వచ్చే 100 రోజుల సమయం నాకోసం కేటాయించండి చాలు... మీ మేధస్సుకి తగ్గ గుర్తింపు, మీ భవితకి మళ్ళీ పునర్వైభవం తీసుకు వస్తా అంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి దేవుని సాక్షిగా అవినీతి రహిత పాలన అందిస్తా అని ప్రతిజ్ఞ చేస్తున్న చంద్రన్నని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలన్న సంకల్పంతో వున్న యువత "యువ సంకల్ప సదస్సు"పేరుతో హైదరాబాద్లో తెలుగుదేశం విద్యావంతుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు...
తెలుగునేల అంటే అవినీతి,అక్రమాలకి చిరునామా కాదు అభివృద్దికి,ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం అని మళ్ళీ నిరూపించాలన్న సంకల్పం పూనిన యువత రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ కోసం కేటాయించాలన్న సంకల్పంతో వున్నారు... తెలుగు యువతకి ఆత్మవిశ్వాసాన్ని తీసుకువచ్చి గ్రామీణ మధ్యతరగతి పిల్లల,రైతుపిల్లల మేధస్సుకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చిన చంద్రబాబుని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో వున్న మన విద్యావంతులు Jan26thన APHB Community Hall,1st Road,1st Phase,KPHB(Near Temple Bus Stop)Hydలో "TDP యువ సంకల్ప సదస్సు"పేరుతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు... మరింత స్పూర్తిగా,మరింత సంకల్పంతో పని చెయ్యటానికి Blood Donation Camp కూడా Organise చేస్తున్నారు.. అలాగే తెలుగుజాతికి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ప్రసాదించిన అన్నగారి వర్ధంతిని పురష్కరించుకుని Jan18th "TDP యువ సంకల్ప రాలీ "నిర్వహించబోతున్నారు.. ఈ కార్యక్రమానికి విద్యావంతులు,మేధావులు,ఇంజనీర్లు,నిపుణులు అత్యధిక సంఖ్యలో హాజరై తెలుగుదేశం పట్ల మీకున్న సంకల్పాన్ని తెలపాలని కోరుకుంటున్నాం... మీ ఆలోచనలు,అభిప్రాయలు పంచుకుని ఒకరికి ఒకరం సహకరించుకుంటూ Team Workతో ముందుకు సాగేదానికి మన మిత్రులు చేస్తున్న ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించండి ..
అన్నగారి ఆశయాల సాధన కోసం చంద్రన్న సారధ్యంలో Team Work చేసి తమ భవిష్యత్తుకి పునర్వైభవం తెచ్చుకునే కార్యక్రమాల కోసం,తమలాంటి ఆలోచన, ఆశయ లక్ష్యం వుండి సంకల్పబలంతో ముందుకు సాగే యువతతో భవిష్యత్తు ప్రణాలికలు కోసం ఈరోజు సమావేశం అయి చర్చించుకున్నారు...
--