Om Sri Gurubhyonamaha,
: త్రిగుణములు -
సత్వగుణం, రజోగుణం, తమోగుణం :
సత్వగుణం అనేది బాగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం, దైవం వైపుకు తిరుగుతాం,
మృదువుగా మాట్లాడుతాం.
రజోగుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు. ఎప్పుడూ ఏదో
ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చేయాలనే తపన, చేస్తూ ఉండటం.
ప్రాపంచిక విషయాలపై అమిత ఆసక్తి, దానితో నిరంతరం కర్మరంగంలోకి
దూకటం.
తమోగుణం అధికంగా ఉంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా-దాక్షిణ్యాలపై
ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస.
ఈ 3 గుణాలు ప్రతి వారిలోనూ ఉంటాయి. ఏదో ఒక గుణం ప్రబలంగాను, మరొకటి
సాధారణంగాను, మరొక గుణం తక్కువ గాను ఉంటుంది. ఎక్కువ తక్కువలే గాని
అందరిలో ఉండేది ఈ మూడు గుణాలే. ఇలా
అందరిలో 3 గుణాలు ఉండటానికి కారణం ? - అందరికి తండ్రి పరమాత్మ, తల్లి
మాయ. పరమాత్మ గుణరహితుడు. మాయ త్రిగుణాలతో ఉంటుంది. ఆ మాయ యొక్క
గుణాలే అందరిలోనూ ఉంటాయి. అంటే తల్లి చాలు.
-తత్త్వబోధ