ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై
అజ్మీర్ లో అవతారుడు
{1/3}. మొదటి పర్యటన -14th September 1922
11 సెప్టెంబర్ 1922 వ తేదిన బాబా గుస్తాద్జి, ఘనీ, సదాశివ్, ఆది మరియు సయ్యద్ సాహెబ్ లతో పాటు బొంబాయి నుండి గుజరాత్ మెయిల్ లో బయల్దేరి అదే రోజున అర్దరాత్రి సమయంలో అజ్మీర్ చేరుకొన్నారు.
అందరూ ఎడ్వార్డ్ మెమోరియల్ సెరాయ్ హోటల్ నందు బస చేసారు. అక్కడే బాబాకి నీళ్ళ విరేచనాలు మూలంగా తీవ్రమైన అస్వస్థకు గురయ్యారు. తరువాతి రోజు అనగా 12 వ తేది బాబా తప్ప (ఆరు సార్లు విరేచనాల కారణంగా) మిగతా వారందరూ చక్కగా విశ్రమించారు.
14 సెప్టెంబర్ గురువారం రోజున బాబా ఆజ్ఞల ప్రకారం సద్గురువు ఖ్వాజా సాహెబ్ ము'ఇనుద్దిన్ చిష్టి సమాధి సందర్శనార్ధం కారణంగా అందరిని ఉపవాసం ఉండమన్నారు.
చిష్టి అతని సమయంలో కుతుబ్-ఎ-ఇర్షాద్ గా ఉండడం మూలంగా ప్రసిద్ధి అయ్యారు. బాబా చెప్పిన విధంగా సయ్యద్ సాహెబ్ మరియు ఘనీ చిష్టి సమాధి వద్ద ఫతేహ పటించారు/ఉచ్చరించారు.
{లార్డ్ మెహెర్ పేజి.323}
{2/3}. రెండవ పర్యటన -9th June 1935
అజ్మీర్ లో కుతుబ్ ఖ్వాజా ము'ఇనుద్దిన్ చిష్టీకి గౌరవ వందనాలు తెలుపడానికి బాబా టాక్సీ లో బయల్దేరారు. బాబా చిష్టి దర్గాలోనికి ప్రవేశించగా మండలి మాత్రం కారు లోనే ఉండిపోయారు.
బాబా లోపల ఉన్నంత వరకు గడ్డంతో ఇద్దరు వృద్దులు హటాత్తుగా కనబడి బాబా టాక్సీకి ఇరువైపులా నిలబడినారు. ఎప్పుడైతే బాబా దర్గా నుండి బయటకి వచ్చారు.
ఆ ఇద్దరు మాత్రం కారు పక్కనే నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. వాళ్ళ వింతైన ప్రవర్తనకు గుస్తాద్జి, రావుసాహెబ్ మరియు చాన్జీ లు ఆశ్చర్య పోతున్నారు.
కాని బాబా వాళ్ళ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు: "వాళ్ళు నాకు ఇక్కడ సేవ చేసే ఉద్దేశ్యంతో ఖ్వాజా సాహెబ్ ద్వారా పంపబడ్డారు."
{లార్డ్ మెహెర్ పెజి. 1681/2}
{3/3}. మూడవ పర్యటన -16th Feb 1939
ఎరుచ్ గుర్తుకు తెచ్చుకుంటూ ....
ఒకనాటి రాత్రి బాబా ఒంటరిగా చిష్టి సమాధి వద్దకు వెళ్లి తన శిరస్సును సద్గురువు సమాధిపై కొన్ని వేళ్ళ సార్లు ఉంచారు.
{లార్డ్ మెహెర్ పేజీ.1990/1}