తెలుగుదనం.కో.ఇన్ ఆవిష్కరణ

5 views
Skip to first unread message

మురళీ కృష్ణ వలివేటి (Murali Krishna Valiveti)

unread,
Nov 1, 2006, 11:07:49 AM11/1/06
to CalTelu...@googlegroups.com, newtelu...@googlegroups.com, punet...@googlegroups.com, racha...@googlegroups.com, sahi...@googlegroups.com, SJC...@googlegroups.com, srinad...@googlegroups.com, tata...@googlegroups.com, Telugu-...@googlegroups.com, Telugu-ci...@googlegroups.com, telugu...@googlegroups.com

Suswaagatam

స్వాగతం! సుస్వాగతం!!

తెలుగు బిడ్డలందరినీ "తెలుగుదనం" సాదరంగా అహ్వానిస్తుంది.

తెలుగు ప్రజలకోసం ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న శుభ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న 15 కోట్ల తెలుగువారి కోసం ఈ "తెలుగుదనం.కో.ఇన్ [telugudanam.co.in]" అనే వెబ్ సైట్‌ను నేడు, 1 నవంబర్ 2006న, ఆవిష్కరిస్తున్నాం.

తేనెలొలికే తెలుగు భాషకు మావంతు సేవ ఈ "తెలుగుదనం".

ఎక్కడెక్కడో వున్నా తెలుగుపై మక్కువ తీరని తెలుగు బిడ్డలకోసం ఈ "తెలుగుదనం".

తమ పిల్లలకు తెలుగు భాష నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుంది ఈ "తెలుగుదనం".

'మన సంస్కృతినీ, సాంప్రదాయాలను గుర్తుచేసుకుందాం, నలుగురితో పంచుకుందాం,' అనుకునేవారికి ఈ "తెలుగుదనం".

వంటలు, సౌందర్యం, చిట్కాల వంటి సంగతులతో మన తెలుగింటి ఆడపడుచులకు అండగా వుంటుంది ఈ "తెలుగుదనం".

తెలుగువారి కాలక్షేపం కోసం మేము చేస్తున్న చిరు ప్రయత్నమిది. కోటికి ఒక తెలుగు సైటు కూడా లేని ఈ పరిస్థితిలో మన ఈ "తెలుగుదనం" అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందనీ, అందరినీ సంతోషపరుస్తుందనీ ఆశిస్తూ "తెలుగుదనం"కు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం.

రండి. "తెలుగుదనం" సందర్శనకు లోనికి దయచేయండి. ఇక్కడ క్లిక్ చేయండి...

lOniki

ఇట్లు,

సహచరులతో కలిసి

మురళీ కృష్ణ వలివేటి

13-5-15, వి.యం.గాంధీ బిల్డింగ్స్,

వీర రాఘవ పేట,

చీరాల - 523155,

ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

( (91) (8594) 325 777

www.telugudanam.co.in

swagatam.jpg
loaniki.JPG
Reply all
Reply to author
Forward
0 new messages