ఉబుంటు 11.04, తెలుగు వాడుకరి మార్గదర్శని విడుదల

8 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
May 1, 2011, 1:23:33 AM5/1/11
to ubuntu-...@lists.launchpad.net, linux-telugu-users, telugu-c...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net
మిత్రులారా,

గత జులై నుండి జరుగుతున్న కృషి ఫలితంగా 28 ఏప్రిల్ 2011 న ఉబుంటు 11.04 పూర్త తెలుగుతో విడుదలైందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. దానితో పాటు వాడుకరి మార్గదర్శని ఈ పుస్తకం రూపుదిద్ది విడుదల చేశాను, మరిన్ని వివరాలకు నా బ్లాగ్ పోస్ట్ చూడండి.
http://teluginux.blogspot.com/2011/04/blog-post.html
నేను అనుకొన్న ప్రణాళికకు జరిగిన పనికి పోలిక క్రింద ఇస్తున్నాను.

13 జనవరి 2011 1:15 సా న, Arjuna Rao Chavala <arjun...@googlemail.com> ఇలా రాసారు :
మిత్రులారా,
ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 తో అది విడుదలవుతుంది.
ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి
1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా స్థాపించగల మాడ్యూల్  వూబి స్థానికీకరణ ( 100 పదబంధాలు)   (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.) 
పూర్తి అయింది. పరీక్ష చేయాలి.
2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro
పురోగతి లేదు. కొంత అలోచించితే  టైపింగ్ నేర్చుకోవటానికి ఇంగ్లీషు వాడి  ఆ తరువాత అనుభవానికి తెలుగు వాడటం సరిపోతుంది. దానిక మంచి వ్యాస భాగాలు ఎంపిక చేయాలి,
౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు
పురోగతి లేదు.ప్రాధాన్యత పెంచాలి.
3) విద్యా అనువర్తనములు,
చిన్న పిల్లలకొరకు  gcompris
 విషయానికొకటి చొప్పున
తెలుగు klettres అక్షరం టైపింగు అనుభవ వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు)
లెక్కలు geogebra
సామాజికశాస్త్రం ..గుర్తించాలి
విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి
మీ సలహాలతో స్పందించిండి

ఇతర ప్రాధాన్యతల వలన పురోగతి లేదు.
లినక్స్ తెలుగు వాడుకరుల వెబ్సైటు    చూస్తూ వుండండి.
మీలో మరింతమంది తెలుగు వుబుంటు సాధ్యమైనంతవరకు వాడి దీనిని అభివృద్ధి చేయడంలో సహకరించమని మనవి.

ధన్యవాదాలు
అర్జున
Reply all
Reply to author
Forward
0 new messages