*** జ్ఞాని పాదాలు ***

7 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Oct 6, 2013, 9:34:36 PM10/6/13
to mm...@googlegroups.com

 ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై

 

*** జ్ఞాని పాదాలు ***

 


భగవంతుడి గురించి తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఎంతో సాధన చెయ్యాలి. పవిత్రమైన దివ్య భావాల మధు మందారలతో ఆరాధించాలి. భగవంతుడి కృప వల్లనే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞాని మానవులందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరిని దైవ స్వరూపంగా ప్రేమిస్తాడు. అటువంటి జ్ఞానులు ప్రాత స్మరనీయులు. వారి పట్ల సదా భక్తి ప్రపత్తులు ప్రదర్శించాలి. వారు పంచే జ్ఞాన కాంతులు ఆత్మ వికాసానికి దోహదం చేస్తాయి. నిజమైన జ్ఞాని ఎవరి నుండి ఏదీ ఆశించడు.

 


ఒక రాజు జ్ఞాని పాదాల పై తన శిరస్సు ఉంచి వినమ్ర పూర్వకంగా అభివందనం చేశాడు. పక్కనే ఉన్న మంత్రికి అది నచ్చలేదు. "దేశానికి రాజుగా ఉన్న మీరు జ్ఞాని పాదాల పై శిరస్సును ఎలా ఉంచారు?" దేశ శార్వభౌమునిగా స్వర్ణ కిరీటాన్ని అలంకరించుకొన్న శిరస్సు మీది." అని మంత్రి అన్నాడు. రాజు "తగిన సమయంలో నీకు సమాధానం చెప్తాను" అన్నాడు.



కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు రాజు మంత్రిని పిలిచి ఒక మేక తలను,పులి తలను, మనిషి తలను తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ విని మంత్రి అయోమయంలో పడ్డాడు. ఆదేశం ఏమిటి అని ప్రశ్నించలేదు. మేక తలను తీసుకొని రమ్మని మంత్రి తన మనుషులను పంపాడు. డబ్బు చెల్లించగానే ఒక కసాయివాడు మేక తల ఇచ్చాడు. పులి తల విపణిలో దొరకదు.

 


 
మంత్రి ఆరి తేరిన వేటగాళ్ళను అడవికి పంపాడు. వారు పులిని చంపి దాని తలను తెచ్చి మంత్రికి ఇచ్చారు. ఇక మనిషి తల -ఎలా సంపాదించాలి? శవం నుంచి మనిషి తలను వేరు చేయడానికి ఎవరూ అంగీకరించరు. ఎలాగో అలాగ అతి కష్టం మీద మనవ శిరస్సు కూడా మంత్రి సంపాదించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు "ఇప్పుడు నువ్వు మూడు తలల్ని ఇచ్చి వెయ్యి" అని అన్నాడు. మళ్ళీ మంత్రి దిగ్భ్రాంతి చెందాడు.

 


 "
కష్టపడి తెస్తే ఇచ్చేయమంటారేమిటి అనుకొన్నాడు మంత్రి. మేక తల ఇవ్వడం కష్టం కాదు. పులి తలను ఎవరూ తీసుకోరు. భయపడతారు. ఎవరినో బ్రతిమాలుకొని ఎక్కువ ధనం ఎర చూపి పులి తల ఇచ్చేసాడు. ఎంత ధనం ఇచ్చినా, ఎన్ని బహుమతులు ఇస్తామన్న మనిషి తల మాత్రం తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాన్ని ఇంట్లో ఎవరూ పెట్టుకోరు. మంత్రి రాజు వద్దకు వెళ్లి "మనిషి తలను ఎవరూ పెట్టుకోరు. మంత్రి రాజు వద్దకు వెళ్లి  "మనిషి తలను ఎవరూ స్వీకరించడం లేదు రాజా!" అన్నాడు.

 

 


అప్పుడు రాజు "మేక తలను కాని, పులి తలను కాని చచ్చిన తర్వాత కొంత విలువ ఉంటుంది. మనిషి తలను ఎవరూ తాకరు. అటువంటి  ఎందుకూ కొరకాని నా తలను జ్ఞాని పాదాల పై ఉంచాను. నేను చేసింది తప్ప?" అన్నాడు.


 

ప్రాపంచిక విషయాలు కాని సుఖాలు కాని వెలువ లేనివి.


 

జ్ఞాని పాదాలకు నమస్కరించడం కన్నా పుణ్యప్రదమైనది మరొకటి లేదు. 

 


పాదాలు మోక్షానికి స్వర్ణ సోపానాలు.

 

 

భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకొన్న జ్ఞాని భగవత్-స్వరూపుడే. 

 


అతని పాదాలు భగవంతుని అమృత పాదాలతో సమానం.

 

 


మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్

Reply all
Reply to author
Forward
0 new messages