---------- Forwarded message ----------
From: "Sastry R Pisapati" <
gaut...@gmail.com>
Date: 24-Jan-2017 4:25 PM
Subject: [raduno-14] Morals
To: "
Radu...@googlegroups.com" <
Radu...@googlegroups.com>
Cc:
చాగంటి కోటేశ్వరరావు గారి ముత్యాల "మాటలు"........
జీవితం లో నేర్చుకోవాల్సినవి కొన్ని
1. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే.
2. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్థించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి.
3. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడాన్కిఅయినా సిద్దపడతాడు. అలాగే ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులుచేయడానికైనా సందేహించడు మనిషి.
4. మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం.
5. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు. కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మ విశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు. కానీ విజయపథలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది.
6. బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే.. తటస్థంగా ఉన్నట్లు కాదు. బలవంతుడి పక్షం వహించినట్లు.
7. అతి నిద్ర, బద్దకం, భయం, కోపం, నిరాశావాదం- ఈ ఐదు అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
8. అహంకారము ప్రతి ఒక్కరినుంచీ – అఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
9. ఉపాయాన్నిఅలోచించేటప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి.
10. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చకలిగినా రేపటి దాని పర్యవసానాన్ని మాత్రం తప్పించుకోలేవు.
11. మంచివారు దూరం కావడం, చెడ్డవారు దగ్గర కావడమే దుఃఖాని కి నిదర్శనం.
12. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు.
13. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు.
14. పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం… ఇదే జీవితం.
15. ఉత్తమ గుణాల వల్ల మవిషి ఉన్నతుడవుతాడు కానీ ఉన్నత పదవి వల్ల కాదు… - శిఖరం మీద కూర్చొన్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు.
16. తలపై మోసే భారాన్ని ఇతరులు కొంత పంచుకుంటే బాధ తగ్గుతుంది. కానీ ఆకలి బాధనూ, అజ్ఞాన బాధనూ ఎవరికి వారే తగ్గించుకోవాలి.
17. మంచివారు దూరంకావడం, చెడ్డవారు దగ్గరకావడమే దుఃఖానికి నిదర్శనం.
18. మెరుగు పెట్టకుండా రత్నానికి, - కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
19. కేవలం డబ్బుంటే
సరిపోదు. మంచి వ్యక్తిత్వం ఉంటనే సమాజం గౌరవిస్తుంది.
20. ఎవరి వయస్సుకు తగ్గంటు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది.
--
You received this message because you are subscribed to the Google Groups "Raduno 14" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
Raduno-14+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
Radu...@googlegroups.com.
To view this discussion on the web, visit
https://groups.google.com/d/msgid/Raduno-14/CAA2oVrtu0Lq1Nhb4KVYKY0vvX%3DMi%3DeMAgWDmxJs%3DcaHAB_J%3DOg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.