పృథ్వి పంచకంలో
భూమిలో భూమి - మృత్యువు కదా!
గు: భూమిలో భూమి - మృత్యవు
శి: మృత్యు దేవత అండీ !
భూమిలో జలము - బ్రహ్మ... బ్రహ్మము
బ్రహ్మము అంటే చతుర్ముఖ బ్రహ్మ గారు. సృష్టి చేసేటటువంటి బ్రహ్మ గారు.
భూమిలో అగ్ని - విష్ణువు,
విష్ణువు - ఈయన పోషక కర్త, స్థితి కర్త.
భూమిలో వాయువు - ఇంద్రుడు,
ఇంద్రుడు - ఈయన ఇంద్రియాధిష్ఠాన దేవత.
భూమిలో ఆకాశము - అగ్ని, అగ్ని!
ఇట్లా మొట్టమొదట ప్రాథమికంగా చిట్టచివరి భూపంచకంలో, పృథ్వి పంచకంలో, పృథ్వీ తత్వ పంచకంలో వీళ్ళు ఏర్పడ్డారు. ఇదే ఆఖరుగా ఏర్పడ్డారు. ఇది... అదే ఆకాశ పంచకానికి వచ్చామనుకోండి....
అది జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము
జ్ఞాతకేమో గురుమూర్తి,
మనస్సుకేమో చంద్రుడు, చంద్రుడు!
బుద్ధికి బృహస్పతి, బృహస్పతి!
చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడు!
అహంకారమునకు రుద్రుడు.
ఈ రకంగా ఇంద్రియాదిష్ఠాన దేవతలంతా ఏర్పడ్డారు. ఆ చివర ఆకాశ పంచకము. ఈ చివర పృథ్వి పంచకము. మధ్యలో జలపంచకము. జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము. అంతే కదా! జల పంచకములో ఎవరు ఏర్పడ్డారు?
జలములో ఆకాశము - సదాశివుడు,
జలములో వాయువు - ఈశ్వరుడు, ఈశ్వరుడు!
జలములో అగ్ని - రుద్రుడు,
జలములో జలము - విష్ణువు,
జలములో పృథ్వి - బ్రహ్మ.
అది చూడండి. మరలా క్రింద చెప్పిన పేర్లే, అటు ఇటుగా మారినాయి. వాటి వాటి యొక్క స్థితి భేదాన్ని అనుసరించి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, పృథ్వి ఆ తత్త్వముల యొక్క సంయోజనీయత ద్వారా. అయితే, మూలముగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే, పృథ్విలో పృథ్వి, జలములో జలము, అగ్నిలో అగ్ని, వాయువులో వాయువు, ఆకాశంలో ఆకాశము. ఇవి చాలా బలవత్తరమైనటువంటివి. ఎందుకంటే వాటిలో అర్థభాగములు ఉన్నాయి కాబట్టి. అర్థభాగమేమో అపంచీకృతంగా ఉంది. అర్థభాగమేమో పంచీకృతమయ్యింది. అందువల్లనే ఆ పంచకమంతా కూడా దానిలోకి ఆకర్షించబడుతుంది. పృథ్వీ తత్వం చేత ఆవరించబడుతున్నటువంటి శరీరమే నేననే వారందరూ మృత్యుదేవత ముఖములో పడక తప్పదు.
జల పంచకానికి అధిష్ఠానము ఎవరు? జలములో జలము - విష్ణువు కదా! కాబట్టి జలపంచకమంతా కూడా రేపు ప్రళయకాలంలో ఏమైపోతుంది? విష్ణువు నందు అంతర్భూతమైపోతుంది. ఆయన నుంచే వ్యక్తమైంది, ఆయనయందే తిరిగి లయమైపోతుంది. అందుకనే నారాయణడని పేరు. నారము ఆయనము. నీరము యొక్క ఆశ్రయమంతా విష్ణువే. జలములో జలము అన్నమాట. కాబట్టి ఆ జలపంచకమంతా ఆధారభూతంగా ఉన్నటువంటి విష్ణువు ద్వారా ఏర్పడింది, తిరిగి మరలా ఆయన యందే లయించిపోయింది.
అగ్నిపంచకం.
అగ్నిలో ఆకాశము - దిక్పాలకులు, అష్ట దిక్పాలకులు!
అగ్నిలో వాయువు - వాయుదేవుడు.
అగ్నిలో అగ్ని - సూర్యుడు.
ఈ సూర్యుడే అధిష్ఠానం. మనం కూడా అగ్నిని ఎక్కడి నుంచి పొందుతున్నాము? అంటే, సూర్యుడి నుంచే పొందుతున్నాము. ప్రకాశము నుంచే పొందుతున్నాము. ఆ సూర్యప్రకాశము ఆధారంగానే క్రమశః సృష్టి జరుగుతుంది. సూర్యుడు లేకపోతే ఈ సృష్టిలో ఏదీ లేదు. చీకటి యుగం. మంచుఖండం, హిమయుగం, నడుస్తూఉంటుందన్నమాట. ఆ సూర్యప్రభావం వల్లనే, ఆ జలంలోనుంచి జీవులన్నీ పుట్టుకొచ్చినాయి.
అగ్నిలో జలము - వరుణుడు, వరుణుడు!
అగ్నిలో పృథ్వి - అశ్వినీ దేవతలు, అశ్వనీ దేవతలు.
ఈ రకంగా ఆది దైవక సృష్టి అగ్నిపంచకానికి సంబంధించినటువంటిది. ఈ అశ్వనీ దేవతలు, అష్టదిక్పాలకులు, వరుణుడు, సూర్యుడు... వీళ్ళందరూ కూడా మనం ఆరాధించేటటువంటి దేవతలన్నమాట. వీళ్ళందరి ప్రభావం చేతనే ఋతువులన్నీ ఏర్పడుతున్నాయి. భ్రమణం ద్వారా ఏర్పడుతున్నాయి. భూభ్రమణము, భూ పరిభ్రమణము అంటున్నాము కదా! భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు ఈ అధిష్ఠాన దేవత అనుగ్రహంచేత, ఆ యా ఋతువులన్నీ ఏర్పడి, ఆ జీవ సృష్టి అంతా జరుగతోంది. వరుణ భగవానుని అనుగ్రహం లేకపోయినట్లయితే, మనం వర్షపాతం లేక విలవిల లాడిపోతాము. ఎన్ని భూమి మీద నీళ్ళున్నప్పటికీ కూడా, వర్షం లేకపోతే ప్రాణులన్నిటికి చాలా ఇబ్బంది కరమైన జీవితం జరుగుతూఉంటుంది.
ఒక కాలానికి వచ్చేటప్పటికి అసలు వరణుడే లేకపోతాడు. ప్రళయ కాలానికి వచ్చేటప్పటికి సూర్యప్రభావం తీవ్రమైపోతుంది. తీవ్రమైపోయి, మిగిలినటువంటి అగ్ని పంచకం అంతాకూడా దేదీప్యమానమైనటువంటి ప్రభావితమై, కిందున్న జలపంచకాన్ని తనయందు కలిపేస్తుంది. జలపంచకమేమో తన ఆధీనంలో ఉన్న పృథ్వి పంచకాన్ని కలిపేసుకుంటే, ఆ జలపంచకాన్ని, ఈ అగ్ని పంచకానికి అధిష్ఠానమైనటువంటి సూర్య తప్తత చేత, ఆ మొత్తం ఇంకిపోయేట్లు చేస్తుంది. అప్పుడు ప్రళయకాలంలో జరిగే విధానం అది. ఆది దైవతముల యొక్క ప్రభావం అంతా కూడా. సృష్టి ఆవిర్భావ కాలమందు, సృష్టి పోషణ కాలమందు, సృష్టి తిరోధాన ప్రళకాలమందు. ఈ ఆది దైవతం యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. భూమి విలువ మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, భూకంపం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఈ భూమి ఉందని. అప్పటి వరకూ నేల ఉందని ఎవరూ అనుకోరు. తింటుంటాడు, తిరుగుతూ ఉంటాడు, గడిపేస్తూ ఉంటాడు. భూకంపం వస్తే, అప్పుడు భూమి యొక్క ప్రభావం ఎంతుందో తెలుస్తుంది. భూదేవత యొక్క అనుగ్రహం అలా ఉందన్నమాట. అట్లా మనం ఈ పంచభూతాలని ఆదిదైవతంగా భావించి ఆరాధించే విధానాన్ని పెద్దలు కల్పించారు. ఈ రకంగా పృథ్వి పంచకాన్ని, జలపంచకాన్ని, అగ్ని పంచకాన్ని తెలుసుకున్న తరువాత వాయుపంచకం.
వాయువులో ఆకాశము - జయుడు,
వాయువులో వాయువు - విశ్వయోని,
వాయువులో అగ్ని - అజుడు,
వాయువులో జలము - విశిష్ఠుడు,
వాయివులో పృథ్వి - విశ్వకర్త.
వీళ్ళే ఆధారం. వాయుదేవత అంటే వీళ్ళే. వీళ్ళందరినీ కలిపి వాయుదేవత.... వాయువులో వాయువు చాలా ముఖ్యం.
గు: వాయువులో వాయువు ఏమిటిప్పుడు?
శి: విశ్వయోని- విద్యా సాగర్ గారు