Fwd: Spiritual astrology +2

60 views
Skip to first unread message

Adusumilli Bharathi

unread,
Sep 9, 2022, 1:48:41 AM9/9/22
to mihira...@googlegroups.com

---------- Forwarded message ---------
From: Bharathi Astrology <astrolog...@gmail.com>
Date: Fri, 9 Sep, 2022, 10:41 am
Subject: Spiritual astrology +2
To: <bharat...@gmail.com>


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
( Lectures given in Munich in the year  1981,82,83)

*Second level -53*
- Master E.K.

ఈ సాయంత్రం నన్ను ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి మాట్లాడమని అడిగారు. ఆధ్యాత్మికత అనగా ఆత్మ కి సంబంధించినది. జ్యోతిష్యము అన్న పదానికి నిజమైన అర్థం జ్యోతి ( వెలుగు, ప్రకాశం, light )  ని గురించి వివరించే శాస్త్రం. కానీ వాడుకలో అది గ్రహాల కి సంబంధించిన శాస్త్రంగా, మనమీద గ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయో తెలియచేసే శాస్త్రంగా ప్రసిద్ధికెక్కింది. కానీ శాస్త్ర గ్రంథాల ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి నిజమైన అర్థం జ్యోతి( ప్రకాశం,వెలుగు light) గురించి వివరించే విద్య.

మనందరికి వెలుగు అనగా ఏమిటో తెలుసు అని అనుకున్నా, నిజంగా వెలుగుని గురించి ఏమీ తెలియదు. ఒక చిన్న పిల్లవాడు తేనె బొట్టు రుచి చూస్తే ఆ పదార్థం ఎలా  ఉంటుందో వాడికి  తెలిసినా దాని పేరు, అది ఎలా తయారయిందో, దాన్ని ఎవరు తెచ్చారో ఈ విషయాలేమీ తెలియవు. అలాగే మనకి కూడా light ( వెలుగు)  కి నిజమైన అర్థం తెలియదు.

శాస్త్రజ్ఞులు light,  శక్తా ( Force) లేక పదార్థమా ( Matter) అని ఊహిస్తున్నారు కానీ, ఇంకా పరిశోధనలు పూర్తి కాలేదు.
కానీ ప్రాచీన శాస్త్రవేత్తలు వెలుగు
(Light)  అనగా చైతన్యము యొక్క ఒక భాగమే ( a degree of consciousness) అని తెలియ చేసారు.

- to be 


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2nd level--54*
-Master E.K

నవీన శాస్త్రజ్ఞుల ఊహాగానాల కన్నా , light ( వెలుగు) అనగా చైతన్యం లోని ఒక కోణమే  అని మన ప్రాచీనులు చెప్పినది ఎంతో హేతుబద్ధమైనదని నాకనిపిస్తుంది.
Light అనగా మన కళ్ళని ప్రకాశింప చేసేది అని మనకి తెలుసు.ఇది కాకుండా మన మనస్సుని ప్రకాశింప చేసే ఇంకొక light ఉంది. దానిని మనం mental light ( మానసిక వెలుగు/ ప్రకాశము) అని పిలవవచ్చు. అలాగే విషయాలను అవగాహన చేసుకునేలా మన చైతన్యం విస్తరించి, ఇంకా   ఉన్నత స్థాయిలలో  కూడా విస్తరిస్తుంది.
చైతన్యం లోని ఈ స్థాయిలన్నిటినీ మన ప్రాచీనులు వెలుగు ( light)
అని భావించారు.ఈ వెలుగు/ ప్రకాశమును ( Light) గురించిన శాస్త్రాన్ని వారు వివరించారు. దానినే వారు జ్యోతిష్య శాస్త్రంగా పేర్కొన్నారు.

-to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*Second level- 55*
- Master E.K

ఉదాహరణకి ఒక గదిలో light  switches, table light, bed light మొదలైన పరికరాలన్నీ ఎక్కడ ఉన్నాయో, వాటిని ఎలా వాడుకోవాలో తెలియచేసే ఒక manual ఉందనుకోండి. నేను 
గదిలోకి ప్రవేశించే ముందే దానిని చదువుకోవాలి. అలా నేను ఆ పుస్తకాన్ని( manual) చదవకపోతే దాని పర్యవసానం, 
ఆ switches, ఆ  bed light, table light ఎక్కడో ఉన్నాయో తెలియదు కాబట్టి నేను చీకటిలోనే నిద్రపోవలసి వస్తుంది. ఆ చీకట్లో పుస్తకం కూడా చదవలేను.
అందువలన light ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మన మీదే ఆధారపడి ఉంటుంది.ఇదే సత్యం జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగించుకునే 
విషయంలో కూడా వర్తిస్తుంది. ఇదే విషయాన్ని శాస్త్రాలలో కూడా చెప్పారు. గదిలో దీపం 
వెలిగించినపుడు ఆ దీపపు వెలుగుతో ఆ గది ప్రకాశిస్తుంది. అలాగే అందులో ఉన్న వస్తువులు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుస్తుంది. ఆ గదే నీ జీవితమని, ఆ దీపమే జ్యోతిష్య శాస్త్రమని శాస్త్రాలు చెపుతున్నాయి. మన జీవితం చీకటి గదిలా ఉండకుండా ప్రకాశవంతంగా ఉండడం ఒక వరం.

ఎవరైనా జ్యోతిష్యం చెప్తున్నారు అంటే అది తప్పు కాదు కానీ ఇంత దివ్యమైన శాస్త్రాన్ని అతి స్వల్ప  ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని చెప్పవచ్చు.
మనకున్న అపారమైన ఇంగితజ్ఞానం తోను, సునిశితమైన ఇంద్రియ జ్ఞానంతోను జ్యోతిష్య శాస్త్రాన్ని ఉన్నతమైన ప్రయోజనాలకి ఉపయోగించుకోవచ్చు.

- to be continued


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2nd level -56*
- Master E.K

రాశశి చక్రంలోని పన్నెండు రాశులను తొమ్మిది గ్రహాలను తెలుసుకుని, వాటిని గురించిన జ్ఞానాన్ని పెంపొందించుకుని ఉపయోగించుకోవడానికి, మనకి జ్యోతిష్య శాస్త్రాన్ని అందించారు.
మొట్టమొదట మనిషి ఏడు గ్రహాలనే గుర్తించాడు.ఆ పైన తొమ్మిది గ్రహాలను, క్రమంగా పన్నెండు గ్రహాలను గుర్తించాడు.
భవిష్యత్తులో మనిషికి 33 గ్రహాలతో పరిచయం ఏర్పడుతుందని
శాస్త్ర గ్రంథాలలో వివరించారు.
ఈ ఆధునిక కాలంలో 33 గ్రహాలని పరిశోధించి తెలుసుకుని, వాటి 
ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలి. ఏది ఏమైనప్పటికి 
Type machine లో లేదా advanced computer లో ఉన్న key board లాగా,
రాశి చక్రంలోని రాశులని, గ్రహాలని ప్రకృతి మనకి   అందించింది. మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి  శిక్షణ పొందడం మనమీద ఆధారపడి ఉంటుంది. తన వద్ద ఉన్న type machine తో కొత్త విద్యార్థి అయితే తప్పులు చేస్తూ ఉంటాడు. అదే type machine తో, అదే key board తో , ఒక వ్యాపార వేత్త తన లావాదేవీలు type చేస్తాడు. ఒక రచయిత తన సాహిత్యాన్ని type చేస్తాడు. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనా వ్యాసాలను type చేస్తాడు.
 అదే type machine తో అదే key board తో  సృష్టిలో ఉన్న ఏ విషయాన్నైనా ప్రజలకి తెలియచేయగలము.

అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో అక్షరమాలగా చెప్పబడే రాశి చక్రం లోని రాశులు గ్రహాలు, సమాచారాన్ని ఇస్తాయి.
మనం దేనితో తయారు చేయబడ్డాము,మన గ్రహం దేనితో తయారయింది, సౌర కుటుంబం మొత్తం ఎలా తయారయింది, అనే సమాచారాన్ని అవి ఇస్తాయి.

- to be continued



*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2nd level-57*
- Master E.K

*The key is in your  hands*
( తాళం చెవి మీ చేతుల్లోనే ఉంది)

మనం స్వయం సంకల్ప ( self- willed) అనగా మనము అనుకున్నది మొండిగా చేసే యంత్రాలుగా తయారు చెయ్యబడ్డాము. భద్రత కోసం, రక్షణ కోసం ఇలా రకరకాల కారణాల వలన మనకి మనమే పరిమితులను ఏర్పరుచుకున్నాము. ఈ పరిమితులను గ్రహాలు ఎంతమాత్రం ఏర్పరచలేదు.
గ్రహాలు మనలోని ప్రవృత్తులను ప్రేరేపిస్తాయి. వీటిని మనం సరి అయిన పద్ధతిలో వాడుకోవచ్చు, లేదా తప్పుగా వాడుకోవచ్చు.
ఈ ప్రవృత్తులే మన మానసిక వ్యవస్థ మీద కీబోర్డ్ లా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరు వారి మనస్తాత్విక కంప్యూటర్ కి సరిగా కానీ, తప్పుగా కానీ సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. తప్పుడు సమాచారం ఇస్తే ఫలితాలు అలాగే వస్తాయి. దారి తప్పుతూ ఉంటారు. తన తప్పు తెలుసుకున్న వెంటనే తాను అందించిన సమాచారాన్ని తుడిపేసి, ఇంకా మెరుగైన పద్ధతిలో తమ మనస్తాత్విక కంప్యూటర్స్ కి సమాచారాన్ని అందిస్తారు.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level -58*
- Master E.K

*The will and the reflection*
( సంకల్పము మరియు ప్రతిబింబము)

ప్రకృతి మనకి సంకల్పాన్ని ( ఇచ్ఛని) ప్రసాదించింది. 
కనుక, ప్రకృతి తన సంకల్పానికి మనల్ని బందీలుగా  చేయాలని  అనుకోదు. మన సంకల్పం ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి ప్రకృతి మనకి భాషని ఇచ్చింది.
రాశి చక్రంలో రవి ఉన్న స్థితిని బట్టి మన సంకల్పం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. చంద్రుడు ప్రతి బింబించు లేదా ప్రతిఫలించు ప్రక్రియకు కారకుడు కాబట్టి, ఆ సంకల్పం లోని స్వచ్ఛత ( సంకల్ప బలం) జాతక చక్రంలో చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి తెలుస్తుంది.
సూర్యకిరణాలు చంద్రుని ద్వారా ప్రతిబింబించి భూమికి వచ్చినపుడు దానిని చంద్రకాంతి గా మనం తెలుసుకుంటాము.
ఇదే విధంగా మనస్సు మన సంకల్పం నుండి, ఆత్మనుండి ప్రకాశాన్ని గ్రహిస్తుంది. మనది అనుకునే మన స్వంత  అభిప్రాయాలు, భావనలు అన్నీ కూడా మనలో ఉన్న సత్యం యొక్క ప్రతిబింబాలే. కానీ ఎప్పుడూ ప్రతిబింబించే వన్నీ 
సత్యమవదు. కొన్ని సార్లు వక్రీకరణ చెందవచ్చు. అద్దం సరి అయిన కోణంలో లేకపోతే ప్రతిబింబం వక్రంగా కనబడుతుంది. ఒకొక్క సారి అద్దం సరిగా అమర్చక పోతే మన ముఖం సగమే కనిపిస్తుంది.  వెలుగు అద్దం మీద సరిగా పడకపోతే కూడా అద్దంలో చిత్రం సరిగా కనిపించదు. అద్దం వెనకాల వెలుగు ఉంటే అద్దంలో మన ముఖం సరిగా కనిపించదు.
అద్దాన్ని కొంత చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టి మన ముందు కాంతి ఉంటే కనుక మన ముఖం అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level -59*
- Master E.K

*The will and the reflection*
*సంకల్పము మరియు ప్రతిబింబము*

అదే విధంగా మనస్సు సక్రమంగా పనిచేస్తోందో లేదో  తెలుసుకునే విషయంలో కూడా చూడాలి.మనం మన మనస్సుని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే విషయం జాతకంలో చంద్రుని స్థితిని బట్టి తెలుసుకోవచ్చు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మన మనస్సులో ఎక్కడో, ఏదో దోషం ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.
దాని అర్థం అలాంటి మనసుతో  జీవితమంతా  దురదృష్టంతో కృంగిపొమ్మని కాదు. కొంత జాగ్రత్తలు తీసుకుని, సరి అయిన శిక్షణలో మనస్సుని మలుచుకుని సరిచేసుకోమని ఇది సూచిస్తుంది.

మనం బాగుపడడానికి మార్గం చూపకపోతే జ్యోతిష్యశాస్త్రం వలన ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు.
ప్రతిదీ  ముందే రాసి పెట్టి అలాగే జరుగుతూ ఉంటే జ్యోతిష్యం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒకటే.
ఒకొక్కపుడు తెలుసుకోక పోవడమే మంచిది.
ఎందువలన అనగా మనకి ముందే తెలుస్తే మన స్పందన ఆ విషయంలో తప్పుగా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో జ్యోతిష్య శాస్త్రం వలన మేలు కంటే కీడు జరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి.
కానీ అన్ని దేశాలకి సంబంధించిన ప్రాచీన ఋషులు జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతో ఆదరంతోను, నమ్మకంతోను మనకి అందించారు. ప్రయోజనం లేనిదే శాస్త్రాన్ని ఎవరూ ఇవ్వరు.
( ప్రయోజనం ఉంటేనే శాస్త్రాన్ని ఋషులు ఇస్తారు.)  ఇంకా వారు, ప్రాచీనులు ఈ శాస్త్రాన్ని ఎలా ఉపయోగించుకున్నారో తెలియచేసే విధంగా మార్గదర్శకాలు ఇస్తామని కూడా వాగ్దానం చేసారు.

---- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level  -60*
- Master E.K.


*The will and the reflection*
*సంకల్పము మరియు ప్రతిబింబము*

ప్రకృతి శక్తులు విశ్వ స్థాయిలో పనిచేస్తాయి. భూగోళంలోని  శక్తులు మరియు ప్రజ్ఞలు భూమి మీద నివసించే జీవులందరిలోను  పని చేస్తాయి. అందరికి వేరుగా వ్యక్తిగతంగా అవి పనిచేయవు.గడప గడపకి వచ్చి నీకు ఏం కావాలని గ్రహాలు అడగవు. ప్రతి ఒక్కరి అవసరాలు చక్కగా తీర్చడానికి అవి సిద్ధంగా ఉంటాయి. రైల్వే ట్రెయిన్ ప్రతి ఇంటికి వచ్చి ప్రయాణానికి సిధ్ధం అవమని చెప్పదు.అదే సమయంలో ప్రయాణానికి 
సిధ్ధమైన వారికి అది సేవలు అందిస్తుంది. దానికిగాను మనం చేయాల్సింది కొంత ఉంటుంది, రైలు చేయాల్సింది కొంత ఉంటుంది. మనం రైల్వే టిక్కెట్టు కొనుక్కుని, నిర్ణీత సమయంలో రైలు స్టేషన్ చేరుకుని, బండి కదిలేలోపు అందులోక ఎక్కి కూర్చుంటే అది సురక్షితంగా మనల్ని గమ్యానికి చేరుస్తుంది.
జీవితంలో మనం చేయవలసినది చేయాలి అన్నది యథార్థం. అప్పుడే మనకి గ్రహాలు సహాయపడతాయన్నది కూడా యథార్థం.

- to be continued


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level- 61*
- Master E.K

*Planets help for expansion*

*గ్రహములు వికాసం చెందడానికి తోడ్పడతాయి*

మన చైతన్యం విస్తరించడంలో గ్రహాలు మనకి సహాయం చేస్తాయి. ఎలా వికాసం చెందాలి అని మనం భావన చేయడం మొదలు పెట్టాలి. ప్రతి స్థాయిలోను మన చైతన్యం విస్తరించవలసిన అవసరం ఉందని  మనం భావించినప్పుడు గ్రహాలు మనకి సహాయం చేస్తాయి. మనకి ఏదైనా ఆలోచన వచ్చిన వెంటనే దానితో ప్రత్యక్షంగా సంబంధించిన క్రియ బాహ్యంలో జరుగుతూ ఉంటుంది.
అదేవిధంగా  పురోగతి చెందాలి, మన చైతన్యం విస్తరించాలి అనే తపన మనలో తీవ్రంగా ఉన్నపుడు, మన చైతన్యం సత్యములోనికి , అంతకంటే మరింత ఎక్కువగా దాని యొక్క జ్ఞానములోనికి విస్తరించే విధంగా మనకి సహాయం చేసే గ్రహాలు ఉన్నాయి.

-to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level- 62*
--- Master E.K

*Planets help for expansion*

*గ్రహములు వికాసం చెందడానికి తోడ్పడతాయి*

మన చైతన్యం విస్తరించాలని మనలో ఉన్న తపనకి అనుగుణంగా గ్రహాలు మనకి తోడ్పడతాయి. మనం నిజమైన జ్యోతిష్యశాస్త్ర ప్రయోజనాన్ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.

రాశిచక్రంలోని 12 రాశులను వాటి కారకత్వాలను అర్థం చేసుకుంటే, ఈ గ్రహాలే  మన మానసిక కక్ష్యలలో మన ప్రవృత్తులుగా  (లక్షణాలుగా,స్వభావాలుగా)ఉంటాయని అర్థం అవుతుంది. అలాగే ఈ భూగోళం మీద  కూడా గ్రహ స్వభావాలు శక్తులుగా పని చేస్తూ ఉంటాయి. ఇవి మన ప్రవృత్తులకు అయస్కాంత స్పర్శని ఇస్తూ ఉంటాయి.
మీలో ఉన్న ప్రవృత్తులను ఒక ఇనుప బంతి గాను, భూగోళం మీద పనిచేసే గ్రహ శక్తులను అయస్కాంతంగాను ఊహించుకోండి.

ఉదాహరణకి మన జేబులో ఒక ఇనుప బంతి ఉండి, మన చేతిలో ఒక అయస్కాంతం ఉంటే , మన చేతిలోని అయస్కాంతాన్ని బయట  తిప్పుతున్న కొలదీ లోపల మన జేబులో ఉన్న ఇనుప బంతి అయస్కాంతీకరణ చెందుతుంది. దీనికి కారణం బయట ఉన్న అయస్కాంతం మనవైపు పనిచేస్తోంది.
ఇదే విధంగా గ్రహాలు మన స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 63*
- Master E.K

*Planets help for expansion*

*గ్రహములు వికాసం చెందడానికి తోడ్పడతాయి*

మనలో ప్రేమ, ద్వేషం, ఇష్టము, అయిష్టము,అసూయ,అనుమానము, భయాలు ఇవన్నీఅడ్డుపడి మనలని సంకుచితంగా, పరిమితంగా తయారు చేస్తున్నాయి. గ్రహాలు బయటినుండి పనిచేసినపుడు,
మనలో అడ్డుగా ఉండే ఈ శక్తులు క్రమంగా మనకి మార్గాన్ని ఇస్తాయి. క్రమంగా సమయం వచ్చినపుడు మనలో ఉన్న ఈ ఆసురీ శక్తులే మనతో మాట్లాడడం మొదలు పెడతాయి. లోపల అవి వేసుకున్న భయంకరమైన తొడుగులు( masks) తీసేసి లోపలనుండి చిరునవ్వులు చిందిస్తాయి.

అవి మనతో ఇలా అంటాయి.
" ఇదంతా ఒక నాటకం. నీలో పరిపక్వత రావాలని, నీలో  ఆశించిన మార్పు రావాలని ఆడిన నాటకం. మేము ఈ నాటకం ఆడితే తప్ప నీలోని పరిమితులు పోవు. నీవు ఒక పసిడి మొగ్గవి. ఆ మొగ్గలోని రెక్కలన్నీ  ముడుచుకుని ఉన్నాయి. దానికి రంగు కానీ సువాసన కానీ లేకుండా ఉన్నాయి. అన్నీ పచ్చగా ఉన్నాయి. నీలోని రెక్కలన్నీ విచ్చుకుని ఒక పువ్వులా వికసించాలని మేము నీకు గుర్తు చేయాలనుకున్నాము. ప్రపంచం చూడముచ్చటగా ఉండేలా నీకు కావలసిన రంగులన్నీ తీసుకుని తేనె తయారు చేయి. దానినే మేము ఆత్మ పరిపక్వత అంటాము.

గ్రహాలు ఈ విధంగా పనిచేస్తాయి. మన దైనందిన జీవితంలో మనం అనుకునే మంచి చెడు సంఘటనలన్నీ కూడా  మనకి మంచినే ఇస్తాయి. మంచి సంఘటనల వలన మంచి ప్రభావం, చెడు సంఘటనల వలన
చెడు ప్రభావం ఉంటుందని మనం అన్వయించుకో కూడదు.

,- to be contd.



*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-64*
- Master E.K

*Planets and the* *behavioural*
*patterns*

*గ్రహములు ప్రవర్తనా పధ్ధతులు*

ఈ కథ ఒక సంవత్సరానికి సంబంధించిన కథో, లేదా పది సంవత్సరాలకి సంబంధించిన కథో , లేదా ఈ జన్మకి సంబందించిన కథో కాదు.
జన్మ జన్మల పరంపరలో మొగ్గ పువ్వుగా వికసించే విధానం.
గ్రహాలు మనకి సహాయం చేస్తాయి,మార్గ దర్శనం చేస్తాయి, దారి చూపిస్తాయి. అవి మనకి సేవ చేస్తాయి. మన అర్హతని బట్టి అవి మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తాయి.

ఉదాహరణకి  మీ  పిల్లవాడు వీధిలోకి పరిగెడుతూ ఉంటే వెంటనే మీ సేవకుడు ఏం చేస్తాడు? అప్పుడతను గౌరవంగా మీరు బయటికి వెడుతున్నారా అని పిల్లాడిని అడుగుతాడా?
నిస్సందేహంగా ఆ పిల్లవాడికి సేవకుడికి మధ్యన ఉన్నది యజమాని- సేవకునికి మధ్యన ఉన్న సంబంధమే అయినా, ఆ  సందర్భంలో  పిల్లవాడు బయటికి వెడితే ప్రమాదం జరుగుతుంది కాబట్టి, పిల్లవాడి చేతిని పట్టుకొని లోపలికి నెట్టి  ఇంట్లోకి వెళ్ళమంటాడు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 66*
---Master E.K

*Planets and Behavioural*
*Patterns*
*గ్రహములు ప్రవర్తనా పధ్ధతులు*

నేను మ్యూనిచ్ వచ్చినప్పటినుండి
నా పట్ల మీ ప్రవర్తన  ఎలా ఉంది.? నన్ను మీరు ఉపన్యాస మందిరానికి  ఒంటరిగా రమ్మంటున్నారా?
నేను ఈ ఊరికి కొత్త కాబట్టి, నాకు దారి తెలియదు కాబట్టి చిన్న పిల్లవాడిలా నన్ను మీరు దగ్గర ఉండి తీసుకు వస్తున్నారు. నిజంగా నేను చిన్న పిల్లవాడినా? మీరెందుకు  ఇలా చేస్తున్నారు?
ఈ ఊరిలోని వీధులు నాకు తెలియవు కాబట్టి, ఈ ఊరికి సంబంధించినంత వరకు నేను చిన్న పిల్లవాడినే. నేనీ ఊళ్ళో ఒక రెండు నెలలు ఉండి మనం ఉపన్యాస మందిరం వద్ద కలుసుకుందాము అంటే ,  మీరు సరే అంటారు..ఆకస్మాత్తుగా మీకు నామీద నమ్మకం ఎలా కుదిరింది? నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి దారి కనుక్కుని వస్తానని మీరు నమ్ముతారు.

ఇదే విధంగా గ్రహాలు మనకి స్వాతంత్ర్యం ఇస్తాయి. మనం వ్యక్తిత్వం స్థాయిలోను personality ( మూర్తిమత్వ) స్థాయిలోను క్రమంగా ఎదుగుతూ మన కార్యక్రమాలు
చక్కపెట్టుకుంటున్నకొలదీ గ్రహాలు మనకి స్వాతంత్ర్యం ఇస్తాయి.
ఎప్పుడైతే పరిస్థితి ప్రమాదకరం గాను, అపాయకరంగాను ఉండి మనం తెలివితక్కువగా ప్రవర్తిస్తే వెంటనే గ్రహాలు కలగచేసుకుని, జీవితంలోని సంఘటనల ద్వారా మనకి పరిమితులు ఏర్పరుస్తాయి.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 67*
- Master E.K

*Planets and Behavioural*
*Patterns*
*గ్రహములు ప్రవర్తనా పధ్ధతులు*

మన కుటుంబంపట్ల, మన వృత్తిలోను,మన స్నేహితుల పట్ల, మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించే కొలదీ మనలోని పరిమితులు తగ్గి అంతకంతకు విశాల దృక్పథం వస్తుంది. మనం స్వతంత్రులము అవుతూ ఉంటాము. మనం ప్రకృతి శక్తులతో కలిసి ఒక పరిశోధకుడిగా ప్రపంచ  ప్రయోజనాల కోసం పని చేసినపుడు,  ఈ గ్రహాలు మనకి ప్రకృతి రహస్యాలు  కనుక్కోడానికి సహాయం చేస్తాయి. ఒకవేళ మనకి లభించిన జ్ఞానాన్ని, శాస్త్ర రహస్యాలను తప్పుగా వాడితే గ్రహాలు ఇంకొక సారి అడ్డుగా నిలుస్తాయి.

ఇపుడు అన్ని దేశాలు పోటీ తత్వంలో ముందుకు సాగుతున్నాయి. దాని ఫలితం సామూహిక ఆత్మహత్యలుగా చెప్పబడే అంతర్జాతీయ యుధ్ధాలు. కానీ గ్రహాల దృష్టిలో మాత్రం ఇది ఎంత మాత్రం నష్టంగా పరిగిణించ బడదు. ఎందువలన అనగా మనం మరణం అనుకున్నది మరణం కాదు. ఇదే భూమి మీద తిరిగి జన్మించి మన ప్రవర్తన మెరుగు పరుచుకోవడానికి మనకి అవకాశం లభిస్తుంది.
ఈ విధంగా గ్రహాలు మనకి మార్గదర్శకం చూపిస్తాయి.

---to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 65*
-Master E.K

* *Planets and the*
*Behavioural patterns*

*గ్రహములు ప్రవర్తనా పధ్ధతులు*

మనమందరము భగవంతుని పిల్లలము. గ్రహములు భగవంతుని నివాసంలో సేవకులు. మనం పిల్లలలాగా ప్రవర్తిస్తే గ్రహములు ఒకొక్కసారి మన పట్ల మోటుగా ను, కఠినంగాను వ్యవహరిస్తాయి. ( అలా వ్యవహరించడం వాటి కర్తవ్యం)కనుక ఎప్పుడైతే మన ప్రవర్తన అనాగరికంగాను, స్వభావం పాశకవికంగాను ఉంటుందో, అప్పుడు గ్రహాలు మన జీవితాన్ని ముందే నిర్ణయిస్తాయి.

ఈ పరిస్థితుల్లో  ప్రతిదీ పరిమితమై ముందే నిర్ణయించ బడింది కాబట్టి, నీ జాతకాన్ని జ్యోతిష్కునికి చూపిస్తే ,జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనని వాళ్ళు స్పష్టంగా జోస్యము  చెప్పగలరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఏం చేయాలో గ్రహాలకి తెలుసు.అవి  ఆ వ్యక్తికి అన్నీ చేస్తాయి. కానీ అతనిని స్వతంత్రంగా పని చేయనివ్వవు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 68*
----Master E.K

*The three stages*
**The individual level*

*మూడు దశలు*
* *వ్యక్తిత్వ స్థాయి*.
  
మొదటి దశలో గ్రహాలు మనలని బాగా పరిమితంగా ఉండేలా   మన ఉద్రేకాల చేతులలో కీలు బొమ్మలమయ్యి, బాగా
సంకుచితంగా   ప్రవర్తించేలా చేస్తాయి. ఇది ఎలా అనగా మనిద్దరం రైల్లో కలుసుకున్నప్పుడు నేను నిన్ను ఒకటి కొడితే బదులుగా నీవు నన్ను రెండు కొడతావు. ఈ రకంగా మనం ఒకరికొకరం ఎన్ని దెబ్బలు ఇచ్చుకుంటామో గ్రహాలు ముందు లెక్కిస్తాయి. మన స్వభావం అనాగరికంగా ఉన్నంత కాలం మన జాతకం ముందే నిర్ణయించబడి ఉంటుంది. దీనినే వ్యక్తిత్వ స్థాయిలో జీవించడం (individual level of existence) అని అంటారు. ఈ దశలో నా గురించే నాకు తెలుస్తుంది. నీ కంటే నేను వేరుగా ఎలా ఉన్నానో తెలుస్తుంది కానీ, నీలోను నాలోను కూడా ఉన్న సమానత్వం గురించి తెలియదు.
దీని ఫలితంగా నేను నా ఉద్రేకాలు, నాలో ఉన్న బలమైన ఇష్టాయిష్టాలు,అసూయలు,దుఃఖాలు వీటి చేతిలో కీలు బొమ్మనై పోయాను. ఇలా నేను సందేహంతో, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ, నా సహ ఉద్యోగులను అనుమానిస్తూ, నా భార్యని అనుమానిస్తూ, నా పిల్లల్ని అనుమానిస్తూ   బ్రతకడానికి అలవాటు పడ్డాను. అప్పుడు ప్రతి క్షణం నేను ఒంటరిగా ఉంటాను. ఎవరూ నాకు సహాయం చేయడానికి రారు. ప్రపంచంలో ఎక్కడా విశ్వాసం లేనట్లు, కృతజ్ఞత లేనట్లు కనిపిస్తుంది. ఈ విధంగా నేను బాధతో కూడిన ప్రపంచాన్ని నాకై నేను సృష్టించుకున్నాను. దాని బాధను అనుభవిస్తూ, దీనికి వ్యతిరేకంగా ప్రపంచమే నన్ను బాధించిందనుకుంటాను.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 69*
- Master E.K

*The three stages*
*Individual level*
*మూడు దశలు*

* *వ్యక్తిగత స్థాయి*

ఇలా మొదటి దశలో వ్యక్తిత్వ స్థాయిలో చిక్కుకు పోయినపుడు
ఈ సమస్యలనుండి   బయటికి ఎలా  రావాలి? ఈ బాధ నుండి ఎలా బయట పడాలి?
అందమైన సాయంత్రాన్ని ఎలా ఆస్వాదించాలి? ఇలాంటి సందర్భాల్లో మనం బాగా పరిణితి చెందడానికి గ్రహాలు మనలని బాగా పరిమితంగా ( సంకుచితంగా) చేస్తాయి.
ఇలా ఎందువలన జరుగుతుంది?
గ్రహాలు ఒకే సారి మనలని బాగా పరిణితులుగా ( సమర్ధులు గా)తీర్చిదిద్దవచ్చు కదా?

ఉదాహరణకి నేను నిన్ను ఒక వేయి రూపాయలు అడిగాననుకో.  నువ్వు నాకు ఆ ధనం ఇస్తే ఏమవుతుంది. ఈసారి నేను నిన్ను రెండువేలడుగుతాను.
ఇలా నీవు నాకు డబ్బు ఇస్తున్న కొలదీ ఏమవుతుంది? 
నేను సోమరిలా తయారయి నువ్వే నాకు అన్నీ చేసిపెట్టాలనుకుంటాను.
మన మధ్యన ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి,మన ధోరణి ప్రతికూలంగా  ( negative) ఉండి సరి దిద్దడానికి వీలు లేని విధంగా పాడైపోతుంది.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

( *2nd level  - 70* )
- Master E.K

* *The three stages*

* *Individual level*
*మూడు దశలు** *వ్యక్తిత్వస్థాయి*

గ్రహాలు మంచి గురువులు ( masters) కాబట్టి వాటికి ఈ విషయాలన్నీ బాగా తెలుసు.
అందుకే అవి మనల్ని సంకుచితంగా, పరిమితంగా చేస్తాయి. అప్పుడు మనం పరిణితి చెంది బాగా ఎదగాలనుకుంటాము.
అందుకే మనం వ్యక్తిత్వ స్థాయిలో ఉన్నన్ని రోజులు మన ధనం పట్ల, ఆస్తులు పట్ల, ఉద్యోగం విషయంలోను చాలా జాగ్రత్తగా ఉంటాము. ప్రపంచంలోని ప్రతి అవకాశాన్ని మనమే ముందుగా పొందాలని, మనమే దానిని స్వాధీనం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. కాబట్టి పోటీ తత్వం ఉంటుంది. ఎవరైనా వ్యక్తి మనకంటే ముందుగా వెళ్ళి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం నిరాశ చెందుతాము.
ఇలా కొంతకాలం జరిగాక ఆ వ్యక్తికి కూడా మనకి ఉన్నట్లే ఆశ ఉంటుంది కదా అనే విషయం అర్థం అవుతుంది.

-to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

( *2nd level - 71* )
- Master E K

*The three stages*
*Individual level*

*మూడు దశలు*
*వ్యక్తిత్వ స్థాయి*

ఈ పోటి తత్వం గురించి ఇంకాస్త వివరంగా చెప్పాలి అనగా, ఉదాహరణకి ఒక పది మంది అడవిలో ప్రయాణం చేస్తున్నారనుకుందాము. ఈ పదిమింది కొన్ని రోజుల నుండి ఆహారం లేకుండా ఆకలితో అడవిలో నడుస్తున్నారు. అక్కడ ఒక  చెట్టు కనిపించింది. దానికి ఒకే ఒక పండు ఉంది. ఒకరు ఆ పండు తెంపుకుందామని చేయి వేయగానే మిగతా తొమ్మిది చేతులు కూడా దానిమీద పడతాయి. ఫలితం ఆ పండు అక్కడే ఉంటుంది. ఎవరు దానిని కోసుకోలేరు.ఇప్పుడు మనం చెప్పుకునే అంతర్జాతీయ వ్యూహాలు ఇలాగే ఉంటాయి.
ఈ సందర్భంలో జరిగేది ఏమిటంటే ఎవరూ చెట్టు మీద పండుని కోసుకోలేరు.అందరు ఆకలితో ఇంటికి వెడతారు.
ఇదే సందర్భంలో ఒకవేళ నేను ఆ పండుని కోసి మిగతా తొమ్మిది మందికి ఆ పండుని పంచి ఇచ్చాననుకోండి. అప్పుడు పరిస్థితి ఏమిటి?
అందరు ముందు నన్ను తినమంటారు. నేను అందరికి నా దగ్గర ఉన్నది పంచి ఇవ్వాలని అనుకున్నంత కాలం అందరు ముందు నిన్నే తినమంటారు. దీనికి కారణం అందరితోను పంచుకోవాలి అనే భావన నాకు మొదటి వచ్చింది కాబట్టి అందరు ముందు నన్నే తినమంటారు.

ఇలా క్రమంగా మనం జీవితంలో పాఠాలు నేర్చుకుంటాము. నేను నీ సమస్యలను అర్థం చేసుకుంటాను. నీవు నా సమస్యలు అర్థం చేసుకుంటావు.
ఇలా విలువలను అభివృద్ది చేసుకుంటూ ఉంటాము.
ఇలా వ్యక్తిత్వ స్థాయి ( individual level)  ముగిసి, personality level ( మూర్తిమత్వ స్థాయి )లోకి ప్రవేశిస్తాము.

విశాల విశ్వంలోని personality అనే పెద్ద అండాన్ని ( egg) తెలుసుకోవడానికి, వ్యక్తిత్వం అనే చిన్న అండంలో ఉన్న కోడిపిల్ల ఆ అండం బద్దలు కొట్టుకుని బయటికి  వస్తుంది. 

- to be contd.
*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

( *2nd level - 72* )
----Master E.K.

*Three stages*
*Personality level*

*మూడు దశలు*
*మూర్తిమత్వ స్థాయి*

మనం దానం, మానవతా దృక్పథం, సహనం, విచారణ  ఇవన్నీ అవలంబించాలి.సాధన చేయాలి. కానీ వీటిని మనం మన ప్రయోజనాల కోసమే సాధన చేస్తాము.
 ప్రయోజనాలను ఆశించే మనం మన విలువలను పెంపొందించుకోవాలని చూస్తాము. నీవు నిజాయితీగా ఎందుకు ఉంటున్నావు? సత్యమే ఎందుకు మాట్లాడుతున్నావు? ఇతరులకు విశ్వసనీయంగా ఎందుకుంటున్నావు? అని ఎవరైనా అడిగితే, మనం ఏం చెప్తాము.

 ఎదుటి వారు కూడా మనతో విశ్వసనీయంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాము కాబట్టి మనం కూడా వారితో అలా ప్రవర్తిస్తున్నామని చెప్తాము.
మొట్టమొదట్లో విలువలను పాటించడం వలన మనకి తెలిసిన ప్రయోజనం ఇదే.
ఇది రెండవ దశ. ఈ దశలో మనం ఉత్తీర్ణత చెందాలి.ఈ దశలో గ్రహాలు మనకి కొంత స్వాతంత్ర్యాన్ని ఇస్తాయి.
 ఈ దశలో అందరూ మనల్ని విశ్వసిస్తారు.కొంత 
బాధ్యతాయుతమైన పదవులు వస్తాయి. నాయకులుగా నియమింపబడవచ్చు.
దీని అర్థం ఏమిటి? గ్రహాలు మనకి బహుమానం ఇస్తున్నాయా? ఒక విధంగా నిజమే. మన విలువలకి తగిన పారితోషికం లభించింది.
కానీ కాస్త ఉన్నత స్థాయిలలో ఇది నిజం కాదు.అనుగ్రహంగా మనకి ఇచ్చిన వన్నీ కూడా మన ఆశని పరీక్షించడానికి, మన పరిస్థితి ఏమిటో మనం తెలుసుకునేలా చేయడానికి మాత్రమే అని మనం తెలుసుకోవాలి.

- to be continued

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2d level  - 73*
-Master E.K

*The three stages*

_Personality level_

*మూడు దశలు*
*మూర్తిమత్వ స్థాయి*
 
మనం చేసే మంచి పనుల వలన ప్రపంచానికి ఏమీ ప్రయోజనం ఉండదు కానీ,మన భావనలు,మన స్వభావం పరిశుద్ధం అవుతాయి. ఎందువలన అనగా మనం ఆ పని చేయకపోతే ఇంకొకరు ఆ పనిని మన కంటే బాగా చేస్తారు.ఇది జీవిత సత్యం.
ప్రకృతి మన స్వభావాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి మనకి మంచి పనులు చేసే అవకాశం ఇచ్చింది.దీనిని మనం జాగ్రత్తగాను శాస్త్రీయబద్ధంగాను అర్థం చేసుకోవాలి.కనుక ఉన్నత దశలలోకి ప్రవేశించిన కొలది విలువలను ( virtues) మనం ఇంకొక కోణం లో అర్థం చేసుకుంటాము.
మొట్టమొదట్లో మన ప్రయోజనాలకోసం మనం విలువలని పెంచుకుంటాము.
మనం కొంచెం బల పడగానే  మనం అసభ్యంగా ప్రవర్తిస్తాము.
ఇంక విలువలు పాటించ వలసిన అవసరం మనకి లేదనుకుంటాము.
అపుడు చేయకూడని పనులు చేస్తాము.తిరిగి బాధను పొందుతాము.రెండవ దశలో జీవితం ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ దశను వ్యక్తిత్వవికాసపు దశ అంటారు.
ఈ దశ పరస్పర విలువలతో కూడిన జీవితం.
బుద్ధుని దృష్టిలో ఈ దశ అందమైన పూలతో కూడిన ఒక తోటలాంటిది.అందులో ప్రతి పువ్వు సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.
బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు
"నీకు ఆ తోట చుట్టూ తిరగడానికి అనుమతి ఉంటుంది.
కానీ నీవు పూవు మీద చేయి వేసిన క్షణంలో పూవు కింద ఉన్న సర్పం కాటు వేస్తుంది."

 -to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

( *2nd level -74* )
- Master E.K

*Three stages*

*Personality level*

*మూడు దశలు*
*మూర్తిమత్వ స్థాయి*

ఈ వ్యక్తిత్వ వికాస దశలో మనం కొన్ని వేల చిన్న చిన్నసర్పాల నుండి పాము కాట్లను పొందుతూ ఉంటాము. మనం నిర్వహించ వలసిన బాధ్యతలను తప్పుగా, అవి మన హక్కులుగా, మన అధికారాలుగా భావించడం వలన మనకి మనమే శిక్షను అనుభవిస్తూ ఉంటాము.

ఈ దశలో గ్రహాలు మన విధిని నిర్ణయించే వారుగా కాకుండా పోలీసు అధికారులుగా పనిచేస్తారు. మనం సత్ప్రవర్తన కలిగి ఉంటే వారు మనని గౌరవిస్తారు,స్నేహితులుగా నవ్వుతూ పలకరిస్తారు. చేయి కలుపుతారు. వారు మనతో స్నేహంగా ఉన్నారు కదా అనే ధీమాతో  అసభ్యంగా ప్రవర్తిస్తే 
మనలని న్యాయస్థానానికి తీసుకు వెడతారు. మనం స్నేహితునిగా భావించిన అదే పోలీసు అధికారి మనకు జరిమానా విధిస్తాడు.
మనకి కోపం వస్తుంది.అరె నిన్ననే కదా స్నేహంగా పలకరించి చేయి కలిపాడు.ఇప్పుడేంటి ఇలా మనతో అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటాము.
మనం వ్యక్తిత్వపు వికాస దశలో ఉన్నపుడు గ్రహాలు మనతో ఇలాగే ప్రవర్తిస్తాయి.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

( *2nd level - 75* )
- Master E.K

*Three stages*
*Soul conscious level*

*మూడు దశలు*
*ఆత్మ చైతన్యపు స్థాయి*

ఒక దశలో మనం ఎంతోమంది పోలీసు అధికారులను చూస్తాము. ఒక్కొక్కప్పుడు కొంతమంది పోలీసు అధికారులు పదవీ విరమణ చేయడం చూస్తాము. వీరిని మనం విశ్రాంత అధికారులని ( retired officers)
అని పిలుస్తాము.
మనం personality level
( మూర్తిమత్వ స్థాయి ) నుండి
soul conscious level ( ఆత్మ చైతన్య స్థాయి) లోకి వచ్చినపుడు ప్రతి అధికారి మనకి 
విశ్రాంత (retired) అధికారి లాగే కనిపిస్తారు. వీరు retire అయ్యారు కాబట్టి వీరు ఎంతో తీరికగా మనతో పాటు ఆధ్యాత్మిక సభల్లో పాల్గొంటూ,భగవంతుని సంకీర్తనలు మనతో పాటు పాడుతూ , మనతో చాలా సమయం గడుపుతూ ఉంటారు. 
వారు మనని ఏ రకంగాను శిక్షించరు. దీనికి కారణం  వారు retire అవడం కాదు. 
మన బాధ్యతలను మనం గుర్తించి, ప్రత్యేక హక్కులు నిజం కాదని తెలుసుకోవడం వలన. మనం ఏ తప్పూ చేయడంలేదు. ఎవరితోను అసభ్యంగా ప్రవర్తించడం లేదు.
మనకి ఇకపై మంచితనం మీద తప్ప, గొప్పతనం మీద నమ్మకం ఉండదు. విలువైన విషయాలని కాకుండా పనికొచ్చే విషయాలనే నమ్ముతాము.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
( *2nd level -76* )
- Master E.K

*Three stages*
*Soul conscious level*

*మూడు దశలు*

* *నేను ఆత్మను అను మెలకువలో ఉండు స్థాయి*

ఈ దశలో మార్పు వస్తుంది. పండులోని పులుపు అంతా పోయి తియ్యగా పక్వానికి వస్తుంది. ఈ దశలో గ్రహాలు సహాయకులుగా మార్గదర్శకులుగా మారుతారు. మనం ఏంచేయాలి అనేది తిన్నగా మన మనసుకి స్ఫురణ కలిగేలా గ్రహాలు పనిచేస్తాయి. మనం సురక్షితంగా ఉన్నాము కాబట్టి అవి మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలను  అవి గౌరవిస్తాయి. దీనినే గ్రహాలు మన నుండి ఆశిస్తాయి.ఈ దశలో మనకి జోస్యం పనిచేయదు. జాతకంలో సూచించే విధంగా సంఘటనలు జరుగవు.
ఆత్మలో మేలుకున్న స్థాయిలో ఉన్న వ్యక్తి మనకు తారసిల్లినపుడు అతని జాతకం ప్రకారం 7 సంవత్సరాల తర్వాత  నీకు గొంతు కేన్సర్ వచ్చే అవకాశం ఉందని మనం చెప్తే అతను నవ్వి ఊరుకుంటాడు.
7 సంవత్సరాల తర్వాత మనని పలకరిస్తాడు.ఎలా ఉన్నావు? నీ గొంతు బాగుందా అని మనం అడిగితే,  "శుభ్రంగా ఉంది, బాగున్నాను" అని సమాధానం ఇస్తాడు.

గ్రహాలు నీకు గొంతు కేన్సర్ వస్తుందని శాపనార్ధాలు పెట్టవు.
నీ గొంతు భాగం బలహీనంగా ఉంది అని మాత్రమే గ్రహాలు సూచిస్తాయి. నీ ఆహారపు అలవాట్లు సరిగా లేనపుడు నీవే 
వాటికి లొంగి పోతావు.అవి రావడానికి దోహద పడతావు.
ఆత్మలో మేలుకున్న స్థాయిలో ఉన్న వ్యక్తి తీగ తెగేదాకా లాగడు. ఆహారపు అలవాట్లు బాగుంటాయి. సమయం ప్రకారం శరీరానికి కావలసిన ఆహారం తీసుకుంటాడు. తనకు కావలసినట్టు తన కోరిక మేరకు కాకుండా ,స్నేహితులకి
బంధువులకి కావలసిన  అవసరాలకి స్పందిస్తాడు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

(*2nd level - 77* )
---- Master E.K

*Three stages*
*Soul conscious level*

*మూడు దశలు*

*నేను ఆత్మను అని మెలుకువలో ఉండు స్థాయి*

జీవితంలో మన కోరికలు అవసరాలు , ఈ రెండూ కలిసి పోయి తికమక పెడుతూ ఉంటాయి. కానీ నేను ఆత్మను అనే మెలుకువ కలిగిన స్థితికి చేరిన వ్యక్తికి కోరికలకి  అవసరాలకి మధ్యన ఉన్న తేడా వెంటనే తెలుస్తుంది.అవసరాలు శరీరానికి సంబంధించినవి.అవి తనకైనా కావచ్చు ఇతరులకైనా కావచ్చు. కోరికలు మనసుకి సంబంధించినవి. నిజానికి మనస్సుకి అవసరాలు అంటూ ఏమీ ఉండవు. రుచి మనస్సుకి సంబంధించిందే అయినా, శరీరానికి ఆహారం అవసరం. శరీరాన్ని పోషించడానికే ఆహారం కానీ రుచి కోసం కాదు.
మూర్తిమత్వ స్థాయి ని ( personality level) దాటి,
నేను ఆత్మను అనే మెలుకువ స్థితికి ( soul conscious level) చేరిన వ్యక్తి కోరికలకి, అవసరాలకి మధ్యన ఉన్న తేడాని అర్థం చేసుకుని, అవసరాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చి, కోరికలను విస్మరిస్తాడు.
కోరికలతో ఎప్పుడూ పోరాడ కూడదు. మనం కోరికలతో పోరాడతలుచుకుంటే ముందు మన కోరికలేమిటో తెలుసుకుని వాటితో స్నేహం చేయాలి. దాని వలన పరిష్కారం దొరకదు సరికదా పరిస్థితి ఇంకా విషమిస్తుంది.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

( *2nd level-78* )

*Three stages*
*Soul conscious level*

*మూడు దశలు*
*నేను ఆత్మను అని మెలుకువలో ఉండే స్థాయి*

నేను ఆత్మను అనే చైతన్యం జాగృతమైన వ్యక్తికి తాను విషయాలన్నీ చక్కగా సానుకూలంగా ఎలా నిర్వర్తించుకోవాలో తెలుసు.అతను తన‌ వ్యక్తిత్వంలోని వ్యతిరేక అంశాలను పట్టించుకోడు. అతను తనకు కానీ ఇతరులకు కానీ కావలసిన అవసరాలను మాత్రమే పట్టించుకుంటాడు. ఇలా క్రమంగా అతను శుద్ధ చైతన్యం లేదా ప్రేమ అని మనం పిలిచే స్థితిలోకి అడుగు పెడతాడు. ఆ స్థితిలో అతను 
కోరికలనుండి తప్పించుకోవాలని అనుకోడు కాబట్టి అతనికి కోరికలు ఎంత మాత్రం ఉండవు.
ఈ విధంగా గ్రహాలు మనకి శిక్షణ ఇస్తాయి. ఈ దశలో నీకు శని కుజులు కూడా  మంచి గ్రహాలే అవుతారు, వారు నిన్ను నవ్వుతూ  పలకరిస్తారు.
ఇంతకు ముందు కుజుడు కలహాలని ప్రేరేపిస్తాడని , తుపాకి ఎక్కుపెట్టి బాంబులు కురిపిస్తాడనే అభిప్రాయం నీకు ఉండేది. అలాగే శని ఎప్పుడు నిన్ను విమర్శిస్తూ, నీ మీద నిందలు వేస్తూ, నీ వెనకాల నీ మీద దుష్ప్రచారం చేస్తాడనే అభిప్రాయం నీకు ఉండేది.
ఈస్థితిలో శని నవ్వుతూ నాయనా నేను చెడ్డవాడినని అనుకోవద్దు,  నీలో పరిపక్వత రావాలని మేము ఇంత నాటకం ఆడ వలసి వచ్చింది. సృష్టికర్త తనలాంటి సృష్టి కర్తను తయారు చేసినందుకు మాకు సంతోషంగా ఉంది అని అంటాడు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
( *2nd level - 79* )
- Master E.K

*Three sages*
*మూడు దశలు*

*శని మనకు ఎలా సహాయం చేస్తాడు*.

ఈ దశలో శని నీకు ఎంత మాత్రం ప్రమాదకారి కాదు. అతను నీతో నవ్వుతూ "చూడు నా శరీరం మీద రోమాలు ఎలా నిక్కపొడుచుకున్నాయో" అంటాడు. సాధారణ జ్యోతిష్కుడు నీ జాతకం చూసి, “ నీకు ఏలినాటి శని ప్రవేశిస్తోంది అని చెప్తాడు.” జాతకంలోని జన్మ చంద్రుని మీదకి గోచార శని వచ్చినపుడు కొన్ని చాలా ప్రమాదకరమైనవి , విసుగుపుట్టించే సంఘటనలు జరుగవచ్చు . అదే విధంగా దేవమాన దశలో చంద్రుడు గోచార శనితో కలిసినపుడు ఎటువంటి చెడు ఫలితాలు ఇవ్వడు. మన జీవితంలో ఎటువంటి ప్రభావము ఉండదు. అది ఎన్నడూ జీవితంలో కరిగి కలిసిపోదు. ఎందువలన అనగా శని రాశిచక్రం తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. మన జాతకంలో దేవమాన దశలలో చంద్రుడు కుడా ఇదే వేగంతో తిరుగుతాడు. దీనినే Moon hunt అంటారు. అంటే , అది జీవితాంతం ఉండే చంద్ర, శనుల సమాగమము ( Conjunction).

జ్యోతిష్కుడు శని యొక్క ఈ పట్టు నుండి  ఈ జన్మలో ఎప్పటికి నీవు బయటపడలేవని బాధ పడతాడు. కానీ నిజానికి నీవు దేనిని ఆశించవు కాబట్టి నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. నీవు జీవితంలో అన్నీ శుభాలే అనుభవిస్తావు. నీవు ఎక్కడికి వెళ్ళినా ఇతరులకు ఉపయోగపడే పనులే చేస్తావు కాబట్టి ప్రసన్నమైన మనుష్యులనే కలుస్తావు. అందమైన గృహాలని సందర్శిస్తావు.

శని ఎప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉండడు. కానీ సామాన్య జ్యోతిష్కుడు అసలు సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. గ్రహ ప్రభావాలు తప్పించలేనివని అతను భావిస్తాడు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-80*
----Master E.K.

*Three stages*
*How Saturn helps*

*మూడు దశలు*
*శని మనకు ఏవిధంగా సహాయం చేస్తాడు*

జ్యోతిష్కులు గ్రహాలు జ్ఞాన 
ప్రదాతలు అనే విషయం మర్చిపోతారు. గ్రహాలు మన కంటికి కనిపించే విధంగా భౌతిక గోళాలు మాత్రమే కాదు. అవి కారుణ్యంతో కూడిన జ్ఞాన ప్రదాతలు. గ్రహాలు సౌరకుటుంబము అనే నాటకరంగాన్ని నడిపిస్తూ ఉండటం వలన , వాటికి  ప్రతి వ్యక్తి జీవితము అనే నాటక రంగాన్ని కూడా ఎలా నడపాలో బాగా తెలుసు. గ్రహాలు సామూహిక సౌర చైతన్య స్థాయిలో పనిచేస్తాయి. అదే విధంగా వ్యక్తిగత చైతన్య స్థాయి లోను పనిచేస్తాయి.
గ్రహాలు నీకు మార్గదర్శకులుగాను, సహాయకులుగాను పనిచేసినపుడు నీవు ప్రతి క్షణం వాటి నుండి సందేశాలు అందుకుంటూ ఉంటావు. ప్రతి క్షణం నీవు ఏం చేయాలో ఏం చేయకూడదో అవి సూచిస్తూ ఉంటాయి. సందేశాలు అనగా 
 చనిపోయినవారి నుండి, 
ప్రేతాత్మలనుండి  వస్తాయని నేను చెప్పటం లేదు . అది నా ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఆధ్యాత్మికతను గురించి. ఆధ్యాత్మికత అనగా గ్రహాలలోను, నీలో ను, నీ చుట్టూ అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ గురించితెలుసుకోవడం. అందరిలోను ఉన్న ఆత్మే అంతటా వ్యాపించి ఉంది.

- to  be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
( *2nd level - 81* )
-Master E.K

*మూడు దశలు*
*శని మనకు ఏ విధంగా సహాయం చేస్తాడు*


ఇంటిలో ఉన్న చోటు ఇల్లు కట్టక ముందు  ఎలా ఉందో, అలాగే ఇంటి నిర్మాణం  జరిగాక ప్రతి గదిలోను చోటుఎలాగైతే ఉందో, అలాగే నీలో ఉన్న ఆత్మ నీవు రాక మునుపు ఉంది,అలాగే అందరిలోను ఉన్న ఆత్మే నీలోను ఉంది. దీనికి కారణం నీకు ఆత్మతో సంబంధం ఉంది, నీలో ఉన్న ఆత్మకు నీవు నివసించే చోటుతో సంబంధం ఉంది. నీవు ఈ రకంగా ఆత్మను అర్థం చేసుకుంటే నీవు ఆత్మలోనే నివసించడం మొదలు పెడతావు. దీనినే ఆధ్యాత్మికత అని అంటారు.ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా నీ కర్తవ్యం గురించి తెలుసుకొనుటను ఆధ్యాత్మిక జ్యోతిష్యము అంటారు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
( *2nd level - 82, 83* )
---Master E.K

*Planets and the three planes*

*గ్రహములు మూడు కక్ష్యలు*

సూర్యుడు నీలోని 'నేను' అనే ప్రజ్ఞని సూచిస్తాడు. చంద్రుడు నీ మనస్సుని, కుజుడు నీ ధైర్య సాహసాలని, బుధుడు నీ తెలివితేటలని, శుక్రుడు నీలోని ప్రేమని, గురుడు నీలోని జ్ఞానాన్ని, శని నీకు జరిగే  అనుభవాలని సూచిస్తారు. ఈ విషయం నీకు అర్థం అయితే నీకు కీ బోర్డ్ అర్థం అయినట్లే . అపుడు గ్రహాలతో నీకు మంచి సామరస్యం ఉంటుంది. అపుడు ఉన్నత స్థాయి గురువులైన వరుణుడు, ఇంద్రుడు నీలో పని చేయడం మొదలు పెడతారు. అప్పటిదాకా వారు నీ జాతకంలో పని చేయరు. దీనికి కారణం వారు ఒక ప్రత్యేక విభాగానికి చెందిన వారు. వారు విమానం నడిపే  పైలట్, రైలు నడిపే ఇంజను డ్రైవర్ లాంటి వారు. విమాన పైలట్ కి కానీ, రైలు ఇంజన్ డ్రైవర్ కి కానీ నీవెవరో తెలియదు. అయినా  నీవు ప్రయాణానికి సిద్ధమై  విమానాశ్రయానికి, /రైలు స్టేషన్ కి నిర్ణీత సమయంలో వచ్చినపుడు, నిన్ను గమ్యానికి చేరుస్తారు.
అలాగే ఆధ్యాత్మిక మార్గంలో నీవు దీక్ష తీసుకున్నపుడు నిన్ను కూడా ఆ మార్గంలో గుర్తించడం జరుగుతుంది. ఎలాగైతే నీవు విమానాశ్రయం, రైల్వేస్టేషన్- ఈ సంస్థల్లో ఉద్యోగివైతే అదే పైలట్/డ్రైవర్ నిన్ను గుర్తించి  ఎలా నీకు సహాయం చేస్తారో, అలాగే నీలో ఆత్మ చైతన్యం జాగృతమైనపుడు నీ జాతకంలోని ఇంద్రుడు, వరుణుడు నీకు సహాయ పడతారు. నీకు మొత్తం కీ బోర్డ్ గురించిన విషయాలన్నీ తెలియచేస్తారు.

- to  be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
( *2nd level  - 84* )
- Master EK

*Planets and three planes*
*గ్రహములు మూడు కక్ష్యలు*

గ్రహములు మన శరీరంలోని ప్రతి భాగాన్ని ,  పదార్థము, శక్తి, ప్రజ్ఞ అనే ఈ మూడు కక్ష్యలలోను నియంత్రిస్తాయి అనే విషయం అర్థం చేసుకోవాలి.  గ్రహములు పదార్థమును నియంత్రిస్తాయి, శక్తిని నిర్దేశిస్తాయి, ప్రజ్ఞకి సమయస్పూర్తి ని ఇస్తాయి. గ్రహములు ఈ మూడు కక్ష్యలలోను , ఆ కక్ష్యలలో  ఉన్న ఉనికి ( existence) సహాయంతో పని చేస్తాయి. నీ శరీరం మీద భౌతిక కక్ష్యలో పని చేస్తాయి. నీ లోని ప్రాణమయ శరీరం మీద, వాటి కార్య కలాపాల మీద ఇంకొక రకంగా పని చేస్తాయి. నీ ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని అవి నియంత్రిస్తాయి. నీ ఆరోగ్యం ఎప్పుడు ప్రమాదకరంగా ఉంటుందో, ఎప్పుడు నీవు సలహాలు తీసుకుని జీవితాన్ని సక్రమంగా కొనసాగించాలో, నీకు అనారోగ్యం అసలు  ఎప్పుడు ఉండదో మొదలైన విషయాలు గ్రహాలు తెలియచేస్తాయి. ఆత్మ చైతన్య స్థాయిలో  గ్రహములు నీకు గురువులు, మార్గదర్శకులు,
సహాయకులు. ఈ స్థాయిలో జ్యోతిష్కులు జోస్యం చెప్పడంలో విఫలం అవుతారు.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2nd level-85*
----Master E.K.

*The mechanism of the planets*

*గ్రహముల యొక్క యంత్రాంగం*

గ్రహములు వెన్నెముకలోని నాడీమండల వ్యవస్థని ఎలా రూపొందించాయో గమనించు.
ఊపిరితిత్తులు భౌతిక పదార్థంతో తయారయినాయి. కానీ శ్వాస మాత్రం ప్రాణమయ కక్ష్యలో పనిచేస్తుంది. స్వరపేటిక భౌతిక పదార్థంతో తయారయింది. కానీ స్వరం మాత్రం మానసిక, ప్రాణమయ కక్ష్యలలో రూపొందుతుంది. కొంత చైతన్యంతో కూడిన శబ్దాన్ని మనం మనలోని శబ్దంగా చెప్పుకుంటాము. అక్షరాలు వెన్నెముకలో అమర్చ బడ్డాయి . స్వరపేటిక ద్వారా  మనం ఉచ్చరించే ప్రతి అక్షరము వెన్నుపూసలలోని వివిధ స్థాయిల నుండి వచ్చేలా అమర్చబడి ఉంది.
మనస్సు తనకు తానే ఈ కంప్యూటర్ వ్యవస్థను ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. అలా మనస్సు ప్రయత్నం చేసినపుడు స్వరపేటిక ద్వారా శబ్దం ఉత్పన్నమయి, నాలిక ద్వారా అక్షరం ఉచ్చరించబడుతుంది.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-86*
---Master E.K

*The mechanism of the planets*

* *గ్రహముల యొక్క యంత్రాంగము* 

అక్షరాలు పదాలుగాను, పదాలు వాక్యాలు గాను మారుతాయి.ఈ వాక్యాలు వ్యక్తం అవకముందు ఇవి నీలో, నీ ఆలోచనలుగా, అభిప్రాయాలుగా ఉన్నాయి.ఈ ఆలోచనలే నీలోపల ఒక వాక్యంగా కూర్పు చేయబడి చివరికి ఒక వాక్యంగా ఉచ్చరించ బడుతుంది. 
శబ్దం విఛ్ఛిన్నమయి చోటులో ఉన్న ప్రకంపనలలో ఎలా అదృశ్యం అవుతోందో చూడు. శబ్దాలు చోటులో ఉన్న రేడియోధార్మిక తరంగాలలో కలిసి పోతాయి.
ఈ శబ్దాలను తిరిగి మనస్సు కర్ణభేరి( ear drum) ద్వారా గ్రహించి, అక్షరాలు గాను, వాక్యాలు గాను రూపు దిద్దుతుంది.
తిరిగి నీ మనస్సులో ఉన్న ఆలోచనలను మనస్సు ప్రసారం చేస్తుంది. అపుడు ఎదుటి వారి మనస్సులో ఆలోచన మొలకెత్తుతుంది. 
సంభాషణల ద్వారా,ఉచ్చారణ ద్వారా ఆలోచనలు మనిషి నుండి మనిషికి ఎలా ప్రయాణిస్తున్నాయో చూడు. మనం దీనిని అసలు పట్టించుకోము. ఇదంతా సర్వసాధారణం అని అనుకుంటాము. మనము బుధ, గురు ప్రజ్ఞలను అర్థం చేసుకుంటే , బుధుడు మన ఆలోచనలను అభిప్రాయాలను ఎలా కూర్పు చేస్తాడో,మిథున రాశి ద్వారా బుధుడు ఎలా స్వర పేటిక ని తయారు చేస్తాడో, మన తెలివితేటల్ని ఆలోచనలుగా ఎలా కల్పిస్తాడో, మన ఆలోచనలని,  మానసిక భావాల్ని  మన మాతృభాషలో కి వాక్యాలుగా ఎలా అనువదిస్తాడో అర్థం అవుతుంది.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-87*
--- ,Master E.K

*The mechanism of the planets*
*గ్రహములు యొక్క యంత్రాంగము*

అప్పుడు మనం మనలో గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకుంటాము. అలాగే గ్రహములు యొక్క ప్రతి చర్యకు ప్రతిస్పందించకుండా, గ్రహములు గురించిన ఎరుక లేకుండా వాటి విషయంలో ఎంత నిద్రాణంగా ఉన్నామో అర్థం అవుతుంది. గ్రహములు గురించి మన ఎరుక పురోగతి చెందుతున్న కొలది , అవి మనకు వాటి సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాయి. అవి మనకు పాఠాలు చెప్తాయి. గ్రహాలకి గ్రహాల కి మధ్యన , అలాగే సూర్యునికి, సౌర కుటుంబాలకి మధ్యన ఉన్న శాశ్వతమైన జ్ఞానాన్ని మనము గ్రహాల ద్వారా పొందుతాము.
ఇది ఆధ్యాత్మిక జ్యోతిష్యానికి ఉపోద్ఘాతము మాత్రమే. నిజమైన ఆధ్యాత్మిక జ్యోతిష్యము ఒక సముద్రము. కానీ అది తియ్యని సముద్రము. జ్యోతిష్య గ్రంథాలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా , " నేను" అనే పుస్తకాన్ని చదవడం ద్వారా అందులో  ప్రవేశించే ప్రయత్నం చేద్దాము.

మాడమ్ హెలోనా పెట్రోవా బ్లావట్స్కీ ప్రకారం అది ( నేను అనే పుస్తకం) ఒక లిఖిత ప్రతి.( one manuscript). అది గుహాలయము (cave temple) లో లిఖించబడి ఉంది. దాని ఒకే ఒక కాపీ ప్రస్తుతం వాడుకలో ఉంది. దాని అర్థం " నేను" అనేది సదా ఒకే ప్రతి. ఒకే గ్రంథము.( దానికి కాపీలు ఉండవు) కనుక " నేను" అనేది వాడుకలో ఉన్న ఒకే ఒక ప్రతి అని మాడమ్ బ్లావట్స్కీ సూచించారు.
కనుక "నేను" అనే పుస్తకాన్ని చదివి గ్రహాలని నీ జ్యోతిష్కులు గా పొందవచ్చు.అపుడు నీకు గురువంటే ఏమిటో నిజమైన అర్థం  తెలుస్తుంది.

- to be continued


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-88*
- Master E.K.

*How do planets work*
*గ్రహములు ఎలా పని చేస్తాయి*

మరణం అనేది ఒక సంఘటన కాదు. అది ఒక విరామం. ఈ పద్ధతి ద్వారా మరణం ముందు జరిగే సంఘటనలు తెలుసుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక విషయాలు, ముఖ్యంగా ఆత్మ సాధనకు, దీక్ష తీసుకోవడానికి కావలసిన మార్గ దర్శకాలు, ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే అవరోధాలు, దానిని అధిగమించే ఉపాయాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రయోజనం కోసమే భారత దేశంలో ఈ పద్ధతి వాడతారు.ఇది చాలా సనాతనమైన పద్ధతి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి జ్యోతిష్కులు ఈ పద్ధతి వాడతారు. ఎందువలన అనగా ఇతర పద్ధతుల్లో మనకి ఆధ్యాత్మిక విషయాలు అంత స్పష్టంగా తెలియవు. ప్రచారం పొందిన జ్యోతిష్య శాస్త్ర విధానంలో రేఖా మాత్రంగా పైపైనే విషయాలు తెలుస్తాయి కానీ స్పష్టంగా తెలియవు. ఆధ్యాత్మిక సాధనలో నీ గురించి నీకు ఎరుక కలిగిన క్షణం నుండి ప్రచారంలో ఉన్న జ్యోతిష్య పధ్ధతులు నీ జాతకంలో పనిచేయవు. ఫలితాలు రావు. అందువలన మనం సాధారణ జ్యోతిష్యం మీద ఆధారపడ లేము. మనకి సూటిగా ఖచ్చితంగా జోస్యం చెప్పే ఒక పద్ధతి కావాలి. ఎందువలన అనగా మనలో వివిధ కక్ష్యలు ఉంటాయి. దాని ప్రకారం గ్రహాలు మనలో పని చేస్తూ ఉంటాయి.

-to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-89*
---Master E.K.

*How do planets work*
*గ్రహములు ఎలా పనిచేస్తాయి*

మనం అథమ స్థాయి చైతన్య కక్ష్యలో ఉన్నపుడు మన మీద గ్రహముల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది.ఎందువలన అనగా తప్పనిసరి పరిస్థితుల్లో అవి మన మీద పని చేయ వలసి వస్తుంది. మనం పూర్తిగా  ప్రాపంచిక విషయాలలో,ఉద్రేకాలలో మునిగిపొయి అనాగరికంగా ఉన్నపుడు,మన పురోగతి మన చేతులలో ఉండదు.మనకు ఎటువంటి ఎంపిక ( choice) ఉండదు. అపుడు గ్రహాలు మనకోసం ఎంపిక చేస్తాయి.అనగా గ్రహాలు నిర్ణయించినట్లే జరుగుతాయి, మన నిర్ణయాలు, మనం ఎంపికలు పని చేయవు.అప్పుడు అవి తప్పనిసరిగా పనిచేస్తాయి,మన జాతకంలోని (సంఘటనలు),జోస్యం యథార్థం అవుతుంది.మన జీవితంలోని మంచి చెడు సంఘటనలు జాతకంలో ఉన్నట్లే యథాతథంగా జరుగుతాయి.జోస్యం నిజం అవుతుంది.మన చైతన్యం అథమ స్థాయిలో, పూర్తిగా ప్రాపంచిక పరంగాను, ఉద్రేక పూరితంగాను ఉన్నపుడు జాతకంలోని ప్రతి సంఘటనను సులభంగా జోస్యం చెప్పవచ్చు.అపుడు ప్రతి గ్రహము చైతన్యాన్ని భగ్గుమని మండేలా చేస్తుంది. చైతన్యం ఎప్పుడూ సంఘటనలు అనే జడివానని సృష్టిస్తూ ఉంటుంది.
చైతన్యం ఎప్పుడు ఎవరితో కలిసినా, అది మనిషైనా, జంతువైనా, వృక్షమైనా , ఘర్షణే అవుతుంది తప్ప అది కలయికగా ఉండదు,కలయిక అవదు.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

(*2nd level-90*)
-Master E.K.

*How do planets work*
*గ్రహములు ఎలా పని చేస్తాయి*

గ్రహములు మనలని ఉద్రేకపరిచి సంఘటనలు జరిగేలా  ప్రేరేపిస్తాయి. ఈ స్థితిలో గ్రహములు ఘర్షణపూర్వకమైన వాతావరణాన్ని కల్పించి, మనకి ఇతరులతో బాధ కల్పించే అనుభవాలు పొందేలా చేస్తాయి.
గతంలో మనం చేసిన కర్మల ఆధారంగా ఉద్రేక పూరితమైన మన ప్రవర్తన వ్యక్తం అవడానికి తగిన వాతావరణం అందంగా రూపు దిద్దుకుంటుంది. గతంలోని మన ప్రవర్తన ఆధారంగా మన ధోరణి ఏర్పడుతుంది. గతంలోని మన ప్రవర్తనే వరుస క్రమంలో మన జీవితంలో సంఘటనలని కల్పిస్తుంది. ఈ ధోరణితో మనం ఇతరులతో ఘర్షణకు దిగుతాము.

-to be contd.

( For few days, I will present Master EK’s lecture on Feminine Heirarchy. This lecture is related to sign Virgo. Since Sun entered Virgo, I feel it is very useful to read this lecture in this month. 


*THE FEMININE HIERARCHY*
 - Master EK

( Transmitted by E. Krishnamacharya at Masters' Garden (Kotagiri, India) in the night from 13th to 14th July 1965, in the company of E. Warnon and A. Sassi. )
 
There has been a Feminine Hierarchy in this world since earliest antiquity. It is as important and inevitable in the Spiritual World as it is in the social and physical worlds. It counts for fifty percent of the whole Spiritual Kingdom. It has been energized in the social and political areas of this planet ever since the equinoxes entered the signs of PISCES and VIRGO. This stimulation of the Feminine Hierarchy in the present cycle of the Great Year started when the Virgin-Mother gave birth to the greatest ‘soul-fisherman’ of this time, Master Jesus. It is the Virginal Eternal Principle or VIRGO.

*THE FEMININE HIERARCHY-2*
- Master EK

Its manifestation in the previous cycle took place as the Great Mother KANYA KUMARI. Its power is manifested on the planet Earth in the place called ‘Kanya Kumari’ (Cape Comorin) where Vivekananda meditated on the Mother of the World and where St. Paul meditated on the Child of the Mother of the World. It is only after this meditation that St. Paul was able to understand the Path of BHAKTI (Devotion) to which he was initiated firstly by the Master Jesus and afterwards by the Lord CHRIST.
 
JESUS received the last Great Initiation from a Virgin on Mount ABU. Right before this event, He met the RAJARSHI (the Initiated King) and the emperor SHALIVANA, in the valley of the Himalayas which is near KULU (Kalaga). Anyone who has read the KALKI PURANA or the Book of the Prophecies connected with the Age of Kali written by Vedavyasa remembers the incident of their encounter and the details of their discussion.

- to be continued


*The Feminine Hierarchy-3*

- Master EK

After He had completed his stage of discipleship, which lasted twelve years, in the secret valley of the Himalayas, the Master Jesus received the final Initiation from a Virgin, in the beginning of the third year.
It took Him twelve months to receive this initiation in its fullness. Then, He came back into the world, bearing His Message for twelve years. Three days before the completion of these twelve years, He was crucified on Golgotha. On the third day which was the last of the twelve years (it was a Friday), His Mother Mary, as She was approaching Him during the night with a lamp and a sword, in the presence of the Lord Christ, gave Him the final initiation by touching Him with the sword and it was done by virtue of the Power with which She had been entrusted by the MOTHER of the WORLD. She created and made Him the SON of the CELESTIAL VIRGIN. It was midnight!

- to be continued


*The Feminine Hierarchy-3*
- Master EK

Just before the beginning of the Kali Yuga, Veda Vyasa received the last initiation from His Mother, who was at this time symbolically called Virgo and Daughter of Pisces , the Virgin-Mother was not only the physical Mother, but She was the Logos of the Infallible name , in the state of consciousness named ‘Pasyanti’. This is why She was known as SATYAVATI (the Truth-Bearing Word).
 
In this special Ritual, Ramakrishna Paramahamsa asked his consort Sarada Devi to keep the sacramental state of Virginity. At this moment He was given the name of Lord by Her. A man can't give another man the Final Initiation.
 
UDAVA, the direct Disciple of the Lord KRISHNA in Madura, had to receive his final Initiation to the Mysteries of the Soul-Self Giving only from the GOPI's hands on the altar of the Bhakti. For this purpose, UDAVA had to go to Madura, then to Brindavan.


- to be continued


*The Feminine Hierarchy-4*
- Master EK

BISHMA, the Pure celibate whole lifetime, and the Great Patron of the Heroes of the MAHABHARATA WAR was introduced to VEDAVYASA as his younger brother by blood ties of spirituality. This initiation was the work of his Mother, the same DAUGHTER of PISCES, SATYAVATI.
 
All the Rishis got their Final Initiation to the Mystery of VIRGO and PISCES through their mother, sister, wife, or daughter. This final Initiation to the PISCES-VIRGO Consciousness opens the door to liberation from the cycle of rebirth within the equinoxes.
 
VASISHTA, one of the Lights of the Great Bear, was initiated by his consort ARUNDATI, called ‘Torch of Initiation’ in the Final Ritual of the SEVEN FLAMES. In the description of the Ritual proper to the seventh plane, there is an allegory according to which AGNI, made brilliant by the sacrifice of the seven Rishis, fell in love with their Consorts. Then SVAHA, Agni's Consort (Svaha was nothing else than a ‘tongue of Flame’) took the form of the Rishi's Seven Consorts and under this disguise She kept AGNI on the Planetary Spiritual Level. That is to say that every planet is led by ‘its Light’, considered as its counterpart, its partner in Creation.

- to be continued


*The Feminine Hierarchy-5*
- Master EK

SVAHA did this to prevent AGNI's ‘Fall’ and to protect Him from the Rishis' curse.
 
Also on the planetary scale, the Lord of every plane is conducted by His own Light considered as His Consort (counterpart of creativity).
 
The Seven Great Suns of Initiation, called the SAPTA RISHIS (the Spiritual GUIDES of the Constellation of the Great Bear) themselves are guided by their own ‘Light’ as a feminine counterpart. At regular intervals they come down onto Earth as Great Sages or Lords of Spirituality. They are born on earth as examples with their consorts and join the Spiritual Hierarchy.
 
DURGA, the Lord SHIVA's consort, is the KUMARA's Mother and with LAKSHMI on one side and SARASVATHI on the other; they are the first TRIANGLE of the Feminine Hierarchy. This TRIANGLE is called LALITA, the secret of Beauty, on which fine-arts are based, for it is one of the elements of Initiation for the Initiates of the Higher Order.

- to be continued


*The Feminine Hierarchy-6*
- Master EK

In the Vedic Initiation the Candidate is called ‘the Beggar’. The dispensation of the first food, the first alms to this beggar are always given by a woman at the time of his spiritual rebirth. The Mother of the World, GAYATRI, acts through this woman who gives the first food to the newly-born (the Initiate). The Buddha received that first food from a woman called SUJATA in the form of MILK filtered through seven cows. The Rishi AGASTYA's consort (‘wife’), LOPAMUDRA, conferred this Initiation on her husband. GAYATRI, VISHVAMITRA's consort; ARUNDATI, VASISTA’s consort; ANASUYA, ATRI's consort, and RENUKA, JAMADAGNI's consort, all did the same.
 
Saint Elisabeth, Saint Margaret and Saint Catherine (who presides over the sacrament of conferring the stigmata on the bodies of the devout) all lead to the Hierarchy of the one Great Mother of the World and of Her Triangle.

- to be continued


*The Feminine Hierarchy-7*
- Master EK


KANYA KUMARI, the incarnation of the Lord SHIVA's consort, presides over the areas which are just below the Equator, in the Northern hemisphere, near Cape Comorin. In the physical body of each individual, KANYA KUMARI's grace is located just above the umbilicus (the human equator). This centre, which is potentially ‘above the usual Solar Plexus centre’ opens up the ascending Path and the door of the souls' redemption at the time of Initiation.
 
The VIRGIN gives birth to the Initiated as a Spiritual Child, in an immaculate way. At the time of Initiation, She changes all the directions of the flows. She conceives the Saviours in the heart of men, as SONS of GOD and SHE leads the SON in his dispensation of the Lord's Grace. This Initiation makes the SON of GOD a SAVIOUR of the World.

( This wonderful lecture is completed. )


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-91*
- Master E.K.

*How do planets work*
* *గ్రహములు ఎలా పనిచేస్తాయి*

ఉదాహరణకి  పారిస్ లో  నేనేదైనా నేరం చేసి, ఒక  వ్యక్తిని హత్య చేసి, వేరొక వ్యక్తి నుండి పదివేల డాలర్లు దొంగతనం చేసి పోలీసులనుండి తప్పించుకుని , రైలులో జర్మనీ కి పాస్పోర్ట్ లేకుండా పారిపోయి అక్కడ  ఉన్న మీతో జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ ఉన్నాననుకోండి.
అప్పుడు జరిగే సంఘటనలు నేను ఊహించినట్లు, మీరు ఊహించినట్లు ఉండవు. నేను మీకు జ్యోతిష్యం వివరిస్తున్న సమయంలో తలుపు చప్పుడవుతుంది. అక్కడున్న తలుపు తీస్తే ఆ వచ్చిన వాళ్ళు మేము పోలీసులమని చెప్తారు. అప్పుడు వారు ఇక్కడ ఎవరైనా భారతీయుడు ఉన్నాడా అని అడుగుతారు. ఈ విధంగా సంఘటనా క్రమం మనం అనుకున్నదానికి భిన్నంగా జరుగుతుంది. పరిణామ క్రమంలో మన చైతన్యం అథమ స్థాయిలో ఉన్నపుడు ఈ విధమైన సంఘటనలు జరుగుతాయి.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level 92 and 93*
- Master E.K.

*How do planets work*
*గ్రహములు ఎలా పని చేస్తాయి*

గ్రహములు అన్నీ కూడా ఒక పోలీసు ఆఫీసర్ గా, కస్టమ్స్ అధికారి గా, న్యాయాధికారి గా 
పని చేస్తాయి. నిస్సందేహంగా అవి తమ క్రమశిక్షణని అమలు చేస్తాయి.ఈ కారణం వలననే వ్యక్తుల చైతన్యం అథమ స్థాయిలో ఉన్నపుడు జోస్యం చెప్పడం సులభతరం అవుతుంది. కానీ అదే వ్యక్తులు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ,నేను ఎందుకు పుట్టాను, ఏ మార్గంలో ప్రయాణించాలి, నేను ఏది చేయాలి, ఏది మానేయాలి, నా శరీరానికి ఏ వ్యాయామాన్ని ఇవ్వాలి, నా మనస్సుకి ఏ శిక్షణ ఇవ్వాలి, అందరికి సేవ చేయడానికి నేను ఏ చదువు చదవాలి, ఏ వృత్తిని ఎన్నుకోవాలి 
అని తమకు తామే ప్రశ్నించుకున్నపుడు జీవితపు విలువలు మారిపోతాయి. దీక్ష తీసుకుని ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు గ్రహాలు నీతో  వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. అవి మంచి పనులే చేయమంటాయి. చెడు పనులు మానేయమంటాయి. ఈ విషయంలో ఎంపిక మాత్రం నీదే ఉంటుంది. గ్రహాల సలహాలను నీవు పాటిస్తే నీవు పురోగతి చెందుతావు. గ్రహముల సలహా కంటే నీ ప్రలోభాలే బలీయమయినపుడు కథ మొదటికి వస్తుంది. నీవు పురోగామించడానికి సమయం పడుతుంది. ఇది గ్రహములు పని చేసే రెండవ స్థాయి. ఈ దశలో నీకు గ్రహములు శ్రేయోభిలాషుల లాగా సలహాలు ఇస్తాయి.

మొదటి స్థాయిలో గ్రహములు పోలీసు అధికారుల లాగా పని చేస్తాయి.రెండవ స్థాయిలో శ్రేయోభిలాషుల లాగా పని చేస్తాయి. మూడవ స్థాయిలో గ్రహములు స్నేహితుల్లా గా పని చేస్తాయి. మన ప్రలోభాలను దాటుకుని, పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ప్రతి గంట, ప్రతి నిముషం, ప్రతి క్షణం గ్రహములు ఇచ్చే సలహా అర్థం చేసుకుంటూ ఉంటే , మనకి గ్రహాలను ఎలా అనుసరించాలో తెలుస్తుంది. దీనికి కారణం, భవిష్యత్తులో మన పురోగతికి తోడ్పడే పరిస్థితులను కల్పించి మనకి మంచి సంఘటనలు జరిగేలా గ్రహములు ఏర్పాటు చేస్తాయి.

- to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-94*
- Master E.K.

*How the planets teach in*
*different levels*

*వివిధ స్థాయిలలో గ్రహాలు
ఏ విధంగా బోధిస్తాయి*       

మన ఆలోచనా విధానం తప్పు దోవలో నడుస్తున్నపుడు, గ్రహములు మనకు అవరోధాలు కల్పిస్తాయి. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనుష్యులను అర్థం చేసుకోవడం ద్వారా, గ్రహములు ఇచ్చే సలహాలను ప్రతి నిముషం, ప్రతి క్షణం అమలు చేస్తూ ఉంటే అవి మనకు స్నేహితుల్లా పని చేస్తాయి. గ్రహములు మనకు ఎన్నో మంచి బహుమానాలు ఇస్తూ ఉంటాయి. ఆ బహుమానాలు వద్దు అనే స్థాయికి ఎదిగే దాకా అవి మనకు ఇస్తూనే ఉంటాయి.

మన ప్రలోభాలను, కోరికలను అదుపులో ఉంచుకుని, గ్రహముల సంకల్పాన్ని అర్థం చేసుకుని , ఆ ప్రకారం మనం నడుచుకుంటే గ్రహములు మనకి ఎన్నో బహుమానాలు ఇస్తాయి.
మన పురోగతి మడతలలో ఇమిడి ఉన్న సంకల్ప శక్తి, మనో శక్తి వికసించి మనం మనలోని చైతన్యపు అట్టడుగు రహస్యపు పొరలలోకి వెళ్ళడానికి మనకి అనుమతి లభిస్తుంది. అవకాశాలు కల్పించ బడతాయి. ఎట్టి పరిస్థితుల్లోను మనకి ఇచ్చిన అవకాశాలను మనము మనకోసం వినియోగించుకోము అనే విషయం నిర్ధారణ అయినపుడు మాత్రమే గ్రహములు మనకు మంచి అవకాశాలు కల్పిస్తాయి.
అంతదాకా మనం దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాము.
ఈ దరిద్రం అనేది ఒక్కొక్కప్పుడు ధన పరంగాను, ఒక్కొక్కప్పుడు తెలివితేటల పరంగాను, ఒక్కొక్కప్పుడు ధైర్యం లోపించడం గాను, ఒక్కొక్కప్పుడు ఆత్మవిశ్వాసం లోపించడం గాను ఉండవచ్చు. ఈ విధంగా మనకి ఏదో విధమైన సంపదని లోపింపచేసి గ్రహములు మనని సునిశితంగా పరిశీలిస్తూ తమ ఆధీనంలో ఉంచుకుంటాయి.
ఇచ్చిన అవకాశాలను మనకోసమే వినియోగించుకునే స్వభావం మనలో కొనసాగినంత కాలం ,గ్రహాలు మనలను శిక్షణలో ఉంచుతాయి. గ్రహములు అనుసరించే జటిలమైన వ్యూహం ఇదే. మనలోని మన మానసిక యంత్రాంగాన్ని గ్రహములు ఒక పరిశోధనాలయంగా (laboratory)  తీసుకుని మనలని పరిశుద్ధం చేయడానికి  సదా పనిచేస్తూ ఉంటాయి.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2nd level-95* 
  - Master E.K.

*How the planets teach us in different levels*

*వివిధ స్థాయిల్లో గ్రహములు ఏ విధంగా బోధిస్తాయి*

మనము మూడవ స్థాయిలో ప్రవేశించినపుడు, మనము మన గురించి దేనిని వాడుకోము అని గ్రహములు అర్థం చేసుకున్నప్పుడు,
ఈ స్థాయిలో జోస్యం చెప్పడం చాలా కష్టం. ఈ స్థాయిలో గ్రహములు మనకు చాలా బహుమానాలు ఇస్తాయి.
ఈ స్థాయిలో మన భవిష్యత్తు కానీ, ఇతరుల భవిష్యత్తు కానీ చదివే సామర్ధ్యాన్ని గ్రహములు మనకి ఇస్తాయి. అలాగే ఈ స్థాయిలో గ్రహములు మనకి ఇతరుల ఆలోచనలను నియంత్రించే శక్తిని కానీ,  కొన్ని వేలమందిని  శాసించే శక్తిని కానీ ప్రసాదిస్తాయి. మనము మనం గురించి, మన కోసం ఏ అవకాశాన్ని వినియోగించుకోము
అని తెలిసిన మరుక్షణం నుండి గ్రహములు మనకి ఈ శక్తులన్నిటిని ప్రసాదిస్తాయి.
ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తుల జాతకంలో జోస్యం చెప్పడం చాలా  కష్టం. ఎందువలన అనగా వారి జాతకం ప్రకారం ఏ సంఘటన జరగదు.

-to be contd.


*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-96*
---Master E.K.

*How the planets teach us in different levels*
* *వివిధ స్థాయిలలో గ్రహములు ఏ విధంగా బోధిస్తాయి*

ఇలా మూడవ స్థాయికి చేరుకున్న వ్యక్తుల జాతకములు ఎవరైన జ్యోతిష్కునికి చూపిస్తే, ఆ జ్యోతిష్కుడు ఆ వ్యక్తి జాతకం గురించి ఎప్పటికి జోస్యం చెప్పలేడు. ఆ వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పలేడు.
ఎందు వలన అనగా ఆ వ్యక్తి ఆయుర్దాయం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది.అదే కింద స్థాయిలలో ఉన్న వ్యక్తి, అన్ని విషయాలలోను అసభ్యంగా ప్రవర్తిస్తాడు కాబట్టి, అతని మరణం ఎప్పుడూ స్థిరంగా నిర్ణయించబడి ఉంటుంది. గ్రహములకు అటువంటి వారి స్వభావాలు తెలుసు. లోపల ఉన్న చైతన్యం ఆ శరీరంలో ఉండడానికి ఇబ్బంది కరంగాను, భరించే స్థితిలోను లేనపుడు, గ్రహములు ఆ వ్యక్తికి  ఎక్కువగా తినడం వలన కానీ, తాగడం వలన కానీ, తనకు తానే మరణం కల్పించుకునే పరిస్థితులు కల్పిస్తాయి. అందువలన పరిణామక్రమంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తుల మరణం ఎప్పుడు  సంభవిస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఉన్నత చైతన్య స్థాయిలలో ఉన్న వ్యక్తుల ఆయుర్దాయం నిర్ణయించడం చాలా కష్టం.
మనం మూడవ చైతన్యం స్థాయి లోకి ప్రవేశించినపుడు
మన కోసం మనం ఏ అవకాశాలను వినియోగించుకోము అనే  విషయం గ్రహములు అర్థంచేసుకున్నపుడు, జాతకం చెప్పడం చాలా కష్టం.ఈ స్థాయిలో గ్రహములు మనకు ఎన్నో బహుమానాలు ఇస్తాయి.  అపుడు అవి నీ భవిష్యత్తుని కానీ, ఇతరుల భవిష్యత్తును కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తాయి. అలాగే ఇతరుల ఆలోచనలను నియంత్రించే శక్తిని కాని, కొన్ని వేలమందిని శాసించే శక్తిని కానీ ప్రసాదిస్తాయి. మనము మన గురించి ఏ అవకాశాలను వినియోగించుకోము అని తెలిసిన మరు క్షణం నుండి గ్రహములు మనకు ఈ శక్తులన్నిటినీ ప్రసాదిస్తాయి. ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తుల జాతకం జోస్యం చెప్పడం చాలా కష్టం. ఎందు వలన అనగా వారి జాతకం ప్రకారం ఏ సంఘటన జరగదు.

- to be continued

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*
*2nd level-97*
---Master E.K.

*It is difficult to predict at this stage*

*ఈ దశలో జోస్యం చెప్పడం  కష్టం*

ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వ్యక్తికి దేహమును వదిలిపెట్టడం అనగా విశ్రాంతి తీసుకోవడం. ఎందువలన అనగా అతను మరు జన్మలో కూడా పనులు కొనసాగించవలసి ఉంటుంది. కానీ మరణమే ముగింపు అని నమ్మేవారికి మాత్రం మరణం ఒక సంఘటన. ఆధ్యాత్మికత అనగా ఏమిటో తెలిసిన వారికి మాత్రం మరణం ఒక సంఘటన కాదు. మరణం గంటో రెండు గంటలో ఒక గదిలో విశ్రాంతి తీసుకునే విరామం లాంటిది.
అలాంటి వ్యక్తి జాతకాన్ని జ్యోతిష్కునికి చూపించి ఇతని ఆయుర్దాయం ఎంతో చెప్పమంటే అతనేదో బండ లెక్కలు వేసి ఒక తేదీని జోస్యం చెప్పగలడు. కానీ అది ఖచ్చితంగా తప్పుతుంది.
జ్యోతిష్కులు, మహాత్ములను ఎన్నోసార్లు చంపేస్తూ ఉంటారు.
ఒకొక్క సారి వార్తాపత్రికల్లో కూడా మహాత్ముల మరణాన్ని ప్రచురిస్తూ ఉంటారు. చాలాసార్లు వారు ఆ తేదీలను మార్చి తిరిగి ప్రచురించ వలసి వస్తుంది. అదే వ్యక్తిని వారు మూడు నాలుగు సార్లు చంపవలసి వస్తుంది. ఉత్తమ జన్మ కలిగిన వారి జాతకాలు అలా ఉంటాయి. అందువలన అటువంటి జాతకాలు సామాన్యమైన పద్ధతుల్లో చూసి జోస్యం చెప్పలేము.

సాధారణ జ్యోతిష్య శాస్త్రానికి భిన్నంగా ఉండే "Esoteric Astrology" అనే పుస్తకంలో జ్వాలాకూల మహర్షి ఈ విషయాన్ని హెచ్చరించారు. అనేక సందర్భాల్లో  ఆయన హేతుబద్ధంగా Esoteric Astrology లోనికి వెళ్ళి అందులోని ఉన్నత సిద్ధాంతాల ప్రకారం జాతకాలు చూడమని సలహా చెప్పారు. దీనిని ఆధ్యాత్మిక జాతకాలకి వాడతాము కాబట్టి ఈ పద్ధతి జ్యోతిష్యశాస్త్రములోని ఒక ఉత్తమ మార్గాన్ని చూపిస్తుంది.
అందువలననే నేను ఈ పద్ధతిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level - 98*
---Master E.K.

*Fixed signs*
*స్థిరరాశులు*

ఇప్పుడు మనము కుంభరాశిని గురించి తెలుసుకుందాము. రాశి చక్రంలో నాలుగవ స్థిర రాశి, మూడవ వాయుతత్వపు రాశి అయిన కుంభరాశి చాలా పవిత్రమైనది. రాశి చక్రంలో వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి ,ఈ నాలుగు స్థిరరాశులు. మేషరాశి నుండి లెక్కించినపుడు కుంభ రాశి నాలుగవ స్థిర రాశి అవుతుంది.
రాశిచక్రంలో మిథునరాశి, తులారాశి,, కుంభ రాశి వాయుతత్వపు రాశులు. మేష రాశి నుండి కుంభ రాశి మూడవ వాయుతత్వపు రాశి అవుతుంది.
కుంభరాశి, మానవుడు మూడవ దశలో, నాలుగవ కక్ష్యలో ప్రవేశించి స్థిరపడడాన్ని సూచిస్తుంది.

ఈ వాక్యానికి వివరణ అవసరం.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

*2nd level-99*
---Master E.K.

*Fixed signs*
*స్థిర రాశులు*

స్థిర రాశులు చైతన్యం స్థిరపడడాన్ని సూచిస్తాయి. మన చైతన్యం మూడు గుణాలలో  వ్యక్తం అవుతుంది. అవి సత్త్వ గుణము,రజో గుణము,తమో గుణము. మేష రాశి రజో గుణాన్ని, వృషభ రాశి తమో గుణాన్ని , మిథున రాశి సత్త్వ గుణాన్ని సూచిస్తుంది. తిరిగి వరుస క్రమంలో కర్కాటక రాశి రజో గుణాన్ని, సింహరాశి తమో గుణాన్ని, కన్యా రాశి సత్త్వ గుణాన్ని సూచిస్తుంది. తులా రాశి రజో గుణాన్ని, వృశ్చిక రాశి తమో గుణాన్ని, ధనస్సు రాశి సత్త్వ గుణాన్ని సూచిస్తుంది. మకర రాశి రజో గుణాన్ని, కుంభ రాశి తమో గుణాన్ని, మీన రాశి సత్త్వ గుణాన్ని సూచిస్తుంది. ఈ రకంగా నాలుగు స్థితులలో ఉన్న మన చైతన్యం మూడు గుణాలు ద్వారా వ్యక్తం అవుతుంది.
మనం ఒకొక్క గుణాన్ని విడిగా అర్థం చేసుకోవాలి.
రజో గుణం మార్పుని, తమో గుణం స్థిరత్వాన్ని, సత్త్వ గుణం సర్దుబాటుని సూచిస్తుంది.

- to be contd.

*ఆధ్యాత్మిక జ్యోతిష్యము*

  *2nd level -100*
    --- Master E.K.

*Fixed signs*
*స్ధిర రాశులు*

ఈ మూడు చెతన్యపు
 స్థితులలోను మన చైతన్యం ఒక క్రమ పధ్ధతిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇలా ఈ చైతన్యం రెండవసారి, మూడవసారి నాలుగవ సారి ప్రయాణం చేస్తుంది. ఈ చైతన్యం తనకు తాను నాలుగు కోణాల్లో ఏర్పడి, చివరికి ఒక చతురస్రం లో  ఈ నాలుగు కోణాలు అమరి స్థిర పడే దాకా కొనసాగుతుంది. అపుడు మనకి మన పురోగతిలో మొదటి దశ ఏర్పడుతుంది. చైతన్యపు అథమ స్థాయి, తరువాత స్థాయి, మూడవ స్థాయి, నాలుగవ స్థాయి. ఈ విధంగా నాలుగు స్థాయిలలో ను చైతన్యం స్థిర పడుతుంది.

మొదటి చైతన్యపు పొర ఇపుడు నడిచే స్థితి. దీనినే జాగృదావస్థ అంటాము.ఇది భౌతికమైనది. రెండవ చైతన్యపు స్థితి నిద్ర. మూడవది స్వప్నావస్థ. నాలుగవది yogic state ( తురీయావస్థ)

- to be contd.

Reply all
Reply to author
Forward
0 new messages