గదాదర్ -హృదయ పరిశుద్ధత/పవిత్రత.

2 views
Skip to first unread message

Avg.Hariprasad

unread,
Oct 28, 2014, 9:42:57 AM10/28/14
to mm...@googlegroups.com

 ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై

 

గదాదర్ -హృదయ పరిశుద్ధత/పవిత్రత

 

ఒకరోజు గదాదర్ {రామకృష్ణ పరమహంస} తన తల్లి అయిన కాళికా మాత కళ్ళలోకి చూస్తూ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు:

"అమ్మా! ఎందుకంత దిగులుగా ఉన్నావు?

ఏమైంది నీకు? 

నా వలన ఏమైనా పొరపాటు జరిగిందా?

నిన్ను ఇలా చూస్తుంటే నా హృదయం తట్టుకోలేక ఉన్నాను. 

మాట్లాడమ్మ...నేను నీ బిడ్డనే కదమ్మా. నాకు కూడా చెప్పకూడదా?

ఈ విధంగా గదాదర్ కొంతకాలంగా ఆంతరికంగా వ్యధ చెందుతూ ఉన్నాడు. 

 

మరోవైపు రాణి రాస్మని దేవి అల్లుడు అయిన మధుర్ బాబు గదాదర్ కి పిచ్చి పట్టింది అని {అమ్మ మీద గల అపార తపన చాలా మందికి పిచ్చిలా కనబడేది} 

అభిప్రాయపడి ఎలాగైనా సరే గదాదర్ ని ఈ ప్రాపంచిక వ్యామోహంలో మంత్రముగ్డుడ్ని చేసి ఇక ముందు అమ్మ అనే మాట కూడా అనకుండా చేయాలని ఆలోచించాడు. 


ఒకరోజున మధుర్ బాబు గదాదర్ వద్దకు వెళ్లి "బాబా, నేను కలకత్తా నగరానికి వెళ్తున్నాను వస్తావా?" అని అడిగాడు. 

అమ్మ పంపితే తప్పకుండా వస్తాను అని చెప్పి బయల్దేరి కలకత్తా నగరానికి ఇద్దరు చేరుకొంటారు. 

{కలకత్తా నగరంలోని ఒక ప్రముఖ వేశ్య లక్ష్మి వద్దకు గదాదర్ ని తీసుకొని వెళ్లి అతని స్థితిని మార్చాలనేది మధుర్ బాబు ఆలోచన.}

 

ఇద్దరూ ఆ వేశ్య గృహంలోకి  ప్రవేశించారు. కాసేపటి తర్వాత లక్ష్మి గదాదర్ ముందు నిలబడి నృత్యం చేయడం ప్రారంభించింది. 

గదాదర్ మీదనే ఏకాగ్రత కలిగి తన చూపుతో ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. 

 

ఈ విధంగా లక్ష్మి నృత్యం మొదలు పెట్టిన క్షణం నుండి గదాదర్ కంటి వెంట కన్నీటి ధార సాగుతూ ఉంది. 

ఈ గదాదర్ యొక్క కన్నీరును చూసిన మధుర్ బాబు "ఆహా తను అనుకున్న పని పూర్తి అయినది అని ఎంతగానో మురిసి పోయాడు.{పాపం అసలు విషయం తెలియక}

 

లక్ష్మి తన నృత్యాన్ని ఆపగానే గదాదర్ వెంటనే లక్ష్మి వైపు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొంటూ ఆవిడ పాదాల మీద పడి 

         "అమ్మ అమ్మా అమ్మా ఎంత కాలమైంది నిన్ను ఇంత ఆనందంగా చూసి.

           ఇంత ఆనందంగా నిన్ను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. 

           ఇప్పటికి నీ దిగులు తీరిందా అమ్మా?  

           ఇప్పుడు నా హృదయం కుదుట పడింది.  

 

          నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి అమ్మా. 

         నువ్వు ఇలా ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి నన్ను ఏమి చేయమంటావు చెప్పు అమ్మా. 

 

          ఎందుకో తెలుసా జగజ్జనని నీ ఆనందంలోనే నా ఆనందం దాగి ఉంది. 

 

 

ఈ సంఘటనంతా గమనిస్తున్న చుట్టూ ఉండే వాళ్ళు లక్ష్మితో సహా దిగ్భ్రాంతి చెందారు, ఇక మధుర్ బాబు కి అయితే ఏమీ మాట్లాడలేక అలా నిలిచి ఉండి పోయాడు. 

 

తాను చేసిన పనికి లోపల ఎంతగానో సిగ్గు పడ్డాడు. గదాదర్ సామాన్యుడు కాదని ఏ స్థాయిలో గదాదర్ పవిత్రంగా ఉన్నాడు  ఆ క్షణం గ్రహించాడు. 

 


-------------------------------------------------------------------------------------------------------

అందుకనే ప్రియతమ అవతార్ మెహెర్ బాబా ఇలా పలికారు:

నన్నే అంటి పెట్టుకొని ఉండాలంటే మీ హృదయం పరిశుభ్రంగా ఉండాలి. 


అలా హృదయం పరిశుభ్రంగా ఉండాలంటే జీవితంలో జరిగే/జరగని 

ప్రతీ దాని వెనుక బాబా నిర్ణయింపబడినవి అనే ధృడ విశ్వాసం కలిగి ఉండాలి. 


ఆ విధంగా మన హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకొంటూ అవతారుడి దివ్య పాదాలకు 

చేరువ అయి బ్రతకడం అనే అపవిత్రతను దూరం చేసి పవిత్రత అనే జీవితంలో తరిద్దామ్...  

=====================================================================

 

 

Gadadar Clean Heart -Purity.jpg
Reply all
Reply to author
Forward
0 new messages