
ఇంటి వద్దే రేయింబవళ్లు చదువులు..!
పోటీ పరీక్షలంటే కోచింగ్ సెంటర్లు, ప్రత్యేక గదుల మధ్య పుస్తకాలతో కుస్తీ పట్టడం సహజం. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. పుస్తకాలకు డబ్బులు లేని దుస్థితిలో తనకు తెలిసిన ఉపాధ్యాయుల నుంచి పుస్తకాలు సేకరించి నిరంతరాయంగా శ్రమించాడు. పగలు చెట్లకింద్ర, రాత్రివేళ విద్యుత్తు సరఫరా లేని సమయాల్లో కొవ్వొత్తి వెలుగుల్లో తన లక్ష్యసాధనకు కృషి చేశాడు. ఈ సందర్భంగా ఆయనను ‘న్యూస్‌టుడే’ పలకరించగా కాయకష్టం చేసి తనను చదివించిన తల్లిదండ్రుల శ్రమ వృథాకానీయనన్నాడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే వారికి తెలియదన్నాడు. డీఎస్సీలోనూ విజయం సాధించి తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకుని, వారి రుణం తీర్చుకుంటానని తెలిపాడు.