ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై
సత్పురుషుల జీవితంలోని సంగతులు
{సంసారమంటే మనస్సంసారమే}
1 డిసెంబర్ 1945
ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు నడివయస్సు వారు రమణ మహర్షి దగ్గరికి వచ్చి
"స్వామీ! నేను రామ నామం నియమంగా ఒక గంట, సాయంత్రం ఒక గంట జపిస్తూ ఉంటె
కొంత సమయానికే ఆలోచనలు ఒక్కొక్కటిగా వచ్చి కాసేపటకి ఎక్కువై నేను చేసే జపం మరిచేలా చేస్తుంది. ఏమి చేసేది? అన్నాడు.
అప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు రమణ మహర్షి.
ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసారం కదా, అందువల్ల సంసారం వదిలేద్దామా అని ఆలోచిస్తున్నాను అన్నాడు.
ఓహో ... అలాగా! అసలు సంసారం అంటే ఏమిటి? అది లోపల ఉన్నదా? బయట ఉన్నదా? అని ప్రశ్నించారు మహర్షి.
భార్యా పిల్లలు ఇలాంటివే స్వామి సంసారం అన్నాడాయన.
అదేనా సంసారం?
వారేమి చేశారండి?
అసలు సంసారం అంటే ఏమిటో ఏదో తెలుసుకోండి ముందు.
ఆ తర్వాత విడిచిపెట్టడం గురించి ఆలోచిద్దాం అన్నారు మహర్షి.
భార్యా పిల్లలను విడిచి వస్తారనుకోండి.
ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది.
సన్యసిస్తారనుకోండి.
కర్ర, కమండలం ఇలాంటి వాటితో అదొక సంసారంగా పరిణమిస్తుంది.
ఎందుకదీ?
సంసారమంటే మనస్సంసారమే.
ఆ సంసారాన్ని విడిచి పెడితే ఎక్కడ ఉన్నా ఒకటే, ఏదీ భాధించదు. అన్నారు రమణ మహర్షి.
{శ్రీ రమణాశ్రమ లేఖలు పేజీ.18}
{1}.Ramana Maharshi was a Genuine Sixth Plane Saint. -Avatar Meher Baba {LordMEHER Pg.1217 (Footnote)}
{2}. ఆరవ భూమికను చేరుకోవడంలో కృతకృత్యుడైన బాటసారిని పీర్ లేక సత్పురుషుడు అని పిలువబడడానికి అర్హుడు అవుతాడు.
ఈ పదమునకు సరియైన ఆంగ్ల తర్జుమా లేదు. సాధువు{Saint} అనవచ్చునేమో కాని అది చాలా తేలికగా వాడబడుతుంది. -అవతార్ మెహెర్ బాబా {భగవద్-వచనములు పేజీ.342}
***************************************************************
ఆ క్షణం రాదిక మరుక్షణం కాబట్టే మొదలుపెట్టు తక్షణం
-Mehera Meher School of Awakening
బ్రతకడం జంతుత్వం -వ్యర్ధం
బ్రతికించడం మానవత్వం -అర్ధం
బ్రతుకునే ఇవ్వడం దైవత్వం -పరమార్ధం