అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
ముత్తారం/దేవరకొండ/పెద్దేముల్, ఏప్రిల్ 1 : అప్పుల బాధతో వేర్వేరు జిల్లాలో
ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం
ఓడెడ్ గ్రామానికి చెందిన రైతు మండ మల్లేష్ (48) వరుసగా రెండో ఏడాది కూడా
సాగునీరందక వరి పైరు ఎండిపోవడంతో సోమవారం పురుగుల మందు తాగాడు. నల్లగొండ
జిల్లా దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబావి గ్రామానికి చెందిన పత్తిరైతు కడారి
లాలయ్య (48) ఐదెకరాల్లో సాగుచేసిన పత్తి ఎండిపోతుండటంతో 15 బోర్లు వేశాడు.
నీరు పడకపోగా అప్పులు మూడింతలు పెరగడంతో పురుగుల మందు తాగాడు.
రంగారెడ్డి జిల్లా పెదేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన కాస వెంకటప్ప
సాగు చేసిన వేరుశనగ తెగుళ్లు సోకి దిగుబడి దారుణంగా పడిపోయింది. దీంతో
ఇంట్లోనే ఉరివేసుకున్నాడు.
మహిళను కాటేసిన 'విద్యుత్'
మెదక్ టౌన్: మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం రాయిన్‌పల్లి గ్రామానికి చెందిన
లింగాపురం అంజమ్మ (40) రాత్రి సమయంలో విద్యుత్ లేకపోవడంతో పాముకాటుకు
గురై మృతి చెందింది. ఆమె కారెంటు కాటువల్లే మరణించిందంటూ గ్రామస్థులు
సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
-----------------------------------------------------------------------------
దిగుబడి లేదని.. దూలానికి ఉరి!
పెద్దేముల్, ఏప్రిల్ 1 : వేసిన పంట దిగుబడి ఇవ్వలేదు. చేసిన అప్పులు కొండలా
ఎదురుగా నిలబడ్డాయి. గుండె నీరయింది. బతుకు బరువైన ఆ క్షణాన మృత్యువే
నయమనిపించింది. అంతే..తెల్లారే సరికి రంగారెడ్డి జిల్లా పెద్దేముల్
పోలీస్‌స్టేషన్ పరిధిలోని జనగాంలో కాస వెంకటప్ప దూలానికి వేలాడుతూ
కనిపించాడు. వెంకటప్పకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నాడు.
నాలుగు
ఎకరాల పొలంలో సోదరుడు మల్లప్పతో కలిసి వెంకటప్ప వ్యవసాయం చేస్తున్నాడు.
రెండేళ్లుగా కష్టం, అప్పులు తప్ప మిగిలిందేమీ లేదు. రేటు బాగా ఉందని ఈఏడాది
వేరుశనగ వేశాడు. తెగులు తగులుకుంది. పురుగుమందులు వాడినా పంట దక్కలేదు.
మళ్లీ అప్పుపడ్డాడు. ఆదివారం వేరుశనగ పంటను రాశి చేశాడు. చూస్తే 5 సంచులు
కూడా సరిగ్గా నిండలేదు. పొలం వద్దకు వెళుతున్నానని చెప్పి పశువుల కొట్టంలో
దూలానికి ఉరేసుకున్నాడు.
మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య..
మరో ఇద్దరు రైతులు సోమవారం అప్పుల బాధతో ఉసురు తీసుకున్నారు. కరీంనగర్
జిల్లా ముత్తారం మండలం ఓడెడ్ గ్రామానికి చెందిన రైతు మండ మల్లేష్ (48)
వరుసగా రెండో ఏడాది కూడా సాగునీరందక వరి పైరు ఎండిపోవడంతో పురుగుల మందు
తాగాడు. నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డిబావి గ్రామానికి చెందిన పత్తిరైతు
కడారి లాలయ్య (48) ఐదెకరాల్లో సాగుచేసిన పత్తి ఎండిపోతుండటంతో 15 బోర్లు
వేశాడు. నీరు పడకపోగా అప్పులు పెరగడంతో పురుగుల మందు తాగాడు.