ఈ దృశ్యమాన ప్రపంచమంతా పరమాత్మమీద ఆరోపించబడింది

56 views
Skip to first unread message

radha krishna Kantamneni

unread,
Aug 17, 2014, 7:20:31 PM8/17/14
to sadh...@googlegroups.com
ఈ బ్రహ్మానుభవాన్ని ఆధారంగా చేసుకొని,ఈ అనంత సృష్టి పరమాత్మమీద ఆరోపించబడిందే కానీ వాస్తవంగా లేనేలేదు. ఉన్నది పరమాత్మ ఒక్కటే అనే నిర్ణయాన్ని నిశ్శబ్ధంగా అంగీకరించి సర్వ ద్వంద్వ రహితంగా ఉన్నపుడు ఆ నిర్ణయాన్ని పొందుతారు. కార్యములన్నీ కారణం యొక్క బహురూపములే. ఈ పరిమిత ప్రపంచంలో శరీర మనొ బుద్దులనే పరికరములు. విషయ వస్తువులు ఉద్రేకములు, ఆలోచనలు నిత్యం మారుతూ ఉన్న అనుభవ ప్రపంచము. ఇవన్నీ ఆత్మపై ఆరోపించబడినవే. జీవభావాన్ని నిరసించడానికి మళ్ళి వాటి గురించి గుర్తు చేస్తున్నారు. ఇదంతా లేనిదే అని రెప్పపాటులో నిర్ణయం ఎవరైతే చేయకలుగుతారో వారు మాత్రమే పనికొస్తారు అని చెబుతున్నారు. 

ఇవి అన్ని పాముయొక్క మెరుపు, పొడవుతోక, పడగవంటివి త్రాడుమీద ఆరోపించబడినట్లుగా ఆరోపించబడినవి. ఈ అనంతప్రపంచం రజ్జుసర్పభ్రాంతివలె ఉన్నట్లు కనిపిస్తుంది. అంతే కాని వాస్తవానికి లేనే లేదు. ఆ సర్పం ఉన్నదని అన్పించినంత వరకు దాని యొక్క విశేషాలు నిన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి. లేనిదనే నిర్ణయంతో ఉంటే లేనిది లేకనే పోయింది. ఉన్నది పరమాత్మయే అనే నిర్ణయం ఎపుడైతే తెలుస్తుందో, అపుడు లేనిది లేకనే పోతుంది. అలలు, నురగలు, తుంపరలు అన్నీ సముద్రం కంటే వేరు కానట్లుగా, భౌతిక ప్రపంచంలో అన్నీ శుద్ధ చైతన్యం యొక్క వ్యక్త రూపములే. అనంత విశ్వం కూడా దైవం యొక్క విభూతే కదా! ఆ పరమాత్మ యొక్క విభూతిగా ఈ ప్రపంచాన్ని చూస్తాడు. ఆ విభూతి పరమాత్మ లేకుండా రాలేదు కదా! కానీ విభూతి కెట్టి ప్రాధాన్యతా ఇవ్వకుండా పరమాత్మ మాత్రమే ఉన్నవాడు. సర్వ కాలములయందు పరమాత్మ మాత్రమే ఉన్నవాడు అని నిర్ణయంతో ఉండి విభూతులను నిరసించేస్తాడు.

ఈ ప్రపంచములోని వస్తువులు, విషయాలు,వ్యక్తులు అన్నీ శుద్ద చైతన్య స్వరూపమైన ఆత్మమీద కల్పించబడినవే :-
రెండు రెండుగా కనపడుతున్నవన్నీ ఆయా స్థితులలో ఆయా మనసుచేత కల్పించబడినవే అని తెలుసుకొని వీటిని నిరసించేస్తాడు. స్వస్వరూపమైన ఆత్మ యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల ఇన్ని  అనేకములు అన్నీ ఆ విక్షేప శక్తి ప్రభావం వల్లనే కలిగాయి.కాబట్టి ఆ విక్షేప శక్తిని నిరసించాలి. ఆత్మపై ఆరోపించబడిన ద్వైత ప్రపంచం మిధ్య అని గ్రహించినపుడు మనసు శాంత పడుతుంది. లేనిది లేకనే పోతుంది అనే సూత్రం ప్రకారం మాయా మిథ్యా అనేవి రెండూ కూడాను వ్యష్టి సమష్టి భేదంతో ఉన్న అజ్ఞానము, అవిద్య ఈ రెండు కూడా లేనివే అనేటటువంటి సత్యం గోచరం అవ్వాలి.
Reply all
Reply to author
Forward
0 new messages