ప్రియతమ అవతార్ మెహెర్ బాబా కి జై
[ఓ భగవంతుడా! ]
భగవంతుడు మనిషిని ఏమి కావాలో కోరుకో అని అడిగినప్పుడు ఏ విధంగా కోరుకోవాలో ఓ తత్వవేత్త ఈ విధంగా ప్రార్దిస్తున్నాడు:
ఓ భగవంతుడా!
నేను మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విధంగా ఉన్నానో తెలుసుకోగలిగే ఆత్మ విశ్లేషణ
నాకు ఇవ్వు;
నేను భయపడ్డప్పుడు ఆ భయానికి గల కారణం తెలుసుకోగలిగే ధైర్యానివ్వు;
ఒక ఓటమిలో కూరుకుపోయినప్పుడు గర్వంగా ఆ ఓటమిని ఒప్పుకోగలిగే సాహసమివ్వు;
గెలిచినప్పుడు ఆ గెలుపును గర్వంగా మారనివ్వని వినమ్రతని ఇవ్వు.
ఓ భగవంతుడా!
ఆశలని మెదడులో నింపకు;
ఆశలని హృదయంలో ఉంచి అవి నెరవేరే ఆలోచనలను మెదడులో నింపు.
నన్ను నేను తెలుసుకోవడానికి నా విజ్ఞానానికి మొదటి పాటం అన్న ఇంగిత జ్ఞానాన్ని ఈ
క్షణం నుండే నాకు ఇవ్వు.
నా జీవితాన్ని పూల పాన్పు చేయకు, ముళ్ళ బాధ తెలిసిన తర్వాత పూల తాలూకు మెత్తదనం
మరింత అర్ధమవుతుందన్న పాటాన్ని నాకు నేర్పు.
ఓ భగవంతుడా!
నా హృదయం స్వచ్చంగా, నా గమ్య ఎత్తుగా, నా ఆలోచనలు నిర్దుష్టంగా సాగేటట్టు చెయ్యి.
హాయిగా నవ్వడం ఎలాగో నాకు నేర్పు.
దుఃఖాన్ని మరువనీయకు.
ఓ భగవంతుడా!
హాస్యాన్ని ఆస్వాదించే గుణాన్ని నా నుంచి దూరం చేయకు.
అందువల్ల నేను ఎంత సీరియస్ ఉండాల్సిన పరిస్తితులోనైన నన్ను నేను కొల్పాను.
నాకు కొద్దిగా అణుకువను ఇవ్వు. అందువల్ల ఎంత గొప్ప గెలుపులోనైన నన్ను కోల్పోను.
పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి ఇవే మూల కారణాలని
నేను విశ్వసిస్తున్నాను.