
విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు
2016-17లో ప్రారంభమైన ఈ కోర్సును తాత్కాలికంగా ‘ధూలపల్లి ఫారెస్ట్ అకాడమీ’లో అటవీశాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ 50 సీట్లు ఉంటే దాదాపు ఏడువేల మంది పోటీపడుతున్నారు. 2018-19 నుంచి మాత్రం ఎంసెట్ ద్వారా సీట్లు భర్తీ చేయాలని నిర్ణయించారు. మెరుగైన బోధన కోసం బ్రిటన్‌లోని కొలంబియా, కెనడాలోని అబర్న్ విశ్వవిద్యాలయాలతో విద్యార్థులు, లెక్చరర్ల పరస్పర మార్పిడికి అటవీశాఖ సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది.

పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు ముమ్మరం
దీనికి అనుబంధంగా ‘ఫారెస్ట్ కాలేజ్, పరిశోధన కేంద్రం’ కూడా రూపుదిద్దుకుంటోంది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిలో ములుగు వద్ద ఐదు హెక్టార్లలో రూ.75 కోట్ల వ్యయంతో కళాశాల, వసతి భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ‘జులై కల్లా ప్రస్తుతం ధూలపల్లిలో కొనసాగుతున్న కళాశాలను ఈ క్యాంపస్‌లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పక్కనే 195 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని చెట్ల ఎదుగుదల, పంటల దిగుబడిపై పరిశోధనలకు ఉపయోగించనున్నాం.’ అని డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్
బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చేసిన వారికి ఇతర రాష్ట్రాల్లో అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. అదే తరహాలో సెక్షన్, రేంజ్, బీట్ అధికారుల పోస్టుల భర్తీలో 25-75 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలని అటవీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
సీఎం ఆకాంక్షల మేరకే మెట్టుపాలయంలోని చిన్న కళాశాల నుంచే 165 మంది ఐఎఫ్‌ఎస్‌లు అయ్యారా? అంటూ సీఎం కేసీఆర్ ఆశ్చర్యపోయారు. మన దగ్గరా అలాంటి కళాశాల పెడదామన్నారు. వెంటనే అనుమతి ఇచ్చారు. అఖిల భారత సర్వీసుల్లో తెలంగాణ పిల్లలకు ఎక్కువ అవకాశాలు రావాలన్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నాం. అటవీ విద్య పూర్తిచేసిన వారికి ప్రభుత్వ రంగంతోపాటు..ప్రైవేటు రంగంలో కలప ఆధారిత పరిశ్రమలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎన్జీఓల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. - ప్రియాంకవర్గీస్, సీఎం ఓఎస్డీ |
80 సంస్థలు ముందుకొచ్చాయి విద్యార్థులను దేశవ్యాప్తంగా వివిధ అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లడంతోపాటు.. వారిలో స్ఫూర్తి పెంచేందుకు ఐఎఫ్‌ఎస్‌లు, అటవీ కళాశాలల్లో చదివి ఐఏఎస్‌లు అయిన వారితో బోధించే ఏర్పాట్లుచేస్తున్నాం. సింగరేణి, పీసీబీ వంటి దాదాపు 80 సంస్థలు ఇంటర్న్ షిప్‌కు ముందుకువచ్చాయి. దేశంలో పేరొందిన విశ్వవిద్యాలయాలతోపాటు..ఎన్‌జీఆర్‌ఐ, సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నాం. - చంద్రశేఖర్‌రెడ్డి, ఫారెస్ట్ కళాశాల డీన్ |