరం (నాశనం లేని ఆత్మ) చూడబడదు గాని చూస్తుంది.  వినబడదు గాని వింటుంది.  మననం చేయబడదు గాని మననం చేస్తుంది.  తెలియబడదు గాని తెలుసుకుంటుంది.  ఆత్మ కర్తగా, అంతర్నిహితంగా ఉండేదే గాని మనచేత చూడ శక్యమైన బాహ్యవస్తువు కాదు, అది సర్వాంతర్యామి.  సర్వ శక్తి శాలి.

శరీర త్యాగం ఎలా జరుగుతుంది?
శరీర త్యాగ క్రమాన్ని ఉపనిషత్తు ఈ విధంగా వివరించింది.
గరిక యందలి పురుగు తను ఉన్న గడ్డి పోచ చివర వరకు వచ్చి దాని నుండి మరియొక గడ్డిపోచ మీదకు ప్రాకి, దాని ఆధారం దొరికిన తరువాత వెనుకటి గడ్డిపోచను విడుస్తుంది.  అదే రీతిలో జీవుడు ప్రాణోత్క్రమణ సమయంలో మరియొక దేహాన్ని ధరించి వెనుకటి శరీరాన్ని అచేతనం చేస్తాడు. 

ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా చేసుకోవాలి?
శ్రవణ, మనన, నిధి ధ్యాసలు ద్వారా చేసుకోవాలి అని ఈ విధంగా ఉపనిషత్తు వివరించింది.

ఓ మైత్రేయా! చూడదగినది ఆత్మ మాత్రమే.  ఆత్మావలోకనం చేసుకోవాలంటే ముందుగా సద్గురువు నాశ్రయించి, ఆయన ఉపదేశాన్ని శ్రద్ధగా విని దాన్ని మననం చేసుకుంటూ క్రమంగా దాని మీదే ధ్యానం చెయ్యాలి.  ఆ విధంగా శ్రవణ, మనన, నిదిధ్యాసాల ద్వారా ఆత్మావలోకనం చేసిన తరువాత ఇంక థెలుసుకోవలసినదేమీ ఉండదు.























 



2013/8/22 Kb Narayana Sarma <kbns...@gmail.com>
...

[Message clipped]  
Reply all
Reply to author
Forward
0 new messages