గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. మొన్నటి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన చేసిన త్రీడీ ప్రసంగం ఈ ఘనతను సొంతం
చేసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. '2012 ఎన్నికలు నాకు
తీపి గుర్తులను మిగిల్చాయి.
ఆ ఎన్నికల ప్రచారంలో నేను చేసిన త్రీడీ
ప్రసంగాలకు అరుదైన ఘనత లభించింది' అని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో
పేర్కొన్నారు. 2012 డిసెంబర్ 10న జరిగిన ఎన్నికల ప్రచార సభలలో త్రీడీ
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మోడీ ఒకేసారి 55 ప్రాంతాలలోని
ప్రజలనుద్దేశించి 55 నిమిషాల పాటు ప్రసంగించిన సంగతి తెలిసిందే.