అందరికీ వందనాలు!
పోయిన వారం చెన్నైలో జరిగిన హ్యాకథాన్ ముందు ఫైర్‌ఫాక్స్ తెలుగు అనువాదాలు 79%
ఉంటే అవి ఇప్పుడు 85% దాటాయి. మన ప్రగతి గురించి ఏక్సెల్ వ్యాఖ్య:
> Telugu
>
> EXTRA MENTION FOR VERY ACTIVE POST-EVENT. There's continues action each
> day since the weekend, that's awesome! Malayalam wins this one clearly,
> though.
> 46 files changed, 391 insertions(+), 139 deletions(-).
> 376 newly translated strings for firefox, 28 for fennec.
> Diff
> <
https://l10n.mozilla.org/source/diff/?from=e61da1475648&to=aa2c728d065d&repo=releases%2Fl10n%2Fmozilla-aurora%2Fte>
> looks good overall. Various new strings, various fixes, no regressions or
> technical concerns. The post-event diff
> <
https://l10n.mozilla.org/source/diff/?from=aa2c728d065d&to=f3bdde0aff70&repo=releases%2Fl10n%2Fmozilla-aurora%2Fte>
> shows some accesskey fixups (thanks), and various translation improvements,
> plus another bunch of newly translated strings. Keep it up.
>
ఫైర్‌ఫాక్స్ 44 విడుదలకు గానూ అనువాదాలు పూర్తిచేయడానికి మనకు డిసెంబర్ 11
వరకూ మాత్రమే సమయం ఉంది. తలో చెయ్యీ
<
http://mozilla.locamotion.org/te/firefox/> వెయ్యండి మరి
<
http://mozilla.locamotion.org/te/mobile/>.
అన్నట్టు, మీరు ఫైర్‌ఫాక్స్ డెవలపర్ ఎడిషన్
<
https://www.mozilla.org/te/firefox/channel/#developer> వాడుతూంటే, మరుసటి
రోజు తాజాకరణలోనే ప్రతిఫలిస్తాయి.
@కృష్ణబాబు గారూ, ఫైర్‌ఫాక్స్ కూడా సైన్-ఆఫ్ చెయ్యండి.
గమనిక:
అసలు పాఠ్యంలో ఉండే ఆక్సెస్ కీ లను మనం అనువాదంలో చేర్చనవసరం లేదు. ఉదాహరణకు,
అసలు పాఠ్యం ఇలా ఉంటే:
Close Tabs to the R&ight
>
మనం ఆక్సెస్ కీ కూడా ఉండేలా ఇలా అనువదించే వాళ్ళం:
కుడివైపు ట్యాబులను మూసివేయి *(&i)*
>
ఇకపై మనం అలా చేయనవసరం లేదు. ఆక్సెస్ కీలను ఫైర్‌ఫాక్స్ బిల్డు సమయంలో
ఆటోమెటిగ్గా చేరుస్తుంది.
ఇట్లు,
వీవెన్.