Rahul Power

3 views
Skip to first unread message

n m rao

unread,
Jan 20, 2013, 9:16:03 PM1/20/13
to manakosamt...@googlegroups.com

Vinod Mehta on Rahul G

రాహుల్..ప్చ్!ఆయన శక్తి సోనియానే!

రాహుల్ గాంధీ వ్యక్తిత్వంపై మీ అంచనా ఏమిటి?

మంచివాడు. అహంకారం లేదు. అందరితోనూ మంచిగా ఉండాలనుకుంటాడు. అయితే, రాజకీయాల్లోకి రావడం అతనికి కూడా ఇష్టమని నేను అనుకోను.
తప్పనిసరి
పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఎంత వరకూ విజయం సాధిస్తాడనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
ఇప్పటి దాకా అతను ప్రచారం చేసిన ఏ
రాష్ట్రంలోనూ పార్టీ విజయం సాధించలేదు.
ఉత్తరప్రదేశ్
, బీహార్, గుజరాత్.. ఇలా ప్రచారం చేసిన ప్రాంతాల్లో తనదైన ముద్ర వేయలేకపోయాడు.
రాహుల్‌కు
శక్తి, అధికారం ఆయన తల్లి నుంచి వచ్చినవే. ఆయనకు వ్యక్తిగతంగా ఆ శక్తి ఉందనుకోవటం లేదు. కాంగ్రెస్‌లో పెద్ద పెద్ద వ్యూహకర్తలు, మంత్రులు, కాకలు తీరిన రాజకీయ నాయకులు రాహుల్ ముందు వంగిపోవటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ అధికారం తరతరాలుగా గాంధీ కుటుంబానికి వారసత్వంగా వస్తోంది. దీనిని వారు నిలబెట్టుకుంటున్న తీరు కూడా ఆశ్చర్యకరమే! కానీ, ఇలాంటి వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామానికి చేటు కదా.. వాస్తవమే. కానీ, ప్రజాస్వామ్యం అంటే ప్రజల నిర్ణయమే కదా! వారు గాంధీ కుటుంబాన్ని కావాలనుకుంటే వద్దనటానికి మనమెవరం?

రాహుల్ సత్తా ఎంత? కాంగ్రెస్‌లో విలక్షణ నేత
యువ రాజకీయాలకు ప్రతీక  వ్యక్తిగత జీవితంలో గోప్యత
నాయకత్వ లక్షణాలపై భిన్నాభిప్రాయాలు

'యువరాజు' అంటున్నారు! 'రా... రా... రా...' అని కలవరిస్తున్నారు. 'రాహులోరే భవిష్యత్ ప్రధాని' అంటూ పలవరిస్తూ, పరవశిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ తదితర 'తలలు పండిన' నేతలంతా రాహుల్‌ను భావి ప్రధానిగా అభివర్ణిస్తున్నారు. జైపూర్‌లో జరిగిన చింతన్ శిబిరం మొత్తం రాహుల్ చుట్టూనే తిరిగింది. చివరికి... ఆయనను పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రకటించేందుకు జైపూర్ శిబిరమే వేదికగా మారింది. రాహుల్ 2014 ఎన్నికలనేకాదు... 2019 ఎన్నికలలోనూ పార్టీని గెలిపిస్తారన్నది కాంగ్రెస్ పెద్దల ఆశ! మరి... ఆయనలో సత్తా ఎంత?

జైపూర్, జనవరి 20: రాహుల్ గాంధీ... కాంగ్రెస్‌కు ఆశాకిరణం. ఆయన ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి తొలి ప్రధాని. నాయనమ్మ ఇందిరా గాంధీ నాలుగో ప్రధాని. తండ్రి ఏడో ప్రధాని. తల్లి సోనియా ప్రస్తుతం దేశాన్ని పరోక్షంగా పాలిస్తున్న వ్యక్తి. రాహుల్ ఇప్పటికే అణువణువునా రాజకీయాలు ఒంటబట్టించుకుని ఉండాల్సింది. కానీ... నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి రాహుల్ ఎన్నేళ్లుగానో మీనమేషాలు లెక్కించారు. నాయకత్వంలో, పాలనలో సత్వర నిర్ణయం ముఖ్యమన్న సంగతి రాహుల్ గ్రహించలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సోనియా దగ్గర మార్కులు కొట్టేయడానికి... రాహుల్‌ను ఆకాశానికి ఎత్తుతున్న వారంతా, అంతర్గతంగా మాత్రం ఆయన నాయకత్వ లక్షణాలపై సందేహాలు వ్యక్తం చేసేవారే. "రాహుల్ గాంధీలో రాజకీయ పరిణతి లేదు. ప్రచారంలోనూ, ప్రసంగాల్లోనూ పస లేదు. 2014 ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా కీలకమైనవి. ఎలా చూసినా సోనియా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లడం మేలు'' అని ఓ సీనియర్ నాయకుడు ఇటీవల వ్యాఖ్యానించారు.

నిజానికి... రాహుల్‌గాంధీని కేంద్రమంత్రిగా చూడాలని చాలామంది ఆకాంక్షించారు. దీనిద్వారా పాలనాపరమైన అనుభవం సంపాదించుకుంటారని భావించారు. కానీ... కేంద్ర మంత్రులు, లోక్‌సభ సభానాయకుడు వంటివి కాంగ్రెస్‌లో 'ఉద్యోగులు' నిర్వహించేవే. నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధించినంత వరకూ సోనియా, రాహుల్ యజమానులే కానీ, ఉద్యోగులు కారు.

ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ పార్టీకి 'యజమాని'గా ఉపాధ్యక్ష పదవినే స్వీకరించడం గమనార్హం. మరోవైపు... రోజంతా పని చేయాల్సిన, జవాబుదారీగా వ్యవహరించాల్సిన లోక్‌సభ నాయకుడి పదవిలో రాహుల్‌ను నియమించడం సోనియాకు ఇష్టం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఆ పదవికి అనుభవం, సీనియారిటీ, వాగ్ధాటి ఉన్న నాయకుడిని ఎంపిక చేయాలని ఆమె భావిస్తున్నారు.

అంతా గోప్యతే...
సోనియా గాంధీయే నిగూఢత మూర్తీభవించిన వ్యక్తి అనుకుంటే, రాహుల్ గాంధీ ఆ విషయంలో ఓ ఆకు ఎక్కువే చదివినట్టు కనిపిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నవారి జీవితాలు తెరిచిన పుస్తకాలుగా ఉండాలని ఆశిస్తారు. కానీ.. రాహుల్ జీవితమంతా గుప్పిట దాచిన రహస్యమే. 42 ఏళ్లు దాటుతున్నా ఆయన ఇంతవరకూ తన పెళ్లి గురించే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. రాహుల్‌కు తన వ్యక్తిగత జీవితం గురించి బయట చర్చించుకోవడం ఇష్టం లేని విషయం. ఆయన పెళ్లి చేసుకుంటారా, లేదా? అవివాహితుడిగానే ఉండిపోతారా? ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నారు.

"
నా గర్ల్‌ఫ్రెండ్ పేరు వెరోనిక్. ఆమెది స్పెయిన్. ఆమెను ఎప్పుడు వివాహం చేసుకోబోయేదీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు'' అని 1999లో రాహుల్ ఒకసారి చెప్పారు. అలా చెప్పి 13 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. రాహుల్ లండన్‌లో 1996 జూన్ నుంచి 1999 మార్చి వరకు ఓ ఉద్యోగం కూడా చేశారు. మైకేల్ పోర్టర్ అనే వ్యక్తికి చెందిన 'మానిటర్' అనే సంస్థకు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. ఈ సంగతి కూడా రాహుల్ రహస్యంగానే ఉంచారు.

లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఇంజనీరింగ్ డిజైన్లకు సంబంధించి 'బ్యాకప్స్' పేరిట ఒక కంపెనీ పెట్టారు. పత్రికల్లో ప్రతికూల వార్తలు రావడంతో దానిని నిలిపివేశారు. తెగింపు లేకపోవడం, నిజాన్ని అంగీకరించడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివన్నీ రాహుల్‌కు 'మైనస్' అని చెబుతున్నారు. తన భావాలను ఇతరులతో పంచుకోవడం, ఇతరుల భావాలను గ్రహించడం, ఇతరులతో కలిసి మెలిసి పనిచేయడం వంటి లక్షణాలూ ఆయనలో తక్కువేనని అంటారు. - ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి

సత్తా ఇంతేనా?
ఇటీవల జరిగిన యూపీ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రాహుల్ ప్రచారం చేశారు. 'ఇంకేముంది... హస్తం గెలిచేస్తుంది' అని నేతలు భావించారు. కానీ... సమాజ్‌వాదీ పార్టీ యువనేత అఖిలేశ్ యాదవ్ విజయఢంకా మోగించారు. కాంగ్రెస్‌కు అధికార ం సంగతి పక్కనపెడితే.. పార్టీకి కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లోనూ పరాభవం ఎదురైంది.

ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ప్రచార ప్రభావం కనిపించలేదు. అప్పటినుంచి కాంగ్రెస్‌లో రాహుల్ నాయకత్వ లక్షణాల విషయంలో అనుమానాలు బయలుదేరాయి. యువజన కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్... ఇటీవల పలు రాష్ట్రాల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ విభాగాలకు ఎన్నికలు జరిపించారు. దాదాపు అన్నిచోట్లా పార్టీ వ్యతిరేకులకే పదవులు లభించినట్లు ఆయా వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

బహిరంగ సభల్లోనూ, పార్లమెంట్ చర్చల్లో రాహుల్ తన వాగ్ధాటితో దుమ్ము రేపుతారని చాలామంది భావించారు. తమది అత్యాశే అని వారికి అర్థమైంది. పైగా, ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో వివాదాస్పదమయ్యాయి. ఒక్కటి మాత్రం నిజం! ప్రస్తుత యువ రాజకీయాలకు ఆయన ప్రతీకగా మారారు. 127 సంవత్సరాల పార్టీ 'యువ మంత్రం' జపించడానికి ఆయనే ముఖ్య కారణం. ఇక... ఉపాధ్యక్షుడిగా పార్టీని ఎలాంటి మలుపులు తిప్పుతారో చూడాలి మరి!

'
రాజ'యోగం ఉందా?
ప్రస్తుతం అంగారకుడిపైన నాసా రోవర్ ఉండటం ఎంత నిజమో... మన జాతకంలో అంగారకుడు ఉన్న స్థానాన్ని బట్టేభవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నమ్మే వాళ్లు కోట్లలో ఉండటమూ అంతే నిజం. అందువలన రాహుల్ జాతకాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం...

రాహుల్ గాంధీ 1970 జూన్ 19వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలో జన్మించారు. సాయన జ్యోతిష పద్ధతిలో రాహుల్‌ది మిథున లగ్నం. లగ్నంలో రవి, సప్తమంలో చంద్రుడు ఉన్నారు. రవిచంద్రులు 180 డిగ్రీల దృష్టిలో ఉన్నారు. అంటే ఆయన పౌర్ణమి రోజున పుట్టారన్న మాట. పౌర్ణమి రోజున జన్మించినవారు సాధారణంగా ఏ రంగంలో ఉన్నా రాణిస్తారు. పైగా, చంద్రుడు ఉన్న స్థానాధిపతి అయిన గురువుతో ఈ రెండు గ్రహాలకు శుభ దృష్టి ఉండడం వల్ల దేశ రాజకీయాల్లో రాహుల్ కేంద్ర బిందువుగా మారారు. కాగా, రాజకీయ రంగంలో రాణించాలంటే... రవి, చంద్ర, గురువులతో పాటు కుజుడు కూడా అనుకూలించాలి. అంతేకాక, సప్తమ, దశమ స్థానాలు కూడా బాగుండాలి.

రాహుల్ జాతకంలో సప్తమ, దశమాధిపతి అయిన గురువు వక్రించాడు. రవి, కుజ గ్రహాలు లగ్నంలోనే ఉన్నాయి. కుజ గ్రహానికి అస్తంగత్వ దోషం ఉంది. ఫలితంగానే ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉన్నప్పటికీ, అధికారానికి మాత్రం చేరువ కాలేకపోతున్నారు. ఇక లగ్నాధిపతి బుధుడు భాగ్య స్థానాధిపతి యురేనస్‌తో శుభ దృష్టిలో ఉన్నాడు. ప్రజాబలానికి సంబంధించిన శని దశమ స్థానాన్ని (అధికారం) ప్రబలంగా వీక్షిస్తున్నాడు. ఈ అంశాలను బట్టి రాహుల్ అధికారం చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అయితే, పురోగామి చంద్రుడు 12వ ఇంట సంచరిస్తున్నందువల్ల ఆయనకు మరో రెండున్నర సంవత్సరాల కాలం రాజకీయ అధికారం చేపట్టడానికి అనుకూలంగా లేదు. 2015 వరకూ ఆయనకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే, 2014లో జరిగే ఎన్నికల తరువాత ఆయన ప్రధాని పదవిని చేపట్టే అవకాశాలు చాలా తక్కువ. ఆ తరువాత జరిగే ఎన్నికల్లో ఆయనకు ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/jan/21/main/21main5&more=2013/jan/21/main/main&date=1/21/2013

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/jan/21/main/21main4&more=2013/jan/21/main/main&date=1/21/2013

 

Reply all
Reply to author
Forward
0 new messages