ఒక్క మాట చెబుతా-IV [18th Apr 2015] ఇందులో నేను ఎక్కడ ఉన్నాను? -ప్రాముఖ్యత/ప్రాధాన్యత.

13 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 17, 2015, 10:28:00 AM4/17/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 


 

18th April 2015

[ఇందులో నేను ఎక్కడ ఉన్నాను? -ప్రాముఖ్యత/ప్రాధాన్యత]


 

 

ఒకరోజు ఒక అడ్వకేట్ మెహెర్ బాబా వద్దకు వచ్చి "బాబా మీరు రాసిన పుస్తకాలు, మీ గురించి రాసిన పుస్తకాలు దాదాపుగా చదివాను. చదువుతున్నంత వరకు అన్నీ సవ్యంగానే ఉంటున్నాయి


కాని నిజ జీవితంలోకి ప్రవేశించగానే మీరు చెప్పినవన్నీ ఆచరించే సమయానికి అన్నీ ఆవిరై, మరిచిపోతున్నాను.ఎందుకలా జరుగుతుంది? కాస్త వివరణ ఇవ్వండి బాబా అని వేడుకున్నాడు


 

మాటలకి మెహెర్ బాబా స్పందిస్తూ " ప్రశ్నకి సమాధానం నీ నుండే చెప్పిస్తాను." అని అన్నారు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్లి నేను చెప్పే ఒకే ఒక పనిని నిజాయితీగా నిర్వర్తించు.


అదేమిటంటే రేపు ఉదయం నిద్ర లేవడం నుండి తిరిగి పడుకొనే వరకు నీ జీవితంలో{అనుకొనే} నీవు అత్యంత ప్రాముఖ్యత/ప్రాధాన్యతగా భావించే వ్యక్తులను/వస్తువులను{వాళ్ళు/ఇవి లేకుండా ఉండలేను} ఒక తెల్ల కాగితంలో వరుస క్రమంలో 1 నుండి 100 వరకు రాసుకో. రాసిన కాగితాన్ని ఎల్లుండి ఉదయం నా వద్దకు వచ్చి చూపించు


మరొక్కసారి గుర్తు చేస్తున్నాను: " పనిని నిజాయితీగానే నిర్వర్తించాలి సుమా!" అని చెప్పారు

 

అలాగే అనే అడ్వకేట్ తన ఇంటికి వెళ్లి మెహెర్ బాబా చెప్పినట్లు ఉదయం నిద్ర లేవగానే ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని 1,2,3,4 సంఖ్యలను రాసుకొని అందులో తనకు ఇష్టమైన వ్యక్తులను, వస్తువులను రాస్తూ ఉన్నాడు


పని పూర్తి కాగానే మెహెర్ బాబా రమ్మనటువంటి రోజున వెళ్లి కాగితాన్ని మెహెర్ బాబా కి చూపించాడు


ఆశ్చర్యం


సాధారణంగా మనకి ఎవరైనా ఒక కాగితం ఇస్తే పై నుండి క్రింది వరకు చదువుతాము


కాని ఇక్కడ మెహెర్ బాబా మాత్రం అడ్వకేట్ ఇచ్చిన కాగితాన్ని క్రింది నుండి పై వరకు పూర్తిగా చదివి...ఆశ్చర్యంతో... 


"ఇందులో నేను ఎక్కడ ఉన్నాను? అని ప్రశ్నించే సరికి

అడ్వకేట్ కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు


 

నేను కనీసం చివరి 100 లో నైనా ఉన్నానేమో అన్న ఆశగా చూసాను

కాని అక్కడ కూడా నాకు స్థలం లేకుండా దూరంగా ఎక్కడో పారేశావు{Throw}. 


 

ఇక నేను చెప్పేది నీకు ఎలా వినబడుతుంది?

నేను చూపేది ఎలా కనబడుతుంది


 

ఇప్పుడు అర్ధం అయ్యిందా? నీ కాగితమే{ప్రశ్నే} నీకు సమాధానం చెప్పింది

 

 

List లో నన్ను నువ్వు చేర్చలేదు

జీవితం అనే List లో నువ్వు చేరలేదు.

 

అంతే

 


{ అడ్వకేట్  List లోని 1 నుండి 100 వరకు ఏమి రాసుంటాడో మనం తేలికగా ఊహించుకోవచ్చు}


 

 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

 

 

 

 

110-18-Indulo Nenu Ekkada Unnanu.jpg
Reply all
Reply to author
Forward
0 new messages