Re: [Indlinux-telugu] Telugu localization work

11 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Sep 5, 2012, 10:04:40 AM9/5/12
to indlinu...@lists.sourceforge.net, locali...@swecha.net, linux-tel...@googlegroups.com, k.me...@gmail.com, man...@swecha.net
నా స్పందన  మెయిల్ మధ్యమధ్యన..

2012/8/31 Gōpāl/గోపాల్ <gopala...@gmail.com>
నమస్తే,

కొంత సమాచారం కోసం ఎంత ప్రయత్నించినా ఒక పట్టాన దొరికేలా కనిపించలేదు. దేశంలో లేకపోవడం వల్ల కష్టమవుతుందో, అందరికీ అంతేనో తెలీదు. అందుకే ఇలా మెయిల్ చేస్తున్నాను.
  • తెలుగు స్థానికీకరణ మీద ఎన్ని టీంలు పని చేస్తున్నాయి? కొన్నాళ్ళగా నేను కూడా అనువదిస్తున్నా నాకు తెలిసినవి కొన్నే అని నా అనుమానం: స్వేచ్చ, IndLinux, Linux telugu users. వీళ్ళల్లో ఎంతమంది ఇంకా అనువాదాలు చేస్తున్నారు? వాళ్ళందరి మధ్యా సమన్వయం ఉందా?
సమన్వయ ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి కాని నాకు సంతృప్తికరమైన స్థాయిలో లేవనిపిస్తుంది.  సంస్థాగత ఆకృతి, వనరులు గల స్వేచ్ఛ  లాంటి జట్లు దీనికి నాయకత్వం వహించి వారి ప్రణాళికలు తెలియచేస్తే మిగతా ఔత్సాహికులు సమన్వయించుకోవటం సులభమవుతుంది. ఫ్యూయల్ ఇప్పటికే ఈ దిశగా పనిచేస్తున్నది. అయితే  తెలుగులో ఇంకా ముందు ముందు చేయాల్సినవాటికై ప్రణాళిక విడులవలేదు.
  • ఇందులో IndLinux/Telugu, స్వేచ్చ వాళ్ళ వెబ్‌సైట్లు ఇంగ్లీష్ లో ఉండటంలో అర్థం ఏంటి?
IndLinux/Telugu  ఒక షెల్ మాత్రమే, తెలుగుకి సంబంధించి స్వేచ్ఛ వాళ్లు మాత్రమే చాలా కృషి చేశారు. మరిన్ని వివరాలు స్వేచ్ఛజట్టు సభ్యులు తెలియచేయమని కోరుతున్నాను.
  • తెలుగు అనువాదాల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం తెలుగుకి అధికార పీఠం అని అనుకుంటున్నాను. వారేమైనా పాలుపంచుకున్నారా/కుంటున్నారా?
ఏమి లేదు. వారికి స్థానికీకరణ పై అసలు అనుభవం వుందనుకోను.

అందరూ కలిసి స్థానికీకరణ అనే అంఖాన్ని చక్కగా నడిపించి ఇంత దాకా తెచ్చారు, ఇంకొన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడితే భవిష్యత్తులో పరిస్థితి మెరుగ్గా ఉండడానికి సహాయ చేసినవాళ్ళం కూడా అవుతాం. నేను చెప్పదలుచుకున్నవి ఇవి.

  • ఇప్పటికి చాలా కాలంగా తెలుగులో లినక్సు వాడుతున్నాను. ఇంకా తప్పులు కనబడుతున్నాయి: కొన్ని చోట్ల పదాలు పొసగక అర్థం మారిపోవడం, కొన్ని చోట్ల అసలు అర్థమే లేకపోవడం వంటివి. నాకు చేతనైతే సరి చేస్తున్నాను. అనువాదాలు కష్టమన్న సంగతి తెలుసు, కాని ఇలాంటివి ముందు జాగ్రత్త చర్యలతో నివారించవచ్చు. తెలుగు అనువాదాలు చేసే అందరం ఒక జట్టుగా ఉంటే ఇది తేలికవుతుంది.
మనకి ఇండ్ లినక్స్ జట్టు మూలజట్టు. అయితే అది ముఖ్యంగా అభివృద్ధికారులదనిపించి, వాడుకరులకోసం లినక్స తెలుగు జట్టు చేయటం జరిగింది. అయితే సాఫ్టువేరుని బట్టి వేరు వేరు జట్టులు ఏర్పడతాయి, కనుమరుగుతాయు. మనం ముఖ్యమైనవి ఇండ్ లినక్స్ తో పాటు పంచుకుంటే సరిపోతుంది.
  • ఎప్పటికప్పుడు సభ్యులు చూసేందుకు/నవీకరించేందుకు సౌకర్యం ఉండేలా ఒక చోట పదకోశం ఉండాలి. మెయిళ్ళు, సైట్లో zip ఫైళ్ళు సరికావు. ఇప్పటికే ఉన్నవాటిని పంపిస్తే, ఇందుకు నేను సహాయ పడగలను (A shared google doc will just be fine and way better than adhoc transfers).
స్థానికీకరణకు గూగుల్ డాక్ కన్నా ఉపకరణాలతో పనిచేసే పదకోశాలు మెరుగు. వాటిని సంస్థలు నిర్వహించితే బాగుంటుంది.
  • అప్లికేషన్ దత్తత తీసుకోవడం: ఒకో సభ్యుడు ఒకో అప్లికేషన్ని దత్తత తీసుకుని చేస్తే త్వరగా అవ్వడమే కాక, అనువాదాలు మెరుగ్గా ఉంటాయని నా నమ్మకం (బాధ్యత కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి). ఇద్దరేసి జతగా ఉంటే ఒకరు చేసిన అనువాదం మరొకరు సరిచూడొచ్చు. దీని వల్ల పని కూడా de-centralized గా సుళువుగా జరుగుతుంది.
కనీసం ఇద్దరైనా ఒక ఉపకరణంపై  పనిచేయటం మరియు వాడటం చేస్తే నాణ్యత మెరుగవుతుంది. 
నేను రాసిన ఏ అంశమైనా ఎవరినైనా కష్టపెడితే క్షమించండి. తెలియనితనం దొర్లినట్టుంటే తెలియజెప్పండి. I'm wishing for a constructive participation from all the people who made it all the way till here. IMHO, it only takes one more gentle push to realize a usable Telugu Linux distribution.

తెలుగు లినక్స్ వేర్లూనటానికి వ్యవస్థలో కొన్ని సంస్థలైనా ముందు నడవాలి. కేరళలో మొన్న మొన్నటిదాక స్వేచ్ఛా సాఫ్టువేరుకి పాఠశాల స్థాయికంప్యూటర్ విద్యావిభాగము పూర్తి తోడ్పాటునందించింది. నేను ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖని సంప్రదించాను ఫలితం కనబడలేదు. స్వేచ్ఛవాళ్లు కూడా అలాంటి ప్రయత్నాలు చేశారాని, సఫలీకృతం కాలేదని విన్నాను.  వాడుకరులు పెరిగినపుడు, స్థానికీకరణ కూడా మెరుగుపడుతుంది. లేక పోతే ఔత్సాహికులు కొన్నాళ్లు కృషిచేసినా స్పందన కరువై నీరసపడిపోతారు.
చానాళ్ల క్రిందట తెలుగు అధికార భాషా సంఘం  ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు స్వేచ్ఛ సాఫ్టువేరుకి ప్రోత్సాహమిచ్చింది. కొద్దిసంవత్సరాల క్రిందటి అది స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయింది.
త్వరలో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల వ్యవస్థలు తెలుగు పరంగా ప్రముఖ పాత్ర వహిస్తాయి.  ఆండ్రాయిడ్లో లభించే తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేర్ స్థానికీకరణ పై దృష్టిపెడితే డెస్క్‌టాప్ పై కన్నా మెరుగైన ఫలితాలు పొందవచ్చని భావిస్తాను.
అన్నట్లు నేను లినక్స్ ఫర్ యు లో స్థానికీకరణపై వ్యాసం పరంపర ప్రారంభించాను. అవి నా వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.

గత నాలుగైదు  సంవత్సరాల అనుభవంతో పై విషయాలు పంచుకుంటున్నాను.

ధన్యవాదాలు
అర్జున

-- 
 
Regards,
--
Kōḍūri Gōpāla Kr̥ṣṇa,
Music Technology Group, UPF - Barcelona, Spain.

Portfolio - http://tidbits.co.in
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com

------------------------------------------------------------------------------
Live Security Virtual Conference
Exclusive live event will cover all the ways today's security and
threat landscape has changed and how IT managers can respond. Discussions
will include endpoint security, mobile security and the latest in malware
threats. http://www.accelacomm.com/jaw/sfrnl04242012/114/50122263/
_______________________________________________
Indlinux-telugu mailing list
Indlinu...@lists.sourceforge.net
https://lists.sourceforge.net/lists/listinfo/indlinux-telugu


Gōpāl/గోపాల్

unread,
Sep 5, 2012, 10:42:45 AM9/5/12
to indlinu...@lists.sourceforge.net, Arjuna Rao Chavala, k.me...@gmail.com, linux-tel...@googlegroups.com, locali...@swecha.net, man...@swecha.net
మీ అనుభవాలు పంచుకున్నందుకు చాలా సంతోషం. Linux for you లో ప్రచురిస్తున్న వ్యాస పరంపర కొత్తవారికి ఎంతో సాయపడగలదు.

మీరన్నది నిజం. సంస్థల ఆదరణ లేకపోతే ఇవి నిలవడం అసాధ్యం. స్వేచ్చ బృందంగాని, ఔత్సాహికులుగాని పొన్నాల లక్ష్మయ్య గారిని కలిశారా? వారికి ఇటుగా ఆసక్తి ఉందనిపిస్తోంది (ఫాంట్లవీ చేస్తున్నారు కదా). మనలో ఎవరికైనా ఇక్కడ ( http://apit.ap.gov.in/index.php/contact-us) ఉన్నవాళ్ళలో ఎవరైనా తెలిస్తే మెల్లగా సంప్రదింపులు మొదలుపెట్టొచ్చు. ఐటి శాఖలోనే దీనికి ఒక చిన్న విభాగం ఏర్పడితే పెద్ద మేలు జరుగుతుంది.

రహ్మానుద్దీన్ షేక్

unread,
Sep 5, 2012, 1:55:31 PM9/5/12
to linux-tel...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net, Arjuna Rao Chavala, k.me...@gmail.com, locali...@swecha.net, man...@swecha.net
నాకు తెలిసినంత వరకూ కూడా ముందు ఒక వాడుకరుల సమూహం తయారు చేసుకుని ఆపై స్థానికీకరణపై దృష్టి సారించడం ఉత్తమం. 
కొన్ని రోజులు స్థానికీకరణలో పూర్తి స్థాయిలో పాల్గొన్నాక, అది వాడే వారు మన చుట్టు మనతో పాటే స్థానికీకరణ చేసేవారే కానీ, కొత్తవారు వాడుతున్నట్టు, సలహాలు ఇస్తున్నట్టూ కనిపించక, కొంత మేరకు ఆ వైపు ప్రయత్నాలు తగ్గించాను. ఫేస్‍బుక్ ఇంటర్ఫేస్ ట్రాన్స్లేషన్ మరియు అప్పుడపుడూ సమయం దొరికీ, ఉత్సాహం కలిగినపుడూ గ్నోం, ఇంకా డాక్యుమెంటేషన్ వైపు అరకొరగా స్థానికీకరణలో పాలుపంసుకుంటున్నాను. 
వాడుకరులు పెరిగీ, మనకు సలహాలు, సూచనలు వస్తుంటే, చేసే పనిపై ఆసక్తి కలుగుతుంది. 
అందుకని ఈ విశ్వవిద్యాలయాల వారు తెలుగు అంతరవర్తినితో ఉపకరణాలు వాడితే ఎంతో కొంత మేలు జరగవచ్చు. 
అలానే, ఈ సమూహంలో అప్పుడప్పుడు వేగులు వస్తూ ఉంటే, భౌతికంగా కాక పోయినా, అందరికీ అనువయిన సమయాల్లో ఐఆర్సీ ద్వారా లేదా గూగుల్ హ్యాంగౌట్ ద్వారా కలుస్తూ ఉంటే మేలు. 

2012/9/5 Gōpāl/గోపాల్ <gopala...@gmail.com>
--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.



--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామభివర్ధతాం॥


A new address for ebooks : http://kinige.com

Reply all
Reply to author
Forward
0 new messages