ఒక్క మాట చెబుతా-IV [28th Apr 2015] పని పెట్టె పని Vs పని లేని పని.

9 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 27, 2015, 9:09:26 AM4/27/15
to mm...@googlegroups.com

ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 


 

28th April 2015

[పని పెట్టె పని {మాయా మోహితుడు-నా పని} Vs పని లేని పని {భగవత్ ప్రేమికుడు -నీ పని}]


 

 

నా పని -సృష్టిలో ఉంటూ, సృష్టితో ఉంటూ, సృష్టి కోసమే పని చేయడం 

 

నీ పని -సృష్టిలో ఉంటూ సృష్టికి సారమైన/ఆధారమైన/మూలమైన 

సృష్టికర్తతో ఉంటూ సృష్టికర్త కోసమే పని చేయడం




 

 

పని పెట్టె పని 

1. నా పనిలో మిగిలితే నీ పని

2. పని చేతిలో పని చేయడం

3. భగవంతుడికే పని పెట్టె పని

4. తోటి సృష్టితో Connect చేసే/అయ్యే పని{ఏడ్చే వాడితో కలిసి ఏడవడం}

5. నచ్చని పని (పాత పని) నుండి నచ్చే పని (కొత్త పని) మళ్ళీ తిరిగి నచ్చని పని (పాత పని) చుట్టూ ప్రదక్షిణాలు చేసే పని

6.నా స్థితికి కారణం కనబడి కనబడకుండా పోయే ప్రపంచమే (వ్యక్తులు/వస్తువులు) అని చూపించి అంధుడిని చేసే పని

7. బ్రతుకు మీద ఎటువంటి నియంత్రణ (నవ్వమంటే నవ్వుతూ; ఏడవమంటే ఏడుస్తూ) లేకుండా చేసి ఇంకా ఇంకా బ్రతికేలా చేసే పని



 

 

పని లేని పని 

1. నీ పనిలో మిగిలితే నా పని

2. పనికే పని పెట్టే పని

3. భగవంతుడి చేతిలో/పనిలో పరికరంగా ఉండే పని

4. సృష్టికర్తతో Connect చేసే/అయ్యే పని

{ఆనందాన్ని ఇచ్చేవాడితో ఉండిపోయి ఆనందంగానే ఉండిపోవడం.}

5. పని నుండి కర్తవ్యం; కర్తవ్యం నుండి భాద్యత వైపు తీసుకెళ్ళే ఖచ్చితమైన పని

6. ఇప్పటి నా స్థితికి, తరువాతి పరిస్థితికి భవిష్యత్తులోని గతికి ఏకైక కారణం (కర్త-కర్మ-క్రియ)భగవంతుడే అని అనుభవించేలా చేసే పని

7. బ్రతికే బ్రతుకు మీద పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన నియంత్రణ ఉండేలా చేసే పని

పనే జీవితాన్ని జీవించేలా, తరించేలా చేస్తుంది.     

పనే నిన్ను జంతుత్వం నుండి మానవత్వం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు ఖచ్చితంగా తీసుకెళుతుంది

 

 

-సూఫీ 

 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

120-28-Pani Pette Pani -Pani Leni Pani.jpg
Reply all
Reply to author
Forward
0 new messages