Call for Gnome Telugu Translations Review

6 views
Skip to first unread message

ప్రవీణ్

unread,
May 24, 2011, 3:02:46 AM5/24/11
to ఇండ్ లినక్స్ మెయిలింగు జాబితా, తెలుగు లినక్స్ వాడుకరులు
మిత్రులారా,

దాదాపు ముఖ్యమైన లినక్స్ పంపకాలలో వాడే స్థానీకరణ అంతా గ్నోమ్ నుంచే వచ్చేదే అని మనందరకూ తెలిసిందే, కాకపోతే గ్నోమ్ స్థానీకరణ చాలా వరకూ పూర్తయిన తరువాత దాని పై సమీక్ష జరగనే లేదు చేసినవి చేసినట్టే ఉన్నాయి, ఆ తరువాత ఫ్యూయల్ ప్రోజెక్టు ద్వారా స్థానీకరణలో వాడే పదాలను సూచించారు వీటిని గ్నోమ్ నందు ఇదివరకు వాడిన పదాలకు బదులుగా ఇంకా పూర్తిస్థాయిలో వాడనేలేదు. అంతే కాకుండా ఇప్పటివరకూ జరిగిన అనువాదాలలో అక్కడక్కడా కొన్ని దోషాలు ఉన్నాయి, వీటిని సమీక్షించి సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధముగా చేయటం వలన లినక్సును ప్రజలకు మరింత చేరువచేయవచ్చు మరియు పూర్తిస్థాయిలో వాడమని సూచించవచ్చు. గ్నోమ్ 2.28 స్థిర విడుదల 93% పూర్తయినది ఆ తరువాత నవీకరించబడిన విడుదలలో పదజాలం పెరిగింది అందువలన వాటిని జతచేసిన తరువాత అస్పస్ట పదజాలం(ఫజ్జీ) కూడా పెరిగింది. ఇటీవలే గ్నోమ్ (నోమ్) 3.0 స్థిరమైన విడుదలయింది. దీని పై ఇంకా శ్రధ్ద పెట్టలేదు అందువలన పూర్తయిన పని గణాంకాల ప్రకారం 77% ఉన్నది. ప్రస్తుతం 3.2 అస్థిర విడుదల అభివృద్ధి చేయబడుడుతుంది. నోమ్ 3.2 విడుదలయ్యే సరికల్లా స్థానీకరణ పూర్తి చెయ్యాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమీక్ష చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది. వాడుకరి అంతరవర్తి అనువాదాలు ఇలా ఉండగా పత్రీకరణ(డాక్యుమెంటేషన్) అనువాదాలు మాత్రం శూన్యం. దీనిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సివుంది. ఆసక్తి కలవారు ఈ మెయిలుకు స్పందించి చురుకుగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇటీవలే నేను మూడు గ్నోమ్ అంతర్భాగ అనువర్తనాలను (ఎవిన్స్, చీజ్, ఫైల్-రోలర్) సమీక్ష చేసి, పూర్తి చేసి పై నిల్వలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఫైల్ నిర్వాహకము అయిన నాటిలస్ సమీక్ష చేస్తున్నాను. ఈ సమీక్షను ఒక నిర్దిష్ట గడువులో పూర్తిచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. రెండు వారాల వ్యవధిలో పూర్తిచేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలను కూడా సంకోచించకుండా జోడించండి.

ధన్యవాదాలు.

--
Cheers,
Praveen Illa.

Kaśyap కశ్యప్

unread,
May 24, 2011, 10:20:12 AM5/24/11
to linux-tel...@googlegroups.com, ఇండ్ లినక్స్ మెయిలింగు జాబితా
నేను కొన్ని డాక్యుమెంటేషన్ అనువాదాలు శనివారము కల్లా chEstanu  ,I will start with gnome-doc-utils
ధన్యవాదాలు.
kasyap
9396533666

24 మే 2011 12:32 సా న, ప్రవీణ్ <mail...@gmail.com> ఇలా రాసారు :

--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

ప్రవీణ్

unread,
May 24, 2011, 10:46:38 PM5/24/11
to linux-tel...@googlegroups.com
నేను కొన్ని డాక్యుమెంటేషన్ అనువాదాలు శనివారము కల్లా chEstanu  ,I will start with gnome-doc-utils
 
కశ్యప్ గారు,

పత్రీకరణలో ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు, ఇంతకూ దీనిని లాంచ్పాడ్ నందు చేయాలనుకుంటున్నారా?
--
Cheers,
Praveen Illa.

Kaśyap కశ్యప్

unread,
May 25, 2011, 2:35:36 AM5/25/11
to linux-tel...@googlegroups.com
అవునండి .. ఎమన్నా సూచనలు వగైరా

25 మే 2011 8:16 ఉ న, ప్రవీణ్ <mail...@gmail.com> ఇలా రాసారు :
Cheers,
Praveen Illa.

--
You received this message because you are subscribed to the Google Groups "linux-telugu-users" group.
To post to this group, send an email to linux-tel...@googlegroups.com.
To unsubscribe from this group, send email to linux-telugu-us...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/linux-telugu-users?hl=en-GB.

ప్రవీణ్

unread,
May 25, 2011, 4:52:36 AM5/25/11
to linux-tel...@googlegroups.com

అవునండి .. ఎమన్నా సూచనలు వగైరా

గ్నోమ్ అనువాదాలకు లాంచ్పాడ్ వాడటం వలన అది ఉబుంటు వరకే పరిమితమవుతుంది. కాబట్టి గ్నోమ్ l10n వద్ద దాఖలు చేయడమే అన్ని విధాలా శ్రేయస్కరం. కాని గ్నోమ్ వద్ద ఆన్ లైనులో చేయడం వీలుకాదు కాబట్టి ఆఫ్ లైనులో చెయ్యండి. ఇందుకు జిట్రాన్సులేటర్ (sudo apt-get install gtranslator) అనువర్తనాన్ని వాడండి.మీరు ఎలాగో ఉబుంటూనే వాడతారు కాబట్టి పరిపూర్ణ మద్దతు ఉన్నది. లేకపోతే Poedit కూడా వాడవచ్చు. ఆఫ్ లైనులో చేయడం వలన మీకు కొంత సులువుగా అనిపించవచ్చు ఎందుకంటే వెతికి తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. పూర్తయిన ఫైలును కృష్ణబాబు గారికి పంపించండి వారు పై నిల్వలో చేర్చుతారు. గ్నోమ్ ప్రోజెక్టులో సభ్యులయినందుకు ధన్యవాదాలు. ఫైలును మీ పేరుతో స్వరూపించి జతచేసాను, దీనిని కొనసాగించవచ్చు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియచేయండి.
--
Cheers,
Praveen Illa.

gnome-doc-utils.mallard.master.te.po

Arjuna Rao Chavala

unread,
May 26, 2011, 7:31:45 AM5/26/11
to linux-tel...@googlegroups.com, ఇండ్ లినక్స్ మెయిలింగు జాబితా
ప్రవీణ్

2011/5/24 ప్రవీణ్ <mail...@gmail.com>:

మంచి ప్రయత్నం.
మీ ప్రణాళిక, సూచనలు ఏదైనా వెబ్సైట్ ద్వారా పంచుకుంటే మంచిది.
https://sites.google.com/site/linuxteluguusers/ వాడొచ్చు లేక వేరేదైనా.

ధన్యవాదాలు
అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages