ఒక్క మాట చెబుతా-IV [26th Apr 2015] మాయావి సమక్షంలో మాయ కన్నీరు పెట్టుకున్న క్షణం.

4 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Apr 25, 2015, 9:37:17 AM4/25/15
to mm...@googlegroups.com



  ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై 

 ఒక్క మాట చెబుతా-IV

వినకు -రాసుకోకు -గుర్తుపెట్టుకోకు 

కాని గుండెల్లో పదిలంగా దాచుకో 

 

 

26th April 2015

[మాయావి సమక్షంలో మాయ కన్నీరు పెట్టుకున్న క్షణం]

 

 

క్షణమైతే మాయ మాయావి వద్దకు ఏడ్చుకొంటూ వస్తుంటే... 

 

మాయావి మాయతో " మాయా! ఏమైంది నీ మాయ?

నా ప్రేమికుడి మీద క్షణ కాలమైన ప్రభావం చూపిందా?  అని ప్రశ్నించగా


 

మాయ మాయావికి సమాధానం ఇస్తూ... 

"సృష్టిలోని ప్రతీ జీవ రాశి మనిషితో పాటు నా భాదితులే


 

ప్రతీ ఒక్కరిని నన్ను నమ్మేలా, నా మీద ఆధారపడి  బ్రతకమని శాసిస్తూ 

కొన్ని యుగాలుగా వాళ్ళందరిని నా బానిసలుగా చేసుకొని హాయిగా గడిపేశాను


 

కాని నువ్వు యుగానికి అవతార పురుషుడిగా భువిపై

అవతరించిన తరుణంలో నా హాయి దాదాపు పోయేలా ఉంది


 

సృష్టి పై నువ్వు ప్రసరింప చేసే ప్రేమ ప్రకాశం నా చీకటి సామ్రాజ్యాన్ని కదిలిస్తోంది

 నన్ను మాయమయ్యేలా, నేను విసిరే మొహాన్ని మాయం చేసేలా ఉంది నీ దైవీహిక ప్రేమ


 

నీ దాక అవసరం లేక పోయినా నీ ఒక్క వాస్తవ ప్రేమికుడు ఒక్కడు చాలు నన్ను మాయం చెయ్యడానికి

 కాబట్టి ఇదే నా ఏడుపుకి కారణం

 


సృష్టిలోని వాళ్ళందరూ (నాలో, నాతో) నా భాదితులే {మాయా భాదితులు} అయితే నేను మాత్రం 

నీ ప్రేమికుడి భాధితుడిని అని  మాయ మాయావికి తన గోడును కన్నీటితో చెప్పుకొనే క్షణమే... 

 


శాశ్వత ప్రియతముడు;

అవతార్ పురుషుడు;

సృష్టికర్త;

నిత్య సహచరుడు;

ఉన్నతోన్నతుడు మెహెర్ బాబా తన స్థాయిలోనే ఆనందపడి పొంగిపోయే క్షణం

 


క్షణమే కరుణామయుడు ముందుకు వచ్చి తన ప్రేమికుడిని

ఆలింగనం చేసుకొనే మధురానుభూతి కల్గిన క్షణమే... 


 

ప్రేమికుడు అనే జీవాత్మ ప్రియతముడు అనే పరమాత్మలో ఏకం అయ్యే ఏకైక క్షణం

 

 

 

You Must Always Laugh at Illusion. -Avatar Meher Baba 


 నీవు ఎల్లప్పుడూ మాయ వైపు చూపి నవ్వుతూ ఉండాలి. -అవతార్ మెహెర్ బాబా 

 

 

 

-మెహెరా మెహెర్ స్కూల్ అఫ్ అవేకేనింగ్ 

 

బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం 

బ్రతికించడం మానవత్వం -అర్ధం 

బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం 

119-26-Maayavi -Maya Edupu.jpg
Reply all
Reply to author
Forward
0 new messages