<Greet the people on the dias>
ఈ రోజు PFI మీ గ్రామానికి Fluoride ని తీసేసి మంచి నీరుని అందించే పరికరం మీకు బహుమతిగా ఇచ్చింది. PFI అంటే People For India, దాని అర్ధం భారత దేశం కోసం కష్ట పడే మనషులు. ఏ మతమైన, ఏ దేశమైన, ఏ థత్వమైన చెప్పేది ఒక్కటే, తోటి మనిషికి సాయం చేయమని. PFI అదే చేస్తుంది. మీ విశ్వాసాన్ని గెలుచుకోడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అయితే ఒక పూట కోసం చేసే సాయం కన్నా కల కలం చేసే సాయాన్ని నమ్ముకుంది. అందుకే మీ ఆరోగ్యాన్ని కాపాడే పరికరాన్ని మీకు అందిస్తుంది. A healthy mind resides in healthy body. ఆరోగ్యమైన మేధస్సు ఆరోగ్యమైన శరీరంలో ఉంటుంది. Flouride నీటిలో ఉన్నపుడు అది మన పంటిని, మన బొక్కలని అరుగతీస్తుంది. ఈ నాలుగు గ్రామాలు ఈ కష్టం నుంచి బయట పడడానికి మీకు అందించే బహుమతి. అయితే మీరు ఈ బహుమతిని బహుమతిగా గుర్తున్చాకండి, ఒక అభివృద్ధి కి గుర్తుగా మార్చుకోండి. ఎలా అయితే PFI నిస్వార్ధంగా పెద్ద మనసు చేసుకొని సాయానికి ముందు వచిందో అలా మీరు కుడా ముందుకి రండి. మీ సర్పంచ్ ని, PFI సభ్యులని ఉదాహరణగా తీసుకోండి. ఈ సంస్థని Suraj Kumar, Eeswar ప్రవాస భారతీయులుగా ఉంటూ ప్రారంబించారు. మీకు అందచేసే ఈ సాయాన్ని వారు సంగీతం తోటి భారతీయులకి నేర్పుతూ సంపాదించి ఇచ్చారు. దానికి తోడుగా శివన్న మరియు వారి జట్టు మీకు సాయం చేసారు. అలానే మీరు ముందుకి రండి, అభివృద్దికి పునాది వేయండి, తలా ఒక చెయ్యి వేయండి. ఒక ఉద్యమం కండి. మీ ముందు తరానికి దారి చూపించండి.
సాయం ఎలా ఉండాలే అంటే ఒక పూట కోసం వుండ కూడదు. కల కాలం నిలబడే ల ఉండాలి. వారానికి ఒకసారి మీ ఊరు రచ్చబండ దగ్గర గుమి కూడండి. మీ ఆలోచనలని ఒక కాగితం మీద పెట్టండి. మీ అభివృద్ధి పదకం మీరే తయారు చేసుకోండి. మీ భావితని మీరే తీర్చి దిద్దుకొంది. చదువుకున్న వారని సంప్రదించండి. ఉపాధి పదకలని తెలుసుకోండి. సమాజ శ్రేయస్సు కోసం శ్రమించండి.
మనషిగా పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మా. కృషి వుంటే మనిశులు రుషులవుతారు, మహా పురుషులు అవుతారు.
తార తరాలకి వెలుగు అవుతారు. ఇలావేల్పులు అవుతారు.
1. వాల్మీకి జీవథాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఒక దొంగ నుంచి ఋషిగా మారాడు. ఆ వాల్మీకి మీ లోనే వున్నాడు.
2. ఏక లవ్యున్ని గుర్తుకి చేచ్చుకోంది. సమాజంలో పెద్ద వారిని చూడండి వారిని గురువుగా చేసుకోండి, పట్టుదలతో ముందికి సాగండి.
మీలో ఎవరైనా మీ గ్రామానికి సాయం చేయాలనీ అనుకుంటే మమ్మలిని కలవండి మేము మీకు దారిని చూపిస్తాము. గుర్తు ఉంచుకోండి మేము దానాలు చేయము, మీ ధనాన్ని ఆశించము. కాక పోతే దారిని చూపిస్తాము.
సర్దార్ వల్లభి పటేల్ లా, మహాత్మా గాంధీ లా, వివేకానంద లా, అబ్దుల్ కలం లా, గంటసాల, రెహ్మాన్ లా, ఎన్టీఆర్ రామ రావు లా, c v raman లా, సచిన్ టెండూల్కర్ లా, లోకనాధన్ తిలక్ లా, మదర్ తెరిసా లా మీ ఉనికిని చాటండి, మీరు అంతరించిన తరువాత కూడా మీ పేరుని ఇక్కడ చెక్కి పొంది. భావి తరానికి దారి చూపండి. జీవితాన్ని సార్ధకం చేసుకోండి.
లోకః సమస్త సుకినో భవంతు. అందరు సుఖ శాంతులతో వుండాలి.
ఈ అవకాశాన్ని ఇచ్చిన శివన్న మరియు వారి జట్టుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
జై హింద్! జై హింద్! జై హింద్!