మహాదాత

59 views
Skip to first unread message

Sathish Kumar

unread,
Dec 11, 2020, 12:30:50 PM12/11/20
to sadh...@googlegroups.com
మహాదాత
 
 ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతు దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశం సిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తిగా ఉండేది. చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకు వెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టుకొన్నాడు.‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడమేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది. దాన్ని సరి చేయిం చండి’ అని.

 చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు.     ‘నాయనా...పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట    నిజమే. కానీ, నువ్వు దానం కోసం నీదగ్గరకు వచ్చిన వాళ్లను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసే వాడివి. ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టు కొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మ స్తుతి చేసుకొని మరో నాలుగో వంతు పుణ్యం పోగొట్టుకున్నావు!’

 ‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా?’ అన్నాడు కోటీశ్వరుడు. ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కారాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసు కొన్నావు! కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్రగుప్తుడు. ‘అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాపమా?’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు.

 ‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్య మంటూ ఒక్కపైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వాత సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేక పోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగయింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహ దైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతిలో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయన మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావల సింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు.

ఎం. మారుతిశాస్త్రి






-
Thanks & Regards
Sathish Kumar.v
+918686661625


 Plant Trees, Save Earth

Reply all
Reply to author
Forward
0 new messages